Karthika Deepam 2 July 16th: జ్యోత్స్నకు షాకిచ్చిన కాశీ.. కార్తీక్ బాబు మాస్టర్ ప్లాన్ కు బలి
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 15వ తేదీ 410వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్నను కలిసేందుకు కాశీ శివ నారాయణ ఇంటికి వెళ్తాడు. అప్పటికే దీపా, కార్తీక్ బాబు ఇంట్లోకి వచ్చి ఉంటారు. పైన బాల్కానీలో దీపా క్లీన్ చేస్తుండగా కాశీ రావడాన్ని, జ్యోత్స్నను కలవడాన్ని చూస్తుంది. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారని గమనిస్తుంది. ముఖ్యంగా గౌతమ్, డేటా అని దీపాకు వినిపిస్తుంది. దీంతో గౌతమ్ గురించి జ్యోత్స్న కాశీతో ఏదో ప్లాన్ చేసిందని తెలుసుకుంటుంది. ఆ వెంటనే దీపా కోసం వచ్చిన కార్తీక్ బాబుకు కాశీ వచ్చి జ్యోత్స్నను కలిసిన దృశ్యాన్ని చూపిస్తుంది. దాంతో కార్తీక్ బాబు షాక్ అవుతాడు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటాడు.
ఇక వెంటనే కాశీ భార్య స్వప్నకు ఫోన్ చేసి కాశీకి ఏమైందని, జ్యోత్స్న గురించి ఏదైనా తెలిసిందా అని అడుగుతాడు. దాంతో స్వప్న నిజం చెబుతుంది. ఆ వెంటనే కార్తీక్ బాబు మొదట దీపాతో ఒక ప్లాన్ వేస్తాడు. అసలు జ్యోత్స్న ఏం ప్లాన్ చేస్తోందో తమకు తెలియాలని అనుకుంటాడు. ముందుగా కాశీ వచ్చి వెళ్లిన సంగతి తమకు తెలిసి పోయిందనే విషయం జ్యోత్స్న తెలిసేలా చేయాలని అనుకుంటాడు. దీంతో దీపాతో ఫోన్ లో మాట్లాడుతున్నట్టుగా కాశీ వచ్చిన వెళ్లిన విషయాలను జ్యోత్స్న ముందే మాట్లాడిస్తాడు. దాంతో జ్యోత్స్న కంగారు పడుతుంది. ఆపై దీపా కూడా కాశీ గురించి జ్యోత్స్న ను అడగడం ప్రారంభిస్తుంది. దాంతో అసలు దీపా కాశీ రావడం చూసి మాట్లాడుతుందా? చూడకుండా మాట్లాడుతుందా? అని జ్యోత్స్న మనస్సులో అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 16వ తేదీ 411 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కాశీ వచ్చి జ్యోత్స్నను కలవడంతో దీపా, కార్తీక్ బాబు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇందుకోసం దీపాను తనతో ఫోన్ లో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి కాశీ ఇంటికి వచ్చిన సంగతి నీకు తెలిసిపోయిందని జ్యోత్స్న ముందు చెప్పమని కార్తీక్ బాబు దీపాకు చెబుతాడు. దీంతో దీపా జ్యోత్స్న కిచెన్ వద్దకు వాటర్ కోసం వచ్చిన సమయంలో కార్తీక్ బాబు చెప్పినట్టుగా నాటకం షురూ చేస్తుంది. కాశీ ఇంటికి వచ్చి వెళ్లడం నేను చూశాను బావ, కానీ నన్ను కలవలేదు. నిన్నేమైనా కలిశాడా అని అడుగుతుంది. లేదని కార్తీక్ బాబు చెబుతాడు. మరీ మన ఇద్దరినీ కలవకుండా అసలు కాశీ ఇక్కడికి ఎందుకు వచ్చి వెళ్లాడు? అసలు ఇంకెవ్వరిని కలిసేందుకు వచ్చాడనేది అర్థం కావడం లేదు అని అంటుంది. దీపా మాట్లాడుతుంటే జ్యోత్స్నలో భయాన్ని, కంగారును దీపా గమనిస్తుంది. ఇక వెంటనే దీపా జ్యోత్స్నకు కాఫీ ఇచ్చి కాశీ వచ్చి వెళ్లాడు అమ్మగారు మిమ్మల్ని ఏమైనా కలిశాడా? అని అడుగుతుంది. దాంతో జ్యోత్స్న నేను కింది స్థాయి వాళ్లను అస్సలు కలవనని అంటుంది. అవసరం వచ్చినప్పుడు వాడుకుంటారు కదా అని దీపా అంటుంది.
అవసరం ఉన్నప్పుడు కిందస్థాయి వాళ్లను వాడుకొని, సమస్యల్లో ఇరికించే అవకాశం ఉంది కదా అని దీపా జ్యోత్స్నకు మండిపోయేలా మాట్లాడుతుంది. ఏదేమైనా నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని జ్యోత్స్న అంటుంది. నాకు చెప్పకపోయినా పర్వలేదు కానీ ఎవ్వరినీ వారు మోసం చేసుకోవడం మంచిది కాదని దీపా పరోక్షంగా జ్యోత్స్నకు సలహానిస్తుంది. మనం ఒక పని తప్పు చేసి, దాన్ని దాయడం కోసం మరింతగా తప్పుల మీద తప్పులు చేయడం ఏమాత్రం సరికాదని అంటుంది. ఏదో రోజు మనమే ఆ తప్పుల నిప్పుల్లో కాలిపోతామని గౌతమ్ గురించి పరోక్షకంగా హెచ్చరిస్తుంది. ఇక జ్యోత్స్న మాత్రం తను దొరికిపోవడం కాదు, గౌతమ్ తో నిశ్చితార్థాన్ని చెడగొట్టి ఆ నింద నీపై వేసే ప్లాన్ సిద్ధమవుతోంది. నీపై నిందవేసి ఇంట్లో నుంచి వెళ్లగొడుతానని జ్యోత్స్న అనుకుంటుంది. ఇటు దీపాతో జ్యోత్స్న దగ్గర ఝలక్ ఇచ్చే డ్రామా నడిపించిన కార్తీక్ బాబు.. మరోవైపు కాశీకి కూడా అసలు నిజం తెలిసేలా చెల్లి స్వప్నతో నాటకం ఆడిస్తాడు. కాశీ జ్యోత్స్నను కలిసి ఇంటికి వెళ్తాడు. కాశీని చూసిన దిల్ ఇక తన కార్తీక్ బాబు చెప్పినట్టుగా చేస్తుంది.
కాశీకి జ్యోత్స్న నిశ్చితార్థం వెనక నడుస్తున్న అసలు కుట్ర గురించి తెలియక పోవడంతో జ్యోత్స్నకు సాయం చేస్తున్నాడని, ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేయాలని కార్తీక్ బాబు అనుకుంటాడు. దీంతో స్వప్న ద్వారా తన తల్లి కావేరితో మొదట జ్యోత్స్న నిశ్చితార్థం ఎలా ఆగిపోయింది, అసలు జ్యోత్స్న ఎలా ప్లాన్ చేసి దీపాపైకి నిందను తోసిందనే విషయాలను స్వప్న వెనకాలే ఉన్న కాశీని గమనించి అడుగుతుంది. దాంతో కావేరి జ్యోత్స్న అప్పుడు చేసిన ప్లాన్ ను పూర్తిగా చెబుతుంది. ఇక ఇప్పుడు కూడా నిశ్చితార్థం జరగదని, జ్యోత్స్న అస్సలు నిశ్చితార్థం చేసుకోదని అంటుంది. ఎలాగైనా నిశ్చితార్థాన్ని చెడగొట్టి ఆ నింద మరోసారి దీపాపై వేయాలని ప్రయత్నిస్తుందని కావేరి చెబుతుంది. ఆ మాటలన్నీ కాశీ కూడా వెంటాడు. కాశీ వింటున్న సంగతిని స్వప్న గమనిస్తుంది. ఇక కావేరి మాట్లాడుతూ అసలు జ్యోత్స్న ఎలా తన నిశ్చితార్థాన్ని చెడగొట్టబోతుందనేది అర్థం కావడం లేదని అంటుంది. ఎవరితో ప్లాన్ చేసిందనేది అంతు చిక్కడం లేదని చెబుతుంది. కానీ ఈ నిశ్చితార్థం మాత్రం అస్సలు జరగదని అంటుంది. దాంతో కాశీ తన మనస్సు మార్చుకుంటాడు. జ్యోత్స్న అక్క చెప్పినట్టుగా విని మోసపోయానని అనుకుంటాడు.
కావేరి ఈ విషయాలన్నీ చెబుతున్న సమయంలో శ్రీధర్ బాబు కూడా వెంటాడు. వెంటనే గౌతమ్ మంచి వాడు కాదనే విషయాన్ని అత్త పారుజాతంతో చెప్పాలని ప్రయత్నిస్తాడు. పారు జ్యోత్స్న నిశ్చితార్థం జరగకుండా చేస్తున్న ప్లాన్ గురించి తెలుసుకోవాలని శ్రీధర్ అనుకుంటాడు. దీంతో మాటల్లో పెట్టి పారు నుంచి నిజాలు లాగాలని చూస్తాడు. ఇక పారు కూడా శ్రీధర్ తో ఫోన్ లో మాట్లాడుకుంటూ హాలులోకి వచ్చి అసలు ఈ నిశ్చితార్థం జరగదు అల్లుడు అని అంటుంది. అదే మాటను శ్రీధర్ తో పదే పదే అంటుంది. పారు మాటలను శివ నారాయణ, దశరథ, కార్తీక్ బాబు వింటారు. ఇక వెంటనే పారును అసలు ఈ పెళ్లి ఎందుకు జరగదో చెప్పమని అంటాడు. నేను వేరే ఫోన్ మాట్లాడుతున్నానని చెబుతుంది. కానీ అల్లుడు అన్నావ్.. నువ్వు మాట్లాడుతున్నది శ్రీధర్ తోనే కదా అని శివనారాయణ ప్రశ్నిస్తాడు. అసలు ఎందుకు ఈ పెళ్లి జరగదో చెప్పమని అంటాడు. దాంతో పారు తటపటాయిస్తుంది. సుమిత్ర పారుపై మండిపడుతుంది. దశరథ కంగారు పడుతాడు. ఇక శివనారాయణ మాత్రం ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసిన నిశ్చితార్థం జరిగి తీరుతుందని అంటాడు. ఆ తర్వాత కార్తీక్ బాబు, దీపా వెళ్లి కాశీ, స్వప్నను కలుస్తారు. కార్తీక్ బాబు కాశీకి 10 లక్షలు ఇస్తాడు. జ్యోత్స్న ఆడుతున్న నాటకం నుంచి మనం బయట పడాలని, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం అందరం కలిసి పనిచేయాలని అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని నెలకొల్పింది.


Click it and Unblock the Notifications











