Karthika Deepam 2 July 7th: జ్యోత్స్న మొండితనం.. తిక్క కుదిర్చిన కార్తీక్ బాబు

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 5వ తేదీ 402వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ చేయాలని శివ నారాయణ నిర్ణయిస్తాడు. దీంతో గౌతమ్ తన తల్లిదండ్రులతో వచ్చి ముహుర్తాలు కూడా పెట్టుకుంటారు. వచ్చే బుధవారమే మంచి ముహుర్తం ఉందని పంతులు చెప్పడంతో అదే ముహూర్తాన్ని ఖాయం చేసుకుంటారు. దీంతో జ్యోత్స్నకు ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసే అవకాశం లేకుండా పోతుంది. దాంతో ఇంట్లో వాళ్లు చెప్పినట్టు వింటుంది. కానీ జ్యోత్స్నకు మాత్రం గౌతమ్ తో పెళ్లి అస్సలు నచ్చదు. ఆ విషయాన్ని తానే స్వయంగా చెప్పకుండా దీపాతోనే చెప్పించాలని ప్లాన్ చేస్తుంది. కానీ దీపా, కార్తీక్ బాబులు ఇద్దరు జాగ్రత్త పడుతుండటంతో ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. మరోవైపు దీపాకు సుమిత్ర కండీషన్ పెడుతుంది. అసలు నువ్వు నా కూతురు జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ పెళ్లి అయ్యే వరకు నువ్వు ఇంట్లో కనిపించకూడదని దీపాను అంటుంది. ఇది తన మాట కాదని, గౌతమ్ వాళ్ల తల్లిగారు చెప్పారని అంటుంది.

ఇప్పటికే దీపా వల్ల ఒకసారి నిశ్చితార్థం ఆగిపోయిందని, పైగా తమ కొడుకును దీపా చెంపదెబ్బ కొట్టిందని గుర్తు చేసిందంటుంది. ఒకవేళ దీపా ఇదే ఫంక్షన్ లో కనిపిచేస్తే బంధువులు, అతిథుల ముందు తమకు చిన్నచూపుగా ఉంటుందని భావిస్తున్నారని చెబుతుంది. అందుకోసం దీపా ఇప్పటి నుంచి ఇంట్లో ఉండటానికి వీల్లేదని అంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం దీపాను అడ్డుకుంటుంది. తను చెడగొట్టిన ఫంక్షన్ తన ముందే జరగడం మంచి అమ్మ అని సుమిత్రకు సమాధానం ఇస్తుంది. దీపా లేకపోతే ఆమె చెప్పిందే నిజమని అందరూ నమ్ముతారు. ఇక దీపా అదే ఫంక్షన్ లో ఉంటే దీపా చెప్పింది అబ్ధమని స్పష్టం అవుతుందని చెబుతుంది. దాంతో సుమిత్ర కూడా సరేనని దీపాను ఇంట్లో ఉంచుకోవడానికి అనుమతినిస్తుంది. కానీ ఏదైనా గొడవ చేయాలని, కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం అస్సలు ఊరుకోనని సుమిత్ర హెచ్చరిస్తుంది. అందుకు దీపా కూడా సరేనని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 7వ తేదీ 403 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 403 July 7th 2025

దీపాను ఇంట్లోనే ఉంచుకోవడానికి జ్యోత్స్న ప్లాన్ చేయడంతో తన ఎంగేజ్ మెంట్ ను ఆపేందుకు ప్రయత్నిస్తుందని కార్తీక్ బాబు గ్రహిస్తాడు. ఇదే విషయాన్ని దీపాతో చెబుతాడు. జ్యోత్స్న ఎలాగైనా నీ ద్వారానే ఎంగేజ్ మెంట్ ను ఆపాలని చూస్తుందని అంటుంది. నువ్వు ఏ క్షణంలోనైనా సుమిత్రతో లేదంటే జ్యోత్స్నకు ఆ గౌతమ్ మంచి వాడు కాదని చెప్పే ప్రయత్నం చేస్తే వెంటనే ఆ మాటలను రికార్డ్ చేసి జ్యోత్స్న అందరికీ వినిపిస్తుంది. మళ్లీ నీపైనే నింద వేసి తను తప్పించుకుంటుందని కార్తీక్ బాబు అంటాడు. కానీ ఇప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉంటామని తెలిసి జ్యోత్స్న దీపా మరేదైనా సమస్య సృష్టించే ప్టాన్ చేస్తుంటారు. అసలే జ్యోత్స్నది, పారుది క్రిమినల్ మైండ్ సెట్ కావడంతో ఎలాంటి ప్రమాదానికైనా వెనకాడారు. పెళ్లిని చెడగొట్టే అవకాశం లేదు కాబట్టి. ఎవరికైనా యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది. అటు గౌతమ్ వాళ్ల తల్లిదండ్రులో, లేదంటే మన కుటుంబంలో ఎవరికో ఒకరికి ప్రమాదం కలిగించేలా ప్లాన్ చేస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకుంటూనే మరోవైపు మన కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలని కార్తీక్ బాబు దీపాతో అంటాడు.

ఇక గౌతమ్ తో పెళ్లిని క్యాన్సిల్ చేయడానికి దీపాను వాడుకుందామంటే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడం లేదని జ్యోత్స్న మరో ప్లాన్ వేస్తుంది. తన ఎంగేజ్ మెంట్ కు కాస్తా సమయమే ఉండటంతో మళ్లీ చెడగొట్టేందుకు ప్లాన్ వేస్తుంది. దీంతో పారుజాతంతో కలిసి కాశీని కలిసేందుకు వెళ్తుంది. కాశీతో మంచిగా నటిస్తుంది. అప్పటికే జ్యోత్స్నపై పీకల్లోతు కోపంతో ఉన్న కాశీ అసలు నన్ను కలిసేందుకు ఎందుకు వచ్చారని అడుగుతాడు. మీకు ఏం కావాలని అంటాడు. మాకు ఏం వద్దు నీకే సాయం చేద్దామని వచ్చామని అంటుంది జ్యోత్స్న. నాకేం సాయం చేస్తారని కాశీ అంటాడు. నీకు అర్జెంట్ గా 10 లక్షలు కావాలని నాకు తెలిసింది. పారుజాతం నాకు అన్ని విషయాలను చెప్పింది. నీకు సాయం చేయడానికే వచ్చానని అంటుంది. దాంతో కాశీ నాకు నీసాయం అవసరం లేదని చెబుతాడు. ఆలోచించుకో నీకు ఇప్పుడు కార్తీక్ ఉన్న పరిస్థితుల్లో సాయం చేయలేదు. అప్పు ఇచ్చిన వాడు అసలే రౌడీ, రేపోమాపో ఇంట్లోకి వచ్చి కూడా గొడవ చేస్తాడని కాశీకి భయం పుట్టిస్తుంది. దాంతో కాశీ జ్యోత్స్న దగ్గర అప్పుగా మాత్రమే డబ్బులు తీసుకుంటానని చెబుతాడు.

నువ్వు నాకు తమ్ముడివి కాబట్టి ఈ డబ్బులు తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వలేదు. నాకు తిరిగి ఇవ్వాల్సిన పనేలేదు అని చెప్పి, 10 లక్షల రూపాయల విలువ గల చెక్ ను అందిస్తుంది. బదులుగా తనకు చిన్న సాయం చేయాలని అంటుంది. తనకు గౌతమ్ మీద డౌట్ ఉందని చెబుతుంది. దీపా ఒకసారి గౌతమ్ ను చెడ్డొడని, మరోసారి మంచోడని చెప్పి సందేహంలో పడేసింది. దాంతో ఇంతకీ గౌతమ్ మంచివాడా కాదా అనేది తేల్చుకోలేకపోతున్నాను. అందుకు నువ్వు గౌతమ్ ను ప్రతి రోజూ ఫాలో అయ్యి, అతని యాక్టివిటీస్ ను గమనించాలని చెబుతుంది. దాంతో గౌతమ్ ఎలాంటి వాడో నీకు తెలుస్తుందని అంటుంది. ఇక ఆ విషయాన్ని నాతో పాటు సుమిత్ర అమ్మకు కూడా చెప్పాలని అంటుంది. ఎందుకంటే గౌతమ్ విషయంలో అమ్మ రోజూ బాధపడుతుందని కాశీతో జ్యోత్స్న చెబుతుంది. దాంతో సుమిత్ర అమ్మ కోసమని కాశీ ఒప్పుకుంటాడు. చెక్ తీసుకొని వెళ్లిపోతాడు. ఇక కాశీ నిజం తెలుసుకొని వచ్చి సుమిత్రతో పెళ్లి ఆపమని చెబుతాడని, దాంతో ఆ నిందను మళ్లీ దీపాపైనే వేయొచ్చని జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది.

మరోవైపు కార్తీక్ బాబు జ్యోత్స్నకు ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. గౌతమ్ తో జ్యోత్స్నకు అసలు ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా అని పదేపదే ఫోన్లు చేయించి అడిగించే ప్రయత్నం చేస్తాడు. కానీ జ్యోత్స్న ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో నేరుగా గౌతమ్ ను ఇంటికి వచ్చి నిలదీయమని అంటాడు. గౌతమ్ ఇంటికి వచ్చి జ్యోత్స్నకు అసలు ఈ పెళ్లి ఇష్టం ఉందా? లేదా? కనుక్కోండి అని శివనారాయణ, దశరథ, సుమిత్రలను ప్రశ్నిస్తాడు. వెంటనే జ్యోత్స్నను కనుక్కోండని చెబుతాడు. ఇక జ్యోత్స్న పారులు బయటి నుంచి ఇంటికి తిరిగి వస్తారు. దాంతో శివనారాయణ జ్యోత్స్న అభిప్రాయాన్ని అడుగుతాడు. అందుకు జ్యోత్స్న ఎలా స్పందించి, ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X