Karthika Deepam 2 August 1st: దీపానే కన్న కూతురని తెలుసుకున్న దశరథ.. జ్యోత్స్నకు అసలైన టెన్షన్ మొదలు
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 జూలై 31వ తేదీ 424వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపాను పెంచిన తండ్రి కుబేరాకు సంవత్సరికం చేయాల్సిన సమయం దగ్గరికి వస్తుంది. అయితే దీపా కన్న తండ్రి దశరథ అని, కన్న తల్లి సుమిత్ర అని తెలియడంతో ఇప్పుడు కుబేరాకు తన చేతుల మీదుగా కార్యక్రమం చేయొచ్చునా అనే సందేహంలో పడుతుంది. మరోవైపు తన అసలు తండ్రి బతికి ఉన్నాడు కాబట్టి పెంచిన తండ్రికి నీ చేతుల మీదుగా పిండప్రదానం చేయొద్దని అనసూయ చెబుతుంది. దాంతో దీపా కూడా చేయొద్దని నిర్ణయించుకుంటుంది. ఇదే విషయాన్ని కార్తీక్ బాబుతో చెప్పడంతో అసలు కార్యక్రమాన్ని నీ చేతుల మీద చేయకపోయినా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెబుతాడు. దాంతో దీపా కూడా సరేనని అంటుంది.
ఇక కుబేరా ఆర్థికం ఉందని శివ నారాయణ ఇంట్లోనూ చెబుతాడు. తమకు సెలవు కావాలని రేపు పనికి రాలేమని చెబుతారు. విషయం తెలుసుకున్న శివ నారాయణ వాళ్లకి కార్యక్రమానికి సరిపడా డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తాడు. తన మాత్రం రాలేకపోతున్నానని, రెస్టారెంట్ లో ఉన్న పని వాళ్ల రాలేనని సున్నితంగా చెబుతాడు. ఇక దశరథ మాత్రం సుమిత్రను తీసుకొని వస్తానని దీపాకు హామీనిస్తాడు. దీంతో జ్యోత్స్న, పారులు కూడా వస్తామని అంటారు. కుబేరా కార్యక్రమానికి అన్నీ ఏర్పాట్లు చేస్తారు. ఇక వీళ్లందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఈ సమయంలో పారుజాతం, దీపా, అనసూయ మధ్య భారీ ఘర్షణ జరుగుతుంది. దీంతో ఆవేశం పట్టలేక అనసూయ దీపా గురించి అసలు విషయం చెబుతుంది. దీపా కుబేరా కూతురు కాదని మాట జారుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆషక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 1వ తేదీ 425 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కుబేరా కార్యక్రమానికి హాజరైన జ్యోత్స్న, సుమిత్ర, పారుజాతం, దశరథ, శ్రీధర్ లకు షాకింగ్ విషయం తెలుస్తుంది. భోజనాలు తినే సయమంలో దశరథ తన ప్లేట్ పట్టుకొని కూర్చిలో కూర్చోబోతాడు. కూర్చీ అదుపు తప్పి కింద పడబోతాడు. పక్కనే ఉన్న దీపా వెంటనే దశరథను నాన్న అని పిలుస్తూ పట్టుకుంటుంది. నాన్న మీకేమైనా అయ్యిందా? అని అడుగుతుంది. దశరథ దీపా రెండు సార్లు నాన్న అని పిలవడాన్ని జ్యోత్స్న జీర్ణించుకోలేకపోతుంది. ఏమని పిలిచావని దీపాను ప్రశ్నిస్తుంది. నాన్న అని పిలవకూడదని నీకు ఎన్ని సార్లు చెప్పినా చెవికి వినిపించడం లేదు కదా అని అంటుంది. పోయిన సారి ఇలాగే నాన్న అని పిలిచి బాధ పెట్టావు. పైగా నాదే తప్పు అని నిందవేసి క్షమాపణలు కూడా చెప్పేలా చేశావు అని జ్యోత్స్న ఫైర్ అవుతుంది. అసలు ఇప్పుడు నాన్న అని ఎందుకు పిలిచావో చెప్పమని, అసలు మా నాన్న నీకు ఏరకంగా నాన్న అవుతాడో చెప్పమని జ్యోత్స్న గట్టిగా ప్రశ్నిస్తుంది. ఆ వెంటనే పారు జాతం కూడా అలా ఎవరినీ పడితే వాళ్లని నాన్న అని పిలుస్తావా? అని అంటుంది. దాంతో కార్తీక్ బాబు స్పందిస్తూ ఇవ్వాళ వాళ్ల కుబేరా కార్యక్రమం జరుగుతుండటంతో ఉదయం నుంచి నాన్న నాన్న అని అంటుంది. ఆ విధంగా అని ఉంటుందని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు.
కార్తీక్ బాబు ఇచ్చిన సమాధానానికి పారు జాతం షాకింగ్ గా మాట్లాడుతుంది. అలా ఎలా అంటుందని నిలదీస్తుంది. దశరథను నాన్న అని పిలిస్తే వాళ్ల అమ్మ దశరథకు ఏమౌతుందో ఆలోచిస్తుందా అని అంటుంది. ఆ మాటతో కార్తీక్ బాబు, దీపా ఫైర్ అవుతారు. దాంతో పారుజాతం నేను ఏమాన్నానని అంత కోపం మీకు, మీ నాన్న చనిపోయాడు కదా? చనిపోయిన వాడిని చనిపోయినవాడని అనడంలో తప్పేమి ఉందని అంటుంది. మరోసారి ఆ మాట అనకండి అంటూ దీపా హెచ్చరిస్తుంది. కానీ పారుజాతం అట్టుకూ అదే మాట అంటుంది. మీ నాన్న చచ్చిపోయాడు, మీ నాన్న చచ్చిపోయాడు అంటూ పదే పదే అనేస్తుంది. దాంతో మా నాన్న చచ్చిపోలేదు, బతికే ఉన్నాడని దీపా గట్టిగా అరిచి చెబుతుంది. ఆ వెంటనే అనసూయ కూడా పారుజాతంపై ఫైర్ అవుతుంది. దీపా తండ్రి కుబేరా కాదని చెబుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఆ వెంటనే అనసూయపై పారుజాతం, జ్యోత్స్న ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. దీపా కుబేరా కూతురు కాదనే సంగతి నీకు ముందే తెలుసా అని అడుగుతుంది. అందుకు తెలుసు అని అనసూయ సమాధానం ఇస్తుంది.
మరీ దీపా కుబేరా దగ్గరకు ఎలా వచ్చిందని పారు జాతం ప్రశ్నిస్తుంది. దీపా కుబేరా పెంచుకున్న కూతురు. దీపాను ఎవరో కని బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయారు. అప్పుడు కుబేరా తీసుకొని వచ్చి పెంచుకున్నాడు. దీపా తల్లిదండ్రులు బతికే ఉన్నారని బదులిస్తుంది. బస్టాండ్ లో వదిలేశారని అనడంతో పారుజాతం గుండె జల్లుమంటుంది. తన చేసిన పాపాన్ని గుర్తుకు చేసుకుంటుంది. అనసూయ చెప్పిన మాటలకు జ్యోత్స్న కూడా షాక్ అవుతుంది. నెమ్మదిగా నిజం బయటికి వస్తోందని, తన తండ్రి దశరథకు విషయం తెలియక ముందే జాగ్రత్త పడాలని అనుకుంటుంది. మరీ నీకు దీపా అసలు తల్లిదండ్రులు ఎవరో తెలుసా అని ప్రశ్నిస్తుంది. అందుకు అనసూయ తెలియదని చెబుతుంది. ఇక అందరు ఇంటికి తిరిగి వెళ్లి పోతారు. వెంటనే దీపాకు ఇంకెన్ని విషయాలు తెలుసో, అసలు వాళ్ల తల్లిదండ్రులు తనకు తెలుసా లేదా అనే విషయాన్ని దీపాను అడిగి తెలుసు కోవాలని జ్యోత్స్న తన మనసులో అనుకుంటుంది. మరోవైపు పారు కంగారు పడుతుంటే, దీపానే దశరథ అసలు కూతురు అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే మార్చేస్తుంది. మరోవైపు శ్రీధర్ కార్తీక్ బాబు ఇంటికి వెళ్లి దీపాను అనాథ అని అవమానిస్తాడు. అసలు ఎవరికి ఎలా పుట్టిందోనని నానా మాటలు అని బాధ పెడుతాడు. దాంతో కార్తీక్ బాబు ఫైర్ అవుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











