Karthika Deepam 2 August 4th: జ్యోత్స్న X దీపా.. వంటలక్క దెబ్బకు మైండ్ బ్లాక్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 1న తేదీ 426వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మా జీవితాలను నువ్వు ఏమాత్రం ఉద్దరించావని శ్రీధర్ పై కార్తీక్ బాబు మండి పడుతాడు. దీపాపై ఎక్కువగా మాట్లాడితే సహించేది లేదని అంటాడు. అసలు దీపా పుట్టుక గురించి మాట్లాడే ముందు స్వప్న పుట్టుకు గురించి మాట్లాడుదామా? అని ప్రశ్నిస్తాడు. దాంతో శ్రీధర్ మౌనంగా ఉంటాడు. కార్తీక్ బాబు రెచ్చిపోపవడంతో శ్రీధర్ తగ్గి మాట్లాడుతాడు. ఇక కార్తీక్ బాబుతో పాటు ఇంట్లో వాళ్లందరూ కూడా శ్రీధర్ పై ఫైర్ అవుతారు. ఇంకోసారి దీపా జోలికి వస్తే సంహించేది లేదని కార్తీక్ బాబు హెచ్చరిస్తాడు. ఇక దీపా శ్రీధర్ అన్న మాటలకు బాధపడుతుంది. కన్న తల్లిదండ్రులు కళ్ల ముందే ఉన్నా కూడా వాళ్ల ప్రేమకు నోచులేక పోతున్నాని అంటుంది. కార్తీక్ బాబు ఓదార్చుతాడు. కాంచన కూడా దీపా పుట్టుక విషయాన్ని పెద్దగా పట్టించుకోనని, తన మంచి మనస్సు నాకు తెలుసని అంటుంది. కానీ శ్రీధర్ బాబు మాత్రం కార్తీక్ బాబు, కాంచనలకు కోసం ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 4వ తేదీ 427 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?
కార్తీక్ బాబు అన్న మాటలను శ్రీధర్ బాబు సీరియస్ గా తీసుకుంటాడు. ఏదైనా చేసైనా ఆ దీపాను కార్తీక్ బాబు నుంచి విడదీయాలని, కోట్లట్లో పుట్టి పెరిగిన నా కుడుకు కార్తీక్ బాబు దీపా వల్ల పేద వాడిగా మారిపోయాడని అనుకుంటాడు. ఎలాగైనా కార్తీక్ బాబుకు పూర్వ వైభవం ఇవ్వాలని అనుకుంటాడు. ఇదే సమయంలో తనకు తెలిసిన ప్రయత్నం తాను చేస్తానని రెండో భార్య కావేరితో చెబుతాడు. నీకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏమాత్రం సరికాదని కావేరి శ్రీధర్ ను హెచ్చరిస్తుంది. అయినా కూడా శ్రీధర్ ఊరుకోడు. నేను చేయాల్సిన పని చేస్తానని, నాకు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో బాగా తెలుసని అంటాడు. దాంతో వెంటనే బయటికి వెళ్లిపోతాడు. ఇక శ్రీధర్ ఏం చేస్తాడోనని కావేరి భయపడుతూ ఉంటుంది. మరోవైపు జ్యోత్స్న X దీపాగా స్టోరీ నడుస్తోంది. దీపా పుట్టుక గురించి అందరికీ తెలియడంతో జ్యోత్స్న మనస్సులో వందల ప్రశ్నలు ఉత్పత్నమవుతుంటాయి. వాంటినింటికి దీపా దగ్గర నుంచే సమాధానాలు తీసుకోవాలని అనుకుంటుంది.

ఇక దీపా పనికోసం ఇంటికి రాగా, ఎవరు లేని సమయంలో తన ప్రశ్నలను అడుగుతుంది. దీపా కుబేరా నీ తండ్రి కాదని తెలిసి పోయింది కదా? ఎప్పుడు నీకు బాధ అనిపించలేదా అని ప్రశ్నిస్తుంది. అందుకు దీపా లేదని చెబుతుంది. మరీ నీ సొంత తల్లిదండ్రుల గురించి నీకు ఏమైనా తెలుసా? అని ప్రశ్నిస్తుంది. ఇక దీపాకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ జ్యోత్స్నతో మాత్రం తెలియదని చెబుతుంది. కనీసం నిన్ను మీ తల్లిదండ్రులు ఎందుకు దూరం చేసుకున్నారనే సంగతి అయిన తెలిసిందా అని అడుగుతుంది. దానికి దీపా పరోక్షంగా బదులిస్తుంది. ఆ విషయంలో మాత్రం నాకు మా బావ కార్తీక్ ఒక కథ చెప్పాడని అంటుంది. ఇక దీపా ఒక కట్టు కథను అచ్చం తన చిన్నప్పుడు పారుజాతం తనను బస్టాండ్ లో ఎత్తుకెళ్లి వదిలేసినట్టుగా అర్థం వచ్చేలా చెబుతుంది. దాంతో జ్యోత్స్న బుర్ర గిర్రు మంటుంది. అసలు దీపాకు నిజం తెలిసి ఇలా మాట్లాడుతుందా? లేక దీపా గురించి నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి దీపా ఏం మాట్లాడినా తెలిసిపోయిందని అనిపిస్తుందా? అని తనలో తానే మాట్లాడుకుంటుంది.
దీపా ఇంకా మాట్లాడుతూ తన తల్లి దండ్రులు కచ్చితంగా తనను విసిరి పారేసి ఉండరని గట్టిగా నమ్ముతున్నానని అంటుంది. మా నాన్నకు గిట్టని శత్రువులెవరైనా నన్ను పుట్టినప్పుడే దూరం చేసి ఉండొచ్చు కదా అని జ్యోత్స్నకు తగిలేలా మాట్లాడుతుంది. దేవుడి దయ వల్ల నేను బతికాను.. అంటే భవిష్యత్ లో కచ్చితంగా నా సొంత తల్లిదండ్రులను కలుసుకుంటాను కావొచ్చని చెప్పి షాక్ ఇస్తుంది. దీపా చెప్పిన మాటాలకు జ్యోత్స్న టెన్షన్ ఇంకాస్తా పెరుగుతుంది. అసలు దీపా, కార్తీక్ బాబు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారని సందేహిస్తుంది. మరోవైపు శ్రీధర్ చేసిన పనికి కార్తీక్ బాబుపై శివ నారాయణ ఫైర్ అవుతాడు. అయితే ఇంటికి ఒక పోస్ట్ వస్తుంది. అందులో తన వాట తనకు కావాలని తల్లి కాంచన నుంచి నోటీసులు వచ్చినట్టు శివ నారాయణ కార్తీక్ బాబుకు చెబుతాడు. ఇక ఇలాంటి పనులన్నీ నీకు తెలియకుండా జరుగుతాయా? అని శివ నారాయణ ప్రశ్నిస్తాడు. మరోవైపు కాంచనను నిందిస్తాడు.
ఇక కార్తీక్ బాబు మాత్రం ఆ నోటీసులను నాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. నీకు సంబంధం లేకపోయినా మీ అమ్మ కాంచనకు ఉండొచ్చు కదా అని శివనారాయణ అంటాడు, మరోవైపు దీపా కూడా చేసి ఉండొచ్చు కదా అని సుమిత్ర అనుమానం వ్యక్తం చేస్తుంది. తొందరపడి ఎవరూ ఎలాంటి ఆవేశాలకు పోవద్దని కార్తీక్ బాబు అందరికీ విన్నవిస్తాడు. ఒక గంట సమయం ఇస్తే రుజువు చేస్తానని అంటాడు. ఇక కార్తీక్ బాబుకు శ్రీధర్ పై ఉన్న అనుమానంతో వెంటనే ఫోన్ చేసి ఇలా చేసింది నువ్వేనా అని అడుగుతాడు. అది నేనే అని శ్రీధర్ చెబుతాడు. దాంతో కార్తీక్ బాబు మాట మార్చి నోటీసుకు శివ నారాయణ భయపడి పోయారని, వెంటనే ఆస్తిలో వాట ఇస్తున్నారని చెబుతాడు. ఇలాంటి సమయంలో నేను కూడా అక్కడ ఉండాలి కదా అని శ్రీధర్ వెంటనే శివ నారాయణ ఇంటికి వస్తాడు. తొందర పడి అసలు నోటీసులు పంపించింది నేనే. కార్తీక్ బాబు, కాంచనకు, మరెవ్వరికీ సంబంధం లేదు. ఇలాంటి గొప్ప పని నేనే చేశానని గొప్పగా చెబుతాడు. మొత్తానికి కార్తీక్ బాబుపై పడ్డ నిందను తొలగించుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాతి ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











