Karthika Deepam 2 July 17th: నిజం చెప్పి జ్యోత్స్నకు షాక్ ఇచ్చిన దాసు.. కార్తీక్ బాబు అదిరిపోయే ట్విస్ట్

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 16వ తేదీ 411వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తన నిశ్చితార్థాన్ని చెడగొట్టుకోవడానికి జ్యోత్స్న ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ తానతంట తానే నేరుగా ఎంగేజ్ మెంట్ ను ఆపలేకపోతుంది. గౌతమ్ చెడ్డ వాడే మాట తన నోటి నుంచి రాకుండా, మరోకరి నోటి నుంచి వచ్చేలా చేస్తోంది. అందుకు దాసు కొడుకు కాశీని పావులా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఎలాగైనా నిశ్చితార్థం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు దీపాను ప్రాణాలతో లేకుండా చేయాలని, కార్తీక్ బాబును తన సొంతం చేసుకోవాలనే ఆలోచనలతోనే రగిలిపోతోంది. ఎప్పటికప్పుడు ఎత్తుకు పైఎత్తు వేస్తోంది. ప్రస్తుతం కాశీతో జ్యోత్స్న గౌతమ్ చెడ్డవాడని చెప్పించే ప్రయత్నం చేసింది. అయితే కాశీ వచ్చి జ్యోత్స్నను కలిసిన సంగతిని దీపా, కార్తీక్ బాబు కళ్లారా చూస్తారు. ఇక జ్యోత్స్న కాశీతో ఏం ప్లాన్ చేసిందనేది తెలుసుకోవాలని అనుకుంటారు.

ముందుగా జ్యోత్స్నకు దీపా ద్వారా కార్తీక్ బాబు షాక్ ఇస్తాడు. కాశీ వచ్చి జ్యోత్స్నను కలిసి వెళ్లిన సంగతిని దీపాతో తెలియజేస్తాడు. మరోవైపు జ్యోత్స్న పెద్ద ఫ్రాడ్ అని, గౌతమ్ గురించి తనకు అన్ని విషయాలు తెలిసినా కాశీని వాడుకుంటోందని దిల్ ద్వారా తెలిసేలా చేస్తాడు. ఇలా కార్తీక్ బాబు కూడా ఎప్పటికప్పుడు జ్యోత్స్న కు కౌంటర్లు ఇస్తూనే వస్తున్నాడు. ఓవైపు దీపాను కాపాడుకుంటూ, మరోవైపు జ్యోత్స్న వల్ల ఆ కుటుంబానికి కూడా ఎలాంటి ఆపద రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. త్వరలోనే జ్యోత్స్న తప్పులన్నింటినీ జ్యోత్స్న ద్వారానే చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం కాశీని కూడా తనవైపు తిప్పుకొని అన్ని వైపుల నుంచి దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ లోగా పారుజాతం ఈ నిశ్చితార్థం జరుగదంటూ ఫోన్ లో శ్రీధర్ తో మాట్లాడుతుంది. ఆ మాటను శివనారాయణ, దశరథ, కార్తీక్ బాబు అందరూ వింటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 17వ తేదీ 412 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 412 July 17th 2025

అసలు ఈ నిశ్చితార్థం ఎందుకు జరగదని అంటున్నావో చెప్పమని పారుజాతంను శివనారాయణ అడుగుతాడు. అసలు వేరే ఏదో మాట్లాడబోయే ఇంకేదో మాట్లాడానని అంటుంది. అసలు నువ్వు శ్రీధర్ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారని మండి పడుతాడు. ఇదే సమయంలో గౌతమ్ చెడ్డవాడే విషయాన్ని చెప్పమని జ్యోత్స్న పారుకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ పారుజాతంకు అర్థం కాదు. సైలెంట్ గా ఉంటుంది. ఇక శివనారాయణ స్పందిస్తూ ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ నిశ్చితార్థం కచ్చితంగా జరుగుతుందని అంటాడు. ఎవ్వరూ ఆపలేరని, అడ్డుకోలేరని, ఒకవేళ పారుజాతం అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఇంట్లో నుంచి మెడ పట్టి బయటికి గెంటేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తాడు. దాంతో పారుజాతం వణికిపోతుంది. మరోవైపు దశరథ, సుమిత్రలు కూడా పారుజాతంపై మండిపడుతారు. ఎందుకిలా ఆలోచిస్తున్నావంటూ ప్రశ్నించి తమ దారిన వెళ్లిపోతారు. మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరిస్తారు. ఇక శివనారాయణ కూడా ఫుల్ వార్నింగ్ ఇస్తాడు.

ఇక పారుజాతం వెంటనే జ్యోత్స్న గదిలోకి వెళ్తుంది. జ్యోత్స్న పారుపై మండి పడుతుంది. మంచి అవకాశాన్ని చేజార్చేశావని తిడుతుంది. అసలు విషయం చెప్పేస్తే మనకు తల భారం దిగిపోయేదని అంటుంది. అసలు విషయం ఎలా చెప్పాలే అని పారు అడుగుతుంది. శ్రీధర్ తో గౌతమ్ మంచి వాడు కాదని చెప్పావు కదా, అదే విషయాన్ని అందరి ముందు చెప్పి నిశ్చితార్థాన్ని ఆపితే బాగుండేది. నేను నా నోటితో చెబితే ఎవ్వరు నమ్మరు, పైగా అన్నీ నేనే ప్లాన్ చేస్తున్నానని అనుమానిస్తారు. అదే నువ్వు చెప్పావనుకో నీ ద్వారా నేను సైడ్ అయ్యే అవకాశం ఉండేది. కానీ నువ్వు ఆ అవకాశాన్ని నిరుపయోగం చేశావని పారుపై జ్యోత్స్న మండి పడుతుంది. నేను సాయం చేయకపోయినా నీకు నా మనవడు కాశీ సాయం చేస్తాడులే అని పారుజాతం జ్యోత్స్నకు ధైర్యం చెబుతుంది. అదొక్కటే మనకు ఉన్న అవకాశం అని జ్యోత్స్న అంటుంది. అయితే కార్తీక్ బాబు జ్యోత్స్నకు చిన్న ఝలక్ ఇవ్వాలని అనుకుంటాడు. అందుకోసం వెంటనే దాసును రంగంలోకి దించుతాడు. ఒక్కసారి శివనారాయణ ఇంటికి వెళ్లమని చెబుతాడు.

దాసు శివనారాయణ ఇంటికి వెళ్తాడు. అప్పటికే ల్యాన్ లో ఉన్న జ్యోత్స్న ను చూసి జ్యోత్స్న అని పిలుస్తాడు. ఇక దాసును చూసిన జ్యోత్స్న గుండె బద్దలవుతుంది. కనిపించకుండా పోయిన దాసు నాన్న ఎలా తిరిగి వచ్చాడని కంగారు పడుతుంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న అని ప్రశ్నిస్తుంది. నిజం చెప్పడానికని అంటాడు. దాంతో జ్యోత్స్న వణికిపోతుంది. చెప్పొద్దు నాన్న అని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ కాశీ జ్యోత్స్న అడ్డును తప్పించుకొని ఇంట్లోకి వెళ్తాడు. శివనారాయణ శివ నారాయణ అంటూ గట్టిగా పిలుస్తాడు. దీంతో ముందు సుమిత్ర, తర్వాత దశరథ, ఆ తర్వాత పారు వచ్చి దాసు తిరిగి రావడంతో సంతోషిస్తారు. ఇన్నాళ్లు ఎక్కడున్నావని ప్రశ్నిస్తారు. దానికి దాసు స్పందిస్తూ నేను కేవలం శివనారాయణతోనే మాట్లాడుతానని చెబుతాడు. ఆయనకే నిజం చెప్పాలని అంటాడు.దాంతో పారు, జ్యోత్స్న వణికిపోతారు. ఈరోజు మన గురించి చెప్పేస్తాడని, కథ క్లైమాక్స్ కు వచ్చిందని అనుకుంటారు. ఇక శివనారాయణ రాగానే దాసు ఆయన్ని ఒక గదిలోకి తీసుకెళ్తాడు.

దాంతో జ్యోత్స్న, పారుల గురించి పూర్తిగా చెప్పేసి ఉంటాడని, తను అసలు వారసురాలు కానది, దీపానే అసలు వారసురాలు అని చెబుతాడని కంగారు పడుతారు. మరోవైపు దశరథ కూడా దాసును జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుందే నాన్న శివనారాయణతో చెప్పి ఉంటాడని అనుకుంటాడు. శివనారాయణను గదిలోకి తీసుకెళ్లిన దాసు నిజం చెప్పబోయి ఆగుతాడు. కార్తీక్ బాబు చెప్పినంత వరకే చేస్తాడు. నువ్వు ప్రమాదంలో ఉన్నావని శివనారాయణకు చెప్పి విభూతి నుదిట పూసి, రుద్రాక్షలు మెడలో వేస్తాడు. కాశీ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చానని అంటాడు. ఇక బయటికి వచ్చి కూడా లోపల జరిగిందే చెబుతాడు. ఇక దశరథ నువ్వు గదిలో నాన్నతో ఏం చెప్పలేదా? అని అడుగుతాడు. ఇంకేముందని అంటాడు. నిన్ను ఎవరు కొట్టారో చెప్పవా? అని అంటాడు. మళ్లీ జ్యోత్స్నకు అనుమానం రాకుండా, తనపై ఫోకస్ పెట్టకుండా ఉండాలని నన్ను ఎవ్వరు కొట్టలేదని అంటాడు. దాంతో జ్యోత్స్న కూడా దాసుకు గతం గుర్తుకు రాలేదని అనుకుంటుంది. ఇప్పటికైతే తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X