Karthika Deepam 2 July 26th: సుమిత్ర ఇచ్చిన కౌంటర్ కు కార్తీక్ బాబు షాక్.. మళ్లీ కథ మొదటికి
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 25వ తేదీ 419వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మొత్తానికి జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ ను కార్తీక్ బాబు ఆపించేస్తాడు. దాసుకు గౌతమ్ గురించి పూర్తిగా చెప్పి నిశ్చితార్థాన్ని ఆపాలని కార్తీక్ బాబు దాసుకు సూచిస్తాడు. దాంతో దాసు గౌతమ్ జ్యోత్స్నకు ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగే సమయానికి వచ్చి నిజం చెప్పి ఎంగేజ్ మెంట్ ను ఆగిపోయేలా చేస్తాడు. శివ నారాయణకు గౌతమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తాడు. దాంతో శివనారాయణ గౌతమ్ చెంప చెల్లుమనిపించి నిశ్చితార్థాన్ని ఆపించేస్తాడు. ఆ తర్వాత దాసు చేసిన సాయానికి శివ నారాయణ, దశరథ, సుమిత్ర అందరూ ఎంతగానో ధన్యవాదాలు చెబుతారు. ఇదే సమయంలో దాసుకు అసలు గౌతమ్ గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసని అందరూ సందేహిస్తూ ఉంటారు. అదే ప్రశ్నను శివ నారాయణ దాసును ప్రశ్నిస్తాడు. ఇక దాసు వెంటనే దీని వెనకాల ఉన్నది కార్తీక్ బాబు అని, ఆయన ఎలా చెబితే అలా చేశానని అంటాడు. ఇక కథ మరోవైపు దీపావైపునకు తిప్పుతుంది పారుజాతం.
అసలు దీపా వల్లనే గౌతమ్ తో మనకు సమస్య వచ్చిందని నింద వేస్తుంది. దీపాను చెప్పుతో కొట్టాలని అంటుంది. మొదట నిశ్చితార్థం జరిగినప్పుడు గౌతమ్ చెడ్డవాడని చెప్పి మనకు సాయం చేసిన దానిలా దగ్గర కావాలని చూసింది. ఇక ఆ తర్వాత మన కుటుంబాన్ని నాశనం చేయాలని గౌతమ్ మంచి వాడని చెప్పింది. దీపా గౌతమ్ మంచి వాడని చెప్పడంతోనే నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టుకున్నారని, ఇలా జ్యోత్స్న జీవితాన్ని దీపా నాశనం చేయాలని చూసిందని మరో నిందను దీపాపై వేస్తుంది. మరోవైపు సుమిత్ర కూడా దీపాను ఈ జన్మలో క్షమించనని, నా కూతురుని, నా భర్తను చంపాలని చూసిన వ్యక్తిని నేను అస్సలు క్షమించబోనని అంటుంది. దీంతో కార్తీక్ బాబు ఫైర్ అవుతాడు. తన భర్యా దీపా గురించి ఇంకొక్క మాట మాట్లాడిన కూడా ఊరుకోనని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 26వ తేదీ 420 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపానే దశరథను గన్ తో కాల్చి చంపేందుకు ప్రయత్నించిందని సుమిత్ర బలంగా నమ్ముతోంది. అదే అభిప్రాయాన్ని, తన మనస్సులో దీపాపై రగులుతున్న మాటలను బయటికి చెబుతుంది. దీపా చేసిన నేరాన్ని అసలు సహించేది లేదని అంటుంది. దీపా ను సుమిత్ర నానా మాటలు అంటుండటంతో ఇక కార్తీక్ బాబు స్పందిస్తాడు. దీపాపై పారు, సుమిత్ర నిందలు వేస్తుండటంతో సహించలేకపోతాడు. అసలు దోషి జ్యోత్స్న మంచిదానిగా గుర్తింపు పొందుతూ ఉందని, ఆ ఇంటికే అసలు వారసురాలైన దీపాను ఇంతలా నిందించడంతో తట్టుకోలేకపోతాడు. ఇక వెంటనే సుమిత్రపై ఫైర్ అవుతాడు. హద్దులు దాటి మాట్లాడితే సహించేది లేదని అంటాడు. గౌతమ్ విషయంలో ఎలాగైతే సాక్ష్యాధారాలతో నిరూపించానో ఇక దశరథ మామను ఎవరు హత్య చేద్దామని అనుకున్నారనేది త్వరలోనే నిరూపిస్తానని కార్తీక్ బాబు సవాల్ చేస్తాడు. కార్తీక్ బాబు చాలా బలంగా చెప్పడంతో జ్యోత్స్న భయపడుతుంది. దశరథను చంపాలని చూసింది నేనే కదా అని మనస్సులో అనుకుంటాడు. కానీ ఎలా రుజువు చేస్తాడంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ బాబు మాత్రం రెచ్చిపోతాడు. అతి త్వరలోనే దశరథ మామను చంపాలని చూసిన వారిని, వారెవరైనా సరే మెడ పట్టి లాక్కొచ్చి దశరథ కాళ్ మందు కూర్చొబెడుతానని సవాల్ చేస్తాడు.
కార్తీక్ బాబు మాటలకు జ్యోత్స్న లోలోపల జంకుతుంది. ఒక సమస్య నుంచి తప్పుకున్నానని సంబర పడే లోపు మళ్లీ ఇంకో సమస్యలో చిక్కుకున్నట్టుందని కంగారు పడుతుంది. అయిన అదంతా ఏం కాదని, ఇప్పటికైతే విజయం నాదేనని జ్యోత్స్న సంబరపడి పోతుంది. ఇక దాసు వెళ్లిపోతానని శివనారాయణకు చెబుతాడు. మాకు ఎంతో సాయం చేసిన నువ్వు ఎట్టి పరిస్థితిల్లోనూ భోజనం చేసే వెళ్లాలని శివ నారాయణ అంటాడు. తొలిసారిగా దాసును శివ నారాయణ దగ్గర చేయడంతో పారు జాతం ఆనంద పడుతుంది. దాసును గౌరవించినందుకు కార్తీక్ బాబు, దీపా కూడా సంతోషిస్తారు. ఇక వంటన్నీ రెడీ చేసి అందరూ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తారు. కార్తీక్ బాబు, దీపా అందరికీ వడ్డిస్తామని చెబుతారు. ఇక దాసు మాత్రం కార్తీక్ బాబు, దీపాలను కూడా తమతో పాటే కూర్చొని తినండి అని అంటాడు. కానీ మేం పనోళ్లం యజమానులతో కలిసి తినలేమని కార్తీక్ బాబు దాసుకు వివరిస్తాడు. మీరందరూ తినండి అని కార్తీక్ బాబు చెబుతాడు. కానీ దాసు శివ నారాయణకు ఒక కండీషన్ పెడుతాడు.
అసలు నాతో సాయం చేయించేందే కార్తీక్ బాబు, దీపా వాళ్లిద్దరికే జరగని సన్మానం, మర్యాద నాకెందుకు అని అంటాడు. ఒక ప్లేట్ లో వేసి ఇస్తే ఏదొక మూలన కూర్చొని వెళ్తానని అంటాడు. ఇక దాంతో శివ నారాయణ నువ్వు నాకు ఈరోజు అతిథివి అని, నీ ఇష్టప్రకారమే కార్తీక్, దీపాలు కూడా మనతో కలిసే భోజనం చేస్తారని చెబుతాడు. అయితే కార్తీక్ బాబుతో పాటు దీపా కూడా తినడానికి కూర్చోవడంతో వెంటనే సుమిత్ర లేస్తుంది. దీపా పక్కన కూర్చొని తినడం తనకు అస్సలు ఇష్టం ఉండదు. దాంతో దీపా బాధపడుతుంది. కార్తీక్ బాబు సర్ది చెబుతాడు. ఇక అందరూ కలిసి భోజనం చేస్తారు. ఈ సమయంలో పారుజాతం శివ నారాయణ దాసుతో కలిసి భోజనం చేస్తున్నట్టుగా సెల్ఫీల ఫొటోలను తీస్తుంది. ఇక ఆ ఫొటోలను శ్రీధర్ కు పంపిస్తుంది. ఆ ఫొటోలు చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. కుటుంబం మొత్తం కలిసిపోయిందా అని కుళ్లుకుంటాడు. ఆ ఇంటిలో పని మనిషికి కూడా పనికి రాని దాసును శివనారాయణ పక్కన కూర్చొబెట్టుకొని, మరీ భోజనం వడ్డించడం ఏంటని సందేహిస్తాడు. దీనంతటి వెనకాల తన కొడుకు కార్తీక్ బాబు హస్తం ఉంటుందని భావిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











