Karthika Deepam 2 July 29th: దీపాపై జ్యోత్స్న మరో కుట్ర.. ఆ కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు స్కెచ్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 28వ తేదీ 421వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దాసు నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. సరైనా ఆధారాలు చూపించి జ్యోత్స్న నిశ్చితార్థాన్ని ఆపినందుకు, గౌతమ్ నుంచి కాపాడింనందుకు దాసును శివనారాయణ అభినందిస్తాడు. ఇక ఆయనే స్వయంగా భోజనం వడ్డించి తొలిసారిగా పక్కన కూర్చోబెట్టుకొని తినమంటాడు. దాసుతో కలిసి శివనారాయణ కూడా తింటాడు. భోజనాల తర్వాత దాసు వెళ్లిపోతానని అంటాడు. ఇక దాసు వెళ్తుండగా దశరథ వెనకాలే వెళ్లి నిన్ను జ్యోత్స్న ఎందుకు చంపాలని అనుకుందో చెప్పమని అడుగుతాడు. కానీ దాసు చెప్పడు. అప్పటికే కార్తీక్ బాబు చెప్పిన ప్లాన్ ప్రకారం నడుచుకుంటాడు. అసలు నిజం చెప్పకుండానే వెళ్లిపోతాడు. ఇక జ్యోత్స్న దాసు వెనకాలే కారులో వెళ్లి అడ్డుకుంటుంది. ఎందుకు నటిస్తున్నావని, నీకు గతం గుర్తుకు వచ్చిందనే విషయం నాకు తెలుసని అంటుంది. నువ్వు నిజం చెబితే నా జీవితం నాశనం అవుతుందని వివరిస్తుంది. నువ్వు దీపాకు, ఆ కుటుంబానికి హానీ చేయనంత వరకు నోరు విప్పనని దాసు హామీనిస్తాడు. లేదంటే అంతా చెప్పేస్తానని హెచ్చరించి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. జూలై 29వ తేదీ 422 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?
జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ ఆగిపోవడంతో శివ నారాయణ బాధపడుతాడు. తన మొదటి భార్య తాళిబొట్టును చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. జ్యోత్స్న పెళ్లికి తన నానమ్మ తాళిని ఇవ్వాలని ఎంతగానో ఆశ పడ్డాను. కానీ వీలు పడటం లేదు. ఎంతో ఆశగా ఎంగేజ్ మెంట్ చేద్దామని ప్రయత్నం చేసిన ప్రతిసారి ఏదో రకంగా వాయిదా పడుతూనే ఉందని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇదే సమయంలో దీపా కాఫీ తీసుకొని వచ్చి కాసేపు ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో జ్యోత్స్న అక్కడికి వచ్చి నాన తాతను నేను ఓదార్చుతాను. నీకు ఆ అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ శివ నారాయణ అడ్డుకుంటాడు. దీపాను నేనే మాట్లాడమని చెప్పానని అంటాడు. ఇక దీపా మాట్లాడుతూ త్వరలోనే మీరు అనుకున్నది అవుతుంది పెద్దసారు అని చెబుతుంది. మీరు బాధపడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కార్తీక్ బాబు, దశరథ కూడా శివనారాయణ దగ్గరకు వస్తారు. అవును దీపా చెప్పినట్టుగా త్వరలోనే అంత మంచే జరుగుతుందని అంటాడు. ఇక శివ నారాయణ కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అని అంటాడు. దీపా కార్తీక్ వెళ్లిపోతారు. నీ మనవారి కోసం ఎన్ని కలలు కంటావో కను తాత అని చెప్పి జ్యోత్స్న వెళ్తుంది.

ఇక జ్యోత్స్నను చూస్తూ దశరథ మనస్సులోనే మాట్లాడుకుంటాడు. దాసు నిజం చెప్పి ఉంటే నీ అసలు రూపం నాకు ఇవ్వాలె తెలిసి పోయేది జ్యోత్స్న అని అనుకుంటాడు. ఎలాగైనా నీ మనసులో ఉన్నది ఏంటో తెలుసుకుంటానని అంటాడు. నువ్వు ఎప్పటికి తెలుసుకోలేవు నాన్న అని జ్యోత్స్న తన మనస్సులో అనుకుంటూ వెళ్తుంది. మరోవైపు దీపా వాళ్ల అత్త కాంచన కుబేరా ఫొటోను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అదే సమయానికి దీపా వెళ్లి ఏమైందని అడుగుతుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కుబేరాకు ఆర్థికం చేయాల్సి ఉందని చెబుతుంది. కానీ నువ్వు కుబేరా అసలు కూతురు కాదని తెలియడంతో నువ్వు పిండ ప్రదానం చేయడం ఏమాత్రం సరికాదని దీపాతో అనసూయ చెబుతుంది. చేస్తే ఏమౌతుందని దీపా అడుగుతుంది. పెంచిన నాన్నకు ఆర్థికం చేస్తే బతికి ఉన్న తండ్రి ప్రాణాలకు ముప్పు కలుగుతుందని చెబుతుంది. దాంతో దీపా గుండె పగిలినంత పనైపోతుంది. వెంటనే తన అసలు తండ్రి దశరథ బుల్లెట్ ఘటనను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
మరోవైపు కార్తీక్ బాబు రాగానే ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్తుంది. వెంటనే కార్తీక్ బాబు వెళ్లి విషయం తెలుసుకుంటాడు. పెంచిన తండ్రికి ఆర్థికం చేయకపోయినా.. అన్నదానం చేసి ఆయన రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉంది కదా అని చెబుతాడు. దాంతో దీపా మనస్సు కాస్తా కుదుట పడుతుంది. వెంటనే ఆ ఏర్పాట్లు చేసుకోవాలని అనుకుంటారు. ఇక శివనారాయణ ఇంటికి పనికి వెళ్తారు. అందరూ హాల్ లోనే ఉండటంతో పలకరిస్తారు. సాయంత్రం కాస్తా త్వరగా వెళ్తామని దీపా, కార్తీక్ బాబు చెబుతారు. దాంతో జ్యోత్స్న ఎందుకు అని ప్రశ్నిస్తుంది. అనసూయ గారి తమ్ముడి ఆర్థికం ఉందని చెబుతాడు. అలా చెబుతున్నావేంటీ దీపా వాళ్ల నాన్న అన్ని, మా మామయ్య ఆర్థికం అని చెప్పొచ్చు కదా అని పారుజాతం సందేహం వ్యక్తం చేస్తుంది. ఎలాగ అన్న ఒక్కటే కదా అని కార్తీక్ బాబు బదులిస్తాడు. ఇంతకీ ఏం చేస్తారని అడగటంతో అన్నదానం చేస్తున్నామని బదులిస్తారు. ఇక శివనారాయణ, దశరథతో పాటు అందరినీ రావాలని కోరుతారు. శివనారాయణ మాత్రం రెస్టారెంట్ లో పని ఉందని సున్నితంగా చెబుతాడు. ఇక కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లను లోటు లేకుండా చూసుకోండి అని చెబుతాడు.
జ్యోత్స్నకు చెప్పి దీపాకు పాతికవేలు కూడా ఇచ్చి పంపించు అని చెబుతాడు శివనారాయణ. దాంతో దీపా, కార్తీక్ బాబు సంతోషిస్తారు. ఇక తండ్రిపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు దీపాపై దశరథ ప్రశంసల వర్షం కురిపిస్తాడు. ఇక తను, సుమిత్ర ఇద్దరం కలిసి వస్తామని మాట ఇస్తాడు. మీరిద్దరు వస్తే దీపాకు అమ్మనాన్న వచ్చినట్టే అని అంటాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏమన్నావని అంటుంది. మళ్లీ కార్తీక్ బాబు అదే చెబుతాడు. ఎవడో అనామకుడి కార్యక్రమానికి యజమానులు కూడా వస్తారా? అని అంటుంది. దాంతో దీపా ఫైర్ అవుతుంది. నన్ను పెంచిన తండ్రి గురించి ఇంకొక్క మాట మాట్లాడిన సహించేది లేదని హెచ్చరిస్తుంది. నాకు సర్వం మా నాన్నే అని అంటుంది. దాంతో పారుజాతం సైలెంట్ అవుతుంది. ఆ వెంటనే జ్యోత్స్న కూడా వస్తానని చెబుతుంది. ఇక వీరి వెంటనే పారుజాతం కూడా వస్తానని చెబుతుంది. అమ్మనాన్న దశరథ, సుమిత్రలను ఒంటిరిగా పంపిస్తే కార్తీక్ బాబు, దీపా వాళ్ల మనస్సులను మార్చేస్తారని అనుకుంటుంది. అందుకే కార్యక్రమానికి తను కూడా వెళ్లి కార్యక్రమాన్ని చెడగొట్టి దీపాను బాధపెట్టాలని చూస్తుంది. దాంతో ఇంకోసారి ఎలాంటి కార్యక్రమానికి రమ్మని పిలవరని అంటుంది.


Click it and Unblock the Notifications











