Karthika Deepam 2 July 15th: దీపాను ఛీ కొట్టిన సుమిత్ర.. జ్యోత్స్న గుట్టు తెలుసుకున్న వంటలక్క
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 14వ తేదీ 409వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. నిశ్చితార్థం చెడగొట్టాలని ఓవైపు జ్యోత్స్న ప్లాన్ చేస్తూ ఉంటుంది. అసలే కాశీకి చెప్పిన పనిని ఏం చేశాడో ఏమోనని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ గౌతమ్ గాడి నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇదే సమయంలో గౌతమ్ ఏకంగా తన బెడ్ రూమ్ లో ప్రత్యక్ష్యం అవుతాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కింద తాతయ్య ఉన్న కూడా పైకి ఎలా వచ్చావని జ్యోత్స్న అడుగుతుంది. తాతయ్యనే పంపించాడని గౌతమ్ చెబుతాడు. ఇక గౌతమ్ జ్యోత్స్నతో క్లోజ్ గా మూవ్ అవుతాడు. ఆమె చేయి పట్టుకొని కురులు దువ్వుతూ, జ్యోత్స్న పక్కన కూర్చొంటాడు. కాస్తా రిలాక్స్ అవుదామని అంటాడు. కానీ జ్యోత్స్న మాత్రం గౌతమ్ నుంచి తప్పించుకోవడానికి శత విధాలు ప్రయత్నిస్తుంది. అందుకు ముందుగా పారుజాతంకు ఫోన్ చేస్తుంది. అప్పటికే మెసేజ్ కూడా చేస్తుంది. అయినా పారు స్పందించకపోవడంతో వెంటనే ఫోన్ కాల్ చేస్తుంది.
ఇక పారు పరుగు పరుగునా జ్యోత్స్న దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈలోగా శివనారాయణకు తగులుతుంది. ఆయన పారును ఇంత తొందర ఎందుకంటూ తిడుతాడు. జ్యోత్స్న గదిలోకి వెళ్తున్నానని అంటుంది. అటు వైపు వెళ్లకని శివనారాయణ అంటాడు. గౌతమ్ వచ్చాడు. వాళ్లిద్దరి ప్రైవేట్ గా మాట్లాడుకోనివ్వమని చెబుతాడు. ఇక గౌతమ్ వచ్చిన సంగతి తెలుసుకున్న పారుజాతం కంగారు పడుతుంది. అక్కడ జ్యోత్స్న ఎంత ఇబ్బంది పడుతుందోనని వెంటనే వెళ్లాలని అనుకుంటుంది. కాఫీ తీసుకొని వెళ్లి గౌతమ్ కు ఇస్తుంది. గౌతమ్ కూడా పారు రావడంతో జ్యోత్స్నను వదిలేసి వెళ్లిపోతాడు. ఇక మరోవైపు కాంచనను జ్యోత్స్న నిశ్చితార్థానికి పిలిచేందుకు అన్న దశరథ, సుమిత్రలు చీర తీసుకొని వెళ్తారు. దాంతో కాంచన సంతోషిస్తుంది. కానీ దీపాను చూడటానికి, ఆమె చేతులతో ఇచ్చిన వస్తువులేవీ తినడానికి సుమిత్ర ఇష్టపడదనే విషయాన్ని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 15వ తేదీ 410 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపాపై సుమిత్ర పట్టలేని కోపంలో ఉందని కాంచన తెలుసుకుంటుంది. కనీసం దీపా చేతులతో తాకిన ఏ వస్తువులను, తిను బంఢారాలను తినడం లేదని, కనీసం దీపా ఎదురు పడటం కూడా సుమిత్రకు ఇష్టం లేదనే విషయాన్ని తెలుసుకుంటుంది. దాంతో వెంటనే దీపాను పిలిచి సుమిత్రకు కాఫీ ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ సుమిత్ర మాత్రం అస్సలు దీపా చేతులతో కాఫీ ఇస్తే తాగనని చెబుతుంది. దాంతో కాంచన, దీపా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక దీపాపై సుమిత్ర అత్తకు కోపం పోలేదని కార్తీక్ బాబు తెలుసుకుంటాడు. ఇక సుమిత్ర కాంచనకు బొట్టు పెట్టి సారె అందిస్తుంది. నువ్వు తప్పకుండా నా కూతురు జ్యోత్స్న నిశ్చితార్థానికి రావాలని అంటుంది. ఈ సమయంలో సుమిత్రకు కాంచన కండీషన్ పెడుతుంది. నా ఇంటి కోడలు దీపా నీకు కుంకుమ పెడుతుందని అంటుంది. దాంతో సుమిత్ర ఒప్పుకోదు. నువ్వు ఒప్పుకోకపోతే తెచ్చిన చీర వెనక్కి తీసుకెళ్లిపోమని అంటుంది. ఏం చేయలేని పరిస్థితిలో దీపాతో నుదిట బొట్టు పెట్టించుకుంటుంది. ఇక ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక మరోవైపు జ్యోత్స్న తన ఎంగేజ్ మెంట్ ను త్వరగా ఆపేందుకని ప్రయత్నిస్తుంది. దాంతో కాశీకి చెప్పిన పనిని ఎంత వరకు పూర్తి చేశాడో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక వెంటనే కాశీకి ఫోన్ చేస్తుంది. కాశీ ఫోన్ రింగ్ అవ్వడం దిల్ చూస్తుంది. ఫోన్ ను తీసుకెళ్లి కాశీకి ఇవ్వబోతుంది. కానీ జ్యోత్స్న పేరు పడటంతో ఎందుకు కాల్ చేసిందోనని, తిట్టడానికే కాల్ చేసి ఉంటుందని తానే లిఫ్ట్ చేస్తుంది. ఎందుకు కాల్ చేశావని అడుగుతుంది. నేను కాల్ చేసింది కాశీ కోసం నీకోసం కాదు, ఫోన్ వాడికే ఇవ్వమని అంటుంది. కాశీతో నీకు ఎంటీ పని అని అడుగుతుంది దిల్. కానీ జ్యోత్స్న చెప్పదు. ఫోన్ కాశీకి ఇవ్వమని అంటుంది. ఈలోగా కాశీ వచ్చి దిల్ నుంచి ఫోన్ లాక్కుంటాడు. పైగా దిల్ కు దూరంగా వెళ్లి మాట్లాడుతాడు. దీంతో దిల్ కు కాశీపై అనుమానం వస్తుంది. ఎందుకు ఇంత దూరంగా వెళ్లి మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది. ఇక జ్యోత్స్న కాశీని ఇంటికి రమ్మని చెబుతుంది. దాంతో కాశీ సరేనని, గౌతమ్ గురించి పలు విషయాలు తెలుసుకున్నానని అంటాడు. ఉదయం వచ్చాక పూర్తిగా చెబుతానని సమాధానం ఇస్తాడు.
జ్యోత్స్నను కలిసేందుకు కాశీ శివ నారాయణ ఇంటికి ఉదయమే వస్తాడు. అప్పటికే దీపా, కార్తీక్ బాబు ఇంట్లోకి వచ్చి ఉంటారు. తమ పనుల్లో నిమగ్నమైపోతారు. పైన బాల్కానీలో క్లీన్ చేస్తుండగా కాశీ రావడాన్ని, వచ్చి జ్యోత్స్నను కలవడాన్ని దీపా చూస్తుంది. కాశీ జ్యోత్స్నతో ఏదైనా గొడవ పడుతున్నాడేమోనని సందేహిస్తుంది. కానీ కాసేపటికి వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా గౌతమ్, డేటా అనే రెండు పదాలు దీపాకు వినిపిస్తుంది. దీంతో గౌతమ్ గురించి జ్యోత్స్న కాశీతో ఏదో ప్లాన్ చేసిందని దీపా గ్రహిస్తుంది. ఇక వెంటనే కార్తీక్ బాబు రాగానే తీసుకెళ్లి కాశీ జ్యోత్స్నను కలిసిన దృశ్యాన్ని చూపిస్తుంది. దీంతో జ్యోత్స్న కాశీతో ఏదో ప్లాన్ చేసిందని, ముఖ్యంగా దీపాను ఇరికించేందుకే కుట్ర పన్నుతుందని సందేహిస్తాడు. దీంతో వెంటనే దిల్ కు ఫోన్ చేసి ఏమైందని అడుగుతాడు. దీంతో దిల్ కాశీకి 10 లక్షల అప్పు ఉందని, జ్యోత్స్న కాశీకి ఫోన్ చేసిందనే వివరాలు చెబుతుంది. దాంతో అసలు వాళ్లు ఏం ప్లాన్ చేశారో తెలుసుకోవడానికి కార్తీక్ బాబు దీపాతో ఒక నాటకం ఆడిస్తాడు.
వాటర్ తాగేందుకు జ్యోత్స్న కిందికి వచ్చిన సమయంలో ఫోన్ లో గౌతమ్ ఇంటికి వచ్చి వెళ్లాడని దీపా మాట్లాడుతుంది. కార్తీక్ బాబుకు చెప్పినట్టుగా గౌతమ్ ఇంటికి రావడం నేను చూశాను, నిన్ను కలిశాడా బావ అని అంటుంది. నిన్ను కూడా కలవలేదా, మరీ ఇంకెవ్వరినీ కలిసేందుకు వచ్చాడో అని జ్యోత్స్నను చూస్తూ అంటుంది. ఫోన్ పక్కన పెట్టేసి కాశీ మిమ్మల్ని కలిశాడా అమ్మగారు అని దీపా అడుగుతుంది. నన్నెందుకు కలుస్తాడని జ్యోత్స్న బదులిస్తుంది. వాడితో నాకు పడదు కదా అని అంటుంది. కొందరితో గొడవలు ఉన్నా వాడుకోవడం కోసం కలిసి ఉండొచ్చు కదా అని దీపా సందేహిస్తుంది. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అసలు దీపా కాశీ రావడం చూసి మాట్లాడుతుందా? చూడకుండా మాట్లాడుతుందా? అనే మనస్సులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు నెక్ట్స్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తిని పెంచుతోంది.


Click it and Unblock the Notifications











