Karthika Deepam 2 July 30th: కార్తీక్ బాబు సూపర్ ప్లాన్.. జ్యోత్స్నకు మైండ్ బ్లాక్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 29వ తేదీ 422వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు రాగానే దీపా ఏడ్చుకుంటూ కనిపిస్తుంది. ఆ వెంటనే తమ గదిలోకి వెళ్తుంది. కార్తీక్ బాబు ఏమైందని కంగారు పడుతాడు. వెళ్లి విషయం ఏంటని తెలుసుకుంటాడు. ఇక దీపా తనను పెంచిన తండ్రి కుబేరా ఆర్థికం చేయాల్సి ఉందని చెబుతుంది. కానీ నా అసలు తండ్రి దశరథ బతికే ఉన్నాడు కాబట్టి కుబేరాకు నా చేతులతో ఆర్థికం చేయించకూడదని అనసూయ అంటుందని చెబుతుంది. అలా చేయిస్తే నా తండ్రి దశరథకు అరిష్టం కలుగుతుందని అనసూయ అభిప్రాయ పడుతోందని అంటుంది. అలాగైతే అన్నదానం కార్యక్రమం నిర్వహించి ఆయన రుణం తీర్చుకుందామని కార్తీక్ బాబు సలహానిచ్చాడు. దాంతో దీపా సరేనని చెబుతుంది. ఇక వెంటనే అందుకు సంబంధించిన కార్యక్రమాలపై దృష్టి పెడుతారు.
ఇక తమకు ఒక్క రోజు సెలవు కూడా కావాలని కార్తీక్ బాబు, దీపాలు జ్యోత్స్న, శివ నారాయణను పర్మిషన్ అడుగుతారు. తమ ఇంట్లో అనసూయ వాళ్ల తమ్ముడు కుబేరాది ఆర్థికం చేస్తున్నామని చెబుతాడు. ఆ కార్యక్రమాలన్నీ చూసుకోవడానికి పనులు ఉంటాయి కదా అని బదులిస్తాడు. ఇక సరేనని శివ నారాయణ అనుమతి ఇస్తాడు. మరోవైపు దీపా శివ నారాయణను కూడా కార్యక్రమాన్ని రమ్మని అడుగుతుంది. ఇంట్లో వాళ్లందరూ కూడా రావాలని కోరుతుంది. ఇక దశరథ మాత్రం సుమిత్రను తీసుకొని వస్తానని అంటాడు. దాంతో జ్యోత్స్న, పారుజాతం కూడా వెంటనే మేం కూడా కార్యక్రమానికి వస్తున్నామని చెబుతారు. కార్తీక్ బాబు, దీపా అక్కడ ఎలాంటి మాటలతో సుమిత్ర అమ్మను మార్చేస్తారోనని, తను వెళ్లి కార్యక్రమాన్ని చెడగొట్టి దీపాను ఇబ్బంది పెట్టాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. జూలై 30వ తేదీ 423 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కుబేరా ఆర్థికం ఉందని చెప్పిన సమయంలో శివనారాయణ, ధశరథలు సానుకూలంగా స్పందిస్తారు. ఇంట్లో వాళ్లని రావాలని చెప్పినప్పుడు కూడా శివ నారాయణ తనకు రెస్టారెంట్ లో పని ఉందని చెప్పి రాలేనని అంటాడు. కానీ ఆ కార్యక్రమానికి కావాల్సిన పనులన్నీ చూడండి అని చెబుతాడు. ఇక జ్యోత్స్న కు చెప్పి పాతిక వేలు కూడా ఇప్పిస్తాడు. ఇదే సమయంలో పారుజాతం స్పందిస్తూ ఎవరో అనాముకుడి కార్యక్రమానికి యజమానులు వస్తారా? అని అవమానిస్తూ మాట్లాడుతుంది. దాంతో దీపా ఒక్కసారిగా ఉగ్రరూపిణి అవుతుంది. పారుజాతం మాటలకు మండి పడుతుంది. ఆయన అనాముకుడు కాదని తనకు తండ్రి అని చెబుతుంది. నాకు ఎలాంటి కష్టం రాకుండా, నా పాదాలకు సైతం కందకుండా సాకిన వక్తి ఆయన అని అంటుంది. ఆయనే నాకు తండ్రి, గురువు, దైవం అన్నీ అని అంటుంది. ఇంకోసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని చెబుతుంది. దాంతో పారుజాతం మౌనంగా ఉంటుంది.
ఇక ఆ తర్వాత వంటింట్లోకి వెళ్లి వంట చేస్తూ ఉంటుంది. వెనకాలే కార్తీక్ బాబు కూడా వెళ్తాడు. పారు జాతం తనకు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతోందని రగిలిపోతుంది. శివ నారాయణ, దశరథ నాన్న ఉన్నారు కాబట్టి మౌనంగా ఉన్నాను లేదంటే ఇంకాస్తా గట్టిగానే పారుజాతానికి తగిలించే దాన్ని అని చెబుతుంది. అవును ఈ మధ్యలో పారుజాతం చాలా ఎక్కువ చేస్తుంది కదా అని కార్తీక్ బాబు దీపాతో అంటాడు. చాలా ఎక్కువ చేస్తుందని పారుజాతం తెలుపుతుంది. సరే సమయం వచ్చినప్పుడు పారుజాతం సంగతి చూసుకుందామని చెప్పి బయటకి వెళ్తాడు. ఇదే సమయంలో పారుజాతం హాలులో తల పట్టుకొని కూర్చొంటుంది. ఇంతకీ పారుకు ఏం కష్టం వచ్చిందో తెలుసుకొని ఒక ఆట ఆడుకొందామని అనుకుంటాడు. వెళ్లి పారును ఏమైందని అడుగుతాడు కార్తీక్ బాబు దాంతో పారు శివ నారాయణను డబ్బులు అడిగితే పది రూపాయలు కూడా ఇవ్వనని చెప్పి అవమానించాడని చెబుతుంది. అయ్యో నువ్వు ఆయన భార్యవు అయ్యి ఉండి కూడా డబ్బులు అడగటం ఏంటీ పారు.. నువ్వే నేరుగా తీసుకోవచ్చు కదా అని అంటాడు. మా ఇంట్లో అయితే దీపాదే పెత్తనం మొత్తం అని కార్తీక్ బాబు అంటాడు. కిచెన్ లో ఉన్న దీపాను పిలిచి మరీ మన ఇంట్లో పెత్తనం ఎవరిది అని అడిగిస్తాడు. నాదే అని దీపా చెబుతుంది.
దాంతో పారుజాతం చెలరేగిపోతుంది. ఇక ఈ ఇంట్లో పెత్తనం నాదే నని అనుకుంటూ శివ నారాయణ గదిలోకి వెళ్తుంది. డబ్బులు ఇవ్వాలని అడగటం ఎందుకుని తానే తీసుకోవాలని అనుకుంటుంది. అప్పటికే ఆ గదిలో శివ నారాయణ ఉండకపోవడంతో ఒక ఏంచక్కా లాకర్ ఓపెన్ చేసి 50 వేల కట్ట తీసుకుంటుంది. తను ఎంత సాహసం చేశానో చూపిద్దామని కార్తీక్ బాబు దగ్గరకు వస్తుంది. పారుజాతం వచ్చే సరికి కార్తీక్ బాబు ప్లేస్ లో శివ నారాయణ హాలులో కూర్చొని ఉంటాడు. డబ్బులు దొంగలించిన పారుతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. పారు కొంగు చాటు డబ్బులు దాచుకొన్న ప్రవర్తన చూసి వచ్చి తన పక్కన కూర్చొమంటాడు. పారు రాకపోవడంతో ఫోన్ లోని వీడియో చూడమని చెబుతాడు. ఆ వీడియోలో పారు దొంగతనం చేస్తున్న దృశ్యం ఉంటుంది. దాంతో పారు షాక్ అవుతుంది. ఈ వీడియో ఎవరు తీశారని అడుగుతుంది. నేనే అని కార్తీక్ బాబు చెబుతాడు. ఇక శివ నారాయణ చేతితో బెత్తం దెబ్బలు కూడా తినిపిస్తాడు. నువ్వే రెచ్చగొట్టి నువ్వే దొరికిపోయేలా చేస్తావా? అని పారుజాతం కార్తీక్ బాబుపై మండి పడుతుంది.
నిన్న నా భార్య దీపాపై చేయి ఎత్తినందుకు ఇలా చేశానని అంటాడు. ఇలా ఎపిసోడ్ మొత్తం పారుజాతంపై రివేంజ్ నడుస్తుంది. మరోవైపు కుబేరా కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కార్తీక్ బాబు దీపా మౌనంగా ఉండటం చూసి నోట మాట జారుతాడు. కుబేరా ఆర్థికం అయిపోయిన తర్వాత మీ అమ్మనాన్నల దగ్గరికి వెళ్దామని అంటాడు. దాంతో కాంచన, అనసూయ షాక్ అవుతారు. వాళ్ల అమ్మనాన్న చనిపోయారు కదా కార్తీక్ నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావని కాంచన అడుగుతుంది. నేనే వాళ్ల అమ్మనాన్న నివసించిన ముత్తాలమ్మపల్లికి వెళ్దామని అనబోయి అలా అన్నానని మాట సరిచేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.


Click it and Unblock the Notifications











