Karthika Deepam 2 August 8th: బిగ్ షాక్ ఇచ్చిన కార్తీక్ బాబు.. జ్యోత్స్న తాళి తెంచడంతో దీపాకు రెండో పెళ్లి

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 7వ తేదీ 430వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న దీపా మెడలోని తాళిని తెంచుతుంది. దీంతో క్షమాపణలు చెప్పాలని సుమిత్ర అంటుంది. కానీ అందుకు జ్యోత్స్న అస్సలు ఒప్పుకోదు. మరే పనైనా చేస్తాను కానీ, ఇలా దీపాకు క్షమాపణలు చెప్పడం నా వల్ల అస్సలు కాదని బదులు ఇస్తుంది. వెంటనే సుమిత్ర ఫైర్ అవుతుంది. నువ్వు రాకపోతే ఇక నేనే వెళ్లి స్వయంగా దీపాతో క్షమించమని అడుగుతానని చెబుతుంది. దశరథ కూడా సుమిత్ర వెంటనే నేనూ వస్తానని అంటాడు. అలాగే శివ నారాయణ కూడా క్షమాపణలు చెప్పేందుకు వస్తానని అంటాడు. దాంతో అందరూ కలిసి కార్తీక్ బాబు ఇంటికి వెళ్తారు. ఇక జ్యోత్స్న మాత్రం తన మాట మీదనే ఉంటుంది. దీపాకు క్షమాపణలు చెప్పడం అంటూ అస్సలు జరగని పని అంటుంది. ఇంకెంత పెద్ద గొడవలు జరుగుతాయో అని ఓవైపు పారుజాతం కంగారు పడుతూ ఉంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం ఏమీ కాదని బదులిస్తుంది.

ఇక జ్యోత్స్న దీపా తాళిని తెంచిన విషయాన్ని కార్తీక్ బాబు, దీపా ఇంట్లో ఉన్న కాంచన, అనసూయకు చెబుతారు. దాంతో వాళ్లు షాక్ అవుతారు. కన్నీళ్లు పెట్టుకుంటారు. కాంచన మాత్రం తన మేన కోడలు అనుకుంటున్న జ్యోత్స్నపై మండి పడుతుంది. అలాగే ఆ కుటుంబ సభ్యులపైనా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసలు జ్యోత్స్నకు ఏం పోయే కాలం వచ్చింది. ఇలా ఎందుకు చేస్తుంది. నేను మాత్రం జ్యోత్స్నను అస్సలు వదిలి పెట్టే సమస్యే లేదు. గట్టిగా బుద్ధి చెబుతాను. మంచి మనస్సుకన్న మా అమ్మనాన్నల కడుపులో దీపా కూతురుగా పుట్టాల్సి ఉంటుంది. అసలు దీపానే నా మేన కోడలు. జ్యోత్స్న చేసిన పనికి మీరు మళ్లీ ఆ ఇంటికి వెళ్లడానికి నేను అస్సలు ఒప్పుకోను అని కాంచన అంటుంది. ఇదే సమయంలో శివ నారాయణ, దరశథ, సుమిత్రలు ఇంటికి వస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 8వ తేదీ 431 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 431 August 8th 2025

జ్యోత్స్న చేసిన పనికి మేం క్షమాపణలు చెప్పడానికి వచ్చామని చెబుతారు. దాంతో కాంచన మరింతగా కోసం తెచ్చుకుంటుంది. అసలు క్షమాపణలు చెప్పడానికి జ్యోత్స్న వచ్చిందా? అని కాంచన ప్రశ్నిస్తుంది. మీరు క్షమాపణలు చెప్పడానికి తప్పు చేసింది మీరు కాదు కదా అని ప్రశ్నిస్తుంది. ఇక జ్యోత్స్నతోనే క్షమాపణలు చెప్పించాలని అంటుంది. ఇక ఏదేమైనా తప్పు జరిగింది మా అమ్మాయి తరుఫున కాబట్టి క్షమాపణలు చెబుతున్నామని అంటారు. దాంతో వెంటనే కాంచన దీపాను పిలిచి వీళ్లు నీకు క్షమాపణలు చెబుతున్నారు. అంగీకరిస్తావా? అని అడుగుతుంది. దాంతో అంగీకరిస్తున్నానని అంటుంది. వెంటనే కాంచన మరో ప్రశ్న వేస్తుంది. మరీ నీ కూతురు శౌర్యను గాయపరిచి క్షమాపణలు చెబితే ఊరుకుంటావా అని అడుగుతుంది. దాంతో అస్సలు ఊరుకోనని చెబుతుంది. ఇక ఇదే సమయంలో కార్తీక్ బాబు వచ్చి క్షమించడం అస్సలు కుదరదని అంటాడు. అందుకు బదులుగా మీరు మరో పని చేయాలని అంటాడు.నేనొక కండీషన్ పెడుతున్నానని అందుకు మీరు అందరూ ఒప్పుకుంటే క్షమించడం వీలు పడుతుందని అంటాడు కార్తీక్ బాబు. దాంతో శివ నారాయణ ఏంటా కండీషన్ అని ప్రశ్నిస్తాడు. మీ ఇంట్లో వాళ్లందరూ ఒప్పుకుంటారా అని అంటాడు. అవును ఒప్పుకుంటానమని చెబుతారు. మా ఇంట్లో అందరిది ఒకే మాట ఉంటుందని సుమిత్ర బదులు ఇస్తుంది.

అయితే రేపు మీ ఇంట్లో ఆ కండీషన్ ఏంటో చెబుతానని అంటుంది. ఇక్కడే ఇప్పుడే చెబితే అయిపోతుంది కదా అని అందరూ అడుగుతారు. కానీ బాలు మాత్రం లేదు అక్కడే చెప్పాలని అంటాడు. దాంతో వాళ్లు తిరిగి వెళ్లిపోతారు. అప్పటికే ఇంట్లో పారు, జ్యోత్స్న అసలు కార్తీక్ బాబు ఇంట్లో ఏం జరుగుతుందోనని కంగారు పడుతూ ఉంటారు. ఇదే సమయంలో శివ నారాయణ, దశరథ, సుమిత్రలు తిరిగి వస్తారు. జ్యోత్స్న వల్ల అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుందని, మాటలు పడాల్సి వస్తోందని అంటారు. కార్తీక్ బాబు ఒక కండీషన్ పెట్టాడని అది కూడా రేపు చెబుతానని అన్నాడని అంటారు. వాడు ఏది అడిగినా ఇవ్వాల్సిందే అని అంటారు. కార్తీక్ బాబు కండీషన్ అనడంతో పారుజాతం మాత్రం వెంటనే స్పందిస్తూ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని అడుగుతాడేమో అని అంటుంది. లేదంటే ఆస్తిలో వాటా అడుగుతాడు కావచ్చని సందేహిస్తుంది. పారుజాతం మాటలకు దశరథ, సుమిత్రలు ఫైర్ అవుతారు. అగ్రిమెంట్ కోసమైతే ఎప్పుడో అడిగే వాడు, ఇక ఆస్తి కోసమే అయితే శ్రీధర్ చేసిన పనికి తోడై ఆస్తిని దక్కించుకునే వాడు. కానీ ఆ అవకాశాన్ని కూడా తీసుకోలేదు. ఇక ఏం అడుగుతాడు వేచి చూడాల్సిందేనని అంటారు.

ఉదయం కార్తీక్ బాబు, దీపా ఇద్దరు తిరిగి వస్తారు. ఇక రాగానే కార్తీక్ బాబును నీ కండీషన్ ఏంటని శివ నారాయణ, సుమిత్రలు అడుగుతారు. ఏ ఆడదానికైనా మెడలో తాళిని భర్త చనిపోయాక తీస్తారు. కానీ భార్య దీపా మెడలో తాళి కావాలని తెంచారు. కాబట్టి ఎక్కడైతే నా భార్య తాళిని తెంచారో అక్కడే పందిరి వేసి బంధు, మిత్రుల మధ్య ఘనంగా మా పెళ్లిని మళ్లీ జరిపించాలని కండీషన్ పెడుతాడు. అంతే కాదు ఆ పెళ్లిలో దీపాకు తల్లిదండ్రులు మీరే కావాలని దశరథ, సుమిత్రను డిమాండ్ చేస్తాడు. అందుకు అస్సలు కురదని సుమిత్ర అంటుంది. లేదంటే వదిలేయండి అని కార్తీక్ బాబు ఫైర్ అవుతాడు. మీకు ఇష్టం లేకపోతే ఇక వదిలేయండి, దీపాకు జరిగిన అవమానం గురించి మళ్లీ మాట్లాడకండి అని అంటాడు. దాంతో శివ నారాయణ, దశరథ, సుమిత్రలు షాక్ అవుతారు. మరోవైపు జ్యోత్స్న కార్తీక్ బాబుకు దీపానే అసలు కూతురు అనే సంగతి తెలిసిపోయిందని పసి గడుతుంది. ఈ సందర్భంగా కార్తీక్ బాబు కండీషన్ కు దశరథ, సుమిత్ర ఒప్పుకున్నారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X