Karthika Deepam 2 July 10th: జ్యోత్స్న ప్లాన్ గోవిందా.. కార్తీక్ బాబు మాస్టర్ ప్లాన్ కు సక్సెస్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 9వ తేదీ 405వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న గౌతమ్ వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మకు సారీ చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గౌతమ్ జ్యోత్స్న చేయి పట్టుకొని అడ్వాన్స్ అవుతాడు. అది గమనించిన కార్తీక్ బాబు జోక్యం చేసుకొని జ్యోత్స్నను సేఫ్ గా ఇంటికి తీసుకొని వస్తాడు. ఆ విషయాన్ని కార్తీక్ బాబు ఇంట్లో వాళ్ల అందరికీ చెబుతాడు. మరోవైపు గౌతమ్ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. పరిస్థితి తన చేతిలో నుంచి జారిపోతుందని అనుకుంటుంది. ఓవైపు దీపాను అడ్డుపెట్టుకొని తన పెళ్లిని చెడగొట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే కార్తీక్ బాబు అడుగడుగునా అడ్డుకుంటూనే ఉన్నాడని అనుకుంటుంది. దీపాను కార్తీక్ బాబు పూర్తిగా మార్చేశాడని తెలుసుకుంటుంది.
ఇక ఎలాగైనా తన పెళ్లిని ఆపాలని జ్యోత్స్న మరో ప్లాన్ వేస్తుంది. కాశీకి 10 లక్షలు సాయం చేసి తనకు గౌతమ్ ఎలాంటి వాడో ఫాలో అయ్యి చెప్పాలని అంటుంది. అంతే కాదు తన తల్లి సుమిత్రకు కూడా నువ్వే చెప్పాలని అంటుంది. దాంతో కాశీ సరేనని ఒప్పుకుంటాడు. ఇక గౌతమ్ గుట్టు మొత్తం తెలుసుకుంటాడు. గౌతమ్ మరో అమ్మాయితో తిరుగుతున్న సమయంలో తన ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. మరోవైపు కాశీతో పెళ్లి చెడగొట్టేలా ప్లాన్ చేశానని జ్యోత్స్న పారుజాతానికి చెబుతూ ఉంటుంది. ఈ విషయం కాశీ ఎవ్వరితో చెప్పడని, ఇక దీపా కార్తీక్ బాబులకు కూడా తెల్వనివ్వకుండా జాగ్రత్త పడాలని జ్యోత్స్న అంటుంది. కానీ దీపా కాఫీ ఇవ్వడానికి వచ్చి జ్యోత్స్న మాటలు మొత్తం వింటుంది. దాంతో జ్యోత్స్న, పారుజాతం షాక్ అవుతారు. ఇంకోవైపు కార్తీక్ బాబు గౌతమ్ జ్యోత్స్న కోసం తానే రెండు ఎంగేజ్ మెంట్స్ రింగ్స్ ను కొని పంపించాడని సర్ ప్రైజ్ ఇస్తాడు. ఓవైపు జ్యోత్స్న పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటే.. మరోవైపు కార్తీక్ బాబు వేగవంతం చేస్తూ జ్యోత్స్నకు తలనొప్పి తెప్పిస్తుండటం ఆసక్తికరంగా ఉంది. ఈ క్రమంలో ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక జూలై 10వ తేదీ 406 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

జ్యోత్స్న ఒకవైపు గౌతమ్ తో తన పెళ్లిని చెడగొట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ కార్తీక్ బాబు మాత్రం ఓవైపు పెళ్లిని ఆపాలని చూస్తూనే ఉంటాడు. కానీ జోష్నా నోటితోనే ఈ పెళ్లి చేసుకోనని చెప్పించాలని అనుకుంటాడు. అందుకోసం నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరోవైపు జ్యోత్స్న కూడా బయటపడకుండానే తన పెళ్లిని క్యాన్సిల్ చేయించాలని ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. ఈ లోగా కార్తీక్ బాబు జోష్నకు మరో షాక్ ఇస్తాడు. గౌతం జ్యోత్స్న కోసం ముందుగానే ఎంగేజ్మెంట్ రింగ్స్ పంపించాడని చెబుతాడు. దాంతో దశరథ, సుమిత్ర, శివ నారాయణ ఎంతో సంతోషిస్తారు. అదే మనం తీసుకుంటాం కదా అని సుమిత్ర కార్తీక్ బాబుతో అంటుంది. పోయినసారి మనం తీసుకుంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అందుకే ముందు జాగ్రత్తగా ఈసారి వాళ్లే తీసుకున్నారని కార్తీక్ బాబు వివరిస్తాడు. ముందు ఎంగేజ్మెంట్ రింగ్స్ జోష్ణకు నచ్చాయో లేదో తెలుసుకోమని కార్తీక్ బాబు అంటాడు. ఇక వెంటనే సుమిత్ర జోత్స్నా గదిలోకి వెళ్తుంది.
అప్పటికే జ్యోత్స్న గౌతమ్ తో పెళ్లిని ఎలా ఆపాలని ఆలోచిస్తూ ఉంటుంది. కాశీతో చేసిన ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదోనని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో సుమిత్ర వచ్చి ఎంగేజ్మెంట్ రింగ్స్ చూపిస్తుంది. నిశ్చితార్థం కోసమని గౌతం పంపించినట్లు చెబుతోంది. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏ గౌతం గాడికి ఇంత తొందరగా ఉంది ఏంటని మనసులో అనుకుంటుంది. ఇక సుమిత్ర ఎంగేజ్మెంట్ రింగ్స్ ను జ్యోత్స్నకు ఇచ్చి చూడమని చెప్పి వెళ్ళిపోతుంది. అసలు ఎంగేజ్మెంట్ జరగదని నేను అనుకుంటూ ఉంటే ఈ గౌతమ్ గాడు పెళ్లికి యమ స్పీడ్ అవుతున్నాడని అనుకుంటుంది. అసలు ఎంగేజ్మెంట్ రింగ్స్ లేకపోతే ఎలా జరుగుతుందో చూస్తానని అనుకుంటుంది. ఆ ఎంగేజ్మెంట్ రింగ్స్ ను తన టెడ్డీబేర్ లో దాస్తుంది. రింగ్స్ పోయాయని చెబుదామని అనుకుంటుంది.
ఇక ఇంట్లో వాళ్ళందరూ జ్యోత్స్నకు ఎంగేజ్మెంట్ రింగ్స్ నచ్చాయో లేదో తెలుసుకోవాలని అనుకుంటారు. మరోవైపు కార్తీక్ బాబు కూడా ఇంట్లో వాళ్ళందరిని పోగేసి ఇంతకీ జోష్ణకు గౌతం పంపించిన ఎంగేజ్మెంట్ రింగ్స్ నచ్చాయో లేదో తెలుసుకోండని అంటాడు. అవతల గౌతమ్ బ్రో నాకు ఫోను చేసి మరి అడుగుతున్నాడని, జోష్ణ కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదంటా అని ఇంట్లో వాళ్లతో చెబుతాడు. ఇక వెంటనే జోష్నను పిలిపించి అసలు నీకు ఎంగేజ్మెంట్ రింగ్స్ నచ్చాయా లేదా అని శివ నారాయణ అడుగుతాడు. దాంతో జోష్న మౌనంగా ఉంటుంది. ఇలా కాదు గాని ఎంగేజ్మెంట్ రింగ్స్ ను తన చేతిలో పట్టుకొని నాకు నచ్చాయని చెప్పాలని, జ్యోత్స్న చెప్పడం వీడియో తీసి గౌతమ్ బ్రో కి పంపిస్తానని కార్తీక్ బాబు అంటాడు. దాంతో జ్యోత్స్నకు చిర్రెత్తిపోతుంది.
అసలు ఎంగేజ్ మెంట్ రింగ్స్ లేనే లేవని చెబుతుంది. అలా ఎలా పోతాయని సుమిత్ర జోష్న ను ప్రశ్నిస్తుంది. దాంతో ఏం సమాధానం చెప్పాలో తెలియని జోష్నా పారిజాతాన్ని ఇరికిస్తుంది. ఆ ఎంగేజ్ మెంట్ రింగ్స్ ను పారిజాతానికి ఇచ్చానని చెబుతోంది. దాంతో పారుజాతం షాక్ అవుతుంది. అసలు నాకు ఎప్పుడు ఇచ్చావే అని పారుజాతం జ్యోత్స్నను అడుగుతుంది. దాంతో జ్యోత్స్న నీకే రింగ్స్ ఇచ్చాను. నువ్వే మర్చిపోయావని అంటుంది. ఇక అందరూ పారును తిడుతారు. జ్యోత్స్న తనను ఎందుకు ఇరికించిందోనని పారు షాక్ అవుతుంది. ఇక జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ రింగ్స్ ను పోగొడుతుందని ముందే తెలిసి మరో సెట్ తీసుకొచ్చి ఇంట్లో పెడుతాడు. రింగ్స్ పోయాయని జ్యోత్స్న నాటకం ఆడటంతో దొరికాయని, పారు మాకు తీసుకొచ్చి ఇచ్చిందని, ఫోన్ మాట్లాడుతూ మర్చిపోయిందని దీపా, కార్తీక్ బాబు చెబుతారు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











