Karthika Deepam 2 July 19th: ఇంట్లో నుంచి పారిపోయిన జ్యోత్స్న.. కార్తీక్ బాబు దెబ్బకు పరార్

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 18వ తేదీ 413వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కాశీకి కార్తీక్ బాబు ఫోన్ చేస్తాడు. జ్యోత్స్నకు అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగుస్తున్నాడు కార్తీక్ బాబు. ఇప్పటికే దీపాను వాడుకోని ఎన్నో సార్లు నిందలు వేస్తూ, ఎన్నో దాడులు చేస్తూ తన తప్పించుకుంటూ వస్తోంది. పైగా ఆ నిందలను దీపాపై వేస్తూ శివ నారాయణ కుటుంబంలో అందరికీ దూరం చేసింది. ఆస్తి కోసం, శివ నారాయణ అసలు మనవరాలి జీవితం కోసం, కార్తీక్ ను పెళ్లి చేసుకోవడం కోసం చేయరాని తప్పులు చేస్తోంది. ఊహించని విధంగా కుట్ర పన్నుతూ వస్తోంది. ఇక ఎప్పుడైతే జ్యోత్స్న అసలు మనవరాలు కాదని, దీపానే అసలు మనవరాలని దాసు ద్వారా తెలుసుకున్న కార్తీక్ బాబు జ్యోత్స్నను ఆట ఆడుకోవడం ప్రారంభించాడు. జ్యోత్స్న మొదలు పెట్టిన గౌతమ్ పెళ్లి నాటకంతోనే కార్తీక్ బాబు ఎక్కడ దొరకకుండా జ్యోత్స్నకు ట్విస్ట్ ల ట్విస్ట్ లు ఇస్తున్నారు. ఇప్పటికే దీపాను అడ్డు పెట్టుకొని ఒకసారి జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ చెడిపోయేలా చేసిన సంగతి తెలిసిందే.

ఇక కార్తీక్ బాబు కూడా గౌతమ్ తో జ్యోత్స్నకు పెళ్లి జరిపించాలనే నాటకంతోనే జ్యోత్స్నకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. గౌతమ్ మంచివాడు కాదని తెలిసి కూడా జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది. ప్రస్తుతం నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టారు. దీంతో ఎలాగైనా తన ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేయాలని నానా రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం దీపా తన ఉచ్చులో పడకపోవడంతో కాశీని వాడుకోవాలని ప్లాన్ చేస్తుంది. కాశీకి 10 లక్షలు అవసరం ఉందని తెలుసుకొని డబ్బు సాయం చేసి, గౌతమ్ గురించి తెలుసుకొని తన తల్లి సుమిత్రకు చెప్పాలని అంటుంది. ఇక జ్యోత్స్నను నమ్మిన కాశీ సాయం చేసేందుకు ఒప్పుకుంటాడు. ఈ విషయం దీపా, కార్తీక్ బాబు తెలుసుకొని కాశీని జ్యోత్స్న నుంచి తిరిగి తమ వైపునకు తిప్పుకుంటారు. జ్యోత్స్న ఊహించని విధంగా చెక్ ను తిరిగి ఇప్పిస్తారు. కాశీ కూడా తనను మోసం చేశాడని జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 19వ తేదీ 414 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 414 July 19th 2025

కాశీతో తన నిశ్చితార్థాన్ని చెడగొట్టుకోవాలని జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. ఆ నిందను దీపాపై వేసి దీపాను ఇంట్లో నుంచే కాకుండా ఈ భూమి మీదనే లేకుండా చేయాలని అనుకుంటుంది. కానీ జ్యోత్స్న ప్లాన్ ను ముందే పసిగట్టిన దీపా, కార్తీక్ బాబు ఎత్తుకు పైఎత్తు వేస్తారు. కాశీని తమ కంట్రోల్ లోకి తెచ్చుకుంటారు. జ్యోత్స్న తనను వాడుకోని దీపాపై నింద వేసేలా ప్లాన్ చేసిందని, గౌతమ్ గురించి పూర్తిగా జ్యోత్స్నకు ఎప్పుడో తెలుసని కాశీకి తెలిసేలా చేస్తాడు. దాంతో కాశీ మారిపోయి కార్తీక్ బాబు చెప్పినట్టుగా చేస్తాడు. ఈ క్రమంలో కాశీ జ్యోత్స్న ఇచ్చిన చెక్ ను ఇంటికి వెళ్లి ఇచ్చేస్తాడు. ఈ క్రమంలో శివనారాయణ కంటపడుతాడు. ఎందుకు వచ్చావు అసలు ఏం కావాలని అంటాడు. దాంతో కవర్ చూపించి ఇచ్చి వెళ్దామని చెబుతాడు. శివనారాయణ అది చెక్ చేయగా చెక్ కనిపిస్తుంది. ఇదేంటని జ్యోత్స్నపై మండి పడుతుంది. కాశీ నిజం చెప్పే లోే జ్యోత్స్న ఓ కట్టు కథ అల్లి తప్పించుకుంటుంది.

తనకున్న చివరి అవకాశం కాశీ కూడా హ్యాండిచ్చాడని జ్యోత్స్న తెలుసుకుంటుంది. కార్తీక్ బాబు చెప్పినట్టుగా కాశీ ఆడుతున్నాడని అనుకుంటుంది. ఇక వెంటనే కాశీకి ఫోన్ చేసి చేస్తుంది. జ్యోత్స్న ఫోన్ చేయడం చూసి కట్ చేస్తాడు కాశీ. ఆ వెంటనే కార్తీక్ బాబుకు ఫోన్ చేసి ఏం చేయాలని అడుగుతాడు. అదే సమయంలో మళ్లీ జ్యోత్స్న ఫోన్ చేస్తూ ఉంటుంది. దీంతో కాన్షరెన్స్ పెట్టమని అంటాడు. ఇక జ్యోత్స్న మాట్లాడే మాటలన్నీ కార్తీక్ బాబు వింటాడు. నీకు ఏం చెబితే ఏం చేశావురా అని కాశీపై జ్యోత్స్న మండి పడుతుంది. నువ్వే కదా అక్క అందరి ముందు కవర్ ఓపెన్ చేయమని అన్నావ్ అని అంటాడు. నేను గౌతమ్ కు సంబంధించిన వివరాల పెన్ డ్రైవ్ అనుకున్నానని అంటుంది. నా దగ్గర గౌతమ్ కు సంబంధించిన ఎలాంటి వివరాలు లేవని కాశీ బదులిస్తాడు. నీకు గౌతమ్ గురించి తెలుసు కాబట్టి నువ్వే పెళ్లిని చెడగొట్టుకో అని చెబుతాడు. నువ్వు కూడా మీ బావ కార్తీక్ బాబు చెప్పినట్టుగా ఆడుతున్నావని అంటుంది. నిన్ను మాత్రం వదిలి పెట్టను అని వార్నింగ్ ఇస్తుంది.

ఇక జ్యోత్స్న మాటలను విన్న తర్వాత కార్తీక్ బాబు కాశీని ఇంటికి వెళ్లమంటాడు. జరిగిందంతా దిల్ తో చెప్పమని అంటాడు. ఇక జ్యోత్స్న ప్లాన్ బెడిసికొట్టడం, పైగా తెల్లవారితేనే నిశ్చితార్థం కావడంతో రాత్రికి శివ నారాయణ ఇంట్లోనే పడుకోవాలని కార్తీక్ బాబు దీపాతో అంటాడు. ఎందుకంటే ఈ రాత్రి జ్యోత్స్న ఏం చేసినా చేస్తుందని, అస్సలు మనం ఊహించలేమని, ఈ ఇంట్లోనే ఉండి ఓ కంట కనిపెట్టాలని అంటాడు. కానీ శివనారాయణ మాత్రం రాత్రికి కార్తీక్ బాబు, దీపాను ఇంట్లో ఉండనివ్వడు. బయటికి పంపించి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. మరోవైపు జ్యోత్స్న అర్ధరాత్రి ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంటి బయటికి వచ్చిన జ్యోత్స్నను పారు ఫాలో అవుతూ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావే అని అడుగుతుంది. నేను కనిపించకుండా వెళ్తున్నానని, అలాగైతే తెల్లవారాక నిశ్చితార్థం ఆగిపోతుందని పారుతో చెబుతుంది. ఎవ్వరు ఏమనుకున్నా నా జీవితమే నాకు ముఖ్యమని అంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పారిపోవడం తప్ప మరే దారి లేదని, వారం రోజుల తర్వాత తిరిగి ఇంటికి వస్తానని చెప్పి కారు తీసుకొని వెళ్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X