Karthika Deepam 2 July 8th: జ్యోత్స్నను వాయించేసిన శివ నారాయణ.. కార్తీక్ బాబు ప్లాన్ సక్సెస్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 7వ తేదీ 403వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు జ్యోత్స్న ను ఇరికించడంతో ఏం చేయాలో అర్థంకాక ఇబ్బంది పడుతూ ఉంటుంది. జ్యోత్స్నకు గౌతమ్ తో మళ్లీ పెళ్లికి ఏర్పాట్లు జరిగేలా చూస్తాడు. గౌతమ్ ను కలిసి మళ్లీ పెళ్లికి ముహూర్తాలు పెట్టించమని అంటాడు. దాంతో గౌతమ్ తన తల్లిదండ్రులను తీసుకొని శివ నారాయణ దగ్గరకు వచ్చి ముహూర్తాలు కూడా పెట్టిస్తాడు. దాంతో జ్యోత్స్న లాక్ అయిపోతుంది. కనీసం పెళ్లిని చెడగొట్టడానికి ఏదైనా ప్లాన్ చేద్దామనుకున్నా వీలులేకుండా పోయిందని అనుకుంటుంది. దీంతో ఉన్న సమయంలో పెళ్లి చెడగొట్టానికి ఏదైనా ప్లాన్ చేయాలని అనుకుంటుంది. దీంతో పారుజాతాన్ని తీసుకొని కాశీని కలవడానికి వెళ్తుంది. కాశీకి 10 లక్షలు సాయం చేస్తానని చెప్పి బదులుగా సాయం అడుగుతుంది. దాంతో కాశీ మొదట ఒప్పుకోకపోయినా తనకున్న సమస్యల కారణంగా సరేనని అంటాడు.
చెక్కు ఇచ్చిన తర్వా త జ్యోత్స్న కాశీని సాయం అడుగుతుంది. తనకు గౌతమ్ ను పెళ్లి చేసుకోవాలంటే కాస్తా టెన్షన్ గా ఉందని అంటుంది. మొదట దీపా గౌతమ్ ను చెడ్డవాడని చెప్పి, మళ్లీ మంచి వాడని అంటుంది. దీంతో గౌతమ్ ఎలాంటి వాడో తెలియడం లేదని కాశీతో అంటుంది. అందుకు నువ్వు కొద్దిరోజులు గౌతమ్ ను ఫాలో అవ్వాలని, అతని డైలీ యాక్టివిటీస్ ను తెలుసుకుంటూ ఉండాలని అంటుంది. నువ్వు గమించిన దాని ప్రకారం గౌతమ్ మంచి వాడో, చెడ్డవాడో అన్న సంగతిని మా అమ్మ సుమిత్రకు చెబితే సరిపోద్ది అని జ్యోత్స్న అంటుంది. అందుకు కాశీ సరేనని అంటాడు. ఇక జ్యోత్స్న కాశీ ద్వారా తన ఎంగేజ్ మెంట్ ను చెడగొట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. మరోవైపు గౌతమ్ ను కార్తీక్ బాబు ఇంటికి పిలిపించి జ్యోత్స్నపై కంప్లైంట్స్ ఇస్తాడు. అసలు జ్యోత్స్న ఫోన్ లిఫ్ చేయడం లేదని, మా అమ్మ కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదని శివనారాయణకు చెబుతాడు. దాంతో శివనారాయణ జ్యోత్స్నపై మండిపడుతాడు. ఈ క్రమంలో ఏం జరిగిందేని ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 8వ తేదీ 404 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

జ్యోత్స్న తన పెళ్లిని చెడగొట్టుకోవడానికి కాశీ ద్వారా ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు కార్తీక్ బాబు గౌతమ్ తో పెళ్లి చెడిపోకుండా జ్యోత్స్న నోటితోనే తనకు ఈ పెళ్లి వద్దనిపించేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకు గౌతమ్ తో కార్తీక్ బాబు పలు రకాల ప్లాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ ప్లాన్ లోనే ఇంటికి పిలిపించి మరీ జ్యోత్స్నకు ఈ పెళ్లి ఇష్టం ఉందా? లేదా? అని అడిగిపిస్తాడు. ఇక శివనారాయణ కూడా జ్యోత్స్నకు ఈ పెళ్లి ఇష్టమా? కదా? ప్రశ్నిస్తుంది. కానీ జ్యోత్స్న తటపటాయిస్తూ ఇష్టమే అని బదులిస్తుంది. ఇష్టమే అయినప్పుడు గౌతమ్ వాళ్ల అమ్మ కాల్ చేస్తూ ఉంటే అసలు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తాడు. సైలెంట్ లో ఉందని చెబుతుంది. ఇక దశరథ స్పందిస్తూ నువ్వు వెంటనే వెళ్లి గౌతమ్ వాళ్ల ఇంటికి వెళ్లి ఆమెకు సారీ చెప్పి రా అని ఆదేశిస్తాడు. ఇప్పుడే వెళ్లమని దశరథ అంటాడు. దాంతో చేసేదేమీ లేక జ్యోత్స్న సరేనని వెళ్తుంది. ఇక జ్యోత్స్నకు తోడుగా కార్తీక్ బాబు కూడా వెళ్తానని అంటాడు.
కార్తీక్ బాబు, జ్యోత్స్న ఇక కారులో వెళ్తూ ఉంటారు. కొంత దూరం వెళ్లాక జ్యోత్స్న కారు ఆపమని అంటుంది. కారులోంచి ఇద్దరు దిగుతారు. ఇక్కడ ఎందుకు కారు ఆపమన్నావని కార్తీక్ బాబు జ్యోత్స్నను ప్రశ్నిస్తాడు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నాకు సూటిగా సమాధానం ఇవ్వు అని అంటుంది. దాంతో అడగమని అంటాడు. నీకు నా గురించి ఏమైనా తెలిసిందా? అని కార్తీక్ బాబుతో జ్యోత్స్న అంటుంది. దాంతో కార్తీక్ బాబు షాక్ అవుతాడు. దాసు తనకు జ్యోత్స్న కు చెప్పిన నిజం, జ్యోత్స్న అసలు వారసురాలు కాదనే విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక జ్యోత్స్న దాని గురించే అడిగిందని అర్థం చేసుకుంటాడు. కానీ అసలు విషయం చెప్పబోడు. నిజాలు మొత్తం జ్యోత్స్న నోటి నుంచే రాబడుతానని మనస్సులో అనుకుంటాడు. ఇక జ్యోత్స్నకు బదులిస్తూ అందరికి నీ గురించి ఎంత తెలుసో నాకూ అంతే తెలుసని అంటాడు. ఇంతకీ నీ గురించి అంటే ఏంటో వివరంగా చెప్పమని జ్యోత్స్నను అడుగుతాడు. నా గురించి అంటే నా గురించే బావ.. ఏమైనా తెలిసిందా? అని కోపంతో అడుగుతుంది. అందరికీ తెలిసినంతే తెలుసు అని మళ్లీ బదులిచ్చి కారు తీస్తాడు.
ఇక నేరుగా కార్తీక్ బాబు జ్యోత్స్నను తీసుకొని గౌతమ్ వాళ్ల ఇంటికి తీసుకెళ్తాడు. అసలే గౌతమ్ మంచి వాడు కాకపోవడంతో జ్యోత్స్నకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలని అనుకుంటాడు. అందుకని ముందు జ్యోత్స్నను వెళ్లి సారీ చెప్పి రమ్మని అంటాడు. ఇక కార్తీక్ బాబు బయటే ఉండకుండా లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందామని కిటికీ దగ్గరకు వెళ్తాడు. అప్పటికే గౌతమ్ మరో అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. జ్యోత్స్న వచ్చింది చూసి ఫోన్ కట్ చేస్తాడు. ఇక నాటకం మొదలు పెడుతాడు. జ్యోత్స్న తన ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయనందుకు అలిగినట్టుగా నటిస్తాడు. ఇక జ్యోత్స్న అమాయకంగా నటిస్తూ గౌతమ్ కు సారీ చెబుతుంది. ఆంటీని పిలిస్తే ఆంటీకి కూడా సారీ చెబుతానని అంటాడు. ఆంటీ ఇంట్లో లేదని గౌతమ్ అంటాడు. ఇక నీకు ముందుగా సారీ గౌతమ్ అంటుంది జ్యోత్స్న. మాటల్లో మాటగా ఎంగేజ్ మెంట్ ను పోస్ట్ పోన్ చేసేకుందామని అంటుంది.
అందుకు గౌతమ్ స్పందిస్తూ అసలు ఎంగేజ్ మెంట్ వాయిదా పడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ జరిగితీరుతుందని అంటాడు. పోయినసారే చెడిపోయింది కదా? మళ్లీ ఏదైనా అవుతుందేమోనని భయంగా ఉందని జ్యోత్స్న అంటుంది. ఇక ఇదే అదునుగా జ్యోత్స్న చేయి పట్టుకొని అడ్వాన్స్ అవుతాడు. జ్యోత్స్న షాక్ అవుతుంది. అప్పటికే కిటీకిలోంచి గమనిస్తున్న కార్తీక్ బాబు వచ్చి జ్యోత్స్నను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్తాడు. ఇక జ్యోత్స్న గౌతమ్ చేసిన పనిని తలుచుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు గౌతమ్ మరో అమ్మాయితో తిరుగుతూ ఉండటాన్ని కాశీ వీడియో తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ లో వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











