Karthika Deepam 2 July 24th: కార్తీక్ బాబు 2.O.. జ్యోత్స్నకు బుర్ర గిర్రుమనేలా ట్విస్ట్

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 23వ తేదీ 416వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. గౌతమ్ తో నిశ్చితార్థం ఏమాత్రం ఇష్టం లేని జ్యోత్స్నా అతని నుంచి తప్పించుకోవాలని శత విధాలుగా ప్రయత్నిస్తుంది. కానీ జ్యోత్స్న ప్లాన్లను ఎప్పటికప్పుడు కార్తీక్ బాబు కట్టడి చేస్తూ వస్తాడు. జోష్నా నోటితోని గౌతమ్ చెడ్డవాడని చెప్పించాలని ప్రయత్నిస్తాడు. కానీ జోష్ణ ఎంతకు తనంతట తాను నిజం చెప్పినందుకు సిద్ధపడదు. పైగా ఏ మాత్రం అవకాశం దొరికినా దీపాను ఇరికించాలని చూస్తుంది. కాని దీపకు ఎలాంటి ఆటంకాలను రాకుండా కార్తీక్ బాబు అప్రమత్తంగా ఉంటాడు. ఇక చివరిసారిగా జ్యోత్స్న దీపాను సెంటిమెంటల్ ఫూల్ ను చేయాలనే అనుకుంటుంది. పారును దీప దగ్గరకు పంపించి ముసలి కన్నీరు కార్పిస్తుంది. దాంతో దీప కూడా జ్యోత్స్న ట్రాప్ లో పడిపోతుంది. కానీ కార్తీక్ బాబు నాకు తెలియకుండా నువ్వు ఎవరికి నిజం చెప్పకూడదని తన మీద ఒట్టు వేయించుకొని దీపా నోరు మూయిస్తాడు.

మరోవైపు సుమిత్ర కూడా దీపాను జ్యోత్స్న నిశ్చితార్థం జరిగే వరకు అస్సలు నోరు తెరవకూడదని కండిషన్ పెడుతుంది. అంతేకాదు తనను ఇంట్లోనే దేవుని గది దగ్గరకు తీసుకెళ్లి ప్రమాణం చేయించుకుంటుంది. అలాగే తన ముందు గీత గీసి జ్యోత్స్న నిశ్చితార్థం పూర్తి అయ్యే వరకు దాట వద్దని తన మీద ఒట్టు వేయించుకుంటుంది. దాంతో దీప కదలకుండా అక్కడే నిలిచి ఉంటుంది. పారు వచ్చి నిజం చెప్పమని దీపాని అడిగితే చెప్పనని అంటుంది. దీప ప్లేట్ తిప్పడంతో పారు కంగారు పడి జోష్నకు విషయం చెబుతుంది. అప్పటికి కూడా జ్యోత్స్న నిజం చెప్పడానికి ఒప్పుకోదు. తనకు గౌతమ్ తో నిశ్చితార్థం సమ్మతమేనని అంటుంది. దాంతో కార్తీక్ బాబు దీప షాక్ అవుతారు. ఇక నిశ్చితార్థం ఆపడానికి దీప ప్రయత్నిస్తుంది. కానీ కార్తీక్ బాబు అడ్డుకుంటాడు. అదే సమయంలో శివ నారాయణ కు ఫోన్ కాల్ వచ్చి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 24వ తేదీ 418 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 418 July 24th 2025

గౌతమ్ ఎలాంటి వాడు చెప్పి తన నిశ్చితార్థాన్ని జ్యోత్స్న నే ఆపుకుంటుందని కార్తీక్ బాబు ప్లాన్ చేస్తాడు. కానీ జ్యోత్స్న మాత్రం అందుకు రివర్స్ గా ప్రవర్తిస్తుంది. దీపతో నిజం చెప్పించాలని జ్యోత్స్న ప్రయత్నిస్తే ఆ చివరి అవకాశం కూడా చేజారిపోతుంది. అప్పుడైనా జ్యోత్స్న నిజం చెబుతుందని కార్తీక్ బాబు అనుకుంటాడు. కానీ చూసినా మాత్రం తన నోటితో నిజం చెప్పేందుకు అసలు ధైర్యం చేయదు. తనకు నిశ్చితార్థం చేసుకోవడం సమ్మతమేనని చెబుతుంది. తనకేం కాలేదని, ఎలాంటి టెన్షన్ లేదని ఎంగేజ్మెంట్ కు తాను రెడీ గానే ఉన్నానని అందరి ముందు చెబుతోంది. నాతో కార్తీక్ బాబు, దీపా షాక్ అవుతారు. గౌతమ్ తో ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్పించే సమయం దగ్గర పడడంతో దీపా కంగారుపడుతుంది. ఎలాగైనా నిజం చెప్పి జోష్ణ జీవితాన్ని కాపాడాలని అనుకుంటుంది.

దీప నిజం చెప్పాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ కార్తీక్ బాబు అడ్డుపడతాడు. ఇప్పుడు మనం నిజం చెప్పిన ఎవరు నమ్మరని అంటాడు. అదే సమయంలో శివ నారాయణకు ఫోన్ రావడంతో బయటికి వెళ్తాడు. శివ నారాయణ బయటికి వెళ్లడంతో దశరథ కూడా వెనకాలే వెళ్తాడు. నేను వచ్చేలోపు ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్పించండి అని, లేదంటే ముహూర్తం దాటిపోతుందని దశరథ అయ్యగారికి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక పూజారి ఎంగేజ్మెంట్ రింగ్స్ ను మార్పించేందుకు ఏర్పాటు చేస్తాడు. గౌతమ్ వేలికి ఉంగరం తొడగబోతు ఉంటాడు. మరోవైపు దీప తన కండ్ల ముందే ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ మౌనంగా ఉండలేక పోతుంది. ఎవరు ఏమనుకున్నా నిజం చెబుతానని కార్తీక్ బాబుతో అంటుంది. కానీ కార్తీక్ బాబు ఇది సమయం కాదు, కాస్త వేచి ఉండు అని చెప్తాడు. దీప మాత్రం తన తల్లి గీసిన గీతను చెరిపి అయినా సరే వెళ్లి గౌతమ్ గురించి అందరికీ నిజం చెబుతానని పట్టుబడుతుంది. కాస్త ఓపిక పడితే నీకే విషయం తెలుస్తుందని కార్తీక్ బాబు అంటాడు.

ఇక గౌతమ్ జ్యోత్స్న వేలికి ఉంగరం తొడుగుతూ ఉంటే శివ నారాయణ వచ్చి ఆపరా అని అంటాడు. దాంతో అందరు షాక్ అవుతాడు. జ్యోత్స్న వేలికి ఉంగరం తొడిగే గౌతమ్ కూడా ఆగిపోతాడు. ఏం జరిగిందని అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. ఇక శివ నారాయణ ఉగ్రరూపంతో వచ్చి గౌతమ్ చెంప చెల్లుమనిపిస్తాడు. తాతగారు ఎందుకు కొడుతున్నారని గౌతమ్ ప్రశ్నించడం తో మరో రెండు తగిలిస్తాడు. నా తప్పు ఏంటని అడుగుతాడు. ఇక వెంటనే శివ నారాయణ దశరథను పిలుస్తాడు. నా మనవరాలు జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావా అని ఫైర్ అవుతాడు. అమ్మాయిల జీవితంతో ఆడుకునే వెధవవి అని మండిపడతాడు. ఇంతకీ నేనేం తప్పు చేశానని ఇలా అంటున్నారని గౌతమ్ అడగడంతో దశరథకు చెప్పి దాసుని తీసుకురమ్మని అంటాడు. ఇక దాసు వచ్చి ఫోన్లో అప్పటికే కాశి తీసిన వీడియోను గౌతమ్ కు చూపిస్తాడు. గౌతమ్ అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిపోతుంది.

కానీ గౌతమ్ అప్పటికి కూడా నిజం ఒప్పుకోడు. ఇది నా వీడియో కాదని వాదిస్తాడు. ఎవరో కావాలని మార్ఫింగ్ చేసి ఏఐ ద్వారా ఈ వీడియోను క్రియేట్ చేశారని చెబుతాడు. ఈ రోజుల్లో ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయని అంటాడు. అయినా నేనే తప్పు పని చేశానని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏదైనా ఉందా అని తిరిగి శివ నారాయణను ప్రశ్నిస్తాడు. దాంతో శివ నారాయణ వెంటనే గౌతమ్ ఇంట్లో పనిమనిషిగా చేసిన రమ్యని పిలిపిస్తాడు. ఆమె నిండు గర్భవతిగా ఉంటుంది. గతంలో రమ్యను చూపించే దీప గౌతమ్ చెడ్డవాడని చెప్పిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటారు. ఇక రమ్మని చూడగానే గౌతమ్ గుండె జారిపోతుంది. ఈ అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నీవే అని అనడంతో నోట మాట జారిపోతుంది. కాదని చెప్పే ధైర్యం ఉందా, ఒకవేళ అలా చెబితే డిఎన్ఏ టెస్ట్ కు సిద్ధమేనా అని గౌతమ్ను ప్రశ్నిస్తాడు. దాంతో గౌతమ్ మౌనంగా ఉంటాడు. ఇప్పుడు ఏది మాట్లాడి నా తనదే తప్పు అవుతుందని అనుకుంటాడు.

నేను ఎవరికి నా నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని అంటాడు గౌతమ్. అసలు నాకు పెళ్లి వద్దని, నన్ను ఇంతలా అవమానించిన మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని అంటాడు. దాంతో శివ నారాయణ, దశరథ, సుమిత్ర మళ్లీ గౌతమ్ చెంపలు వాయిస్తారు. ఇక గౌతమ్ నన్ను వాయించే ముందు మీ కూతురు చెంపలు కూడా వాయించమని అంటాడు. జ్యోత్స్న పెద్ద కుట్ర చేసిందని అంటాడు. దీపపై తనతో దాడి చేయించేసింది జోష్న అనే విషయాన్ని చెప్పాలని అనుకుంటాడు. కానీ చెప్పబోతుంటే కార్తీక్ బాబు అడ్డుకుంటాడు. ఇక చేసేదేమీ లేదు గౌతమ్ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. జ్యోత్స్న నిశ్చితార్థం మళ్లీ ఆగిపోవడంతో సుమిత్ర తట్టుకోలేకపోతోంది. కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే ఆసుపత్రిలో చేర్పిస్తారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటారు. ఈ విషయాన్ని కార్తీక్ బాబు దీప కాంచనకు కూడా తెలియజేస్తారు. కాంచన కంగారు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X