Karthika Deepam 2 July 28th: కార్తీక్ బాబు సవాల్ కు వణికిపోయిన జ్యోత్స్న.. సీన్ మొత్తం దీపాపైకి మారడంతో
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 26వ తేదీ 420వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న కార్తీక్ బాబు మాటలకు లోలోపల వణికిపోతుంది. దీపాను హత్య చేయాలని చూసింది, దశరథను హత్య చేయాలని చూసింది ఎవరో త్వరలోనే కనిపెడుతానని చెప్పడంతో జ్యోత్స్న జంకుతుంది. అతి త్వరలోనే సాక్ష్యాధారాలతో భయటపెడుతానని అంటుంది. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అప్పటికే గౌతమ్ గాడి నుంచి తప్పించుకున్నానని సంతోషిస్తూ ఉంటే.. కార్తీక్ బాబు ద్వారా మరో సమస్య ఎదురైందని కంగారు పడుతుంది. ఏదేమైనా మొత్తాని పెద్ద గండం నుంచి బయటి పడ్డానని సంతోష పడుతుంది. మున్ముందు ఏం జరిగినా తనకు అనుకూలంగా మార్చుకుంటానని అనుకుంటుంది. ఇక కార్తీక్ బాబు ఎలా నిరూపిస్తాడో అది కూడా చూస్తానని అంటుంది. ఆ తర్వాత అప్పటికే దాసును పిలిచి ధన్యవాదాలు చెప్పిన శివనారాయణ ఈరోజు అందరం కలిసి భోజనం చేద్దామని అంటాడు.
ఇక దీపా అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తుంది. తీరా తినే సమయంలో దాసు కార్తీక్ బాబు, దీపాలను కూడా కూర్చొమని అంటాడు. అందుకు కూడా శివనారాయణ అనుమతి ఇస్తాడు. మరోవైపు సుమిత్ర వాళ్లతో కలిసి తినడానికి ఒప్పుకోదు. తను వడ్డిస్తానని, మీరందరూ తినండి అని చెబుతుంది. దాంతో అందరూ కలిసి తింటారు. ఇక పారుజాతం ఆనందంలో మునిగి తేలుతుంది. తన కొడుకును శివనారాయణ దగ్గర చేయడం, స్వయంగా వంటకాలను వడ్డించి మరీ భోజనం పెట్టడంతో సంతోషిస్తుంది. గుర్తుకు ఉంటుందని చెప్పి సెల్ఫీలు, ఫొటోలు తీస్తుంది. ఆ ఫొటోలను శ్రీధర్ కు పంపిస్తుంది. ఫొటోలను చూసిన శ్రీధర్ షాక్ అవుతాడు. శివనారాయణ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటాడు. కుటుంబం మొత్తం కలిసిపోతే ఏదోకటి చేసి మళ్లీ ఆందోళన పుట్టించాలని అనుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. జూలై 28వ తేదీ 421 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

జ్యోత్స్న జీవితాన్ని కాపాడినందుకు దాసుకు శివనారాయణ ప్రత్యేక మర్యాదలు చేసి ధన్యవాదాలు తెలుపుతాడు. దాసు కూడా మంచి వాడేనని కోపాన్ని తగ్గించుకుంటాడు. ఇక అందరికీ ఉంటానని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు దాసు వెనకాలే దశరథ కూడా వెళ్తాడు. దాసుకు గతం గుర్తుకు వచ్చిందని అప్పటికే గమనించిన దశరథ అస్సలు జ్యోత్స్న దాసును ఎందుకు చంపాలని అనుకున్నదనే విషయాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటుంది. దాసు నోటితోనే ఆ కారణం తెలియాలని భావిస్తాడు. ఇక వెంటనే దాసు వెనకాలే వెళ్లి నేరుగా అడుగుతాడు. నిన్ను ఆ రోజు నా కూతురు జ్యోత్స్న ఎందుకు కొట్టిందిరా అని ప్రశ్నిస్తాడు. కానీ దాసు మాత్రం నన్ను ఎవరు కొట్టలేదు అన్నయ్య అని బదులిస్తాడు. అసలు నన్ను కొట్టిన తర్వాత ఏం జరిగిందనేది పూరిగా మర్చిపోయానని అబద్ధం చెబుతాడు. దాసు అబద్ధం చెబుతున్నాడనే విషయం దశరథకు స్పష్టంగా అర్థం అవుతుంది. దాంతో గుచ్చి గుచ్చి అడుగుతాడు. జ్యోత్స్న అసలు నిన్ను ఎందుకు కొట్టింది, ఎందుకు చంపాలని ప్రయత్నించిందో గుర్తుకు చేసుకోమని పదే పదే అడుగుతాడు.
కానీ అప్పటికే కార్తీక్ బాబు జ్యోత్స్న నీ కూతురు అనే విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దని అనడంతో సైలెంట్ అవుతాడు. దశరథ అన్నతో చెప్పాలని ఉన్న కూడా కార్తీక్ బాబు వద్దని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోతాడు. మరోవైపు జ్యోత్స్న దాసు, దశరథ మాట్లాడుకోవడాన్ని చాటున వింటూ ఉంటుంది. తన గురించి దాసు దశరథకు నిజం చెప్పి ఉంటాడా? అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇదే సమయంలో పారు జాతం వచ్చి వారిని డిస్టబ్ చేస్తుంది. దాసు నువ్వు ఇంకా వెళ్లలేదారా అని అడుగుతుంది. అవును నీకు గతం గుర్తుకు వచ్చింది కదా.. అసలు నిన్ను కొట్టింది ఎవరురా గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నిస్తుంది. దాంతో దాసు నిజం చెప్పేందుకు సాహసం చేయడు. నన్ను ఎవరు కొట్టలేదు. నాకు అసలు ఏం గుర్తుకు లేదని చెబుతాడు. దాంతో దాసుకు ఇంకెప్పుడు గుర్తుకు వస్తుందోనని తిరిగి ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇక దశరథ దాసు విషయంలో అనుమానిస్తాడు. దాసు కావాలనే నిజం చెప్పడం లేదు అనే విషయం తనకు అర్థం అవుతుందని మనస్సులో అనుకుంటాడు. ఇక ఈ విషయాన్ని మరో మార్గంలో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
మరోవైపు దాసు నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. వెనకాలే జ్యోత్స్న ఫాలో అవుతూ వస్తుంది. దారి మధ్యలో దాసును ఆపుతుంది. జ్యోత్స్నను చూసిన దాసు గతం గుర్తుకు రానట్టుగా నటించాలని ప్రయత్నిస్తాడు. కానీ జ్యోత్స్న ఓపెన్ గా మాట్లాడుతుంది. ఇంకెన్నాళ్లు ఇలా నాటకం ఆడుతావు నాన్న అని అంటుంది. జ్యోత్స్న నాన్న అని పిలవడంతో ఇక దాసు కూడా ఓపెన్ అవుతాడు. ఎందుకు నువ్వు దశరథకు నిజం చెప్పాలని ప్రయత్నిస్తున్నావని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. నేను ఇంకా ప్రయత్నించలేదు అమ్మ, ప్రయత్నిస్తే మాత్రం నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు అని బదులిస్తాడు. అవును నిన్ను ఎవరూ అడ్డుకోలేరు కానీ నా చావు అడ్డుకుంటుందని జ్యోత్స్న హెచ్చరిస్తుంది. నీ తల్లి పారుజాతమే నన్ను చిన్నప్పుడు మార్చింది. ఆ విషయం నీకు కూడా తెలుసు. మరీ అప్పుడు ఎందుకు నిజం చెప్పలేదని ప్రశ్నిస్తుంది. అప్పుడు మా అమ్మ ప్రమాదంలో పడుతుందని చెప్పలేదని బదులిస్తాడు. మరీ ఇప్పుడు చెబితే నేను ప్రమాదంలో పడుతానని జ్యోత్స్న అంటుంది.
నువ్వు ఎలాంటి చెడు ప్రయత్నాలు చేయనంత వరకు మౌనంగా ఉంటానని, దీపాకు, ఆ ఇంటికి ఏదైనా హాని చేయాలని ప్రయత్నిస్తే మాత్రం మొత్తం బయటపెడుతానని హెచ్చరిస్తాడు దాసు. దాంతో జ్యోత్స్న కంగారు పడుతుంది. ఇక ఏ తల్లిదండ్రులైనా పిల్లలను క్షమిస్తూనే వస్తారు. కానీ తల్లిదండ్రులనే చంపే పిల్లలను ఎప్పటికీ క్షమించరని చెబుతాడు దాస్. కానీ నేను నిన్ను క్షమించానని అంటాడు. నీ మీద ఉన్న ప్రేమతోనే నీచుడైన గౌతమ్ తో పెళ్లి జరగకుండా సమయానికి వచ్చి అడ్డుకున్నానని చెబుతాడు. ఆ ఇంటికి వారసురాలు దీపానే అని, ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు శివనారాయణ జ్యోత్స్న పెళ్లి ఎత్తిపోవడం తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇదే సమయంలో దీపా ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. జ్యోత్స్న వచ్చి దీపాను అడ్డుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











