Karthika Deepam 2 July 9th: జ్యోత్స్న గుండె పగిలిపోయే వార్త.. కార్తీక్ బాబు మాస్టర్ స్ట్రోక్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 8వ తేదీ 404వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు ప్లాన్ ప్రకారమే గౌతమ్ ఇంటికి వచ్చి మరీ జ్యోత్స్న కు ఈ పెళ్లి ఇష్టం ఉందా? లేదా అని అడుగుతాడు. దాంతో శివ నారాయణ, దశరథ ఏం జరిగింది గౌతమ్ అని అడిగి తెలుసుకుంటారు. జ్యోత్స్న తన ఫోన్ కాల్స్ తీయడం లేదని, ఇప్పటికే 30 సార్లు ఫోన్ చేశానని చెబుతాడు. మరోవైపు మా అమ్మ కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని చెప్పి వెళ్లిపోతాడు. ఇక శివనారాయణ, దశరథ జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తారు. వెంటనే వెళ్లి గౌతమ్ తోపాటు గౌతమ్ వాళ్ల అమ్మకి సారీ చెప్పి రమ్మని అంటారు. నువ్వే స్వయంగా గౌతమ్ వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మకు క్షమాపణలు చెప్పమని ఆదేశిస్తారు. దాంతో జ్యోత్స్న సరేనని వెళ్లడానికి ఒప్పుకుంటుంది. ఇక గౌతమ్ గురించి ముందే తెలిసినా దీపా ఒక్కదానివి వెళ్లకని అంటుంది. తోడుగా కార్తీక్ బాబు వస్తాడని అంటుంది. అంటే డ్రైవర్ గానే వెళ్లి వస్తానని కార్తీక్ బాబు బదులిస్తాడు.
ఇక కార్తీక్ బాబు జ్యోత్స్నను గౌతమ్ వాళ్ల ఇంటికి కారులో తీసుకెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో కారు ఆపమని కార్తీక్ బాబును జ్యోత్స్న ఇలా అడుగుతుంది. నీకు నా గురించి ఏమైనా తెలిసిందా? బావ అని అడుగుతుంది. దాంతో కార్తీక్ బాబు దాసు తనకు జ్యోత్స్న గురించి చెప్పిన నిజాన్ని, జ్యోత్స్న అసలు వారసురాలు కాదు, దీపానే అసలు వారసురాలు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక జ్యోత్స్న దాని గురించే అడిగిందని అర్థం చేసుకుంటాడు. కానీ బయట పడడు. అందరికి తెలిసిందే. నాకు తెలిసిందని అంటాడు. మరోవైపు గౌతమ్ వాళ్ల ఇంటికి వెళ్లి జ్యోత్స్న సారీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంట్లో ఎవరు లేరని జ్యోత్స్న చేయి పట్టుకుంటాడు గౌతమ్. దాంతో కార్తీక్ బాబు జోక్యం చేసుకొని జ్యోత్స్నను సేఫ్ గా ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక ఇంట్లో వాళ్లకు అక్కడ జరిగిన విషయాన్ని చెబుతాడు. అందరూ షాక్ అవుతారు. మరోవైపు దీపా కంగారు పడుతుంది. అక్కడ ఏం జరిగిందని కార్తీక్ బాబును పదే పదే అడుగుతుంది. ఇంటికి వెళ్లాక చెబుతానని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 9వ తేదీ 405 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

ఇక ఇంటికి వెళ్లిన తర్వాత దీపా కార్తీక్ బాబుతో ఏం జరిగిందని అంటుంది. అక్కడ గౌతమ్ వల్ల జ్యోత్స్నకు ఏదైనా సమస్య వచ్చిందా అని కార్తీక్ బాబును అడుగుతుంది. దాంతో కార్తీక్ బాబు అవునని అంటాడు. నీకు చెబితే కంగారు పడుతావని చెబుతాడు. గౌతమ్ ఇంటికి వెళ్లిన జ్యోత్స్నకు అవమానం జరిగిందని, ఇంట్లో ఎవ్వరూ లేరని ఆ గౌతమ్ జ్యోత్స్న చేయి పట్టుకున్నాడని దీపాకు వివరిస్తాడు. దీంతో దీపా రగిలిపోతుంది. మరీ మీరు అడ్డుకోలేదా? వెంటనే చెప్పు తెగేలా కొట్టాలి కదా అని అంటుంది. కాసేపు ఉంటే జ్యోత్స్న అదే పని చేసేది కానీ తన వల్లనే నిశ్చితార్థం ఆగిపోతుందనే ఆగిపోయింది. ఇక వెంటనే నేను వెళ్లి అడ్డుకుని జ్యోత్స్నను ఇంటికి తీసుకొని వచ్చానని అంటాడు. ఇదే సమయంలో జ్యోత్స్న నిశ్చితార్థం ఆపేందుకు ప్లాన్ చేస్తుందని దీపాతో చెబుతాడు. కానీ ఎలా ప్లాన్ చేస్తుందనేది అర్థం కావడం లేదని చెప్తాడు. ప్రస్తుతం జ్యోత్స్నను గౌతమ్ నుంచి కాపాడాలని, మరోవైపు జ్యోత్స్న, గౌతమ్ లకు కూడా గట్టిగా బుద్ధి చెప్పాలని అంటాడు.
మరోవైపు జ్యోత్స్న గౌతమ్ వాళ్ల ఇంట్లో జరిగిన విషయాన్ని పారు జాతానికి చెబుతుంది. గౌతమ్ తన చేయి పట్టుకొని అసహ్యంగా ప్రవర్తించాడని అంటుంది. దాంతో పారు షాక్ అవుతుంది. మరీ వాడిని నుంచి తప్పించుకోవడం ఎలాగే అని పారు జ్యోత్స్నను ప్రశ్నిస్తుంది. దాంతో జ్యోత్స్న స్పందిస్తూ మన ప్లాన్ ప్రకారం.. కార్తీక్ బాబు, దీపానే పావులుగా వాడుకోవాల్సింది. కానీ వాళ్లిద్దరూ ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. అసలు పెళ్లి విషయంలో ఏమాత్రం నెగెటివ్ గా మాట్లాడటం లేదు. అందుకే మనం తెలివిగా కాశీగాడిని అడ్డుపెట్టుకొని ఈ నిశ్చితార్థం ఆపేందుకు ప్లాన్ చేసిన సంగతి వాళ్లకు తెలియదు అని జ్యోత్స్న అంటుంది. కాశీ తప్పకుండా మనం చెప్పినట్టుగా గౌతమ్ గురించి తెలుసుకొని నిశ్చితార్థాన్ని అడ్డుకుంటాడని అంచనా వేస్తారు. కానీ కాశీ ఇదే విషయాన్ని కార్తీక్ బాబు, దీపాలకు చెబితే ఎలాగే అని పారుజాతం సందేహిస్తుంది. చెప్పే ప్రమాదం కూడా ఉంది అని అంటుంది. కానీ ఈ విషయం మాత్రం కార్తీక్ బాబు, దీపాలకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పాల్సిన పనిలేదని జ్యోత్స్న అంటుంది. అదే సమయంలో దీపా వాళ్ల దగ్గరికి కాఫీ తీసుకొని వస్తుంది.
దీపాను చూసిన జ్యోత్స్న, పారులకు గుండె జారిపోతుంది. కాశీతో తాము వేసుకున్న ప్లాన్ గురించి పూర్తిగా వినేసిందా అని కంగారు పడుతారు. కానీ దీపా మాత్రం అస్సలు విననట్టు నటిస్తుంది. ఇక వారికి కాఫీ ఇస్తుంది. ఇలా మాట్లాడుకుంటుంటే దొంగచాటుగా వచ్చి వింటున్నావా? అని పారు దీపాపై మండిపడుతుంది. విన్న నేను ఏం చేస్తాను అమ్మగారు అని అంటుంది. ఎవ్వరు ఎన్ని చేసినా ఈ నిశ్చితార్థం అస్సలు ఆగదని చెబుతుంది. ఎందుకంటే.. గౌతమ్ చెడ్డవాడు, పరమ నీచుడు, ఆడదానిని ఆటవస్తువుల చూసే దుర్మార్గుడు, వాడికి ఆడదే కావాలి మనస్సుతో పనిలేదు, వాడితో జ్యోత్స్న పెళ్లైతే జ్యోత్స్న జీవితం నాశనం అవుతుంది.. అనే చెబుతూ ఉంటుంది. దీంతో దీపా అలా మాట్లాడటం చూసి జ్యోత్స్న, పారులు హ్యాపీ అవుతారు. మళ్లీ పాత దీపాలా మారిపోయిందని అనుకుంటారు. దీపా ఇలానే మాట్లాడితే నిశ్చితార్థం వెంటనే క్యాన్సిల్ అవుతుందని సంతోష పడుతారు.
కానీ దీపా మాత్రం గౌతమ్ గురించి చెప్పాల్సినవన్నీ చెప్పి.. నేను అలా అనను కదా అని అంటుంది. ఎందుకంటే గౌతమ్ ఉత్తముడు, సత్ర్పవర్తన కలిగిన వాడు, జ్యోత్స్న కు సరైన వాడు అని మాట మార్చేస్తుంది. నేను అడ్డుపడను కాబట్టి నిశ్చితార్థం ఆగే సమస్యే లేదని అంటుంది. మరోవైపు కార్తీక్ బాబు సర్ ప్రైజ్ అంటూ ఉంగరాలు తీసుకొస్తాడు. గౌతమ్ పంపించాడని, జ్యోత్స్నకు చూపించమని ఇంట్లో వాళ్లను పిలిచి ఎంగేజ్ మెంట్ రింగ్స్ ను అందిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











