Karthika Deepam 2 July 14th: దీపాకు సుమిత్ర వార్నింగ్.. సుమిత్రపై కాంచన ఫైర్.. రచ్చరచ్చ

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 12వ తేదీ 408వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సుమిత్ర దీపాను చూస్తేనే భగ్గు మంటుంది. ఇక దీపా సుమిత్రకు కాఫీ తెచ్చి ఇవ్వడానికి వచ్చిన సమయంలో సుమిత్ర మాట్లాడుతూ నాకు నువ్వు ఒక సాయం చేయాలని అంటుంది. దాంతో దీపా సరేనని అంటుంది. జ్యోత్స్న నిశ్చితార్థాని కోసమని మా వదిన కాంచనకు ఈ పట్టుచీర తీసుకున్నానని నువ్వు తీసుకెళ్లి ఇవ్వమని అడుగుతుంది. దాంతో దీపా క్షమించమని అంటుంది. నేను ఆ పని చేయలేనని సుమిత్రకు బదులిస్తుంది. ఆ తర్వాత సుమిత్ర దీపాపై ఇంకా మండిపడుతుంది. నీ వల్లనే మా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని, ఇప్పుడు కూడా నీ వల్లనే శృతి ఎంగేజ్ మెంట్ ఆగిపోతుందేమోనని భయం వేస్తుందని అంటుంది. ఇంకా సుమిత్ర నానా మాటలు అంటుంది. దాంతో దీపా భరించలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఇక వెంటనే కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడ అప్పటికే కార్తీక్ బాబు ఉంటాడు. అంతకు ముందు దశరథ తనతో మాట్లాడుతూ ఆందోళన పడుతున్నాడని, మనమేమో జ్యోత్స్న గురించి నిజం చెప్పే పరిస్థితిలో లేమని అంటాడు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలో తెలియడం లేదని దీపాతో అంటాడు. ఇక దీపా కూడా సుమిత్ర అన్న మాటలకు బాధపడుతూ కార్తీక్ బాబుకు కనిపిస్తుంది. ఇక కార్తీక్ బాబు ఓదార్చుతాడు. ఈ సమయంలో శివ నారాయణ వస్తాడు. కార్తీక్ బాబుతో మాట్లాడే పని ఉందని చెబుతాడు. మీ అమ్మను శృతి ఎంగేజ్ మెంట్ కు పిలవమని అంటాడు. మా అమ్మను అంటే డ్రైవర్ తల్లినా, ఈ ఇంటి యజమాని కూతురునా అని మరోసారి ప్రశ్నిస్తాడు కార్తీక్ బాబు. అందుకు శివ నారాయణ నీ తల్లినే అని అంటాడు. అలాగైతే నేను పిలవనని చెబుతాడు. ఎవ్వరిని ఎలా పిలవాలో మీకు పద్ధతులు తెలుసని చెప్పి దీపాను తీసుకొని ఇంటికి వెళ్లిపోతాడు. ఇక ఎవ్వరిని ఎలా పిలిపించాలో నాకు బాగా తెలుసని అనుకుంటాడు శివ నారాయణ. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 14వ తేదీ 409 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 409 July 14th 2025

కార్తీక్ బాబు, దీపా ఇద్దరూ కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో దీపా స్కూటీని ఆపమని అంటుంది. కార్తీక్ బాబు కోపంలో ఉండటం చూసి కాస్తా శాంతింప చేద్దామని అనుకుంటుంది. అందుకోసం కార్తీక్ బాబుతో శివ నారాయణ అన్న మాటలను గుర్తు చేసి కోపం పోయేలా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇక కార్తీక్ బాబు మాట్లాడుతూ తన తల్లిని కనీసం గౌరవించడం లేదని శివనారాయణపై మండిపడుతాడు. ఆ ఇంటిపై, ఆ ఇంట్లోని మనుషులపై ఎంతో ప్రేమ, గౌరవం ఉండటం వల్లనే ఎన్నో భరిస్తూ ఉన్నానని అంటాడు. నేను అన్ని పనులు మానుకోని మరీ డ్రైవర్ గా పని చేస్తున్నానని, నిన్ను పని మనిషిగా చేసినా ఊరుకుంటున్నానని దీపాతో అంటాడు. నీ మీద ఉన్న కోపాన్ని సుమిత్ర అత్త కూడా మా అమ్మ కాంచనపై చూపించడం ఎందుకని అంటాడు. సుమిత్ర అత్తనే చీర తీసుకొని వచ్చి మా అమ్మ కాంచనను ఆహ్వానించవచ్చు కదా అని ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇక దీపా కార్తీక్ బాబు ఆవేశం తగ్గే వరకు మాట్లాడి, మున్ముందు అన్ని అవే సర్దుకుంటాయని చెబుతుంది. కార్తీక్ బాబు మనస్సు కుదిట పడ్డాక ఇంటికి వెళ్తారు.

ఇక జ్యోత్స్న తన ఎంగేజ్ మెంట్ ను ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు కాశీకి అప్పగించిన పనిని ఎంత వరకు చేశాడనేది తెలుసుకోవాలని అనుకుంటాడు. కాశీ ఏదైనా గౌతమ్ గురించి తెలుసుకున్నాడేమో కనుక్కోవాలని తన బెడ్ రూమ్ లోనే ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో గౌతమ్ నేరుగా తన బెడ్ రూమ్ లోకి వస్తాడు. గౌతమ్ తన గదిలో చూసిన జ్యోత్స్న షాక్ అవుతుంది. అసలు నువ్వు ఇప్పుడు నా గదిలోకి ఎలా వచ్చావని అడుగుతుంది. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని వచ్చానని చెబుతాడు గౌతమ్. కింద తాతయ్య ఉన్నాడు కదా అని అంటుంది. తాతయ్యతో చెప్పే వచ్చానని, ఆయనే నన్ను మీదకు పంపించాడని అంటాడు. ఇక జ్యోత్స్నతో రొమాంటిక్ గా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. వెంటనే జ్యోత్స్న చేయిని పట్టుకుంటాడు. చేతిని నిమురుతు, ఆమె కురులను తాకుతూ ఉంటాడు. దీంతో జ్యోత్స్న తన ఇంటిపై గౌతమ్ చేయి వేయడాన్ని సహించలేకపోతుంది. వెంటనే గౌతమ్ నుంచి తప్పించుకోవాలని చూస్తుంది.

దాంతో పారుజాతానికి మెసేజ్ చేస్తుంది. పారు జాతం మెసేజ్ చూసుకొని హడావుడికి జ్యోత్స్న గదిలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో శివనారాయణను చూసుకోకుండా గుద్దుతుంది. ఇక శివనారాయణ పారును తిడుతాడు. ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. జ్యోత్స్న గదిలోకి అని చెబుతుంది. ఆ గదిలో గౌతమ్, జ్యోత్స్న ఉన్నారు. వారిద్దరిని డిస్టబ్ చేయకని శివనారాయణ అంటాడు. గౌతమ్ వచ్చిన విషయం తెలుసుకొని పారుజాతం వెంటనే కాఫీ ఇవ్వడానికని జ్యోత్స్న గదిలోకి వెళ్తుంది. అప్పటికే గౌతమ్ జ్యోత్స్నను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక పారుజాతం వెళ్లి జ్యోత్స్నను కాపాడుతుంది. గౌతమ్ ను చెప్పుతో కొట్టకుండా అలా సైలెంట్ గా ఎందుకు ఉన్నావని పారుజాతం అంటుంది. మన వీక్ పాయింట్స్ అన్ని గౌతమ్ కు తెలుసని, ఏమాత్రం మన ప్రవర్తనలో తేడా వచ్చినా అస్సలు ఊరుకోడని, మనమే బుక్ అయ్యి పోతామని అంటుంది. ముందు మనం నిశ్చితార్థాన్ని ఎలా చెడగొట్టాలని ప్లాన్ చేశామో అదే ప్లాన్ ను అమలు చేద్దామని అంటుంది.

మరోవైపు సుమిత్ర, దశరథ కాంచనను ఆహ్వానించేందుకు వెళ్తారు. సుమిత్ర చీర, పళ్లు తీసుకొని కాంచనను జ్యోత్స్న నిశ్చితార్థానికి ఆహ్వానించేందుకు వెళ్తుంది. సుమిత్ర తన ఇంటికి రావడంతో కాంచన ఉప్పొంగి పోతుంది. ఇక సుమిత్ర కాంచనతో ప్రేమగా మాట్లాడటంతో ఆనంద పడుతుంది. తన వదిన తనతో మాట్లాడుతుందని సంబరపడుతుంది. ఎవరి వల్లనో మనం ఎందుకు బాధపడాలి అని సుమిత్ర అంటుంది. అదే సమయంలో దీపా, కార్తీక్ బాబు ఇంటికి వస్తారు. ఇక దీపాను కాఫీ పెట్టమని కాంచన అంటుంది. వెళ్లి కాఫీ పెట్టి అనసూయతో పంపిస్తుంది. దీపా ఎందుకు కాఫీ తీసుకురాలేదని కాంచన అడుగుతుంది. సుమిత్రకు దీపా చేతులతో కాఫీ ఇవ్వడం, తను కనపడటం ఇష్టం లేదేమోనని అనసూయ అంటుంది. దాంతో కాంచన షాక్ అవుతుంది. దీపాను పిలిచి కాఫీ ఇప్పిస్తుంది. కానీ సుమిత్ర తీసుకోదు. ఈ విషయంలో నేను అస్సలు తగ్గనని చెబుతుంది. అయినా కాంచన వినదు. చివరిగా దీపాతో సుమిత్రకు బొట్టు పెట్టించే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X