Karthika Deepam 2 August 15th: జ్యోత్స్న మొండితనం.. దీపాను చిత్ర హింసలు పెట్టేలా కుట్ర
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 14వ తేదీ 436వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపా మెడలోని తాళిని జ్యోత్స్న తెంపడంతో సమస్య మొదలైంది. దీపాను అలా బాధ పెట్టినందుకు జ్యోత్స్న ను అందరు నిందిస్తారు. ఏదేమైనా నువ్వు అలా చేసి ఉండకూడదని అంటారు. సుమిత్ర మాత్రం ఏకంగా జ్యోత్స్న రెండు చెంపలు వాయిస్తుంది. తను చేసుకున్న తప్పులకు వెంటనే వెళ్లి దీపా, కాంచన, కార్తీక్ బాబుకు క్షమాపణలు చెప్పాలని అంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం నేను రానని చెబుతుంది. దాంతో శివ నారాయణ, సుమిత్ర, దశరథ కాంచన ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కార్తీక్ బాబు మాత్రం మాకు క్షమాపణలు ఏం వద్దు మళ్లీ పెళ్లి చేయాలని, అది కూడా దీపాకు సుమిత్ర, దశరథలు తల్లిదండ్రులుగా ఉండాలని కండీషన్ పెడుతాడు. దానికి సుమిత్ర తొలుత ఒప్పుకోదు. కానీ కుటుంబం కోసం, జ్యోత్స్న కోసం ఒప్పుకుంటుంది. ఇక పెళ్లి తామంతా సరేనని, ముహూర్తాలు కూడా పెట్టింది.
కానీ జ్యోత్స్న మాత్రం ముందుగానే కార్తీక్ బాబుతో ఛాలెంజ్ చేసినట్టుగా దీపాతో కార్తీక్ బాబు పెళ్లి జరగనివ్వకుండా అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తుంది. ముహుర్తాలు పెట్టిన తర్వాత ఇలా మాట్లాడుతుంది. ఇప్పుడు దీపా అనాథ కాబట్టి తల్లిదండ్రులుగా మా అమ్మ సుమిత్ర, నాన్న దశరథ ఉంటున్నారని చెబుతుంది. మరీ పెళ్లికొడుకుకు కూడా తల్లిదండ్రులు ఉండాలి కదా అని జ్యోత్స్న మెళిక పెడుతుంది. జ్యోత్స్న మాటలతో కార్తీక్ బాబు, కాంచన షాక్ అవుతారు. ఇక పెళ్లి కొడుకు తరుఫున తల్లిదండ్రులు లేకపోతే పెళ్లి ఆగిపోతుంది కదా అని జ్యోత్స్న తాత శివ నారాయణతో అంటుంది. దీంతో అవును తప్పకుండా ఆగిపోతుందని చెబుతుంది. తండ్రి బతికే ఉన్నప్పుడు తప్పకుండా పెళ్లి రావాల్సిందే అని చెప్పి వెళ్లితారు. ఇక కాంచన, కార్తీక్ బాబు సందిగ్ధంలో పడిపోతారు. ఇప్పుడు తండ్రిగా శ్రీధర్ ను ఎలా తీసుకురావాలని ఆలోచనలో పడుతారు. ఈ సందర్భంగా కార్తీక్ బాబు, దీపా, కాంచనలు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 15వ తేదీ 437 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

జ్యోత్స్న ఇరకాటంలో పెట్టడంతో కార్తీక్ బాబు, కాంచన టెన్షన్ పడుతారు. ఇప్పుడు పెళ్లి జరిపించడం ఎలా అని కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు దీపాకు తన కన్న తల్లిదండ్రుల చేతుల మీద పెళ్లి జరిపిస్తానని దీపాకు మాట ఇచ్చానని, ఎలాగైనా చేసి తీరాలని అనుకుంటాడు. మరోవైపు జ్యోత్స్న మాత్రం ఎప్పటికప్పుడు అడ్డుకోవాలనే చూస్తుంది. ఇక అప్పటికే జ్యోత్స్న కార్తీక్ బాబుకు తండ్రి లేకపోతే పెళ్లి జరగదు కదా అని అనడంతో దాని గురించే కార్తీక్ బాబు ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు శ్రీధర్ తన ఇంట్లో హాయిగా కూర్చొని తన రాశి ఫలం చూస్తూ ఉంటాడు. ఊహించని అతిథి తన ఇంటికి వస్తాడని అందులో ఉండటంతో ఎవరు వస్తారా? అని తాపీగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. వెళ్లి చూసే సరికి బయట కార్తీక్ బాబు, కాంచన ఉంటారు. ఇక వారిని చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. అసలు మీరు రావడం ఏంటని ప్రశ్నిస్తాడు. మేం వచ్చింది నీ కోసమే అని అంటారు. ఎందుకో కూడా నీకు ఈ పాటికే తెలిసి ఉంటుంది కదా అని కార్తీక్ బాబు అంటాడు. అబ్బే లేదు, ఈ మధ్య పారుజాతం అత్తయ్య గారు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో నీ విషయాలేవీ తెలుసుకోలేక పోతున్నానని అంటాడు.
ఈ కావేరి వచ్చి కాంచన, కార్తీక్ బాబును ఇంట్లో రండన పిలుస్తుంది. ఎంత సేపు బయటనే ఉంటారా? లోనికి రావచ్చు కదా అని అంటుంది. వాళ్లు వచ్చే వాళ్లే కానీ నేను పిలవలేదు అని శ్రీధర్ అంటాడు. ఇక ఇంట్లోకి వచ్చాక ఎందుకు వచ్చారు? అసలు విషయం ఏంటిదని ప్రశ్నిస్తాడు. కార్తీక్ బాబు, దీపా పెళ్లికి తండ్రిగా నువ్వు రావాలని కాంచన అడుగుతుంది. మళ్లి పెళ్లి చేయడం ఎందుకు? అసలు జ్యోత్స్న చేసిన మంచి పనికి నాకు సంతోషం వేసింది. మనం చేయాల్సిన పనిని తాను చేసింది. ఇంకా దీపా వెనకాలే ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కావడం లేదు. ఆ దీపాను పెళ్లి చేసుకున్నప్పటి నుంచే అసలు దరిద్రం అంటుకుందని మండిపోతాడు. ఇక మళ్లీ పెళ్లి అంటూ నన్ను ఆహ్వానిస్తే ఎలా వస్తానని అంటాడు. పైగా నీకు భర్తగా రమ్మంటే వస్తాను? కార్తీక్ బాబు తండ్రిగా రాను అని శ్రీధర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. కానీ కాంచన మాత్రం నువ్వు తప్పుకుండా రావాల్సిందే అని కండీషన్ పెడుతుంది. కానీ శ్రీధర్ మాత్రం వస్తానని అంటాడు. అయితే పెళ్లి కూతురుగా మాత్రం దీపా ఉంటే అస్సలు రానని అంటాడు. పెళ్లి కూతురుగా జ్యోత్స్న ఉంటే మాత్రం నాకు ఓకే అని చెబుతాడు.
అసలు దీపా దరిద్రురాలని మీకు ఎప్పుడు అర్థం అవుతోందో నాకు తెలియడం లేదు. మీరు అవకాశం ఇస్తే దీపాను కార్తీక్ బాబు జీవితంలో నుంచి వెళ్లగొట్టే అవకాశం వచ్చింది. దీపాకు డబ్బులిచ్చి కార్తీక్ బాబును వదిలేయమని అడుగుతానని అంటాడు. దాంతో కార్తీక్ బాబుకు పట్టలేని కోపం వస్తుంది. కానీ తల్లి కాంచన కారణంగా కార్తీక్ బాబు సైలెంట్ గా ఉండిపోతాడు. వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతారు. ఇక మరోవైపు దీపాను సుమిత్ర నానా మాటలు అంటుంది. నీవల్లనే కార్తీక్ బాబు మాతో చేయించని కూడని పనులన్నీ చేయిస్తున్నాడు. అసలు కార్తీక్ బాబుకు లేని ఆలోచనలన్నీ తెప్పిస్తున్నావ్. మా చేతుల మీదుగానే పెళ్లి చేసుకుని నన్ను కించ పరిచే విధంగా ప్రవరిస్తున్నావని సుమిత్ర అంటుంది. కార్తీక్ బాబు వేసే ప్రతి అడుగు, మాటలో నీ హస్తం ఉందని నాకు బాగా అర్థమైంది. ఇక నువ్వు ఉన్నంత కాలం మాకు మనశ్శాంతి అనేది ఉండదని అంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











