Karthika Deepam 2 July 22nd: మళ్లీ మోసపోయిన దీపా.. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ లో ఫూల్ అవుతూ
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 21వ తేదీ 415వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తను లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుందో చూస్తానని జ్యోత్స్న ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఎవరి కంట పడకుండా కారు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లి పోతుంది. అయితే అప్పటి కే ఇంటికి కాపాలా కాస్తున్న కార్తీక్ బాబు, దీపా జ్యోత్స్న తీసుకెళ్లిన కారు వెనక సీట్ లోనే పడుకొని ఉంటారు. ఆ విషయం తెలియక జ్యోత్స్న అదే కారు తీసుకొని వెళ్తుంది. ఇక కొంత దూరం వెళ్లాక కార్తీక్ బాబు, దీపా మేలుకొని జ్యోత్స్నకు షాక్ ఇస్తారు. బండి తిరిగి ఇంటికి వెళ్తే సరేనని లేదంటే తాత శివ నారాయణకు ఫోన్ చేసి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తాడు. ఇక చివరి అవకాశం కూడా పాడైపోయిందని జ్యోత్స్న తిరిగి ఇంటికి వెళ్తుంది. కార్తీక్, దీపాల వల్ల తన ప్లాన్ ఏదీ సక్సెస్ అవ్వడం లేదని మండి పడుతుంది.
ఇక తెల్లవారక నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లను చకచకా చేస్తూ ఉంటారు. మరోవైపు కార్తీక్ బాబుతో దీపా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపుతామని అడుగుతుంది. జ్యోత్స్న నోటితే నిజం చెప్పించి నిశ్చితార్థాన్ని ఆపించాలని మనం చూస్తున్నాం. కానీ జ్యోత్స్న మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇక ఎలా ఎండ్ కార్డు పడుద్దో చూడాద్దామని అంటాడు. మరోవైపు జ్యోత్స్న దీపాతో చివరి అస్త్రాన్ని ఉపయోగిస్తుంది. తన ఎంగేజ్ మెంట్ ను చెడగొట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఇక దీపానే అని అభిప్రాయపడుతుంది. దీపా నోరు విప్పితేనే తను బయట పడి దీపా బుక్ అవుతుందని జ్యోత్స్న పారుతూ అంటుంది. నువ్వు వెంటనే దీపా దగ్గరకు వెళ్లి కాళ్లపై పడి నిశ్చితార్థాన్ని ఆపేయమని బతిమిలాడు, సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టమని అంటుంది. ఇక పారు జ్యోత్స్న దగ్గరకు వెళ్తుంది. నిశ్చితార్థం ఆపేయడం గురించి దీపాతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వే ఆపాలని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది చూడాలి. ఇక జూలై 22వ తేదీ 416 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

జ్యోత్స్న చెప్పినట్టుగా పారుజాతం దీపా దగ్గరకు వెళ్లి మొసలి కన్నీళ్లు కారుస్తుంది. ఇప్పటికే జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ రెండు సార్లు ఆగిపోయిందని పారు దీపాకు గుర్తు చేస్తుంది. ముఖ్యంగా నువ్వు గౌతమ్ మంచి వాడు కాదని చెప్పినప్పటి నుంచి అసలు ఈ ఎంగే జ్ మెంట్ జరుగుతుందా? లేదా? జ్యోత్స్న జీవితం ఏమౌతుందని సుమిత్ర అమ్మ ఎంతో కంగారు పడుతుంది. ఒక వేళ జరగకూడనిది ఏదైనా జరిగితే సుమిత్ర బతకగలదా? శివ నారాయణ ప్రాణాలతో ఉంటాడా? అని దీపా మనస్సుకు తగిలేలా పారు ముసలి కన్నీరు కార్చుతుంది. దీంతో దీపా కూడా పారు మాయ మాటలను నమ్ముతుంది. నిజం చెప్పటానికి ప్రయత్నిస్తానని తన మనస్సులో అనుకుంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో పారు తన ప్లాన్ వర్కౌట్ అయ్యిందని, ఇక దీపా దగ్గర నుంచి జారుకుంటుంది. తన కుటుంబానికి ఏం జరగకుండా ముందుగానే జాగ్రత్త పడాలని అనుకుంటుంది. కాగా దీపా తన సెంటి మెంట్ డైలాగ్స్ కు పడిపోయిందని పారు వెళ్లి జ్యోత్స్నకు చెబుతుంది. అసలు నిజం చెప్పడానికి దీపా ఒప్పుకుందా లేదా అనే సంగతి చెప్పమని జ్యోత్స్న పారును అడుగుతుంది. ఒప్పుకుందని పారు చెబుతుంది. దాంతో జ్యోత్స్న సంతోషిస్తుంది. దీపా సెంటిమెంట్ పుల్ అనే విషయం తనకు తెలుసని, అందుకే నిన్ను పంపించి నాటకం ఆడించానని అంటుంది. ఇక గౌతమ్ ను రెండు పీకి చెడ్డవాడని తనే నిజం చెబుతుందని, దాంతో మనం తప్పించుకోవచ్చని సంబరపడుతుంది.
మరోవైపు పారుజాతం వచ్చి దీపాతో మాట్లాడిన మాటలన్నింటినీ కార్తీక్ బాబు వెంటాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్న దీపాను గమనిస్తాడు. దీపా పారు మాటలకు కరిగిపోయిందని గుర్తించి వెంటనే తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. పారు చెప్పిన మాటలన్నీ విన్నాను. వాళ్లకు వేరే దారి లేక నీతోనే ఎంగేజ్ మెంట్ ను చెడగొట్టాలని చూస్తున్నారు. అందుకే జ్యోత్స్న పారును పంపించి మొసలీ కన్నీరు కార్చేలా చేసిందని వివరిస్తాడు. వాళ్ల ఉచ్చులో పడకూడదని అంటాడు. కానీ దీపా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటుంది. జ్యోత్స్న, పారులు ఎలాంటి వారైనా పారు మాట్లాడింది మాత్రం ఈ ఇంటి కుటుంబ సభ్యుల గురించే కదా అని అంటుంది. వాళ్లకు ఏదైనా అయితే తట్టుకోలేం కదా అని చెబుతుంది. ఏదేమైనా నిజం చెప్పే తీరుతానని దీపా కార్తీక్ బాబు తో అంటుంది. దాంతో కార్తీక్ బాబు కంగారు పడుతాడు. జ్యోత్స్న ప్లాన్ ఇదే.. మనం గొడవ పడి మనతోనే నిజం చెప్పించాలని సెంటిమెంట్ డ్రామాను క్రియేట్ చేసింది. ఇక నువ్వు ఎవ్వరితోనూ నిజం చెప్పకూడదని తన మీద ఒట్టు వేయించుకుంటాడు.
మరోవైపు దీపాను సుమిత్ర అమ్మ పిలుస్తుంది. దీపా వెళ్లడంతో పట్టుచీరను బాహుమతిగా ఇస్తుంది. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ సందర్భంగా నేను నీకు కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నానని చెబుతుంది. సుమిత్ర తన కన్న తల్లి అని తెలిసిన తర్వాత కొనిచ్చిన మొదటి చీర అని సంబర పడుతుంది. సుమిత్ర దీపాకు చీర కానుకగా ఇవ్వడంతో మొహం వెలిగి పోతుంది. ఇక సుమిత్ర దీపాను ఆ చీరకట్టుకొని రమ్మని, ఆ తర్వాత నాకు నువ్వు ఒక సాయం చేయాలని అంటుంది. సరే అమ్మగారు అని చెప్పి దీపా వెళ్లి ఆ చీరకట్టుకొని తిరిగి వస్తుంది. ఇక సుమిత్ర దీపాతో జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ గురించి మాట్లాడుతుంది. గౌతమ్ చెడ్డవాడని చెప్పిన నువ్వు ఇంట్లోనే ఉన్నావు. ఓవైపు కాంచన వదిన ఎంగేజ్ మెంట్ కు రావడం లేదు. మరోవైపు జ్యోత్స్న నువ్వు ఉంటేనే నిశ్చితార్థం చేసుకుంటానని అంటుంది. అసలు నిశ్చాతార్థం జరుగుతుందా? లేదా? అని దీపాను ప్రశ్నిస్తుంది. తన మీద ఒట్టేసి చెప్పామని అంటుంది. ఈ విషయాన్ని కార్తీక్ బాబు దూరం నుంచి గమనిస్తాడు. ఇక దీపా మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











