Karthika Deepam 2 August 7th: జ్యోత్స్న చెంపలు వాయించిన శివ నారాయణ.. రగిలిపోయిన కార్తీక్ బాబు
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 6వ తేదీ 429వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అయ్యగారుతో జ్యోత్స్న జాతకాన్ని చూపిస్తుంటారు శివ నారాయణ. కుటుంబ సభ్యులందరూ కూడా జ్యోత్స్న జాతకం జ్యోతిష్యుడు ఎలాంటి వివరాలు చెబుతాడోనని అంతా వేచి చూస్తూ ఉంటారు. ఇక అక్కడే కార్తీక్ బాబు, దీపా కూడా ఉంటారు. జ్యోతిష్యుడు ఎలాంటి వివరాలు చెబుతారోనని ఎదురు చూస్తూ ఉంటారు. జాతకం ప్రకారం జ్యోత్స్నకు ఇప్పటికే పెళ్లై పోయి ఉంటుందని చెబుతాడు. ఆ తర్వాత చేతి రాతలను కూడా చూసి అసలు ఈమెకు పెళ్లి గీతనే లేదని చెబుతాడు.దాంతో అందరూ షాక్ అవుతారు. అసలు ఇప్పటికే ఈమె అనుభవించాల్సిన దాని కంటే ఎక్కువనే అనుభవిస్తోందని చెబుతాడు. ఇక జ్యోతిష్యుడు చెప్పిన మాటలకు జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంత సరిగ్గా ఎలా చెబుతున్నారని ఆశ్చర్య పోతుంది.
ఆ వెంటనే జ్యోతిష్యుడు దీపాను చూస్తాడు. ఆమెను చూసిన వెంటనే దగ్గరకు పిలిచి నీ చేయి చూపించు అమ్మ అని అడుగుతాడు. దాంతో దీపా వెంటనే తన చేతి రేఖలను జ్యోతిష్యుడుకు చూపిస్తుంది. ఆమె హస్త రేఖలను చూసిన జ్యోతిష్యుడు షాక్ అవుతాడు. ఈమెది మహారాణి జాతకం. త్వరలోనే ఈమె తల్లిదండ్రులను కలుసుకోబోతోంది. తన తండ్రికి అతి సమీపంలో ఉందని చెబుతాడు. అతి దగ్గర్లోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి వెళ్లిపోతాడు. ఇక దీపా గురించి జ్యోతిష్యుడు మంచి మాటలు చెప్పడాన్ని జ్యోత్స్న జీర్ణించుకోలేక పోతుంది. వెంటనే దీపాతో గొడవ పడుతుంది. నీ మెడలో కార్తీక్ బాబు కట్టిన తాళిని చూసుకునే నువ్వు ఎగురుతున్నావని ఆ తాళిని తెంచేయ బోతుంది. అందరూ అడ్డుకున్నా కూడా వినదు. చివరికి తాళి తెంచుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 7వ తేదీ 430 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపా మెడలోని తాళిని జ్యోత్స్న తెంపేస్తుంది. దరశథ, శివ నారాయణ, కార్తీక్ బాబు, సుమిత్ర లు ఎంత ఆపే ప్రయత్నం చేసినా వినకుండా దీపా మెడలోని తాళిని తెంపేస్తుంది. దాంతో దీపా కుప్పకూలి పోతుంది. తన మాంగళ్యం చెరిగిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రాణం ఉన్న శవంలా మారిపోతుంది. ఇక జ్యోత్స్న చేసిన పనికి సుమిత్ర లాగి పెట్టి కొడుతుంది. అసలు దీపా మెడలోని తాళిని తెంచాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందని జ్యోత్స్న చెంపలు వాయిస్తుంది సుమిత్ర. కానీ జ్యోత్స్న నేను కావాలని తెంచలేదు. పట్టుకున్నాను. హడావుడిలో తెగిపోయింది. దీపా మెడలోని తాళి తెగడానికి కారణం నేను కాదని అంటుంది. ఇక దీపా బాధపడుతూ ఉంటే కార్తీక్ బాబు ఓదార్చుతూ తిరిగి ఇంటికి తీసుకెళ్తాడు. ఇక జ్యోత్స్నపై శివనారాయణ, సుమిత్ర నిప్పులు చెరుగుతారు. ఎవరి మెడలోనైనా మాంగళ్యం తెంచడం ఏమాత్రం మంచిది కాదని జ్యోత్స్నకు గడ్డి పెడుతుంది.
అయినా జ్యోత్స్న మాత్రం అస్సలు నా తప్పేమీ లేదని, నేను కావాలని అస్సలు తెంచలేదని అంటుంది. ఇంకా అలానే మాట్లాడితే నీ చెంపలు వాయిస్తానని హెచ్చరిస్తుంది. అసలే ఇప్పటికే ఈ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరగడం లేదని బాధ పడుతున్నాం. నువ్వు ఇలాంటి పనులు చేయడం వల్లే అన్ని అరిష్టాలు జరుగుతున్నాయని అంటుంది. కావాలని చేయలేదు కదా అని పారిజాతం జ్యోత్స్నను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దాంతో సుమిత్ర మరింత ఫైర్ అవుతుంది. మన మెడలోని తాళిని ఎవరైనా తెంచితే మీరు ఊరుకుంటారా అత్తయ్య అని తిరిగి ప్రశ్నిస్తుంది. దాంతో పారుజాతం మౌనంగా ఉంటుంది. ఇక జ్యోత్స్ను దీపాకు క్షమాపణలు చెప్పాలని సుమిత్ర డిమాండ్ చేస్తుంది. కానీ జ్యోత్స్న మాత్రం నేను అస్సలు క్షమాపణలు చెప్పేది లేదని మొండికేస్తుంది. అవసరమైతే మీ అందరి కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెబుతాను కానీ దీపాకు మాత్రం సారీ చెప్పలేనని అంటుంది.
సరే నువ్వు రాకపోతే నేనే స్వయంగా వెళ్లి దీపాను క్షమించమని కోరుతాను అని అంటుంది సుమిత్ర. సుమిత్ర వెంటనే దశరథ కూడా నేనూ వస్తానని అంటాడు. మరోవైపు శివ నారాయణ కూడా వస్తానని చెబుతాడు. చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకోవాలని అంటాడు. ఇక అందరూ కలిసి కార్తీక్ బాబు ఇంటికి బయల్దేరుతారు. ఇక కార్తీక్ బాబు, దీపాలు అప్పటికే కాంచనకు జరిగిన విషయాన్ని మొత్తం వివరిస్తారు. జ్యోత్స్న దీపా మెడలోని తాళిని తెంచడం ఏంటని షాక్ అవుతుంది. మరో మంచి ముహూర్తం చూసి కార్తీక్ బాబుతో దీపా మెడలో మూడుముళ్లు వేయించాలని నిర్ణయింస్తుంది. ఇక ఆ జ్యోత్స్నను మాత్రం క్షమించే ప్రసక్తే లేదని అంటుంది. మా అన్న దశరథ, వదిన సుమిత్రల కడుపులో పుట్టాల్సింది జ్యోత్స్న కాదు దీపా అని అంటుంది. ఆ జ్యోత్స్న చేసిన పనికి మీరు మళ్లీ ఆ ఇంటికి తిరిగి వెళ్లడాన్ని నేను ఒప్పుకోను అటుంది. ఇదే సమయంలో శివనారాయణ, దశరథ, సుమిత్ర వస్తారు. జరిగిన దానికి క్షమాపణలు కోరుతారు.
మా ఇంటి అమ్మాయి తప్పు చేసినందుకు మేం బాధపడుతున్నామని అంటారు. క్షమాపణలు కోరుతున్నామంటారు. కాంచన దీపాను పిలిపించి నువ్వు క్షమిస్తావా? అని అడిగితే క్షమిస్తానని అంటుంది. గాయం నీకు తగిలింది కాబట్టి క్షమిస్తావు, మరి నీ కూతురికి తగిలితే అని కాంచన మరోసారి ప్రశ్నిస్తుంది. దాంతో క్షమించనని దీపా చెబుతుంది. కానీ కార్తీక్ బాబు ఉత్త క్షమాపణలు సరిపోవని అంటాడు. నాదొక కండీషన్ ఉందని చెబుతాడు. అందుకు మీరందరూ సరేనా అని అడుగుతాడు. దాంతో శివ నారాయణ మాట ఇచ్చి సరే అని అంటాడు. ఏమని అడిగినా కూడా ఇవ్వాలని అంటాడు. మళ్లీ మాట మార్చితే మాత్రం సహించేది లేదని అంటాడు. ఇక శివ నారాయణ కూడా ఒక్క సారి మాట ఇస్తే తప్పే రక్తం మాది కాదని గట్టగా చెబుతాడు. అదేదో ఇప్పుడే చెప్పొచ్చు కదా అని కాంచన, దీపా అడిగితే.. లేదు మీ ఇంటికి వచ్చే చెబుతానని అంటాడు. అక్కడే అన్నింటికి ముహూర్తం ఫిక్స్ చేశానని చెబుతాడు. అలాగే నీ ఇష్టం అని చెప్పి తిరిగి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications










