Karthika Deepam 2 August 6th: దీపా మెడలో తాళి తెంచిన జ్యోత్స్న.. గుట్టు బయట పడటంతో వంటలక్కపై దాడి
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 5వ తేదీ 428వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు ఇప్పుడిప్పుడే శివనారాయణ మనస్సును మార్చుతూ ఉంటాడు. అందరి దృష్టిలో దీపాపై ఉన్న కోపాన్ని తెలిగించాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో జ్యోత్స్న నిశ్చితార్థం గౌతమ్ తో జరగకుండా అడ్డుకొని, ఆ క్రెడిక్ దాసు, దీపాలకు వచ్చేలా చేస్తాడు. దీంతో శివ నారాయణ మనస్ఫూర్తిగా దీపాతో మాట్లాడటం మొదలు పెడుతాడు. ఇదే క్రమంలో శివ నారాయణకు ఆస్తిలో వాటా కావాలంటూ నోటీసులు అందుతాయి. అది కూడా కూతురు కాంచన పేరు మీద కోర్టు నుంచి నోటీసులు రావడంతో షాక్ అవుతాడు. ఈ పని కార్తీక్ బాబునే చేయించి ఉంటాడని తొలుత కార్తీక్ బాబుపై ఫైర్ అవుతాడు. మీ తల్లితో ఆస్తి కోసం ప్రయత్నం చేస్తున్నావా? అని ప్రశ్నిస్తాడు. మాకు అలాంటి ఉద్దేశం లేదని చెబుతాడు. ఆ నోటీస్ కు మాకు ఎలాంటి సంబంధం లేదని కార్తీక్ బాబు వివరించే ప్రయత్నం చేస్తాడు. కానీ శివ నారాయణ నమ్మబోడు. దీంతో గంటలో రుజువు చేస్తానని చెబుతాడు.
ఇక ఆస్తి కోసం ఆలోచించేది తన తండ్రి శ్రీధర్ ఒక్కడే అని అనుకొని వెంటనే ఫోన్ చేసి తెలుసుకుంటాడు. తన మాటలతో ఇంటికి వచ్చేలా చేస్తాడు. శ్రీధర్ ను ఇంటికి రప్పించి ఆయన నోటితోనే నిజం చెప్పిస్తాడు. నోటీసులు పంపించింది నేనే, అందులో కార్తీక్ బాబుకు, కాంచనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. ఇక దాంతో శ్రీధర్ పై శివ నారాయణ మండి పడుతాడు. నీకు ఎన్ని సార్లు చెప్పినా కూడా నువ్వు మారేది లేదు. ఎంత తిట్టినా, చివాట్లు పెట్టినా, అవమానించినా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావని శివనారాయణ ఫైర్ అవుతాడు. ఎప్పటికైనా ఆస్తి నా కొడుకుకే వచ్చేలా చేస్తానని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు శ్రీధర్ చేసిన రచ్చను కార్తీక్ తన తల్లి కాంచనకు చెబుతాడు. దాంతో ఆమె ఫైర్ అవుతుంది. ఇంకోసారి ఇలా చేస్తే గట్టిగా బుద్ధి చెప్పాలని అంటుంది. ఆల్రెడీ శివనారాయణ తాత అదే పని చేశారని చెబుతాడు. మరోవైపు శివ నారాయణ తమ ఇంటికి పూజారిని పిలిపిస్తాడు. జ్యోత్స్న జాతకం చూపిస్తాడు. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 6వ తేదీ 429 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

అయ్యగారు జాతకాలు చూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జ్యోత్స్న జాతకం అంటూ పుట్టినప్పుడు రాయించిన జతకాన్ని అయ్యాగారుకు ఇస్తారు. ఆ జాతకం చూసిన అయ్యగారు ఈ జాతకం ప్రకారం ఇప్పటికే ఈమెకు పెళ్లై పోయి ఉంటుందని చెబుతాడు. మళ్లీ పెళ్లి అనేది జరగదని చెబుతారు. ఇప్పటికే పెళ్లి కావడం ఏంటి అయ్యగారు అని అందరూ షాక్ అవుతారు. ఈ జాతకం జ్యోత్స్నదే అయితే ఆమెకు ఇప్పటికే పెళ్లై పోయిందని చెబుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పి షాక్ ఇస్తాడు. జాతకాలు కాకుండా చేయి చూసి కూడా చెబుతారు కదా మీరు.. అమ్మాయి గారి చేయి చూసి చెప్పండి అని అంటారు. వెంటనే జ్యోత్స్న అయ్యగారు ముందు కూర్చొని తన చేతి రేఖలను చూపిస్తుంది. అది చూసిన అయ్యగారు ఆమెకు కళ్యాణ గీత లేదని చెబుతాడు. ఇప్పటికే ఈమె అనుభవించాల్సిన దానికంటే అధిక ఐశ్వర్యం అనుభవిస్తోందని చెబుతాడు. ఇలా నిజాలు చెప్పడంతో కార్తీక్ బాబు, దీపా కచ్చితంగా చెబుతున్నారని షాక్ అవుతారు.
అంతే కాదు జ్యోత్స్నకు కష్టాలు మొదలయ్యాయని చెబుతాడు. పెళ్లి యోగం లేదని, అసలు ఈమె హస్త రేఖలను బట్టి చూస్తే ఎవరో ఈమె నుదిటి రాతను మార్చాలని ప్రయత్నించారని చెబుతాడు. దాంతో పారుజాతం షాక్ అవుతుంది. ఇక నిజాలు మొత్తం బయట పడేలా ఉన్నాయని దీపా వెంటనే అయ్యగారు దృష్టిని మరల్చాలని ప్రయత్నిస్తుంది. అయ్యగారును జ్యూస్ తాగండి అని చెప్పి గ్లాస్ ఇస్తుంది. దీపాను చూసిన అయ్యగారు నిర్గాంత పోతారు. ఆమె దివ్యమైన రూపం, అష్ట ఐశ్వర్యాలను అనుభవించాల్సిన ఆమె జీవితాన్ని చిరు నవ్వులో చూస్తాడు. వెంటనే దీపా చేతి రేఖలు చూస్తాడు. నీది మహారాణి జాతకం అని చెబుతాడు. మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారమ్మ అని ప్రశ్నిస్తాడు. దాంతో పారుజాతం అది మా ఇంటి పని మనిషి, దాని తల్లిదండ్రులు పుట్టినప్పుడే విసిరేశారు. పెంచిన తండ్రి కూడా చచ్చిపోయాడని అంటుంది. అది ఒక అనాథ అని చెబుతుంది. దాంతో అయ్యగారు ఫైర్ అవుతాడు. పారు జాతం నోరును మూయమని అంటాడు.
దీపా చేతి రేఖలను బట్టి చూస్తే ఆమె మహాజాతకురాలని అంటాడు. ఆమె తల్లిదండ్రులు బతికే ఉన్నారని చెబుతాడు. వారికి చేరువలోనే ఉన్నావని దీపాకు వివరిస్తాడు. సమయం వచ్చినప్పుడు అన్ని నిజాలు బయటికి వస్తాయని, ఇక దశరథ, సుమిత్రలు కాస్తా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వెళ్లిపోతాడు. జ్యోత్స్న మాత్రం దీపాపై రగిలిపోతుంది. ఎక్కడ దీపానే అసలు వారసురాలు అనే విషయం తెలుస్తుందోనని కంగారు పడుతుంది. దీంతో ఆ కోపాన్ని మొత్తం దీపాపై చూపిస్తుంది. అసలు నీ మెడలో కార్తీక్ బాబ కట్టిని తాళిని చూసుకుంటూ పొగరుగా ప్రవర్తిస్తున్నావని అంటుంది. ఆ తాళి నీకు ఈ ఇంటిలో ఉన్నత స్థానాన్ని ఇచ్చిందని విర్రవీగుతున్నావని, నీకు ఐడెంటిటీని తెచ్చింది కార్తీక్ బాబు కట్టిన తాళి మాత్రమే అని అంటుంది. వెంటనే తాళిని పట్టుకొని తెంచేయబోతుంది. దీపా జ్యోత్స్నను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు సుమిత్ర, దశరథ, శివ నారాయణ, కార్తీక్ బాబు అందరూ అడ్డుకుంటారు. తాళిని వదలమని అంటారు. కానీ జ్యోత్స్న అస్సలు వదలదు. గట్టిగా పట్టుకొని తెంచేస్తుంది. తాళి తెగిపోవడంతో అందరూ షాక్ అవుతారు. దీపా తన ప్రాణాలు పోయినంతగా ఫీల్ అవుతుంది. ఇక కార్తీక్ బాబు జ్యోత్స్నపై చేయి చేసుకోబోతాడు. ఇదే సమయంలో సుమిత్ర జ్యోత్స్న చెంపలు వాయిస్తుంది. ఇక దీపా కుప్పకూలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచింది.


Click it and Unblock the Notifications











