Karthika Deepam 2 August 2nd: దీపాకు జ్యోత్స్న డైరెక్ట్ వార్నింగ్.. అసలు కథలు మొదలు

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 1న తేదీ 426వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కుబేరా కార్యక్రమం సందర్భంగా అన్నదానం చేస్తారు దీపా, కార్తీక్ బాబు. ఈ కార్యక్రమానికి దశరథ, సుమిత్ర, పారుజాతం, జ్యోత్స్న హాజరవుతారు. ఈ సమయంలో దీపాను పారుకు మధ్య పెద్ద ఘర్షణ జరుగుతుంది. దీపాను పారు తన తండ్రి చచ్చిపోయాడు చచ్చిపోయాడు అంటూ పదే పదే అంటుంది. దాంతో దీపా ఫైర్ అవుతుంది. తన తండ్రి చనిపోలేదని, బతికే ఉన్నాడని అందరి ముందు చెబుతుంది. ఆవేశంలో నోరు జారడంతో అందరూ షాక్ అవుతారు. ఇక పారు అంతలా అన్ని మాటలు అనడంతో దీపా పట్టలేక నిజం చెప్పబోతుంది. కానీ కుబేరా మాత్రమే తన తండ్రి కాదని చెప్పి మౌనంగా ఉంటుంది. దీపా చెప్పిన మాటలను అనసూయ అవునని చెబుతుంది. కుబేరా నా తమ్ముడు మాత్రమేనని అంటుంది. ఎవరో చిన్నప్పుడే దీపాను బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయారని వివరిస్తుంది. ఇక కుబేరా తీసుకొచ్చుకొని పెంచుకున్నారని వివరిస్తుంది.

దీపాను వదిలి వెళ్లింది ఎవరనే సంగతి, వారి వివరాలు మాత్రం నాకు తెలియదని అంటుంది. దీప పుట్టుక గురించి తెలుసుకున్న పారుజాతం, శ్రీధర్, సుమిత్ర, దశరథ షాక్ అవుతారు. ఇక జ్యోత్స్నకు అప్పటికే దీపా పుట్టుక గురించి, దీపానే అసలు వారసులు రాలు అనే సంగతి తెలిసిందే. దాంతో కుబేరా తన తండ్రి కాదనే విషయం తెలుసుకున్నట్టే, తనే శివ నారాయణ అసలు వారసురాలు అనే సంగతి కూడా తెలుసుకుందా అని సందేహిస్తుంది. దాంతో వెంటనే కుబేరా నీ తండ్రి కానప్పుడు మరీ నీ అసలు తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా అని ప్రశ్నిస్తుంది. దాంతో తెలియదని దీపా బదులిస్తుంది. మరోవైపు శ్రీధర్ బాబు దీపాను అనాథ అంటూ అవమానిస్తాడు. దీంతో అందరూ ఆయనపై ఫైర్ అవుతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 2వ తేదీ 426 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 427 August 2nd 2025

దీపా పుట్టుక గురించి తెలియడంతో శ్రీధర్ బాబు రగిలిపోతాడు. కుబేరా కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ తిరిగి ఇంటికి వస్తారు. ఇంట్లో వాళ్లందరూ మౌనంగా ఉంటారు. దీపా తల్లిదండ్రులు ఎవరో తెలియదని, తను అనాథ అని శ్రీధర్ అనడంతో బాధ పడుతుంది. ఇక కాంచన ఏమంటుందో దీపా టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ కాంచన మాత్రం దీపాను ఒక్క మాట కూడా అనబోదు. దీపా నా కోడలు మాత్రమే అని, తన పుట్టుక విషయాల గురించి నాకు అవసరం లేదని అంటుంది. నేను దీపా విషయంలో ఎలాంటి చెడు అభిప్రాయంతో లేనని అంటుంది. కానీ ఇదే సమయంలోనే శ్రీధర్ వాళ్ల ఇంటికి వస్తాడు. ఇక దీపా పుట్టక గురించి పూర్తిగా తెలియడంతో ఇక దీపాను ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతాడు. అసలు మీ తల్లిదండ్రులు నిన్ను విసిరిపారేసరంటే నువ్వు అనాథవే కదా అని అంటాడు.

మరోవైపు శ్రీధర్ హద్దులు దాటి మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడూ దీపాకు సపోర్ట్ చేసే అనసూయపైన కూడా ఫైర్ అవుతాడు. అసలు నీకు మాట్లాడే అర్హతే లేదని మండిపడుతాడు. ఇన్నాళ్లు దీపాకు మేనత్తవనే గౌరవంతో ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నీకు ఏమాత్రం విలువ ఇచ్చే సమస్యే లేదని చెబుతాడు. దాంతో అనసూయ కూడా మౌనంగా ఉంటుంది. ఇక శ్రీధర్ దీపాపై చెలరేగిపోతాడు. నానా మాటలు అంటాడు. అయినా కూడా దీపా ఏమాత్రం స్పందించదు. పక్కనే ఉన్న కార్తీక్ బాబు కూడా ఏమాత్రం తిరిగి సమాధానం ఇవ్వబోడు. అయితే శ్రీధర్ మాట్లాడుతూ మాట్లాడుతూ దీపా పుట్టుకపై తప్పుగా మాట్లాడుతాడు. దాంతో ఒక్కసారిగా కార్తీక్ బాబు, దీపా షాక్ అవుతారు. అసలు మీ తల్లిదండ్రులు నిన్ను ఎలా కని ఉంటారో, లేక వాళ్లు ఎందుకు కలిసి నిన్ను కన్నారో అంటూ హద్దులు దాటి మాట్లాడుతాడు. దీంతో కార్తీక్ బాబు శ్రీధర్ పై మండి పడుతాడు. అసలు నువ్వు దీపా పుట్టకపై మాట్లాడే అర్హత కలిగి లేవని అంటాడు. నువ్వు దీపాను అన్నట్టుగానే నేను స్వప్న పుట్టుక గురించి మాట్లాడితే నీకు ఎలా ఉంటుందని కార్తీక్ బాబు ఫైర్ అవుతాడు.

అసలు నువ్వు మా జీవితాలను ఏమాత్రం ఉద్దరించావని దీపాను అంటున్నావు. నాకు, స్వప్నకు తండ్రి ఉన్నా కూడా అనాథలుగానే ఉంటున్నాం. మా కోసం నువ్వు ఏమీ చేయలేదు. మాకు నువ్వు చూపించిన బతుకుదెరువు అంటూ ఏమీ లేదు. ఎవరి బతుకు వాళ్లం బతుకుతున్నాం. నువ్వు మాకు ఏదైనా సాయం చేయాలనుకుంటే వెంటనే ఈ ఇంట్లో నుంచి వెళ్లిపో అని తండ్రి శ్రీధర్ ను వెళ్లగొడుతాడు. దీంతో శ్రీధర్ వెళ్లిపోతాడు. కార్తీక్ బాబు తొలిసారిగా ఉగ్రరూపంగా మాట్లాడటంతో ఎమోషనల్ అవుతాడు. ఇంటికి వెళ్లి మందేస్తూ ఉంటాడు. కార్తీక్ బాబుతో జరిగిన గొడవను కావేరికి కూడా చెబుతాడు. ఇక కావేరి కూడా ఫైర్ అవుతుంది. దాంతో దీపా వల్లనే నా కొడుకు జీవితం నాశనమైందని, వాడి జీవితాన్ని ఎలా బాగు చేయాలో నాకు బాగా తెలుసని అంటాడు. ఇక నేను అనుకున్నదే చేసి తీరుతా అని ఇంట్లో నుంచి చెప్పకుండానే వెళ్లిపోతాడు.

మరోవైపు పారు దీపా గురించిన విషయాలను తెలుసు కోవాలని అనుకుంటుంది. అప్పటికే శివ నారాయణ కు దీపా అసలు తండ్రి కుబేరా కాదని తెలియడంతో పాపం అంటాడు. పెంచిన తండ్రి కుబేరా గొప్పవాడని, నిన్ను చేరదీసి పోషించడం ఆయన గొప్ప మనస్సుకు నిదర్శనమని అంటాడు. ఇక దీపాను పారుజాతం పలు ప్రశ్నలు అడుగుతుంది. నిన్ను బస్టాండ్ లో వదిలేసిన సమయం రాత్రినా, పగలా అని అడుగుతుంది. దాంతో కార్తీక్ బాబుకు పారు గుట్టు తెలుస్తుంది. ఇక దీపా మౌనం ఉంటుంది. కార్తీక్ బాబు సమాధానం చెప్పనివ్వకుండా మాట మార్చేస్తాడు. పైగా శివ నారాయణతో బెత్తం దెబ్బలు పడేలా చేస్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న దీపా దగ్గరకు వచ్చి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలని అంటుంది. దాంతో దీపా దేని గురించి అని ప్రశ్నిస్తుంది. ఇక జ్యోత్స్న ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందేని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X