Karthika Deepam 2 July 5th: జ్యోత్స్నకు బిగుస్తున్న ఉచ్చు.. గుట్టు రట్టు చేసే పనిలో కార్తీక్ బాబు, దీపా

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 4వ తేదీ 401వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్నకు మళ్లీ నిశ్చితార్థం చేయాలని శివనారాయణ చెబుతాడు. అయితే అప్పటికే కార్తీక్ బాబు జ్యోత్స్న నోటితోనే నిజం చెప్పించాలని మళ్లీ గౌతమ్ తో పెళ్లి నాటకం స్టార్ట్ చేస్తాడు. దీంతో గౌతమ్ శివ నారాయణకు ఫోన్ చేసి అతని తల్లిదండ్రులతో ఇంటికి వస్తున్నామని, ముహుర్తాలు పెట్టుకుందామని అంటాడు. దాంతో శివనారాయణ కూడా సరేనని అంటాడు. అదే విషయాన్ని ఇంట్లో ఉన్న జ్యోత్స్న, సుమిత్ర, దశరథ, పారులకు చెబుతాడు. ఎవ్వరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లడానికి వీల్లేదని అంటాడు. జ్యోత్స్న పెళ్లికి ముహూర్తాలు పెట్టడం ఖాయమని, ఎవ్వరూ అడ్డుకోవాలని ప్రయత్నించినా ఈ పెళ్లి మాత్రం తప్పకుండా జరుగుతుందని చెబుతాడు. ఇక జ్యోత్స్న షాక్ అవుతుంది. తనకు తెలియకుండా మళ్లీ పెళ్లి టాపిక్ వచ్చిందంటే కచ్చితంగా కార్తీక్ బాబే ప్లాన్ చేసి ఉంటాడని ఊహిస్తుంది.

ఇక గౌతమ్ తన తల్లిదండ్రులను తీసుకొని శివ నారాయణ ఇంటికి వస్తాడు. వాళ్ల తల్లిదండ్రులు కూడా మళ్లీ సంబంధం కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇంటికి వచ్చి మరీ తెలుపుతారు. ఇక కార్తీక్ బాబు, దీపా సందడి సందడి చేస్తారు. మరోవైపు జ్యోత్స్న మాత్రం జ్వరం వచ్చిందని నాటకం ఆడుతుంది. పారు కిందికి వచ్చి జ్యోత్స్న బయటికి రాలేదని చెబుతుంది. తనకు ఆరోగ్యం బాలేదని అబద్ధం చెబుతుంది. ఇక జ్యోత్స్ననే మరో నాటకం ఆడుతుందని తెలుసుకొని కార్తీక్ బాబు, గౌతమ్ వాళ్ల అమ్మ, పారును తీసుకొని జ్యోత్స్న గదిలోకి వెళ్తారు. పోయినసారే ఎంగేజ్ మెంట్ చెడిపోయిందని, ఈసారి కూడా అలానే అవుతుందేమోనని జ్యోత్స్న భయపడుతుందని అంటాడు. దాంతో గౌతమ్ వాళ్ల అమ్మ ఈ ఎంగేజ్ మెంట్ తప్పకుండా జరుగుతుందని అంటుంది. దాంతో జ్యోత్స్న మరింతగా ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 5వ తేదీ 402 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 402 July 5th 2025

జ్యోత్స్న పూర్తిగా ఇరుక్కుపోతుంది. గౌతమ్ తో పెళ్లికి శివనారాయణ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోసారి ఎంగేజ్ మెంట్ కు కూడా ఎక్కువ సమయం ఇవ్వకుండా కేవలం 4 నాలుగు రోజుల గ్యాప్ లోనే నిశ్చితార్థం వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. ఇక జ్యోత్స్నకు ఎంగేజ్ మెంట్ ను ఆపేందుకు సమయం లేకుండా పోయింది. దానికి తోడు గౌతమ్ వాళ్ల అమ్మ సుమిత్రకు కండీషన్ పెడుతుంది. గౌతమ్ తో జ్యోత్స్న పెళ్లి జరగాలంటే ఈ ఇంట్లో మీ మేన అల్లుడు కార్తీక్ బాబు, ముఖ్యంగా దీపా ఉండకూడదని షరుతు విధిస్తుంది. గతంలో దీపా గౌతమ్ పై చేయి చేసుకుందని, మా బంధువుల్లో పరువు పోయిందని చెబుతుంది. మళ్లీ ఆమె ఉంటే ఏదైనా సమస్య వచ్చే అవకాశం లేకపోలేదని అంటుంది. ఇందుకు సుమిత్ర కూడా తన కండీషన్ ను ఒప్పుకుంటుంది. ఇక గౌతమ్ వాళ్ల తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత సుమిత్ర ఇదే విషయాన్ని కార్తీక్ బాబు, దీపాలతో చెబుతుంది. జ్యోత్స్న మేడమ్ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిద్దామని కార్తీక్ బాబు అనడంతో సుమిత్ర వెంటనే స్పందిస్తుంది. జ్యోత్స్న పెళ్లి సవ్యంగా జరగాలంటే మీరు నాకో సాయం చేయాలని సుమిత్ర అంటుంది.

దాంతో ఏం చేయాలో చెప్పండి అంటూ కార్తీక్ బాబు, దీపా అడుగుతారు. దీపా వెంటనే సుమిత్ర దీపా ఈ ఇంట్లో ఉండకూదని అంటుంది. నా కూతురు జ్యోత్స్న పెళ్లై, అత్తగారి ఇంటికి వెళ్లే వరకు నువ్వు మా ఇంట్లో ఉండకూదని, నువ్వు మాకు చేసే సాయం ఏదైనా ఉందంటే అది ఒక్కటి మాత్రమేనని అంటుంది. ఇక దీపా ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడకుండా వెంటనే వెళ్లి పోవడానికి సిద్ధమవుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అదే సమయంలో జ్యోత్స్న దీపాను అడ్డుకుంటుంది. నువ్వు వెళ్లడానికి వీల్లేదని అంటుంది. దీపా ఉంటేనే తన ఎంగేజ్ మెంట్ మళ్లీ క్యాన్సిల్ అవుతుందని భావిస్తుంది. దీంతో దీపాను వెళ్లనివ్వకుండా ఆపుతుంది. ఇంట్లో వారు సుమిత్ర, శివనారాయణ, దశరథను కూడా ఈ విషయంలో ఒప్పిస్తుంది. అందుకు వారు కూడా సరేనని చెబుతారు. ఇక దీపాను ఇంట్లో ఉండనివ్వడానికి అనుమతిస్తుంది సుమిత్ర. కానీ మరో కండీషన్ పెడుతుంది. నీ వల్ల ఎలాంటి గొడవ జరగకూడదని చెబుతుంది. అలా జరిగితే నువ్వు నా కోపాన్ని చూడవు. నాలోని తల్లి కోపాన్ని చూస్తావని హెచ్చరిస్తుంది.

సుమిత్ర అమ్మ మాటకోసం ఎలాంటి గొడవకు నేను కారణం కాబోనని హామీనిస్తుంది. ఇక ఆ తర్వాత ఎటు వెళ్లాల్సిన వారు అటు వెళ్లిపోతారు. మరోవైపు కాశీ చేసిన 10 లక్షల అప్పు తీర్చడం కోసమని పారుజాతం ప్రయత్నిస్తుంది. దాంతో పారుజాతం శివనారాయణ దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుతుంది. కాశీకి అప్పు తీర్చాలని చెప్పుకుండానే తనకు కూడా 15 లక్షలు కలుపుకొని అడుగుతుంది. కానీ శివనారాయణ అస్సలు ఇవ్వనని అంటాడు. నీకు డబ్బులతో ఏం పని అని మందలిస్తాడు. నువ్వు అంత మొత్తంలో డబ్బులు అడగడం దేనికి అని అంటాడు. సమాధనం లేకపోవడంతో పారుజాతం మౌనంగా వెళిపోతుంది. మరోవైపు జ్యోత్స్న దగ్గరకు పారుజాతం వెళ్లి మండిపడుతుంది. ముసలోడు డబ్బులు ఇవ్వడం లేదని రగిలిపోతుంది. ఇక ఆ తర్వాత జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ గురించి చర్చిస్తారు. ఈ ఎంగేజ్ మెంట్ ను ఎలాగైనా నిలిపివేయాలని జ్యోత్స్న అంటుంది.

దీపాతో నువ్వు వేసిన ప్లాన్ అస్సలు వర్కట్ కాదని పారుజాతం అంటుంది. నువ్వు దీపాను ఇంట్లోనే ఉండమన్నప్పుడు కార్తీక్ బాబు మొహంలో నేను చిరు నవ్వు చూశాను. దాంతో నీ ప్లాన్ వాళ్ల పూర్తిగా అర్థం అయ్యి ఉంటుంది. ఇక దీపా వల్ల నువ్వు ఎంగేజ్ మెంట్ ను చెడగొట్టడం సాధ్యమయ్యే పని కాదు. మరోలా ఆలోచించాలని పారుజాతం అంటుంది. మనం ఇచ్చే ట్విస్ట్ కు దీపాతో పాటు కార్తీక్ బాబుకు కూడా దిమ్మతిరిగి పోవాలని అంటుంది. అలా చేయాలంటే మనం ఒకరిని కలవాలని జ్యోత్స్న అంటుంది. ఎవరిని పారుజాతం అడిగినా చెప్పదు. డైరెక్ట్ గా వెళ్లి కలిసేప్పుడు నీకే తెలుస్తుందిలే అని అంటుంది. మరోవైపు సుమిత్ర అన్న మాటలకు దీపా బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన కార్తీక్ బాబు దీపాను ఓదార్చుతాడు. అంతా మన మంచికే అనుకోవాలని ధైర్యం చెబుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X