Karthika Deepam 2 August 16th: జ్యోత్స్న ట్రాప్ లో పడ్డ దీపా.. వంటలక్కకు ఘోర అవమానం
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 15వ తేదీ 437వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న దీపా మెడలోని తాళిని తెంపేసినందుకు మళ్లీ వారిద్దరికి పెళ్లి జరిపించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే కార్తీక్ బాబు అందరినీ ఒప్పించి దీపాతో తన పెళ్లి జరిగేలా ఏర్పాట్లు చేస్తుంటాడు. ఇక కార్తీక్ బాబు చేసే ప్రతి పనిని, ప్లాన్ ను జ్యోత్స్న చెడగొడుతూ వస్తుంది. ముఖ్యంగా దీపాకు తల్లిదండ్రులుగా దశరథ, సుమిత్రలను ఉండాలని కార్తీక్ బాబు కండీషన్ పెట్టినట్టే, జ్యోత్స్న కూడా కార్తీక్ బాబుకు మెలిక పెడుతాడు. దీపాకు అంటే మా తల్లిదండ్రులు ఉన్నారు. మరి బావ కూడా తల్లిదండ్రులు వస్తారు కదా అని సందేహిస్తుంది. ఒక వేళ తల్లి ఉండి తండ్రి లేకపోయినా కూడా పెళ్లి ఆగిపోతుంది కదా అని అంటుంది. అవును ఆగిపోతుందని శివ నారాయణ అంటాడు. తండ్రి లేకుంటే అప్పుడు పెళ్లి కార్యక్రమం మరోలా ఉంటుంది కానీ, బతికి ఉన్నప్పుడు కచ్చితంగా పెళ్లికి రావాల్సిందేనని చెప్పి వెళ్లి పోతాడు.
ఇక వెంటనే కాంచన కార్తీక్ బాబును తీసుకొని శ్రీధర్ ఇంటికి వెళ్తుంది. అసలు విషయం చెబుతుంది. కార్తీక్ బాబు దీపాల మళ్లీ పెళ్లికి నువ్వు రావాలని ఆహ్వానిస్తారు. దాంతో శ్రీధర్ నవ్వేసి ఊరుకుంటాడు. నేను ఆ దీపా, కార్తీక్ బాబుల పెళ్లికి అస్సలు ఒప్పుకోనని అంటాడు. మొత్తానికి మనం చేయాల్సిన పనిని జ్యోత్స్న చేసింది. దీపా మెడలోని తాళిని తెంచి మంచి పని చేసిందని అంటాడు. ఇదే మంచి సమయం అని, ఇక దీపాను కార్తీక్ బాబు జీవితం నుంచి వెళ్లగొడితే మంచిదని అంటాడు. వీలైతే ఆ విషయాన్ని నేనే మాట్లాడుతానని అంటాడు. అంతే గానీ దీపాతో కార్తీక్ బాబు పెళ్లికి నేను అస్సలు ఒప్పుకోనని అంటాడు. దాంతో కార్తీక్ బాబు, కాంచన తిరిగి వెళ్లిపోతారు. మరోవైపు దీపాపై సుమిత్ర ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. చిరాకు పడుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 16వ తేదీ 438 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

దీపాను సుమిత్ర నానా మాటలు అంటుంది. నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయిందని మండి పడుతుంది. మాతో కార్తీక్ బాబు ఎంతో మంచిగా ఉండేవాడని అంటుంది. కానీ వాడిని నీ వలలో పడేసుకొని పూర్తిగా మార్చేశావు. అందుకే మా ఇంట్లో మా చేతులతో పెళ్లి చేసుకునేలా ఏర్పాట్లు చేశాడు. ఎప్పుడు లేనిది కార్తీక్ బాబుతో ఇలాంటి కండీషన్ ను పెట్టించి, మా ఇంట్లోనే పెళ్లి చేసుకొని గెలిచానని చెప్పడం కోసమే ఇలా చేస్తున్నావని అంటుంది. నీకు వచ్చినన్నీ వేషాలు మరొకరికి రావని అంటుంది. ఇక నీపై నాకు ఉన్న కోపం ఎప్పటికీ పోదు. నిన్ను క్షమించే ప్రసక్తే లేదని మండి పడుతుంది. ఆ తర్వాత పారు, జ్యోత్స్నలు దీపా దగ్గరికి వచ్చి మరింత బాధ పెడుతారు. మా అమ్మ దగ్గర నీ స్థానం అంతే దీపా అని జ్యోత్స్న అంటుంది. ఇక అది ఎప్పటికీ మారదు అని అంటుంది. దాంతో దీపా బాధపడుతుంది. ఇక ఆ వెంటనే పారు మరింత కఠినంగా మాట్లాడుతుంది. అసలు ఆ తాళిని నువ్వే తెంపేసుకొని జ్యోత్స్న చేతిలో పెట్టావు కాద అని అడుగుతుంది.
పారుజాతం ప్రశ్నకు దీపా షాక్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. పారుజాతం మాటలను కార్తీక్ బాబు వెంటాడు. దీపా మెడలోని తాళిని తనే తెంచేసుకుందని పారు అనడంతో కార్తీక్ బాబు రక్తం మరిగిపోతుంది. ఇక పారుజాతం జల్లుమంటుంది. తన మాటలకు కార్తీక్ బాబు ఎలా స్పందిస్తాడోనని భయపడుతుంది. మొల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఇక కార్తీక్ బాబు, దీపా కూడా కిందకి వస్తారు. ఈ సమయంలో జ్యోత్స్న కార్తీక్ బాబుకు ఎదువుతుంది. నువ్వు వెళ్లిన పని కాలేదని దిగులు పడుతన్నావా? బావ అని అంటుంది. అసలు నేను అనుకున్న అవుతుందా? లేదా? అన్న టెన్షన్ నీకు ఎందుకు? పెళ్లైతే దీపా నీ స్థానంలోకి వస్తుంది అనినా అంటాడు కార్తీక్ బాబు. అందుకు అంత సీన్ లేదని, అసలు దీపా పెళ్లికి శ్రీధర్ మామ అస్సలు ఒప్పుకోడని అంటుంది. ఇక మీ పెళ్లి జరగడం కష్టమని అంటుంది. కానీ దీపా కచ్చితంగా జరుగుతుందని చెబుుతుంది. అదే మాటను కార్తీక్ బాబును చెప్పమని అంటుంది. కానీ కార్తీక్ బాబు కాన్పిడెంట్ గా చెప్పబోడు. దాంతో అసలు ఏమైందని దీపా కార్తీక్ బాబును అడుగుతుంది. దాంతో కార్తీక్ బాబు శ్రీధర్ ఇంటి దగ్గర జరిగిన విషయాన్ని తెలియ జేస్తాడు. శ్రీధర్ మామ ఇంటికి వెళ్లొద్దని చెప్పాను కదా? మీరు ఎందుకు వెళ్లారని దీపా ప్రశ్నిస్తుంది.
ఇక కార్తీక్ బాబు స్పందిస్తూ అసలు నేను వెళ్లలేదని, అమ్మ కాంచన పిలిస్తే వెళ్లాల్సి వచ్చిందని అంటాడు. ఇక దొరికిందే అవకాశంగా మాస్టర్ కొండెక్కి కూర్చొన్నాడని దీపాతో చెబుతాడు. అసలు ఆయన మన పెళ్లికి రానని చెప్పారని అంటాడు. పైగా మన బంధం ఎప్పటికీ కలిసి ఉండేది కాదని, అందుకే దేవుడు మనల్ని విడదీస్తున్నాడని ఆయన చెప్పారని దీపాతో కార్తీక్ బాబు వివరిస్తాడు. అసలు మనం ఎలాగైనా ఈ విషయంలో గెలిచి తీరాలని, లేదంటే మనల్ని అందరూ మరింత చులకనగా చూస్తారని కార్తీక్ బాబు అంటాడు. అలా గెలవాలంటే శ్రీధర్ ఒప్పుకోవాలని అంటుంది. ఇక మరోవైపు శ్రీధర్ చచ్చినా ఒప్పుకోనని, దీపా, కార్తీక్ ల పెళ్లి అస్సలు జరగబోదని అంటాడు. అదే సమయంలో స్వప్న ఎంట్రీ ఇస్తుందని తన బ్యాగ్ సర్దుకొని ఇంటికి వస్తుంది. వాళ్ల పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే కాశీ నన్ను వాళ్ల ఇంటికి రానివ్వనని చెప్పాడని అంటుంది. అయినా పర్లేదు. నేను మాత్రం దీపా, కార్తీక్ బాబుల పెళ్లికి అస్సలు ఒప్పుకోనని పట్టుదలతో ఉంటాడు. మరోవైపు దీపాను చీటికి మాటికీ పారుజాతం నానా మాటలు అంటుంటే కార్తీక్ బాబు తట్టుకోలేకపోతాడు. ఇక పారుకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











