Karthika Deepam 2 July 12th: జ్యోత్స్న దెబ్బ.. షాక్ లో కార్తీక్ బాబు.. వంటలక్కకు శోఖం

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 11వ తేదీ 407వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రస్తుతం శివ నారాయణ ఇంట్లో జ్యోత్స్న పెళ్లి హడావుడి జరుగుతోంది. జ్యోత్స్నకు ఘనంగా పెళ్లి చేయాలని శివనారాయణ, గౌతమ్, సుమిత్రలు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ జ్యోత్స్న మాత్రం ఎప్పటికప్పుడు గౌతమ్ తో తన ఎంగేజ్ మెంట్ ను అడ్డుకోవాలని చూస్తూ ఉంటుంది. ఎలాగైన చెడగొట్టాలని నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇందు కోసం తనకు తెలిసిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. నేరుగా గౌతమ్ తోనే తేల్చుకుంటానని అనుకుంటుంది. ఇంటికి వెళ్లి మరీ గౌతమ్ ను ఎంగేజ్ మెంట్ వాయిదా వేద్దామని అడిగితే అస్సలు వద్దని అంటాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇక ఏ దారిలేక పోవడంతో దీపా తమ్ముడు కాశీని వాడుకోవాలని చూస్తుంది. కాశీకి 10 లక్షలు ఇచ్చి మరీ గౌతమ్ గురించి తెలుసుకొని తన తల్లి సుమిత్రకు చెప్పాలని అంటుంది. దాంతో గౌతమ్ అదే పనిలో ఉన్నాడు. గౌతమ్ వేరో అమ్మాయితో కలిసి ఉన్నప్పుడు వీడియో కూడా తీశాడు.

ఇక కాశీని జ్యోత్స్న పావులా వాడుకుంటుందని దీపాకు తెలిసిపోతుంది. జ్యోత్స్న పారుకు చెబుతున్న సమయంలో దీపా కూడా వింటుంది. దాంతో కాశీతో వేసిన ప్లాన్ కూడా చెడిపోతుందని జ్యోత్స్న కంగారు పడుతుంది. అన్నీ దారులు మూసుకుపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితితో ఆందోళన పడుతోంది. మరోవైపు కార్తీక్ బాబు జ్యోత్స్న పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా ఉండాలని ఏర్పాట్లు చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడల్లా గౌతమ్ గురించి ఇంట్లో మాట్లాడుతూ జ్యోత్స్నకు కోపం తెప్పిస్తున్నాడు. ఇక గౌతమ్ ఎంగేజ్ మెంట్ రింగ్స్ కూడా పంపించాడని కార్తీక్ బాబు జ్యోత్స్నకు షాక్ ఇస్తాడు. జ్యోత్స్న మాత్రం తనకు పెళ్లి ఇష్టం లేదని బయట పడదు. జ్యోత్స్న చేతనే నిజాలు చెప్పించాలని కార్తీక్ బాబు అనుకుంటాడు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 11వ తేదీ 408 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 408 July 12th 2025

జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ గురించి అన్ని ఏర్పాట్లు చకాచకా చేస్తున్నారు. ఈ క్రమంలో దశరథకు టెన్షన్ మొదలవుతుంది. అసలు జ్యోత్స్న దాసును ఎందుకు చంపాలని అనుకుంది. ఇప్పుడు గౌతమ్ తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది. ఒకప్పుడు గౌతమ్ చెడ్డవాడని చెప్పిన దీపా, ఇప్పుడు మంచి వాడని ఎందుకు అంటోంది. అసలు గౌతమ్ మంచివాడా? చెడ్డవాడా? అని తనతో తానే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాడు. ఇక పట్టలేక కార్తీక్ బాబును పిలిచి ఈ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. గౌతమ్ గురించి నాకు పూర్తిగా తెలియాలి. నేను నమ్మింది నిన్ను ఒక్కడినేరా అంటూ దశరథ కార్తీక్ బాబును అడుగుతాడు. కానీ కార్తీక్ బాబు గౌతమ్ గురించి నిజాలు చెప్పబోడు. జ్యోత్స్నకు గౌతమ్ చెడ్డవాడని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందని చెబితే తీసుకుంటాడో లేదోనని ఆగిపోతాడు. జ్యోత్స్నకు మంచే జరుగుతుందని సమాధానం ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు దీపాకు సుమిత్ర అమ్మకు మధ్య భావోద్వేగమైన సన్నివేశం సాగింది.

దీపా సుమిత్ర అమ్మ గదిలోకి కాఫీ తీసుకొని వెళ్తుంది. అమ్మగారు కాఫీ తీసుకోండని అంటుంది. దాంతో సుమిత్ర దీపా వైపు గుర్రుగా చూస్తుంది. అసలు నీకు ఇంత కరెక్ట్ గా ఎలా గుర్తుకు ఉంటుంది. నేను ఎప్పుడు నిద్ర లేస్తాను, ఎప్పుడు టీ తాగుతాను, ఎప్పుడు టిఫిన్ తింటాను, ఎప్పుడు తింటాను, ఎప్పుడు కాఫీ తాగుతాను, ఎప్పుడు స్నాక్స్ తింటానో కచ్చితంగా తెలుసుకొని సేవలు చేస్తున్నావు. జీతం తీసుకునే వాళ్లు అయితే చేయాలి కాబట్టి చేస్తారు. కానీ నీకు జీతం కూడా లేదు కదా ఎందుకు ఇంత కచ్చితంగా శ్రద్ధ వహిస్తున్నావనేది నాకు ఆశ్చర్యంగా ఉందని అంటుంది. నీ మనస్సులో ఏం ఉందనేది నాకు తెలియడం లేదని దీపాతో అంటుంది. దాంతో దీపా లోలోపల కుమిలి పోతుంది. నేను నీ కన్న కూతురును అమ్మ. అందుకే ఇలా అన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నానని దీపా మనస్సులో అనుకుంటుంది. నువ్విలా మాట్లాడుతుంటే గట్టిగా అరిచి చెప్పాలని ఉందంటుంది.

ఆ తర్వాత సుమిత్ర మాట్లాడుతూ నాకు నువ్వు ఒక్కసాయం చేయాలని అడుగుతుంది. త్వరలో నా కూతురు జ్యోత్స్న నిశ్చితార్థం ఉందని, ఆ నిశ్చితార్థంలో నీ వల్ల ఎలాంటి గొడవ రాకూడదని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఆడపడుచు(కాంచన) కోసం చీర తీసుకున్నాను. ఎలాగైనా నువ్వు ఈ చీర తీసుకెళ్లి మా వదిన కాంచనకు ఇవ్వాలని ఇదే నువ్వు నాకు చేయాల్సిన సాయం అని అంటుంది. దాంతో దీపా క్షమించండి అమ్మగారు నేను ఆ పనిచేయలేనని చెబుతుంది. చీర మీరు ఇవ్వడానికి, నేను ఇవ్వడానికి చాలా తేడా ఉంటుంది. మీరే వేరే మార్గం చూసుకోండి అని చెబుతుంది. చీర నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు కానీ, నా కూతురు జోలికి మాత్రం రాకని అంటుంది. నీ వల్ల నాకూతురు జ్యోత్స్న నిశ్చితార్థానికి ఆటంకం కలగకూడదని చెబుతుంది. నాకు నా కూతురు అంటే ప్రాణమని చెబుతుంది. 9 నెలలు కడుపులో ఉన్నప్పుడు ఎన్నో కబర్లు చెప్పానని, నా గర్భసంచి బలహీనంగా ఉండటంతో డాక్టర్లు హెచ్చరించారని, దాంతో నా బిడ్డకు ఏం కాకూడదని ఆ 9 నెలలు దేవుడికి ప్రతి రోజూ దీపం ముట్టించి వేడుకున్నాను.

నా బిడ్డ పుట్టాక, తొలిసారి నా చేతులతో ఎత్తుకున్నాక మళ్లి పుట్టినట్టు అనిపించింది. అలాంటి ప్రేమ మాది అని సుమత్ర చెప్పుకుంటూ వచ్చింది. ఇక దీపా పుట్టుక గురించి దీపాకే తన కూతురు అని తెలియక సుమిత్ర చెప్పడంతో దీపా కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుమిత్ర మాటలకు తట్టుకోలేక కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడ కార్తీక్ బాబు దిగాలుగా కూర్చొని ఉంటాడు. దీపా కన్నీళ్లతో రావడం చూసి ఏమైందని అడుగుతాడు. దీపా చెబుతుంది. ఆ తర్వాత కార్తీక్ బాబు దశరథ మామ టెన్షన్ పడుతున్నాడని జరిగిన విషయాన్ని చెబుతాడు. ఈ క్రమంలో శివనారాయణ వారిద్దరి దగ్గరికి వచ్చి బుధవారం నా మనవరాలు జ్యోత్స్న నిశ్చితార్థం ఉంది. మీ అమ్మ కాంచనను పిలవమని అంటాడు. డ్రైవర్ వాళ్ల అమ్మగా అయితే నేను పిలవను, ఈ ఇంటి యజమాని కూతురుని ఎలా పిలుస్తారో పద్ధతి చెప్పాల్సిన అవసరం లేదు. నేను మాత్రం పిలవలేనని చెబుతాడు. ఎలా రప్పించాలో నాకు తెలుసు అని శివనారాయాణ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X