Karthika Deepam 2 August 5th: శ్రీధర్ ను తన్ని తరిమేసిన శివ నారాయణ.. జ్యోత్స్నతో కార్తీక్ బాబుకు మరో సమస్య
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 4వ తేదీ 427వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపాతో జ్యోత్స్నకు వాగ్వాదం జరుగుతుంది. తన తండ్రి కుబేరా కాదని తెలుసుకున్న దీపా, అసలు తల్లిదండ్రుల గురించి ఇంకేమైనా తెలుసుకుందా అని సందేహిస్తుంది. దీంతో దీపానే అడిగి అన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటుంది. దాంతో ఎవరు లేని సమయంలో దీపా దగ్గరకు వెళ్లి అసలు నీ అసలు తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా అని అడుగుతుంది. తన అసలు తల్లిదండ్రులు దశరథ మరియు సుమిత్ర అని తెలిసినా కూడా అప్పటికే దీపాకు తెలిసినా కూడా బయట పడదు. జ్యోత్స్న కు బదులిస్తూ నాకు తెలియదు అని చెబుతుంది. మరి నీ పుట్టక గురించి ఏమైనా తెలుసా అని ప్రశ్నిస్తుంది. అది కూడా తెలియదని సమాధానం ఇస్తుంది. కానీ నన్ను కన్న తల్లిదండ్రులు కచ్చితంగా విసిరేసి ఉండబోరని అంటుంది. ఎవరో కావాలనే నా తల్లిదండ్రులకు దూరం చేసి ఉంటారని అంటుంది.
దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీపాకు అసలు నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతుంది. అలా నిన్ను దూరం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. దాంతో దీపా బదులిస్తూ మా నాన్న అంటే పడని వారు, శత్రువులు దూరం చేసి ఉంటారు కదా అని నా అభిప్రాయం అని చెబుతుంది. ఇక జ్యోత్స్నకు టెన్షన్ మొదలవుతుంది. ఎలాగైనా దీపా మనస్సులో ఏముందో పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక మరోవైపు శివ నారాయణ ఇంటికి ఆస్తి వాట కోసమని కాంచన పేరు మీద నోటీస్ వస్తుంది. ఆ నోటీసులు చదివిన వెంటనే శివ నారాయణ షాక్ అవుతాడు. కార్తీక్ బాబుపై మండి పడుతాడు. కాంచనకు ఈ దురుద్దేశం ఎందుకు కలిగిందని ఫైర్ అవుతాడు. మరోవైపు కార్తీక్ బాబు ఆ నోటీసుకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. ఫ్రూవ్ చేస్తానని అంటాడు. తండ్రి శ్రీధర్ పై అనుమానం వచ్చి ఫోన్ చేసి విషయం తెలుసుకుంటాడు. శ్రీధర్ ను ఇంటికి రప్పించి నిజం చెప్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 5వ తేదీ 428 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

శ్రీధర్ ను కార్తీక్ బాబు ఫోన్ చేసి ఇంటికి రప్పిస్తాడు. నువ్వు పంపించిన నోటీసులకు శివ నారాయణ గజగజ వణికిపోతున్నారు. వెంటనే ఆస్తి పంపకాలు చేసేందుకు సిద్ధమయ్యారని చెబుతాడు. ఇక నేను ఆ ఆస్తి తీసుకుంటానని చెప్పి నువ్వు మాత్రం ఇక్కడికి రావొద్దని అంటాడు. నీ కోసం ఇంత చేసిన నేను శివ నారాయణ ఇంటికి రాకపోతే ఎలాగని వెంటనే వస్తున్నానని చెబుతాడు. ఇక శ్రీధర్ శివ నారాయణ ఇంటికి దొరబాబులా వస్తాడు. దర్జాగా సోఫాలో కూర్చొంటాడు. ఆపై ఆస్తుల గురించి మాట్లాడుతాడు. కంపెనీలు, ప్రాపర్టీస్, గోల్డ్, ల్యాండ్స్, హౌజ్ లు, క్యాష్ పంపకాలపై తనే నిర్ణయం చేస్తూ ఉంటాడు. అయితే శ్రీధర్ తనంతట తాను ఓపెన్ అయ్యే వరకు ఎవరు మధ్యలో మాట్లాడొద్దని ముందుగానే కార్తీక్ బాబు అందరికీ చెబుతాడు. దాంతో అందరూ మౌనంగా ఉంటారు. శ్రీధర్ చెప్పే మాటలన్నీ వింటారు. ఇక శ్రీధర్ అన్ని పంపకాలు తన ఇష్ట ప్రకారమే జరగాలని అంటాడు. అసలు ఈ పని ఎప్పుడో జరగాల్సింది. కానీ నా కొడుకు కార్తీక్ బాబు వల్లే ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిందని అంటాడు. ఆ నోటీసులు పంపించింది నేనే అని, ఇంకెవ్వరికి సంబంధం లేదని అంటాడు. ఇప్పటికైనా కళ్లు తెరుచుకున్నారని శ్రీధర్ శివ నారాయణతో అంటాడు.
అప్పటికే శ్రీధర్ పై శివ నారాయణకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఓపిగ్గా విని విని ఒక్కసారిగా ఫైర్ అవుతాడు. అసలు నీకు ఈ ఇంట్లో నిల్చునే అర్హతే లేదు. అలాంటిది ఆస్తిలో వాటాల గురించి ఎలా మాట్లాడుతావని మండి పడుతాడు. అందుకు నీకు ఎలాంటి హక్కు లేదని అంటాడు. ఎన్ని సార్లు ఇంట్లో నుంచి గెంటేసినా, చివాట్లు పెట్టిన, తిట్టినా కొట్టినా ఇంక నువ్వు మారేది లేదా? అని ప్రశ్నిస్తాడు. అయినా నా కూతురు కాంచనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని అనుకుంటే తను స్వయంగా అడగాలి, లేదంటే నా అంతటగా నేను ఇవ్వాలి. అంతే గానీ మధ్యలో నీ పెద్దరికంతో పనులు కావని అంటాడు. నన్ను ఇలా అమానిస్తారా అని శ్రీధర్ తిరిగి ఫైర్ అవుతాడు. మిమ్మల్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. ఇక ఇప్పటికైనా అర్థమైందా పెద్దసారు, ఆ నోటీసులకు మాకు ఎలాంటి సంబంధం లేదని అని కార్తీక్ బాబు అంటాడు.
ఇక మరోవైపు శ్రీధర్ చేసిన పనిని కార్తీక్ బాబు ఇంట్లో కాంచనకు చెబుతాడు. దాంతో ఆమె ఫైర్ అవుతుంది. అసలు ఎన్ని సార్లు చెప్పినా కూడా ఈయన అసలు వినిపించుకోరా అని మండి పడుతుంది. మా నాన్న జోలికి వెళ్తే ఇంకోసారి ఊరుకునేదే లేదని అంటుంది. వెంటనే శ్రీధర్ కు ఫోన్ కలిపి ఇవ్వమని అంటుంది. గట్టిగా బుద్ధి చెబుతానని ఊగిపోతుంది. ఇక కార్తీక్ బాబు స్పందిస్తూ ఆల్రెడీ శివనారాయణ గట్టిగానే క్లాస్ పీకాడని చెబుతాడు. మరోసారి ఇలాంటి పని చేస్తే ఆయన విశ్వరూపాన్ని చూపిస్తాడని అంటాడు. ఇదిలా ఉంటే జ్యోత్స్న పెళ్లి విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుందని, ఆటంకాలు కలుగుతున్నాయని శివ నారాయణ పంతులును పిలిచి జాతకం చూపిస్తాడు. అయితే ఆ జాతకం ప్రకారం అప్పటికే ఆమె పెళ్లై పోయి ఉంటుందని అయ్యగారు చెబుతారు. దాంతో శివ నారాయణ, సుమిత్ర అందరూ షాక్ అవుతారు. ఇక దీపా కార్తీక్ బాబు కూడా పూజారి చెప్పే మాటలను వింటూ ఉంటారు. అసలు ఆ జాతం జ్యోత్స్నది అయితే కదా అని కార్తీక్ బాబు అనుకుంటాడు. అసలు ఇప్పటికే పెళ్లై పోవడం ఏంటని కంగారు పడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











