Karthika Deepam 2 August 11th: దీపా ముందు శివ నారాయణ కన్నీళ్లు.. జ్యోత్స్న కు బిగ్ షాక్

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 9వ తేదీ 432వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపాతో మరోసారి పెళ్లి అంటూ కార్తీక్ బాబు ఇచ్చిన ట్విస్ట్ కు జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆమె బుర్ర గిర్రుమని తిరుగుతుంది. అసలు బావ ఇలా ఎందుకు అడిగాడు అని తనలో తాను ప్రశ్నించుకుంటూ ఉంటుంది. అందుకు కారణం కార్తీక్ కు నిజం తెలిసి పోయిందా అని సందేహిస్తూ ఉంటుంది. ఈ విషయం వెంటనే తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక శివ నారాయణ, దరశథ, సుమిత్రలు మాత్రం కార్తీక్ అడిగిన దానికి బదులివ్వడానికి కాస్తా సమయం కావాలని అంటారు. అయితే కార్తీక్ బాబు మాత్రం అందరికీ షాక్ ఇచ్చేలా కండీషన్ పెడుతారు.

ఏ ఇంట్లోనైతే తన భార్య దీపా తాళిని తెంచారో అదే ఇంటో ఘనంగా పందిరి వేసి మళ్లీ పెళ్లి చేయాలని కోరుతాడు. అంతే కాదు దీపాకు తల్లిదండ్రుల స్థానంలో సుమిత్ర, దశరథలు ఉండాలని కండీషన్ పెడుతాడు. అలాగే చెప్పండి జ్యోత్స్న చేసిన తప్పును క్షమిస్తాం. లేదంటే ఆ తప్పు ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని అంటాడు. ఇక తమ నిర్ణయం చెబుతామని శివ నారాయణ అంటాడు. కానీ సుమిత్ర మాత్రం ఇది అస్సలు జరగదని అంటుంది. నేను ద్వేషించే వ్యక్తికి తల్లి స్థానంలో ఉండటం ఏంటని ప్రశ్నిస్తుంది. నేను ఒప్పుకోనని తన నిర్ణయాన్ని అందరి ముందు చెప్పి వెళ్తుంది. ఇక ఆ తర్వాత శివ నారాయణ, కార్తీక్ బాబులు ఎలా స్పందించారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 11వ తేదీ 433 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 433 August 11th 2025

కార్తీక్ బాబుకు దీపా గురించి నిజం తెలిసి పోయి ఉంటుందని జ్యోత్స్న డౌట్ పడుుతంది. అందుకే ఇంట్లో మళ్లీ పెళ్లి చేయాలని కండీషన్ పెట్టారని అనుకుంటుంది. వెంటనే ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని అనుకుంటుంది. ఇక బయట ఉన్న దీపా కార్తీక్ బాబు దగ్గరకు వెళ్లి కొన్ని ప్రశ్నలు వేస్తుంది. అవును బావ ఇప్పుడు మీరు ఈ ఇంట్లో పని మనుషులుగా చేస్తున్నారు కాదా.. ఇలాగే ఇంకెక్కడ పని మనుషులుగా చేసినా వారి చేయి తగిలి తాళి తెగితే వాళ్లనే పెళ్లి చేయమని అడుగుతారా? అని ప్రశ్నిస్తుంది. ఆ ఇంటి యజమానులనే దీపాకు తల్లిదండ్రులుగా ఉండి పెళ్లి చేయమని అడుగుతారా? ఈ ఇంట్లో మాత్రం ఎందుకు ప్రత్యేకంగా దీపాకు తల్లిదండ్రులుగా సుమిత్ర, దశరథలను ఉండమని అడిగావని ప్రశ్నిస్తుంది. దాంతో కార్తీక్ బాబు మరింత ఆసక్తికరంగా బదులిస్తాడు. చేతి తాకి తాళి తెగడం వేరేలా ఉంటుంది. కావాలని తాళి తెంచడం మరోలా ఉంటుంది. ఈ రెండికి తేడా మాకు తెలిసింది.

అలాగే నువ్వు కూడా ఈ ఇంట్లో పని చేసే ఏ పని మనిషి తాళి బొట్టునైనా దీపా మెడలో నుంచి ఎలా తెంపేశావో అలాగే తెంపేస్తావా? అని కార్తీక్ బాబు తిరిగి ప్రశ్నిస్తాడు. దాంతో జ్యోత్స్న నేను అలా ఎందుకు తెంచుతానని అంటుంది. పక్కనే ఉన్న పారుజాతం దీపా మెడలో ఉన్న తాళి బొట్టు కథ వేరే కదా అని అంటుంది. ఆ అందుకే ఈ ఇంట్లో మళ్లీ పెళ్లి చేయాలని, అది కూడా దరశరథ, సుమిత్రలను తల్లిదండ్రులుగా ఉండాలని కండీషన్ పెట్టానని కార్తీక్ బాబు అంటాడు. ఇక ఆ తర్వాత దీపా ఇంట్లోకి వెళ్లిపోతుంది. శివ నారాయణ దీపాతో మాట్లాడుతాడు. తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. తన తల్లిని ఎంతో గొప్పగా చూసుకోవాలని అనుకున్నానని, కానీ తను డబ్బు సంపాదించే సమయానికి తల్లి లేదని దీపాతో చెబుతాడు. కానీ తన కూతురు కాంచన పుట్టి ఆ లోటు తీర్చిందని, కాంచనపై నాకు ఎనలేని ప్రేమ ఉందని చెప్పుకుంటాడు. కానీ ఇప్పుడు బంధాలు లేకుండా పోయాయని, ప్రేమలు కనుమరుగు అయ్యాయని అంటాడు.

ఇదే సమయంలో కార్తీక్ బాబు వచ్చి శివనారాయణను మాటలకు బదులిస్తాడు. బంధాలు లేకపోవడం అంటూ ఏమీ లేదు. వాటిని మనం చూడగలగాలి. మనం కోరుకున్నంత దూరంలోనే బంధాలు, ప్రేమలు దాగి ఉన్నాయని అంటాడు. కార్తీక్ బాబు సలహాలిస్తుండటంతో శివ నారాయణకు మండిపోతుంది. మీ సలహాలు నాకేమీ వద్దని అంటాడు. అయితే మేం అడిగిన దానికి సమాధానం ఇవ్వండి అని కార్తీక్ బాబు శివనారాయణను అడుగుతాడు. దాంతో శివ నారాయణ సమాధానం ఇవ్వబోతుంటాడు. ఇదే సమయంలో పారుజాతం కార్తీక్ బాబుపై మండి పడుతుంది. అసలు పనిమనిషుల పెళ్లిళ్లు మా ఇంట్లో ఎందుకు చేస్తామురా అని గొంతెత్తుతుంది. ఇక వెంటనే సుమిత్ర సుమిత్ర అంటూ పిలుస్తుంది. పైన గదిలో ఉన్న సుమిత్ర కిందికి వస్తుంది. ఇక ఇప్పుడు మళ్లీ అడగమని పారుజాతం కార్తీక్ బాబును అంటుంది. ఇక కార్తీక్ బాబు మా పెళ్లి మళ్లీ జరిపిస్తారా? అని అడిగాం కదా దానికి ఇంకా సమాధానం రాలేదని అంటాడు.

దాంతో పారుజాతం కార్తీక్ బాబుపై రెచ్చిపోతుంది. ఈ ఇంటి యజమానిగా నేను చెబుతున్నాను. ఈ ఇంట్లో మీ పెళ్లి జరగదని అంటుంది. నా మాటే అందరి మాట అని అంటుంది. ఇక కార్తీక్ బాబు నువ్వు ఆగు పారు, నేను నిన్ను అడగలేదు అని అంటాడు. నువ్వు అడిగినా అడకపోయినా ఇదే మా అందరి నిర్ణయం అని అంటుంది. మరోవైపు శివ నారాయణ, సుమిత్ర కూడా మౌనంగా ఉండటంతో కార్తీక్ బాబు, దీపా సరే వెళ్లిపోదామని అనుకుంటారు. బయల్దేరే సమయంలో శివ నారాయణ మీ పెళ్లి ఈ ఇంట్లో జరుగుతుందని అంటాడు. పారుకు నిర్ణయాలు చేసే అధికారం లేదని అంటాడు. ఇక సుమిత్ర తనకు ఇష్టం లేదన్నట్టుగా పైన గదిలోకి వెళ్లిపోతుంది. శివ నారాయణ మాట ఇవ్వడంతో కార్తీక్ బాబు, దీపా, దశరథ సంతోషిస్తారు. ఇదే విషయాన్ని కార్తీక్ బాబు తల్లి కాంచనకు కూడా చెబుతాడు. దాంతో కాంచన కూడా సంతోషిస్తుంది. ఇదే సమయంలో బాలుకు ఒక ఫోన్ వస్తుంది. బయటికి వెళ్లి మాట్లాడి వస్తానని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X