Karthika Deepam 2 July 23rd: దీపాకు అగ్ని పరీక్ష.. కార్తీక్ బాబు సైతం మౌనంగా.. చెలరేగిపోయిన జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 22వ తేదీ 416వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపా ద్వారా తన నిశ్చితార్థాన్ని చెడగొట్టుకోవాలని జ్యోత్స్న పారును పంపిస్తుంది. దీపాకు అన్ని సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతుంది. ఎలాగైనా గౌతమ్ నుంచి జ్యోత్స్న జీవితాన్ని కాపాడాలని, ఆ శక్తి నీ ఒక్కదానికే ఉందని పారుజాతం దీపాకు రెచ్చగొడుతుంది. దీపా కూడా కాస్తా ఎమోషనల్ అవుతుంది. జ్యోత్స్న నిశ్చితార్థం ఆగిపోతే సుమిత్ర అమ్మ ఎంత బాధపడుతుందోనని, ఎలాంటి అనార్థాలకు దారి తీస్తుందోనని భయపడుతూ ఉంటుంది. అయితే పారు దీపాతో చెప్పిన మాటలను కార్తీక్ బాబు వింటాడు. దీపా పారువైపు మళ్లడం కూడా గమనిస్తాడు. ఇక పారు వెళ్లిపోయిన తర్వాత దీపా దగ్గరకు వెళ్లి.. పారు మాటలకు కరిగిపోయావా? అని ప్రశ్నిస్తాడు. కరిగిపోవడం ఏం లేదని, పారు చెప్పింది నిజమే కదా అని అంటుంది. దాంతో కార్తీక్ బాబుకు కోపం వస్తుంది. నీ మనస్సును ఎలా కరిగించాలో వారికి తెలుసని, ముఖ్యంగా జ్యోత్స్నకు బాగా తెలుసని కార్తీక్ బాబు అంటాడు. అందుకే జ్యోత్స్న పారుజాతాన్ని పంపించి ఇలా నీ ముందు ముసలి కన్నీరు కార్చేలా చేసిందని చెబుతాడు.

ఏదేమైనా మూర్ఖత్వానికి పోయి జ్యోత్స్న నిశ్చితార్థం చేసుకోవడం నాకు ఏ మాత్రం నచ్చడం లేదు. నేను వెంటనే వెళ్లి గౌతమ్ మంచి వాడు కాదనే నిజాన్ని చెబుతానని దీపా అంటుంది. దాంతో కార్తీక్ బాబు దీపాను ఆపుతాడు. అలా చేస్తే సరిగ్గా జ్యోత్స్న ప్లాన్ ను అమలు చేసిన దానివి అవుతావు. జ్యోత్స్న కు కావాల్సింది కూడా ఇదే. మన ఇద్దరి మధ్య ఘర్షణ మొదలై ఎవరిమో ఒకరమూ నిజం చెప్పాలని చూస్తుందని అంటాడు. మనం అస్సలు జ్యోత్స్న ఉచ్చులో పడొద్దని అంటాడు. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరితోనూ గౌతమ్ గురించి మాట్లాడకూదని తన మీద ఒట్టు వేయించుకుంటాడు. దాంతో దీపా కూడా మౌనంగా ఉండి పోతుంది. మరోవైపు సుమిత్ర కూడా దీపాను పిలిచి కానుకగా చీర ఇస్తుంది. ఆ చీర కట్టుకొని దీపా మురిసిపోతుంది. ఆ వెంటనే సుమిత్ర దీపాతో ఒట్టు వేయించుకుంటుంది. దేవుడి గది దగ్గర జ్యోత్స్న నిశ్చితార్థం పూర్తి అయ్యే వరకు బయటికి రావొద్దని గీత గీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 23వ తేదీ 417 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 417 July 23rd 2025

ఇక జ్యోత్స్న నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు దీపా ఎలాగైనా ఎంగేజ్ మెంట్ ను ఆపుతుందనే ధైర్యంతో జ్యోత్స్న నిశ్చితార్థానికి ఒప్పుకుంటుంది. కానీ సుమిత్ర మాత్రం దీపాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అసలు నీ మనసులో ఏదో ఉందని, అందుకే నువ్వు జ్యోత్స్న నిశ్చితార్థం జరుగుతుందా? లేదా? అంటే ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నావని అంటుంది. ఇక నువ్వు నాకు ఒక సాయం చేయాలని అడుగుతుంది. తన మీద ఒట్టు వేయించుకొని దీపా ముందు లక్ష్మణ రేఖలా ఒక గీత గీస్తుంది. నువ్వు జ్యోత్స్న నిశ్చితార్థం పూర్తయ్యే వరకు ఆ గీత దాటి వస్తే మాత్రం నేను చచ్చిపోయినట్టే అని కఠినంగా మాట్లాడుతుంది. దాంతో దీపా మీ మాటకు కట్టుబడి ఉంటానని చెబుతుంది. ఇక ధైర్యంగా జ్యోత్స్న, పారులు కిందికి వస్తారు. అప్పటికే గౌతమ్, తన తల్లిదండ్రులను తీసుకొని ఇంటికి వస్తాడు. వారిని సుమిత్ర, దశరథ, శివ నారాయణ, కార్తీక్ బాబు రిసీవ్ చేసుకుంటారు. ఇక జ్యోత్స్న కూడా వచ్చి గౌతమ్ పక్కన ధైర్యంగా కూర్చొంటుంది. కాసేపు అయ్యాక దీపా ఎక్కడ కనిపించకపోవడంతో కంగారు పడుతుంది. పారు జాతానికి చెప్పి దీపాను చూడమని అంటుంది.

పారు దీపా దేవుడి గది దగ్గర ఉందని గమనించి జ్యోత్స్నకు చెబుతుంది. దాంతో వెంటనే వెళ్లి దీపాను తీసుకొచ్చి నిజం చెప్పించమని పారుతో అంటుంది. ఇక వెంటనే పారు దీపా దగ్గరకు వెళ్తుంది. ఏమైంది దీపా నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ నిజాలు ఎవరు చెబుతారని పారు అంటుంది. నేను ఏం నిజాలు చెప్పాల్సిన పనిలేదు. అసలు నేను ఈ గీత దాటి రానని అంటుంది. ఇదేమైనా లక్ష్మణ రేఖనా చెరిపేస్తే చెరిగిపోతుందని పారు గీతను చెరిపే ప్రయత్నం చేస్తుంది. దాంతో దీపా అడ్డుకుంటుంది. ఆ గీతను చెరిపితే సుమిత్ర అమ్మనే చెరపాలని ఇంకెవ్వరు చెరిపిన అస్సలు ఊరుకోనని హెచ్చరిస్తుంది. మరి అక్కడ గౌతమ్ గురించి నిజం చెప్పెదెవరు అంటుంది. గౌతమ్ ఎలాంటి వాడో అన్నది నీకు, జ్యోత్స్న బాగా తెలుసు. మీరే నిజం చెప్పండి అని అంటుంది. దాంతో దీపా ప్లేట్ తిప్పేసిందని పారు షాక్ అవుతుంది. వెంటనే వెళ్లి జ్యోత్స్నకు చెబుతుంది. వాష్ రూమ్ కు వెళ్లి వస్తానని చెప్పి పారిపోమని సలహానిస్తుంది. పారు జ్యోత్స్న చెవి దగ్గర మాట్లాడుతుండటం చూసి శివ నారాయణ పారును పక్కకు ఉండమని చెబుతాడు. ఇక జ్యోత్స్న మాత్రం అసలు విషయం చెప్పకుండా అనే కూర్చొని ఉంటుంది.

దీంతో కార్తీక్ బాబు వెళ్లి జ్యోత్స్న నోటితో గౌతమ్ మంచి వాడు కాదనే నిజాన్ని చెప్పించాలని అనుకుంటాడు. దాంతో ముహుర్తానికి సమయం దగ్గర పడుతుందని జ్యోత్స్నను కంగారు పెడుతాడు. ఐదు నిమిషాలే సమయం ఉందని తొందర పెడుతాడు. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పమని అందరి ముందు అడుగుతాడు. ఎందుకో జ్యోత్స్న టెన్షన్ గా ఉందని, ఆమె చేతులు కూడా వణుకుతున్నాయని చెబుతాడు. త్వరగా చెప్పు జ్యోత్స్న నీ మనస్సులో ఏం ఉందో చెబితేనే తర్వాత కార్యక్రమాలు సాఫీగా జరుగుతాయని అంటాడు. ఆ తర్వాత సుమిత్ర, దశరథ, శివ నారాయణ కూడా జ్యోత్స్నను ఏమైందని పదే పదే అడుగుతారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తన నోటితో గౌతమ్ గురించి నిజం చెప్పే ప్రసక్తే లేదని జ్యోత్స్న నిర్ణయించుకుంటుంది. వెంటనే గట్టిగా అరుస్తుంది. నాకేం కాలేదు. నేను నిశ్చితార్థానికి రెడీగానే ఉన్నానని చెబుతుంది.దాంతో కార్తీక్ బాబు, దీపా షాక్ అవుతారు. నిజం చెబుతుందని అనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటని సందిగ్ధంలో పడిపోతారు. ఇక దీపా టెన్షన్ పడ నిజం చెబుతానని అంటుంది. కానీ కార్తీక్ బాబు అడ్డుకుంటాడు. ఇక జ్యోత్స్నకు రింగ్స్ మార్చి, తాంబూలాలు మార్చుకునే సమయం దగ్గరపడుతుంది. ఈ సమయంలో శివ నారాయణకు ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే బయటికి వెళ్తాడు. ఆ వెంటనే దశరథ కూడా వెళ్తాడు. మరోవైపు గౌతమ్ జ్యోత్స్నకు ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగేందుకు సిద్దం అవుతాడు. నెక్ట్స్ ఏం జరిగిందనేది తరువాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X