Karthika Deepam 2 August 12th: కార్తీక్ బాబును భయపెట్టిన జ్యోత్స్న.. దీపాకు తెలియకుండా
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 10వ తేదీ 433వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కూతురు కాంచనను తలుచుకొని శివనారాయణ ఎమోషనల్ అవుతాడు. ఇప్పుడు నాకు ఆ బంధం లేకపోయిందని బాధ పడుతాడు. అందుకు కార్తీక్ బాబు బదులిస్తాడు. బంధాలు లేకపోవడం ఏమీ లేదని అంటాడు. మనం కోరుకుంటే వెంటనే ఆ బంధాలు, ప్రేమలు అన్నీ తిరిగి వస్తాయని అంటాడు. కానీ వాటిని మనం కోరుకోవాలని, మనం కోరుకున్న దూరంలో అన్నీ ఉంటాయని వివరిస్తాడు. కానీ శివ నారాయణ మాత్రం కార్తీక్ బాబు ఓదార్పును పెద్దగా లెక్క చేయడు. మీ సలహాలు మాకేం అవసరం లేదని అంటాడు. దాంతో కార్తీక్ బాబు వెంటనే మరి మా లెక్కలు తేల్చండి అని అంటాడు. దీపాతో ఈ ఇంట్లో పెళ్లికి ఒప్పుకుంటారా? లేదా? అని ప్రశ్నిస్తాడు. ఇక శివ నారాయణ జరుగుతుందని కార్తీక్ బాబుకు మాట ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 12వ తేదీ 434 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?
మళ్లీ దీపాకు నాకు మీ ఇంట్లోనే పెళ్లి చేయాలని కండీషన్ కు శివ నారాయణ ఒప్పుకుంటాడు. కానీ సుమిత్ర మాత్రం కార్తీక్ అడిగిన దానికి ఒప్పుకోదు. పీకల దాకా కోపం ఉన్న దీపాకు నేను తల్లిగా ఉండి పెళ్లి ఎలా జరిపిస్తానని అంటుంది. తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెబుతుంది. కానీ శివ నారాయణ మాట ఇవ్వడంతో ఎలాగైనా చేస్తారని కార్తీక్ బాబు భరోసాతో వెళ్లిపోతారు. తమ పెళ్లితో రెండు కుటుంబాలను ఒక్కటి చేసే అవకాశం వస్తుందని అంటాడు. ఇక ఇదే విషయాన్ని కార్తీక్ బాబు దీపా ఇంటికి వెళ్లి కాంచనకు కూడా చెబుతారు. దాంతో కాంచన ఫుల్ ఖుషి అవుతుంది. పైగా శివనారాయణ నిన్ను గుర్తు చేసుకుని భావోద్వేగం అయ్యాడని కూడా కార్తీక్ బాబు కాంచన తల్లికి చెబుతాడు. దాంతో కాంచన కూడా సంతోషిస్తుంది. మీ ఇద్దరికి ఆ ఇంట్లో పెళ్లి జరుగుతుండటం ఆనందంగా ఉందని అంటుంది. ఇదే సమయంలో కార్తీక్ బాబుకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే బయటికి వెళ్తాడు. అయితే దీపా ఎవరిని అడిగినా కూడా సమాధానం ఇవ్వకుండా ఫ్రెండ్ అని చెప్పి వెళ్తాడు.

ఇక కార్తీక్ బాబు వెంటనే బయటకి వెళ్తాడు. కార్తీక్ బాబుకు ఫోన్ చేసింది. మరెవరో కాదు. జ్యోత్స్న నే. ఇక కార్తీక్ బాబు వెళ్లి జ్యోత్స్న ను కలుస్తాడు. జ్యోత్స్న కార్తీక్ బాబుకు దగ్గర కావాలని ప్రశ్నిస్తుంది. కానీ కార్తీక్ బాబు మాత్రం జ్యోత్స్నను అంతకంతకు దూరం పెడుతూనే ఉంటాడు. జ్యోత్స్న మాట్లాడుతూ అసలు నీకు ఇంట్లో మళ్లి పెళ్లి జరిపించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తుంది. నువ్వు తాళి తెంపడం వల్లనే అని బదులిస్తాడు. అదిసరే అసలు నువ్వు కొన్ని విషయాల్లో ఎందుకు తగ్గి ఉంటున్నావు? నీకు అవసరం లేని విషయాల్లోనూ, నీ తప్పులేని సందర్భాల్లోనూ సర్దుకు పోతూ ఉంటున్నావ్? వీటన్నింటికి కారణం ఏంటి? నువ్వు ఎందుకు ఇవన్నీ భరిస్తున్నావని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ బాబు స్పందిస్తూ నా కుటుంబం కోసం అని బదులిస్తాడు. ఇక జ్యోత్స్న నా కుటుంబం ఏంటి బావ, మన కుటుంబం అని బదులివ్వొచ్చు కదా అంటుంది. నీ దృష్టిలో కుటుంబం అంటే నువ్వు, దశరథ, సుమిత్ర.. కానీ నాకు మాత్రం అమ్మా, మామ, అత్త, దీపా, దాసు, పిన్ని, స్వప్న, కాశీ, తాత, పారు, నువ్వు, ఆ చివర్లో శ్రీధర్ నాన్న కూడా ఉంటారని చెబుతాడు.
నీకు నీ కుటుంబం కావాలంటే ఆ దీపా నీ జీవితంలో ఉండకూడదు అని జ్యోత్స్న అంటుంది. కానీ కార్తీక్ బాబు దీపా వల్లనే నాకు నా కుటుంబంతో కలిసి ఉండాలని అనిపించింది. దీపా అంటే వెలుగు. నా జీవితపు వెలుగు అని బదులిస్తాడు. మీ పెళ్లిని ఇంట్లో అస్సలు జరగనివ్వనని ఛాలెంజ్ చేస్తుంది. దాంతో కార్తీక్ బాబు నీ వల్ల కానీ పని అని అంటాడు. సవాల్ అంటే సవాల్ అని అనుకుంటారు. ఇక జ్యోత్స్న ఇంటికి తిరిగి వెళ్లే సరికి అక్కడ కూడా ఇదే టాపిక్ కొనసాగుతుంది. కార్తీక్ బాబు, దీపాల పెళ్లికి నేను అనుమతించాను కానీ, ఇంట్లో వాళ్ల అందరి అభిప్రాయం కూడా తీసుకోవాలని శివ నారాయణ అనుకుంటాడు. ఇక వెంటనే దశరథ దగ్గరకు వెళ్లి ఇదే విషయాన్ని గుర్తుకు చేస్తాడు. కార్తీక్ బాబు, దీపాల పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా అని అడుగుతాడు. మీ నిర్ణయమే మా నిర్ణయం నాన్న అని బదులిస్తాడు. ఇక జ్యోత్స్న, పారు, సుమిత్ర కూడా వీరి మాటలు విని బయటికి వస్తారు.
శివ నారాయణ తను ఎవరి అభిప్రాయం తీసుకోకుండా కార్తీక్ బాబుకు మాట ఇచ్చానని అంటాడు. అందుకు కారణం ఈ ఇంటికి ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టకూడదనే. అక్కడ నా కూతురు కాంచన, ఇక్కడ నీ కూతురు జ్యోత్స్న కంట కన్నీరు ఉండకూడదనే ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నానని శివ నారాయణ అంటాడు. ఇక దీనికి సుమిత్ర స్పందిస్తూ ఏదేమైనా ఈ నిర్ణయానికి నేను అస్సలు ఒప్పుకోను అని అంటుంది. నా భర్తను చంపేందుకు ప్రయత్నించిన వ్యక్తికి నేను తల్లిగా ఉంటానని ఎలా అనుకుంటున్నారు. ఇప్పటి వరకు మీ మాట నేనెప్పుడు దాట లేదు మామయ్య. కానీ ఈ విషయంలో నన్ను క్షమించండి, నేను అస్సలు అంగీకరించడం లేదు అని చెబుతుంది. ఇక జ్యోత్స్న అభిప్రాయం తీసుకోగా.. తాత చెప్పినట్టుగానే చేద్దామని అంటుంది, మరోవైపు పారు కూడా శివ నారాయణకే సపోర్ట్ చేస్తుంది. ఇక శివ నారాయణ, దశరథ కూడా సుమిత్ర అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నీకు ఇష్టం లేకపోతే నా మాటను కార్తీక్ బాబు నుంచి వెనక్కి తీసుకుంటానని అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











