Karthika Deepam 2 August 14th: జ్యోత్స్న మరో చిచ్చు.. దీపా కన్నీటి వరద

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 13వ తేదీ 435వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపాతో తన కన్న తల్లి సుమిత్ర ప్రేమగా మాట్లాడిందని పొంగిపోతుంది. ఇన్నాళ్లు తనపై కోపంగా ఉందని, ఇప్పుడు మొత్తం పోయిందని సంతోషిస్తుంది. ఇక వెంటనే వాళ్లందరికీ టీ, కాఫీలు పెట్టడానికి కిచెన్ లోకి వెళ్తుంది. ఇక సుమిత్ర మాత్రం కాంచనతో ప్రత్యేకంగా మాట్లాడానికి గదిలోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత సుమిత్ర వదిన వచ్చి దీపా, కార్తీక్ బాబుల పెళ్లికి ఒప్పుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తుంది. కానీ సుమిత్ర మాత్రం నాకు అస్సలు సంతోషంగా లేదని చెబుతుంది. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నీ చిరునవ్వుతో తెలుస్తోంది. కానీ నేను లోపల ఎంత బాధను దాచుకున్నానో నీకు తెలుసా వదినా అని సుమిత్ర కాంచనను ప్రశ్నిస్తుంది. సుమిత్ర అడిగిన ప్రశ్నకు కాంచన షాక్ అవుతుంది. అంటే కార్తీక్ బాబు దీపాల పెళ్లి నీకు ఇష్టం లేదా? దీపాను నువ్వు క్షమించలేదా అని తిరిగి ప్రశ్నిస్తుంది.

దీపాను కార్తీక్ బాబు మళ్లీ పెళ్లి చేసుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నేను ఎంతో బద్ధశత్రువుగా భావించే దీపాకు తల్లిగా ఉండటం అనేది అస్సలు నచచడం లేదు. దీపా చేసిన పనికి ఈ జన్మలో క్షమించను. అసలు దీపాకు క్షమాపణ అంటూ ఉండదని బదులిస్తుంది. దాంతో కాంచన బాధపడుతుంది. ఏదైనా గుడిలో వాళ్లను పెళ్లి చేసుకోమని, అందుకు మిమ్మల్ని వచ్చి అక్షింతలు వేయమంటే సరిపోతుందని సుమిత్ర అంటుంది. నువ్వే గది నుంచి బయటికి వచ్చాక ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లందరికీ చెప్పాలని అంటుంది. కానీ అదే సమయంలో జ్యోత్స్న వచ్చి లేదు మమ్మీ ఈ పెళ్లి ముందు అనుకున్నట్టుగానే జరగాలి. దీపాకు నువ్వు తల్లిగానే ఉండాలని అంటుంది. నాకోసం నువ్వు ఇది చేయాలని లేదంటే నేను జీవితాంతం దోషిగా మిగిలి పోతానని నచ్చజెబుతుంది. దాంతో సుమిత్ర సరేనని అంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 14వ తేదీ 436 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 436 August 14th 2025

కార్తీక్ బాబు, దీపాలకు మళ్లి పెళ్లి చేయడానికి అయ్యగారిని పిలిపించి వెంటనే ముహుర్తాలు పెట్టించేందుకు సిద్ధం అవుతారు. ఈ సందర్భంగా అయ్యగారు వచ్చి పలు ముహూర్తాలను చెబుతాడు. ఇక దగ్గర్లోని ముహూర్తాన్ని ఖాయం చేస్తారు. దీంతో కార్తీక్ బాబు, దీపా, దశరథ అందరూ ఆనందంలో మునిగి తేలుతారు. కానీ జ్యోత్స్న మరో మెలిక పెడుతుంది. నాకు ఒక సందేహం ఉందని చెబుతుంది. అసలు కళ్యాణం ఎలా జరిపిస్తారని అంటుంది. దాంతో కాంచన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుకు పట్టువస్త్రాలు ధరింపజేసి మంత్రోచ్ఛారణ మధ్య పెళ్లి జరిపిస్తారు. ఈ సమయంలో అమ్మాయి తరుపున తల్లి తండ్రి వరుడి కాళ్లు కడుగుతారు. ఆ తర్వాత అమ్మాయిని మీ ఇంటికి అప్పగిస్తున్నాం, ఇకపై మీదే బాధ్యత అంటూ వరుడు తల్లి తండ్రి అప్పగిస్తారని అంటుంది. ఇక కార్తీక్ బాబుకు తల్లి తండ్రులుగా అనే మాటతో ఆగిపోతుంది. ఏమైంది అత్త ఎందుకు ఆగిపోయావని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. కార్తీక్ బావకు తల్లి తండ్రి ఉన్నారు కదా. అందులో బాధ పడాల్సిన విషయం ఏమీ లేదు కదా అని ప్రశ్నిస్తుంది.

దీపాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి మా అమ్మ నాన్న సుమిత్ర, దశరథ ఆమెకు తల్లిదండ్రులుగా నిలుస్తున్నారు. కానీ కార్తీక్ బావకు తల్లి ఉంది, తండ్రి ఉంది కాబట్టి పెళ్లిలో ఇద్దరూ ఉండాల్సిందే కదా అని ప్రశ్నిస్తుంది. దాంతో కార్తీక్ బాబు మండి పడుతాడు. ఏదో పెంట చేస్తుందని అనుకున్నాను. అలాగే చేసిందని మనస్సులో అనుకుంటాడు. గతంలో జరిగిన గొడవలన్నీ తెలిసి కూడా శ్రీధర్ గురించి ఎలా గుర్తుకు చేస్తున్నావని జ్యోత్స్న పై కార్తీక్ బాబు మండి పడుతాడు. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. పద్ధతిగా ఉంటే సరేనని చెప్పండి. పెళ్లి కొడుకు తరుపున తల్లీ తండ్రి లేకపోతే పెళ్లి ఆగిపోతుంది కదా తాత అని శివ నారాయణను ప్రశ్నిస్తుంది. అవును పెళ్లి ఆగిపోతుంది. భర్త పోయి భార్య ఉన్నా, భార్య పోయి భర్త ఉన్న సంగతి వేరేలా ఉంటుంది కానీ. బతికి ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా పెళ్లిలో ఉండాల్సిందేనని అంటాడు. లేదంటే పెళ్లి జరిపించలేమని శివ నారాయణ చెప్పి అందరూ వెళ్లి పోతారు. ఇక జ్యోత్స్న పెట్టిన మెలికకు సుమిత్ర సంతోషిస్తుంది. పారు జాతం ఎగిరి గంతులేస్తుంది. జ్యోత్స్న నీది మాస్టర్ మైండ్ అని పొగుడుతారు. ఎక్కడ మెలిక పెట్టాలో అక్కడే పెట్టావని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతారు. ఇక కాంచన ఇంటి నుంచి అందరూ వెళ్లి పోతారు. జ్యోత్స్న ఇచ్చిన ట్విస్ట్ కు కార్తీక్ బాబు, దీపా, కాంచన, అనసూయ అందరికీ దిమ్మ తిరిగి పోతుంది.

అంతా సైలెంట్ గా ఉంటారు. శ్రీధర్ ను పిలిచేందుకు మనస్సు రాకపోవంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అలాగే ఉండిపోతారు. ఇక అనసూయ స్పందిస్తూ ఈ గొప్పింటి వాళ్లు ఇలానే ఉంటారు అక్కయ్య. నువ్వు ఏమీ బాధ పడుకు. వాళ్లు పెడితే కడుపు నింపుతారు. లేదంటే, కోలుకోలేని దెబ్బ కొడుతారని అంటుంది. ఇక దీపా ఆవేశంలో కార్తీక్ బాబును గుడికి వెళ్లి పెళ్లి చేసుకొందామని అంటుంది. కానీ కార్తీక్ బాబు ఆపుతాడు. అలా ఆవేశ పడకు, నువ్వు ముందు డ్యూటీకి వెళ్లమని చెబుతాడు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావని ప్రశ్నిస్తుంది. నాకు కొంచెం పని ఉందని చెప్పి దీపాను పంపిస్తాడు. ఇక దీపాకు తన తల్లిదండ్రులతో పెళ్లి జరిపిస్తానని లేని పోని ఆశలు క్రియేట్ చేశానని, ఎలాగైనా సాధించి తీరాలని అనుకుంటాడు. ఇక దీపా శివ నారాయణ ఇంటికి పనిచేసుకోవడం కోసం వెళ్తుంది. అక్కడ పారుజాతం, జ్యోత్స్న అడ్డుకుంటారు. ఒక్కదానివే వచ్చావ్, కార్తీక్ బాబు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తారు. గంట లేట్ గా వస్తానని చెప్పాడని అంటుంది. పర్మిషన్ ఎవరు ఇచ్చారు అని జ్యోత్స్న అంటుంది. ఆ విషయాలన్నీ వచ్చాక ఆయన్నే అడగమని అంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X