Karthika Deepam 2 July 31st: జ్యోత్స్న కటిక గుణం.. దీపాను పుట్టెడు దుఃఖంలోకి నెట్టి

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 30వ తేదీ 423వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రతి విషయంలో ఈ మధ్య పారుజాతం కాస్తా ఎక్కువ చేస్తుందని కార్తీక్ బాబు, దీపా అనుకుంటారు. కుబేరా విషయంలో పారు మాట్లాడిన మాటలు, పైగా దీపాపై చేయి ఎత్తి కొట్టబోవడాన్ని జీర్ణించుకోలేకపోతారు. ఇక ఎలాగైనా పారు జాతానికి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు కార్తీక్ బాబు. అందుకు బయటికి వెళ్తున్న సమయంలో పారు హాలులో తల పట్టుకోవడాన్ని చూస్తాడు. పారు దిగాలుగా కూర్చొని కనిపించడంతో ఏమైందో తెలుసుకొని మరింత బుద్ధి చెప్పే ప్రయత్నం చేద్దామని అనుకుంటాడు. ఆ వెంటనే పారు దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగుతాడు. దాంతో పారు శివ నారాయణ దగ్గరకు వెళ్లి డబ్బులు ఇవ్వమని అడిగి ఇవ్వడం లేదని, కనీసం 10 రూపాయలు కూడా ఇవ్వనని మొహం మీదనే చెప్పేశాడని అంటుంది. ఆ మాటలు విన్న కార్తీక్ బాబు ఎలాగైనా పారుకు బుద్ధి చెప్పాలని అనుకుంటాడు.

ఇక వెంటనే పారుకు ఒక సలహానిస్తాడు. మా ఇంట్లో అయితే పెత్తనం మొత్తం దీపాదే. అంతే కాదు ఏ ఇంట్లో అయినా పెత్తనం మొత్తం ఆడవాళ్లదే ఉంటుంది. మొగుళ్లు అలా పడి ఉండాల్సిందే అని రెచ్చగొడుతాడు. అసలు నువ్వు ఈ ఇంటికి యజమానివి. నువ్వు ఎవ్వరినీ డబ్బులు అడగాల్సిన పని లేదని చెబుతాడు. నేరుగా, ధైర్యంగా వెళ్లి తీసుకోవాల్సిందేనని ఎక్కిస్తాడు. ఇక కార్తీక్ బాబు మాటాలు నమ్మి, డబ్బుపై ఆశతో పారుజాతం నేరుగా శివనారాయణ గదిలోకి వెళ్తుంది. అక్కడ లాకర్ ఓపెన్ చేసి 50 వేలు తీస్తుంది. ఇక కార్తీక్ బాబు అంతా వీడియో తీసి శివ నారాయణకు చూపిస్తాడు. శివ నారాయణ ఆ వీడియోను పారుకు చూపించి బండ బూతులు తిడుతాడు. అంతే కాదు బెత్తం దెబ్బలు కూడా వేస్తాడు. ఇలా కార్తీక్ బాబు ఇరికించడంతో పారు కోపంతో రగిలిపోతుంది. నువ్వు దీపాపై చేయి ఎత్తినందుకే నీకు ఈ శిక్ష అని చెబుతాడు కార్తీక్ బాబు. మరోవైపు కుబేరా ఆర్థికానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అక్కడ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 31వ తేదీ 424 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 424 July 31st 2025

రెస్టారెంట్ పనిలో బిజీగా ఉంటానని చెప్పిన శివ నారాయణ కూడా కుబేరా కార్యక్రమానికి వస్తారు. శివ నారాయణతో పాటు కొడుకు దశరథ, కోడలు సుమిత, జ్యోత్స్న, పారు కుబేరా కార్యక్రమానికి హాజరవుతారు. ఇక శివ నారాయణ, దశరథలు దీపాను పరామర్శిస్తారు. ఇక వారికి కూర్చోవడానికి కూర్చీలు కూడా వేయలేదా అంటూ మరోవైపు పారుజాతం గోల చేయాలని చూస్తుంది. అయితే అప్పటికే దీపా తన కన్నతండ్రి దశరథ బతికి ఉన్నా కూడా కుబేరాకు పిండం పెడుతుండటం బాధిస్తుంది. నిజం తెలిసిపోయిన తర్వాత ఆ కార్యక్రమం చేయడానికి దీపాకు మనస్సు ఒప్పుకోదు. ఏదైనా జరగ కూడనిది జరిగితే ఎలా అని బాధపడుతూ ఉంటుంది. కానీ కార్తీక్ బాబు దీపాకు ధైర్యం చెప్పి కార్యక్రమాన్ని నడిపిస్తాడు. ఇక శివ నారాయణ కుటుంబం రావడంతో వారికి ప్రత్యేకంగా కూర్చీలు వేయించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఈలోగా సుమిత్ర, కాంచన మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది. జ్యోత్స్న చేస్తున్న పనులకు, మరోవైపు దీపాను సుమిత్ర అవమానిస్తున్నందుకు కాంచన కోపంగా ఉంటుంది. కాంచన అస్సలు ఎవ్వరితోనూ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది.

కాంచన వదినా పూర్తిగా మారిపోయిందని సుమిత్ర అంటుంది. అందుకే జ్యోత్స్న నిశ్చితార్థం కోసం కూడా రాలేదు. అయిన వాళ్లకు దూరంగా ఉండటం ఆమెకు ఆనందాన్ని ఇస్తోందని అంటుంది. దాంతో కాంచన ఫైర్ అవుతుంది. నేను ఇప్పుడిలా ప్రవర్తించడానికి కారణం ఎవరో మీకే తెలిసి ఉంటుంది వదినా, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అని కాంచన అంటుంది. ఇక ఇదే సమయంలో శ్రీధర్ కూడా కావేరిని తీసుకొని ఎంట్రీ ఇస్తాడు. దాంతో పారుజాతం శ్రీధర్ ను అవమానిస్తుంది. ఇక శ్రీధర్ కూడా తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూనే ఉంటాడు. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందంట కదా అనే టాపిక్ తీసి పారుజాతం నోరు మూసుకునేలా చేస్తాడు. ఆ తర్వాత కార్తీక్ బాబు జ్యోక్యం చేసుకొని అందరినీ భోజనం చేయమని చెబుతాడు. అందరికీ ప్లేట్స్ లో వడ్డిస్తూ ఉంటారు. తమ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన కూర్చీల్లో కూర్చొని తింటూ ఉంటారు. ఇక దశరథ కూడా ప్లేట్ లో భోజనం తీసుకొని వెళ్లి కుర్చీలో కూర్చోబోతాడు. ఇదే సమయంలో స్లిప్ అయి కింద పడబోతాడు.

ఇక పక్కనే ఉన్న దీపా దశరథను వెంటనే పడకుండా పట్టుకుంటుంది. అంతే కాదు నాన్న అని గట్టిగా అరుస్తుంది. దెబ్బలు ఏమైనా తగిలాయా నాన్న అని అడుగుతుంది. ఇలా రెండు సార్లు దీపా నాన్న అని పిలవడంతో జ్యోత్స్న మండిపోతుంది. దీపా సరిగ్గా దొరికిందని ఎలాగైనా గొడవను పెద్దగా చేయాలని అనుకుంటుంది. నీకు ఎన్ని సార్లు చెప్పినా నాన్న అని పిలవకుండా ఉండలేవా? అని జ్యోత్స్న దీపాను ప్రశ్నిస్తుంది. గతంలో ఒకసారి నాన్న అని పిలిచింది. అయినా కూడా సహించాం. పైగా నాతోనే క్షమాపణలు కూడా చెప్పించుకుంది. మరి ఇప్పుడు ఎందుకు నాన్న అని పిలిచని ప్రశ్నిస్తుంది. దీపా మౌనంగా ఉంటుంది. కార్తీక్ బాబు సర్దిచెప్పబోతాడు. అయ్యగారు అనబోయి నాన్న అనింది అని అంటాడు. అలా నాన్న అంటే వాళ్ల అమ్మకు దశరథ ఏమౌతాడో తెలుసు కదా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. దీంతో పారుపై కార్తీక్, దీపాలు ఫైర్ అవుతారు. మరోవైపు దీపాను నీ తండ్రి చచ్చిపోయాడని అవమానంగా మాట్లాడుతుంది. ఇక దీపా సహించలేకపోతుంది. నా తండ్రి చచ్చిపోలేదని, బతికే ఉన్నాడని అంటుంది. కుబేరా చనిపోయాడు కదా అని పారు ప్రశ్నిస్తుంది. అందుకు అనసూయ స్పందిస్తూ కుబేరా నా తమ్ముడు మాత్రమే అని, దీపాను కన్న తండ్రి కాదనే నిజం చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని కలిగిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X