Karthika Deepam 2 August 18th: దీపాకు మొదలైన టార్చర్.. పంతం నెగ్గిన జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 16వ తేదీ 438వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీపా, కార్తీక్ బాబుకు మళ్లీ పెళ్లి చేసేందుకు శివ నారాయణ ఒప్పుకుంటాడు. జ్యోత్స్న చేసిన తప్పును ఇలా సరిదిద్దుకుంటామని అంటాడు. ఇంట్లో అందరూ ఒప్పుకున్నా సుమిత్ర మాత్రం అస్సలు దీపా, కార్తీక్ ల పెళ్లికి ఒప్పుకోదు. ముఖ్యంగా దీపాకు తనను తల్లిగా ఉండమని అడగటంతో అస్సలు ఉండనని అంటుంది. ఇక భర్త దశరథ, మామ శివ నారాయణ కోసం ఒప్పుకుంటుంది. చివర్లో ఎలాగూ పెళ్లి తంతు నుంచి తను తప్పించుకోవడానికి అసలు విషయాన్ని కాంచనకు చెప్పి తనకు దీపాకు తల్లిగా ఉండాలని లేదని, ఈ పెళ్లిని గుడిలో జరిపించమని అంటుంది. కానీ జ్యోత్స్న సుమిత్ర మనస్సును మార్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే జీవితాంతం వీళ్లు నన్ను దోషిలాగే చూస్తారు మమ్మి, ఇప్పుడు దీపాను నువ్వు ఎలాగైతే ద్వేషిస్తున్నావో అలాగే ద్వేశిస్తారు. అలాంటి పరిస్థితి నాకు రావొద్దంటే నువ్వు పెళ్లిలో దీపాకు తల్లిగా ఉండేందుకు ఒప్పుకోవాలని అంటుంది. దాంతో సుమిత్ర సరేనని అంటుంది.

ఇక జ్యోత్స్న మాత్రం కార్తీక్ బాబు, దీపాల పెళ్లిని చెడగొట్టడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పటికే కార్తీక్ బాబుకు తండ్రి శ్రీధర్ కూడా రావాలని, లేదంటే పెళ్లి క్యాన్సిల్ అవుతుందని మెలిక పెడుతుంది. ఈ విషయాన్ని తాత శివ నారాయణతో చెప్పిస్తుంది. శివ నారాయణ ఇదే విషయాన్ని చెప్పడంతో కార్తీక్ బాబు షాక్ అవుతాడు. ఇక కాంచన, కార్తీక్ బాబు ఈ విషయంపై తీవ్రంగా చర్చిస్తారు. దీపాకు అనవసరంగా తానే లేనిపోని ఆశలను కలించానని కార్తీక్ బాబు అంటాడు. తన తల్లిదండ్రులు సుమిత్ర, దశరథల చేతుల మీదుగా పెళ్లి చేయిస్తానని మాటిచ్చాను. ఎలాగైనా చేసి తీరాలని నిర్ణయించుకుంటాడు. ఇక శ్రీధర్ ను పెళ్లికి రమ్మంటే రానని మొహం మీదనే చెబుతాడు. ఇక మరోవైపు జ్యోత్స్న, పారులు దీపాను వేధిస్తూ ఉంటారు. పెళ్లి పనుల హడావుడి అంటూ జ్యోత్స్న కార్తీక్ బాబు, దీపాలో ఆందోళన కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 18వ తేదీ 439 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 439 August 18th 2025

కార్తీక్ బాబు, కాంచన శ్రీధర్ ఇంటికి వెళ్లి పెళ్లికి రావాలని అడిగితే రానని చెప్పడంతో బాధతో వెనుదిరుగుతారు. ఈ విషయాన్ని శ్రీధర్ పారుజాతానికి ఫోన్ చేసి చెబుతాడు. దాంతో పారు ఫుల్ ఖుషి అవుతుంది. కార్తీక్ బాబు, దీపాల పెళ్లి ఇక క్యాన్సిల్ అవుతుందని సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇదే విషయాన్ని జ్యోత్స్నతో పంచుకుంటుంది. జ్యోత్స్న కూడా ఆనంద పడుతుంది. మరోవైపు దీపాపై సుమిత్ర నిప్పులు కక్కుతుంది. నీ వల్ల నాకు, నా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోయిందని, కార్తీక్ బాబుకు లేని పోని మాటలన్నీ చెప్పి మార్చేస్తున్నావని, మా ఇంట్లోనే మళ్లీ పెళ్లికి ప్లాన్ చేసి మమ్మల్ని అవమానించాలని చూస్తున్నావని సుమిత్ర దీపాతో అంటుంది. సుమిత్రమ్మ మాటలకు దీపా బాధపడుతుంది. మౌనంగా ఉండిపోతుంది. ఆ వెంటనే దీపా దగ్గరకు పారుజాతం వచ్చి అసలు నీ మెడలోని తాళిని నువ్వే తెంచేసుకుని ఆ నింద జ్యోత్స్నపై వేసావ్ కదా అని అంటుంది. ఆ మాట కార్తీక్ బాబు వెంటాడు. ఇక పారుకు బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. వెంటనే దీపాను తీసుకొని పారుజాతం దగ్గరకు వెళ్తాడు.

ఇటీవల చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావ్ పారు అని మందలిస్తాడు. దాంతో పారుజాతం మరింతగా రెచ్చిపోతుంది. మాట్లాడుతాను రా.. ఏం చేస్తావంటూ విరుచుకు పడుతుంది. మహా అయితే బెత్తం దెబ్బలు కొట్టిస్తావు. పోయిన సారి రెండు, ఇక ఈసారి 3 దెబ్బలు పడతాయి. అంతే కదా అని పారుజాతం ధీమాగా చెబుతుంది. కానీ కార్తీక్ బాబు పారును ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకెళ్లి అక్కడ ఒక పెద్ద గుండం గీస్తాడు. ఇక రేపు ఉదయం 9 గంటల సమయం కల్లా నిన్ను శివ నారాయణ గారెతో ఈ గుండంలో నిలబెడుతానని సవాల్ చేస్తాడు. నీవల్ల కాదని పారుజాతం అంటుంది. ఒక వేళ అలా జరగకపోతే ఏం చేస్తావని కార్తీక్ బాబును అడుగుతుంది. దాంతో కార్తీక్ బాబు నీకు బానిసలా జీవితాంతం పడి ఉంటానని అంటాడు. ఇక పారుజాతం కార్తీక్ బాబు చెప్పిన మాటలతో అసలు రేపు ఉదయం 9 గంటల వరకు నా గదిలో నుంచే బయటికి రానని తలుపు వేసుకొని ఉంటుంది. ఇక కార్తీక్ బాబు ఎలా తనను ఇరికించబోతున్నాడు అనే దానిపై పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. తన జాగ్రత్తలో ఉండేందుకు కొన్ని నియమాలు పెట్టుకుంటుంది.

మరోవైపు కార్తీక్ బాబు, దీపా ఇంటికి తిరిగి వెళ్లగానే కాంచన బాధపడుతూ ఉంటుంది. తన కొడుకు కార్తీక్, దీపాల పెళ్లి ఎలా జరిపించాలా? అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పటికే ఇంటికి వెళ్లి మరీ బతిమిలాడినా శ్రీధర్ పెళ్లికి రానని చెప్పారంటూ అన్ని విషయాలను గుర్తు చేసుకుంటుంది. ఇక ఇదే సమయంలో శౌర్య పాప చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఎలాగైనా తన అమ్మనాన్నలు కార్తీక్ బాబు, దీపాల పెళ్లి జరగాలని అంటుంది. మీ పెళ్లి చూడాలని అనుకుంటున్నాను. నా స్నేహితులు కూడా వస్తారని చెబుతుంది. ఎలాగైనా పెళ్లిని ఘనంగా జరిపించేలా చూడాలని శౌర్యపాప కార్తీక్ బాబు దగ్గర ప్రామీస్ తీసుకుంటుంది. ఇటు దీపాకు, అటు తల్లి కాంచనకు, కూతురు శౌర్యకు మాట ఇవ్వడంతో ఇక ఎలాగైనా పెళ్లి జరగాలని మరింత బలంగా కార్తీక్ బాబు అనుకుంటాడు. ఇదే సమయంలో జ్యోత్స్న వచ్చి పెళ్లి పనులు ఎక్కడికి వచ్చాయని అంటుంది. శ్రీధర్ మామ కూడా ఉంటే పెళ్లికి మీరంతా సిద్ధమేనా అనే విషయం స్పష్టం చేసుకుని వెళ్దామని వచ్చానని అంటుంది. శ్రీధర్ మామ రాకపోతే పెళ్లి జరగదని అంటుంది. కానీ కార్తీక్ బాబు పెళ్లి జరుగుతుందని అంటాడు. ఆ వెంటనే కార్తీక్ శ్రీధర్ ఇంటికి వెళ్తాడు. కార్తీక్ బాబును రాత్రిపూట ఇంటి దగ్గర చూసిన వెంటనే శ్రీధర్ పెళ్లి మాట ఎత్తనంటే నీతో మాట్లాడుతానని అంటాడు. అందుకు కార్తీక్ బాబు సరేనని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X