Karthika Deepam 2 August 9th: కార్తీక్ బాబు కండీషన్ కు తలొగ్గిన శివ నారాయణ.. దీపాపై రగిలిపోయిన జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 8వ తేదీ 431వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపా మెడలోని తాళి తెంచినందకు కార్తీక్ బాబు కండీషన్ పెడుతాడు. అయితే రేపు మీ ఇంట్లోనే ఆ కండీషన్ గురించి అందరికీ చెబుతానని కార్తీక్ బాబు అంటాడు. ఇప్పుడే చెబితే అందరికీ తెలిసి పోతుంది కదా అని అంటారు. కానీ కార్తీక్ బాబు మాత్రం రేపే మీ ఇంట్లోనే చెబుతానని అంటాడు. దాంతో శివ నారాయణ, దశరథ, సుమిత్ర తిరిగి వెళ్లిపోతారు. మరోవైపు పారు, జ్యోత్స్న కార్తీక్ బాబు ఇంట్లో అసలు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతారు. కార్తీక్ బాబు ఏం మాయ చేస్తున్నాడో అని, తమపై ఎలాంటి మాటలు చెబుతున్నాడోనని అనుకుంటారు. ఇదే సమయంలో శివ నారాయణ, దశరథ, సుమిత్రలు ఇంటికి తిరిగి వస్తారు. వెంటనే అక్కడ ఏం జరిగిందని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక జ్యోత్స్న వల్ల మేం అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చిందని, మాటలు పడాల్సి వచ్చిందని అంటారు.

మీరు ఎవరి ముందు తలిదించుకొని మాటలు పడాల్సిన అవసరం లేదని జ్యోత్స్న అంటుంది. కానీ ఇలాంటి సయమంలో పడాలి. తప్పు మన సైడ్ ఉన్నప్పుడు అవతలి వాళ్లు ఏమన్నా పడాలి. ఇక బాధలో అనసూయ, కాంచన ఓ మాట అంటే తీసుకోక తప్పదు అని శివ నారాయణ అంటాడు. ఇక ఆ తర్వాత కార్తీక్ బాబు దీపాలు తిరిగి ఇంటికి వస్తారు. ఎప్పటి లాగే తమ పనులకు వెళ్తూ వెంటారు. కానీ శివ నారాయణ, దశరథ, సుమిత్రలు వారిని అడ్డుకుంటారు. ముందుగా నువ్వేందో కండీషన్ గురించి చెబుతానని అన్నావ్ కదా ఆ కండీషన్ గురించి చెప్పమని అంటారు. ముందుగా అది చెప్పి మిగితా పనులకు వెళ్లమని అంటారు. దాంతో కార్తీక్ బాబు స్పందిస్తూ దీపా మెడలోని తాళిని జ్యోత్స్న ఇక్కడే తెంచింది కాబట్టి ఇక్కడే పందిరి వేయించి మాకు మళ్లీ పెళ్లి చేయించాలని, తల్లిదండ్రుల స్థానంలో దశరథ, సుమిత్ర ఉండాలని కోరుతారు. దానికి ఎలాంటి సమాధానం వచ్చిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 9వ తేదీ 432 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 432 August 9th 2025

కార్తీక్ బాబు తన కండీషన్ చెబుతాడు. దీపాకు తనకు మళ్లీ పెళ్లి చేయాలని అది కూడా ఈ ఇంట్లో ఇక్కడే బంధూమిత్రులు, ఆకాశమంత పందిరి వేసి జరిపించాలని డిమాండ్ చేస్తాడు. దీపా తల్లిదండ్రులను ఎలాగూ తిరిగి తీసుకు రాలేరు కాబట్టి, దీపాకు తల్లి స్థానంలో సుమిత్ర, తండ్రి స్థానంలో దశరథ నిల్చోవాలని, నిండు మనస్సుతో పెళ్లి జరిపించాలని కండీషన్ పెడుతాడు. కార్తీక్ బాబు పెట్టిన కండీషన్ కు అందరూ షాక్ అవుతారు. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటారు. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. మా పనులు మేం చేసుకుంటామని అంటాడు కార్తీక్ బాబు. కానీ సుమిత్ర మాత్రం అస్సలు కుదరదని చెబుతుంది. అసలు దీపా పక్కన కూడా నిల్చోవడానికి ఇబ్బంది పడే నేను దీపాకు తల్లి స్థానంలో ఉండి పెళ్లి జరిపించడం ఎలా జరుగుతుందని అనుకుంటున్నావని ప్రశ్నిస్తుంది సుమిత్ర. ఎవ్వరూ ఎలా డిసైడ్ చేసినా నేను మాత్రం దీపాకు తల్లిగా ఉండేందుకు అస్సలు ఒప్పుకోను. ఇదే నా నిర్ణయం అని చెప్పి వెళ్లిపోతుంది.

సుమిత్ర వెంటనే దశరథ కూడా వెళ్తాడు. సుమిత్రను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. దీపాకు తల్లిగా ఉండి పెళ్లి జరిపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ సుమిత్ర మాత్రం అస్సలు ఒప్పుకోనంటే ఒప్పుకోనని అంటుంది. దశరథ ఎంత చెప్పినా వినదు. ఇక చివరికి మామ శివ నారాయణ మాటను కూడా లెక్క చేయదు. అది జరగని పని అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోతుంది. ఇక సుమిత్రను ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం చేస్తానని దశరథ తండ్రి శివనారాయణతో అంటాడు. నా మాటను మీరు గౌరవిస్తారని నాకు తెలుసు. కానీ దానికి సమయం పడుతుందని అంటాడు. ఇక కార్తీక్ బాబు శివ నారాయణను కండీషన్ విషయంలో మీ తుది నిర్ణయం ఏంటని ప్రశ్నిస్తాడు. దాంతో ఇప్పుడే కదా నువ్వు కండీషన్ గురించి చెప్పించింది. మాకు కాస్తా ఆలోచించుకోవడానికి సమయం కావాలి. ఆ తర్వాత ఏంటనేది వివరిస్తామని అంటాడు.

మరోవైపు కార్తీక్ బాబు ఇచ్చిన షాక్ కు జ్యోత్స్న బుర్ర గిర్రుమని తిరుగుతుంది. నేనేం ఏమైంతో ఊహించానో బావ అదే అడిగాడు అని జ్యోత్స్న తన మనస్సులో అనుకుంటుంది. అయితే దీపా గురించి బావకు ఏదో నిజం కచ్చితంగా తెలిసి ఉంటుంది. అందుకే తల్లిదండ్రులుగా దశరథ, సుమిత్రలను ఉండాలని, గ్రాండ్ గా మళ్లీ పెళ్లి చేయించాలని అడుగుతున్నాడని సందేహిస్తుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంటుందని అంటుంది. ఇక కార్తీక్ బాబు పెట్టిన కండీషన్ కు శివ నారాయణ ఒప్పుకుంటారా? లేదా? అంటూ కంగారు పడుతుంది. ఇదే విషయమై పారుజాతంతో చర్చిస్తుంది. వెంటనే పారుతో ఈ పెళ్లి జరగకుండా చూడాలని అంటుంది.

దాంతో పారు ఇప్పుడు పరిస్థితి మన చేతిలో ఏం లేదు. నీ వల్ల ఎన్ని సమస్యల్లో ఇరుక్కున్నానో నాకు తెలుసు. కార్తీక్ బాబు సామాన్యుడు కాదు. ఎలాగైనా అందరి చేత ఒప్పిస్తాడు. ఇక శివ నారాయణే మాట ఇచ్చాడు కాబట్టి. కచ్చితంగా చేసి తీరుతాడు. కానీ అమ్మ సుమిత్ర ఒప్పుకోదు కదా అని జ్యోత్స్న అంటుంది. ఏదేమైనా ఈ పెళ్లి జరగకుండా చూడాలని పారు అంటుంది. కార్తీక్ బాబును ఎలాగూ ఏం చేయలేం కాబట్టి దీపా సైడ్ నుంచి ఏదైనా అవకాశం ఉందో ఆలోచించు అని జ్యోత్స్న కు సలహానిస్తుంది. ఇక దీపా, కార్తీక్ బాబుతో ఒక మాట్లాడాలని అనుకుంటుంది. దీపా కార్తీక్ బాబుకు కాఫీ ఇవ్వబోతుంటే అడ్డుకుంటారు. దీపాతో మళ్లి పెళ్లి, పైగా దరశథ, సుమిత్రలను తల్లిదండ్రులుగా పెట్టడానికి కారణం ఏంటో తెలుసుకోచ్చా? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. అందుకు కార్తీక్ బాబు ఎలాంటి సమాధానం ఇచ్చారనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X