Karthika Deepam 2 July 21st: పారిపోతూ పట్టుబడ్డ జ్యోత్స్న.. పోయిపోయి కార్తీక్ బాబుకే దొరకలా
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 19వ తేదీ 414వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తెల్లవారితే నిశ్చితార్థం ఉందని తెలుసుకొని జ్యోత్స్న పారిపోవాలని ప్రయత్నిస్తుంది. అప్పటికే కార్తీక్ బాబు తన నిశ్చితార్థాన్ని చెడగొట్టుకునేందుకు ఎలాంటి అవకాశాన్ని మిగుల్చలేదని మండి పడుతుంది. ఇంకా ఇంట్లోనే ఉంటే ఎలాగైనా తన నిశ్చితార్థం చేసి తీరుతారని గ్రహిస్తుంది. గౌతమ్ గాడితో ఎంగేజ్ మెంట్ చేసుకునే బదులు ఇంట్లో నుంచి పారిపోవడం ఉత్తమం అని భావిస్తుంది. ఇక అర్ధరాత్రి అందరూ ఇంట్లో పడుకోవడం చూసి నెమ్మదిగా పారిపోవాలని ప్రయత్నిస్తుంది. కానీ అదే సమయంలో పారుజాతం జ్యోత్స్నను అడ్డుకుంటుంది. పారు వెనకాల నుంచి పట్టుకోవడంతో తాత శివనారాయణ అనుకొని జ్యోత్స్న భయపడుతుంది. ఇక పారును చూసి నార్మల్ అవుతుంది.
అసలు ఇంత అర్థ రాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తుంది. దాంతో పారిపోతున్నానని బదులిస్తుంది జ్యోత్స్న. ఎక్కడికి పారిపోతున్నావే తెల్లవారితేనే ఎంగేజ్ మెంట్ ఉంది కదా చెడగొట్టకుండా ఎక్కడికి వెళ్తున్నావని పారుజాతం జ్యోత్స్నను ప్రశ్నిస్తుంది. నీకు కూడా చెప్పనని, నేను ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోయేదే ఎంగేజ్ మెంట్ నుంచి తప్పించుకోవడానికని చెబుతుంది. కార్తీక్ బాబు మనకు ఉన్న అన్నీ అవకాశాలను చెడగొట్టాడని అంటుంది. ఇక ఇంట్లో నుంచి పారిపోవడం వల్లే ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెబుతుంది. నేను వెళ్తున్నానని, నీకు ఏం తెలియనట్టుగా ఉండమని చెబుతుంది. ఆ తర్వాత ఎవ్వరి కంట పడకుండా కారు తీసుకొని జ్యోత్స్న వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక జూలై 21వ తేదీ 415 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

నిశ్చితార్థం నుంచి తప్పించుకున్నానని జ్యోత్స్న సంబర పడుతుంది. మరికొన్ని గంటల్లో పెళ్లి కూతురు కనిపించడం లేదని తెలుసుకొని అందరూ షాక్ అవుతారని కారులో బయటికి మాట్లాడుతూ ఉంటుంది. నేను అక్కడ లేకపోతే ఇక ఎంగేజ్ మెంట్ జరగదని భావిస్తుంది. కానీ జ్యోత్స్నకు కార్తీక్ బాబు షాక్ ఇస్తాడు. అర్ధరాత్రి నుంచే కార్తీక్ బాబు, దీపా ఇద్దరు ఇంటి ముందు కాపాలా కాస్తూ ఉంటారు. ఇంట్లో ఉందామంటే శివ నారాయణ అవసరం లేదు, రేపు ఉదయం రండి అంటూ బయటికి పంపించి తలుపులు వేయడంతో వారు వెళ్లి కారులో పడుకుంటారు. ఆ విషయం తెలియని జ్యోత్స్న కార్తీక్ బాబు, దీపాలు ఇద్దరు పడుకున్న కారునే తీసుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక కొంత దూరం వెళ్లాకా, జ్యోత్స్న మాటలు వినిపించి నిద్ర లేస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు పెద్ద మేడమ్ గారు అంటూ ప్రశ్నిస్తారు. కారులోనే ఉన్న కార్తీక్ బాబు, దీపాలను చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. అసలు మీరు ఈ కారులోకి ఎప్పుడు ఎక్కారని తిరిగి ప్రశ్నిస్తుంది. రాత్రి ఇంటికి వెళ్లే ముందు కారులోనే పడుకున్నామని, తెల్లవారితే నిశ్చితార్థమని ఇంటి దగ్గరే కాపలా కాస్తున్నామని చెబుతుంది.
ఇక జ్యోత్స్న షాక్ అవుతుంది. చివరి అవకాశం కూడా చేజారిపోయిందని మండిపడుతుంది. అసలు ఎవరికైతే దొరికొద్దని అనుకున్నానో వారికే దొరికిపోయానని అనుకుంటుంది. ఇక ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యిందని చిరాకు పడుతుంది. ఇక కార్తీక్ బాబు జ్యోత్స్న మేడమ్ ఇంత అర్థరాత్రి పూట ఎక్కడికి బయల్దేరుతున్నారో అని అడుగుతాడు. పెట్రోల్ కొట్టించడానికి అని అబద్దం చెబుతుంది. పెట్రోల్ నిన్నే ఫుల్ ట్యాంక్ చేయించాను మేడమ్.. ఇప్పటికైనా నిజాలు చెప్పండి అంటూ సూచిస్తాడు. కనీసం బండి యూటర్న్ అయిన తీసుకోండి మరీ అనడంతో వెంటనే జ్యోత్స్న ఇంటికి తిరిగి వస్తుంది. ఇక అప్పటికే పారు జాతం కూడా ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. జ్యోత్స్న ఇంట్లో కనిపించకపోతే అందరూ నన్నే తిడుతారని భావిస్తుంది. ఇంట్లో నుంచి వెళ్లే ముందే జ్యోత్స్న తిరిగి వస్తుంది. కార్తీక్ బాబు వల్ల ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యిందని చెబుతుంది.
ఇక తెల్లవారక ఇంటిని మొత్తం ముస్తాబు చేస్తూ ఉంటారు. పూల దండలు, తోరణాలు కడుతూ నిశ్చితార్థం కోసం అన్ని ఏర్పాట్లను చేస్తారు. ఇక దీపా టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు నిశ్చితార్థాన్ని ఎలా ఆపుతాము బావ అని కార్తీక్ బాబును దీపా ప్రశ్నిస్తుంది. లేదంటే దుర్మార్గుడైన గౌతమ్ చేతిలో జ్యోత్స్న జీవితం బలైపోతుందని కంగారు పడుతుంది. జ్యోత్స్న బయట పడటం లేదు కాబట్టి ఏం జరగాల్సి ఉంటే అదే జరుగుతుందని అంటాడు కార్తీక్ బాబు. మరోవైపు జ్యోత్స్న గుండె గుబేలు మంటుంది. ఎంత ప్రయత్నించినా కార్తీక్ బాబు తన ప్లాన్స్ ను ఎప్పటికప్పుడు చెడగొడుతూ ఎంగేజ్ మెంట్ రోజు వరకు తీసుకు వచ్చాడని అంటుంది. ఇక నిశ్చితార్థాన్ని అడ్డుకునేందుకు మనకున్న అన్ని దారులు మూసుకుపోయాయని పారుతో చెబుతుంది. ఇక మన ముందు ఉన్నవి రెండే దారులని అంటుంది. ఒకటి గౌతమ్ చెడ్డవాడని నా నోటితో నేనే చెప్పడం, లేదంటే గౌతమ్ తో ఎంగేజ్ మెంట్ కు ఒప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదని అంటుంది. ఏది చేసినా నా జీవితానికే నష్టం వాటిల్లుతుందని ఆందోళన పడుతుంది.
నాకు ఉన్న అవకాశాలన్నీ పూర్తిగా మూసుకుపోయాయని చెబుతుంది. ఇప్పుడు ఈ ఎంగేజ్ మెంట్ ను ఆపడం నీవల్లనే అవుతుందని జ్యోత్స్న పారుజాతంతో అంటుంది. నువ్వు నాకు సాయం చేయాలని కోరుతుంది. నువ్వు వెళ్లి దీపా కాళ్లపై పడి గౌతమ్ చెడ్డ వాడనే విషయాన్ని అందరి ముందు చెప్పేలా చేయమని అంటుంది. అందుకు పారుజాతం సరేనని చెప్పి దీపా వద్దకు వెళ్తుంది. నువ్వు నాకు సాయం చేయాలని పారుజాతం దీపాను కోరుతుంది. గౌతమ్ చెడ్డవాడనే సందేహం సుమిత్ర, దశరథల మనస్సుల్లో ఉందని, ఎలాగైనా నువ్వు గౌతమ్ గురించి నిజం చెప్పి వారికి సాయం చేయాలని కోరుతుంది. అందరి ముందు మరోసారి గౌతమ్ గుట్టును బయట పెట్టాలని చేతులు పట్టుకొని అడుగుతుంది. అందుకు దీపా ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు కాంచన ఇంకా ఫంక్షన్ కు రాలేదని సుమిత్ర, దశరథ, శివ నారాయణ ఎదురు చూస్తారు. కారు తీసుకొని వెళ్లి కాంచనను తీసుకొని రమ్మని శివ నారాయణ దశరథకు చెబుతాడు. కానీ కార్తీక్ బాబు మాత్రం మా అమ్మ రాదని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తి పెంచుతోంది.


Click it and Unblock the Notifications











