Karthika Deepam 2 August 13th: దీపాపై సుమిత్ర కర్కషత్వం.. కన్న కూతురుపైనే కఠినత్వం

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 12వ తేదీ 434వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబుతో జ్యోత్స్న ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. దీపాపై తన కోపాన్ని చూపిస్తుంది. నీకు నీ కుటుంబం కావాలంటే నీ జీవితంలో ఆ దీపా ఉండకూడదని జ్యోత్స్న అంటుంది. దాంతో కార్తీక్ బాబు మండి పోతాడు. అసలు దీపా వల్లనే నాకు మంచి కుటుంబం దొరుకుతుందని అంటాడు. దీపా అంటే వెలుగు దీపా నా జీవితానికి వెలుగు అని చెబుతాడు. ఇక దీపా వల్లనే నాకు కుటుంబం మొత్తంపై ప్రేమ కుదిరిందని వివరిస్తాడు. దీంతో జ్యోత్స్నకు మరో సందేహం కలుగుతుంది. కార్తీక్ బాబుకు దీపానే అసలు కూతురనే సంగతి తెలిసి పోయిందా అని ఆందోళన పడుతుంది. ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలని అనుకుంటుంది.

అసలు దీపా వల్లనే నీకు అన్ని కష్టనష్టాలు వచ్చాయని జ్యోత్స్న అంటుంది. అలా ఏం కాదని కార్తీక్ బాబు అంటాడు. ఇప్పుడు దీపా వల్లనే ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందని మండి పడుతుంది. అలా ఏం కాదని, అయినా నువ్వు తాళి తెంచడం వల్లనే ఇలా జరిగిందని అంటాడు. ఇక ఏదేమైనా మాకు మళ్లి పెళ్లిచేసుకునే అవకాశం దొరికిందని అంటాడు. కానీ జ్యోత్స్న మాత్రం నేను ఈ పెళ్లి జరగకుండా అడ్డుకుంటానని అంటుంది. కార్తీక్ బాబుతో ఛాలెంజ్ చేసి తిరిగి ఇంటికి వెళ్తుంది. ఇంట్లో కూడా కార్తీక్ బాబు, దీపాల పెళ్లిపై చర్చ జరుగుతుంది. అప్పడే జ్యోత్స్న తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది. శివ నారాయణ, సుమిత్ర, దశరథల దృష్టిలో మంచి అనిపించుకోవాలని కార్తీక్ బాబు, దీపాల పెళ్లికి మద్దతునిస్తుంది. ఇక ఆగస్టు 13వ తేదీ 435 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 435 August 13th 2025

కార్తీక్ బాబు, దీపాల పెళ్లికి ఏర్పాట్లు చేయాలని శివ నారాయణ అంటాడు. అందుకు దశరథ కూడా సరేనని చెబుతాడు. కానీ సుమిత్ర మాత్రం అస్సలు ఒప్పుకోదు. తనకు ఏమాత్రం కార్తీక్ బాబు దీపాల పెళ్లి రావడం ఇష్టం లేదని చెబుతుంది. నాకు శత్రువైన దీపాకు తల్లి స్థానంలో ఉండి పెళ్లి చేయించడం అనేది నాకు ఏమాత్రం నచ్చడం లేదని అంటుంది. ఇప్పటి వరకు మీరు చెప్పిన ఎన్నో మాటలు విన్నాను. కానీ ఈ సారి మాత్రం నన్ను క్షమించండి మామయ్య అని సుమిత్ర శివ నారాయణతో అంటుంది. ఈ విషయంలో నేను ఏమాత్రం తగ్గాలని అనుకోవడం లేదని చెబుతుంది. దాంతో దశరథ సుమిత్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా వినకపోవడంతో శివ నారాయణే నచ్చచెబుతాడు. నీ అభిప్రాయం తెలుసుకోకుండా వాళ్లకు మాట ఇచ్చాను సుమిత్ర. ఇప్పుడు నీకు ఇష్టం లేదంటే నా మాటను వెనక్కి తీసుకొని వాళ్లను క్షమాపణలు కోరుతాను. ఇక ఏదైమైనా నువ్వు తీసుకునే నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉంటుందని చెబుతాడు. మరోవైపు జ్యోత్స్న, పారులు కూడా ఒప్పుకోమని ఒత్తిడి చేస్తారు.

ఇక కార్తీక్ బాబు, దీపాల పెళ్లి గురించి కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడెలా తన పుట్టింటికి వెళ్లి వీరి పెళ్లి గురించి తన తండ్రి శివ నారాయణతో మాట్లాడాలని ఆలోచిస్తుంది. ఇదే విషయాన్ని అనసూయతో అంటుంది. పుట్టింటికి ఎలా వెళ్లేదని మదన పడుతుంది. దేనికైనా మగవాళ్లకు ఉన్నంత హక్కు, ఆడవాళ్లకు ఉండదు కదా అని అంటుంది. ఇదే సమయంలో దశరథ కాంచన ఇంటి గుమ్మంలో అడుగు పెడుతాడు. నువ్వు ఇలా అనుకుంటావనే మేమే మాట్లాడటానికి వచ్చామని అంటాడు. దశరథను చూసి కాంచన పొంగిపోతుంది. ఇక ఆ వెంటనే శివ నారాయణ కూడా వస్తారు. కాంచనతో ఎంతో ప్రేమగా మాట్లాడుతాడు. మీరు అడగటానికి ఇబ్బంది పడుతారనే మేం వచ్చామని శివ నారాయణ అంటాడు. మొత్తానికి మంచి రోజు చూసి, ముహుర్తాలు పెట్టించి కార్తీక్ బాబు, దీపాల పెళ్లి ఘనంగా జరిపించాలని శివ నారాయణ అంటాడు. ఇలా అందరూ ఒక్కసారిగా కలిసిపోవడం చూసి కార్తీక్ బాబు, దీపా, కాంచన ఎంతో సంతోషిస్తారు. ఇక సుమిత్ర మాత్రం ఇప్పుడే ముహుర్తాల విషయం ఎందుకు అని, ముందుగా అందరూ కాఫీలు తాగండి అని చెబుతుంది.

దీపా నువ్వు వెళ్లి అందరికీ కాఫీలు ఇవ్వమని ప్రేమగా అడుగుతుంది. సుమిత్ర తనతో ప్రేమగా మాట్లాడటంతో దీపా ఉంపొంగి పోతుంది. తన కన్న తల్లి తనతో ప్రేమగా మాట్లాడిందని, తనపై ఉన్న కోపం మొత్తం పోయిందని అనుకుంటుంది. ఇక వెంటనే అందరికీ కాఫీలు పెట్టించేందుకు కిచెన్ లోకి వెళ్తుంది. ఆ వెంటనే సుమిత్ర కాంచనను తీసుకొని బెడ్ రూమ్ లోకి వెళ్తుంది. ఇక కాంచన ఎంతో సంతోషంతో తన వదిన చేతులను పట్టుుకొని నాకు చాలా సంతోషంగా ఉంది వదినా అని అంటుంది. మా ఇంట్లో నీ మొహంపై చూడాలని అనుకున్న చిరు నవ్వును ఇన్నాళ్లకు చూశానని చెబుతుంది. మొత్తానికి నువ్వు దీపాను క్షమించడం నాకు ఆనందంగా ఉందని అంటుంది. దాంతో సుమిత్ర ఊహించని షాక్ ఇస్తుంది. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నీ మొహంపైనా నవ్వును చూస్తే అర్థం అవుతోంది కాంచన.. మరి నేను లోపల ఎంత బాధ పడుతున్నానో నీకు తెలియదు కదా. ఎవ్వరికీ తెలియకూడదనే మొహానికి మేకప్ వేస్తూ కాస్తా చిరు నవ్వును కూడా అద్దుకొని వచ్చానని అంటుంది. అంటే దీపాను నువ్వు క్షమించలేదా వదినా అని కాంచన ప్రశ్నిస్తుంది. ఈ జన్మకు క్షమించనని అంటుంది.

మామయ్య శివ నారాయణ మాటను నా భర్త దాటడు, నా భర్త దశరథ మాటను నేను దాట లేను. అందుకే వచ్చాను. కానీ ఈ పెళ్లిని ఆపాల్సింది మాత్రం నువ్వే. అస్సలు ఈ పెళ్లికి రావడం నాకు ఇష్టం లేదు. నువ్వే బయటికి వెళ్లాక పెళ్లి ఎవరి ఇంట్లో పెట్టాల్సిన పనిలేదు. గుడిలో జరిపించండని చెప్పాలని సుమిత్ర కాంచనకు చెబుతుంది. అంతే కాదు మమల్ని పెళ్లికి వచ్చి అక్షింతలు వేయమంటే సరిపోతుందని, అందరితో ఈ విషయాన్ని నువ్వే చెప్పాలని అంటుంది సుమిత్ర. అది నా వల్ల కాని పనని చెబుతుంది కాంచన. ఏదేమైనా ఈ పెళ్లి ఆగితీరాలని సుమిత్ర పట్టుబడుతుంది. కానీ ఇదే సమయంలో జ్యోత్స్న వచ్చి ఈ పెళ్లి జరగాలని అంటుంది. దీపా నీ ప్రాణాలు కాపాడిన రుణం తీర్చుకుంటున్నానని అనుకో అమ్మ అని సుమిత్రకు జ్యోత్స్న చెబుతుంది. ఈ పెళ్లి జరిగితేనే నేనే చేసిన తప్పుకు క్షమాపణ దొరుకుతుందని, నాకోసం ఒక్క రోజు అమ్మలాగా నటించమని నచ్చజెబుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X