Karthika Deepam 2 July 18th: జ్యోత్స్నకు కార్తీక్ బాబు కౌంటర్.. దాసును చంపేందుకు మరో ప్రయత్నం
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 17వ తేదీ 412వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తన నిశ్చితార్థాన్ని కాశీ ద్వారా చెడగొట్టి ఆ నింద మొత్తం దీపాపై వేయాలని జ్యోత్స్న కుట్ర పన్నుతూ ఉంటుంది. గౌతమ్ తో తన ఎంగేజ్ మెంట్ ఆగిపోయిన తర్వాత జ్యోత్స్న అసలు భూమి మీదనే లేకుండా చేస్తానని అనుకుంటూ ఉంటుంది. ఇదే విషయాన్ని తనకు కాఫీ ఇవ్వడానికి లేన్ లో వచ్చిన పారుజాతంతో కూడా అంటుంది. ముందు కాశీ సంగతి తేల్చమని చెప్పి పారు వెళ్లిపోతుంది. ఆ వెంటనే జ్యోత్స్నకు ఊహించని షాక్ తగులుతుంది. కనిపించకుండా పోయిన దాసు తిరిగి వస్తాడు. వచ్చి జ్యోత్స్న ను పిలుస్తాడు. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావని జ్యోత్స్న అడుగుతుంది. నిజం చెప్పడానికి అని దాసు అంటాడు. ఏం నిజమని జ్యోత్స్న అడుగుతుంది. కానీ సమాధానం ఇవ్వకుండా దాసు ఇంట్లోకి వెళ్లిపోతాడు. కేవలం శివ నారాయణతోనే మాట్లాడుతానని అంటాడు.
దాసు తిరిగి రావడంతో సుమిత్ర, దశరథ సంతోషిస్తారు. పారుజాతం కూడా చూసి సంతోషిస్తుంది. ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నిస్తారు. కాశీకి వెళ్లానని చెబుతాడు. నేను వెంటనే శివ నారాయణతో మాట్లాడాలని అంటాడు. శివన్నారయణ అంటూ గట్టిగా పిలుస్తాడు. శివ నారాయణ వచ్చి ఏంటని దాసును అడుగుతాడు. వెంటనే దాసు శివనారాయణను ఓ గదిలోకి తీసుకెళ్తాడు. దాంతో నిజం చెప్పేసి ఉంటాడని పారు, జ్యోత్స్నలు వణికిపోతారు. కానీ దాసు మాత్రం కేవలం రుద్రాక్షమాల మెడలో వేసి, విభూదిని నుదిట పూసి మీరు ప్రమాదంలో ఉన్నారని చెప్పి వెళ్లిపోతాడు. ఇక బయటికి వచ్చిన శివనారాయణ లోపల జరిగింది ఇదేనని అంటాడు. నిన్ను ఎవ్వరు కొట్టారో దాని గురించి చెప్పడం కోసం నాన్నతో మాట్లాడటానికి రాలేదా? అని దశరథ ప్రశ్నిస్తాడు. నన్ను ఎవ్వరు కొట్టలేదని, నాకేం కాలేదని మళ్లీ గతం మర్చిపోయినట్టుగా మాట్లాడుతాడు దాసు. జ్యోత్స్న దాసుకు గతం గుర్తుకులేదని ఊపిరి పీల్చుకుంటుంది. ఇప్పటికైతే తప్పించుకున్నామని పారు, జ్యో అనుకుంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది మరింత ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 18వ తేదీ 413 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కార్తీక్ బాబు, దీపాలపై కాంచనకు అనుమానం వస్తుంది. అసలు వీళ్లిద్దరు జ్యోత్స్న గురించి అసలు నిజం శివ నారాయణకు చెప్పకుండా ఎందుకు దాస్తున్నారని సందేహిస్తుంది. వెళ్లి కార్తీక్ బాబు, దీపాను నిలదీస్తుంది. మీరు వాళ్లకు నిజం చెబుతారా? లేదంటే నేను వెళ్లి మా నాన్నకు నిజం చెప్పి జ్యోత్స్నను గౌతమ్ నుంచి కాపాడటంతో పాటు, జ్యోత్స్న కుట్రను కూడా బయట పెడుతానని అంటుంది. కానీ కార్తీక్ బాబు మాత్రం తన తల్లి కాంచనను ఆపుతాడు. ఇప్పుడు ఆవేశ పడితే పని కాదని సర్ది చెబుతాడు. మరోవైపు కాంచన అస్సలు వినను అంటుంది. ఇప్పుడు జ్యోత్స్న గురించి చెప్పకపోతే దోషిగా మిగిలిపోతానని, వెంటనే జ్యోత్స్న గురించి, ఆ గౌతమ్ గాడి గురించి చెప్పి వాళ్లకు నిజాలు తెలియజేస్తానని అంటుంది. ఇప్పుడు మేం చేసే పని కూడా అదేనని కార్తీక్ బాబు కాంచను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. జ్యోత్స్న బుద్ధి చెప్పడం, గౌతమ్ నుంచి జ్యోత్స్నను కాపాడటం, రెండు కుటుంబాలను కలపడమే లక్ష్యమని చెప్పి శాంతింప జేస్తాడు. కొద్ది రోజులు ఓపికగా ఉంటే నీకు మరిన్ని నిజాలు కూడా తెలుస్తాయని అంటాడు. దాంతో కాంచన సరేనని ఊరుకుంటుంది.
జ్యోత్స్న ముందు మాత్రం మీరు మరోసారి దోషిగా మిగలడానికి వీల్లేదని కాంచన చెబుతుంది. దాంతో జ్యోత్స్నకు బుద్ధి చెప్పడానికే ఇంత ప్రయత్నం చేస్తున్నానని కార్తీక్ బాబు అంటాడు. మరోవైపు దాసు తిరిగి వచ్చిన విషయం తెలుసుకొని కాశీ, స్వప్న, కావేరి చాలా సంతోషిస్తారు. వెంటనే కలిసేందుకు ప్రయత్నిస్తారు. మరోవైపు వెంటనే కాశీకి కార్తీక్ బాబు ఫోన్ చేస్తాడు. జ్యోత్స్నకు షాక్ ఇచ్చే సమయం వచ్చిందని, ఆ గౌతమ్ కు సంబంధించిన వీడియోలు కూడా తీసుకొని రెడీగా ఉండమని చెబుతాడు. ముందుగా వెళ్లి నాన్న దాసును కలిసి, స్వప్నను అక్కడే దింపేసి తిరిగి వెంటనే శివనారాయణ ఇంటికి రమ్మని అంటాడు. దాంతో కాశీ వెంటనే నువ్వు చెప్పినట్టుగా పెన్ డ్రైవ్ పట్టుకొని ఇంటికి వచ్చానని జ్యోత్స్న కు చెబుతాడు. ఇక కార్తీక్ బాబు చెప్పినట్టుగా కాశీ ఫాలో అవుతాడు. మరోవైపు పారును పంపిస్తున్నానని, ఆ పెన్ డ్రైవ్ పారుకు ఇవ్వమని జ్యోత్స్న చెబుతుంది. నువ్వు మాత్రం బయటనే ఉండమని అంటుంది. కానీ అప్పటికే వచ్చి కాశీ కార్తీక్ బాబును కలవడంతో కార్తీక్ బాబు కాశీని ముందుగానే లోపలికి పంపిస్తాడు.
కాశీ ఎన్వలెప్ పట్టుకొని హాలులోకి వెళ్తాడు. అప్పటికే పారు దిగుతుంది. నిన్ను ఇంటి బయటే ఉన్నామన్నాను కదా అని అంటుంది. వాళ్లిద్దరు మాట్లాడుతూ ఉంటే కార్తీక్ బాబు శివ నారాయణను తీసుకొనిస్తాడు. వెంటనే కాశీని శివనారాయణ అడ్డుకుంటాడు. అసలు నువ్వు ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావని అడుగుతాడు. అసలు పారు చేతిలో ఉన్న కవర్ ఏంటని ప్రశ్నిస్తాడు. దాంతో పారు ఆ కవర్ ను చూపించి, అందులో ఏముందో ఓపెన్ చేస్తుంది. అందులో ఏమీ లేదని పారు అంటుంది. కానీ శివ నారాయణ చెక్ చేసి అందులో చెక్ ఉందని, 10 లక్షల రూపాయలు జ్యోత్స్న పేరుపై ఉందని అంటాడు. అసలు వాడికి చెక్ ఎందుకు ఇచ్చావని జ్యోత్స్నను ప్రశ్నిస్తాడు. కాశీ దెబ్బెశాడని గమనించిన పారు కోపంతో రగిలిపోతుంది. ఇక కాశీ గౌతమ్ అంటూ పూర్తిగా నిజం బయట పెట్టే లోపే అపడ్డుకొని..తనే కథను మార్చేస్తుంది. గౌతమ్ వెంచర్ లో ఒక ఫ్లాట్ తీసుకుంటానంటే నేనే 10 లక్షలు సాయం చేశానని చెబుతుంది. కానీ నన్ను అడగకుండా నువ్వు ఎందుకిలా చేశావని జ్యోత్స్నపై మండిపడుతాడు. పారునే దీనంతటికి కారణమని, మీరిద్దరు నాకు తెలియకుండా ఇంకోసారి ఎలాంటి పని చేయొద్దని అంటాడు. ఇక తనను మోసం చేశాడని కాశీపై జ్యోత్స్న రగిలిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











