Karthika Deepam 2 July 11th: జ్యోత్స్న చెంప చెల్లుమనింది.. పారిజాతానికి కార్తీక్ బాబు మాస్ వార్నింగ్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 10వ తేదీ 406వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఓవైపు జ్యోత్స్న గౌతమ్ తో తన పెళ్లిని చెడగొట్టుకోవాలని ప్లాన్ ల మీద ప్లాన్స్ చేస్తూ ఉంటుంది. అందుకు తగట్టుగానే కార్తీక్ బాబు కూడా జ్యోత్స్న పెళ్లిని త్వరగా చేయాలని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో గౌతమ్ ఎంగేజ్ మెంట్ రింగ్స్ పంపించాడని ఇంట్లో వాళ్లందరికీ చెబుతాడు. గౌతమ్ బ్రోకు ఈ రింగ్స్ చాలా సెంటిమెంట్ అని చెబుతాడు. పోయిన సారి మనం ఇచ్చిన రింగ్స్ వల్ల ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందని, ఇప్పుడు స్వయంగా తానే తనకు ఎంతో సెంటిమెంట్ అయిన ఈ రింగ్స్ ను పంపించాడని అంటాడు. ఇక ముందుగా ఈ రింగ్స్ జ్యోత్స్నకు నాచ్చాయో లేదో ఒకసారి తెలుసుకోవాలని కార్తీక్ బాబు సుమిత్రతో అంటాడు. దాంతో సుమిత్ర ఆ రింగ్స్ ను తీసుకెళ్లి జ్యోత్స్నకు ఇస్తుంది. ఓపెన్ చేసి చూడమని, నీకు నచ్చిందో లేదో తర్వాత చెప్పమని అంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం ఆ రింగ్స్ ను టెడ్డీ బేర్ లో పెట్టి పోయానని చెబుదామని అనుకుంటంది.
ఇక అందరూ జ్యోత్స్నను కిందికి పిలిచి రింగ్స్ విషయాన్ని అడుగుతారు. మరోవైపు కార్తీక్ బాబు తనకు గౌతమ్ ఫోన్ చేస్తున్నాడని, జ్యోత్స్నకు ఎంగేజ్ మెంట్ రింగ్స్ నచ్చాయో లేదో తెలుసుకోమని అంటున్నాడని కంగారు పెడుతాడు. అంతే కాదు ఆ రింగ్స్ ను చేతిలో పట్టుకొని ఈ రింగ్స్ నాకు నచ్చాయని చెప్పాలని అది వీడియో తీసి గౌతమ్ బ్రోకు పంపిస్తానని కార్తీక్ బాబు అంటాడు. దాంతో జ్యోత్స్నకు మండిపోతుంది. అసలు ఆ రింగ్స్ లేవని చెబుతుంది. ఏమయ్యాయని శివనారాయణ, దశరథలు జ్యోత్స్నను అడుగుతారు. ఆ రింగ్స్ ను గ్రానీ పారుకు ఇచ్చానని చెబుతుంది. దాంతో పారుజాతం షాక్ అవుతుంది. అస్సలు నాకెప్పుడు ఇచ్చావే అని జ్యోత్స్నను అడుగుతుంది. ఇక జ్యోత్స్న నీకే ఇచ్చాను. నువ్వు ఎక్కడ పెట్టావో నాకెలా తెలుస్తుందని నిందవేస్తుంది. దీంతో శివ నారాయణ రింగ్స్ ఎక్కడ అని పారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఈ లోగా దీపా రింగ్స్ తీసుకొచ్చి ఇస్తుంది. పారుజాతం ఆ రింగ్స్ ను తనకిచ్చి మర్చిపోయారని చెబుతుంది. ఇక జ్యోత్స్న షాక్ అవుతుంది. తను దాచి పెట్టిన రింగ్స్ దీపా చేతికి ఎలా వెళ్లాయని కంగారు పడుతుంది. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 11వ తేదీ 407 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

జ్యోత్స్నకు ఆ రింగ్స్ నచ్చాయా? లేదా అని ఇంట్లో వాళ్లు అందరూ అడుగుతారు. దాంతో సరైన సమాధానం చెప్పకుండానే వెళ్లిపోతుంది. ఇక కార్తీక్ బాబు ఇచ్చిన ట్విస్ట్ కు జ్యోత్స్న షాక్ అవుతుంది. అసలు నేను టెడ్డీ బేర్ లో దాచిన రింగ్స్ దీపా చేతిలోకి ఎలా వచ్చాయని కంగారు పడుతుంది. వెంటనే తన గదిలోకి వెళ్లి టెడ్డీ బేర్ లో దాచిన రింగ్స్ ను చూస్తుంది. ఇక అందులో రింగ్స్ ఉండవు. దాంతో జ్యోత్స్నకు దిమ్మతిరిగిపోతుంది. అసలు తను దాచిన రింగ్స్ దీపా చేతిలోకి ఎలా వచ్చాయని కంగారు పడుతుంది. తను ఎంగేజ్ మెంట్ ను ఆపాలని ప్రయత్నిస్తున్నట్టు కార్తీక్ బాబుకు తెలిసిపోయిందని గ్రహిస్తుంది. అందుకే వచ్చి రింగ్స్ ను దొంగలించాడని అనుకుంటుంది. తపపై కార్తీక్ బాబు ఎప్పుడు ఓ కన్నేసి ఉంచుతున్నాడని స్పష్టం చేసుకుంటుంది. ఇక కార్తీక్ బాబుకు తెలియకుండా తన ఎంగేజ్ మెంట్ ను ఆపాలని మనస్సులో అనుకుంటూ ఉంటుంది. ఇలోకా పారుజాతం జ్యోత్స్న గదిలోకి వస్తుంది. జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది.
పారుజాతం కోపంలో ఊగిపోతుంది. తనను ఇరికించాలని ప్రయత్నించినందుకు జ్యోత్స్న చెంపలు వాయిస్తుంది. అందరి ముందు నన్ను వెర్రిదాన్ని చేశావని జ్యోత్స్నపై మండిపడుతుంది. అసలు రింగ్స్ నేను తీయకపోయినా మీ తాత శివనారాయణ ముందు అలా ఎలా నామీదకు తోసేస్తావని అంటుంది. నువ్వు చేసే పనులేవీ సరిగా లేవని అంటుంది. నువ్వు దీపాకు ఇచ్చి నామీదకు నెట్టేస్తావా? అని ఫైర్ అవుతుంది. అసలు నేను దీపాకు ఇవ్వలేదని, కార్తీక్ బాబే దొంగలించాడని అంటుంది. వాడు చాలా తెలివైన వాడని, వాడితో ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని అంటుంది. జాగ్రత్తగా ఉన్న ఫలితం లేదని, కార్తీక్ బాబు దీపాలకు నిజం తెలిసి పోయినట్టు ఉందని పారుతూ చెబుతుంది. ఈ ఇంటి వారసురాలిని నేను కాదనే నిజాన్ని పసిగట్టారని పారుజాతంతో జ్యోత్స్న వివరిస్తుంది. అలా ఏం జరిగి ఉండదని పారు అంటుంది. ఏదైనా చిన్న విషయం తెలిస్తేనే రచ్చ రంబోలా చేసే కార్తీక్ బాబు, దీపాలు ఇంత పెద్ద రహస్యం తెలిసినా కూడా సైలెంట్ గా ఉంటారా? అని పారుజాతం అంటుంది.
ఉంటారు.. ఎందుకంటే దీపానే మా మమ్మి కూతురు, నేను ఈ ఇంటికి అసలు వారసురాలిని కాదు కాబట్టి అంటుంది. దాంతో పారు షాక్ అవుతుంది. ఏంటే దీపానే సుమిత్ర అసలు కూతురా? అని ప్రశ్నిస్తుంది. తొందర్లో నోరు జారనని జ్యోత్స్న మనస్సులో అనుకుంటుంది. దీపానే సుమిత్రకు అసలు కూతురు అనే విషయాన్ని ఎప్పటికీ పారుజాతానికి తెల్వనివ్వకూడదని, పారుకు తెలిసే లోపు దీపాను చంపేయాలని అనుకుంటుంది. ఇక బయటికి సుమిత్ర అస్సలు కూతురులాగానే దీపా ఫీల్ అవుతుందని అంటుంది. సుమిత్ర అసలు కూతురు పురిట్లోనే చచ్చింది. ఇక తిరిగి రాలేదు. ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. తెలిసిన వాళ్లేవరూ బతికి లేరని పారుజాతం జ్యోత్స్నతో అంటుంది. మరోవైపు రింగ్స్ విషయంలో కంగారు పెట్టిన కార్తీక్ బాబును నిలదీసేందుకని పారు, జ్యోత్స్నలు వాళ్ల దగ్గరికి వెళ్తారు. అక్కడ కార్తీక్ బాబు దీపా జడలో గులాబీ పువ్వు పెడుతాడు. ఆ గులాబీ కోసం పారు గొడవ పడుతుంది. ఈ సమయంలోనే జ్యోత్స్న చెంపపై చేతి అచ్చులను చూసి కార్తీక్ బాబు ఏంటి సంగతిని అడుగుతాడు. పారునే కొట్టానని ఒప్పుకుంటుంది. ఇక మీరెందుకు ఇలా చేస్తున్నార్రా అని పారు అడుగుతుంది. మున్ముందు నీకే తెలుస్తుందిలే పారు అని కార్తీక్ బాబు సమాధానం ఇస్తాడు.


Click it and Unblock the Notifications











