Karthika Deepam 2 August 19th: కార్తీక్ బాబు కన్నీళ్లు.. దీపాకు గుడ్ న్యూస్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 18వ తేదీ 439వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీపాల పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే దీపాకు అమ్మనాన్నగా దశరథ, సుమిత్రలు ఉంటున్నప్పుడు.. కార్తీక్ బావకు కాంచన అత్త, శ్రీధర్ మామ కూడా పెళ్లిలో ఉండాలని జ్యోత్స్న కండీషన్ పెడుతుంది. దాంతో కాంచన, కార్తీక్ బాబు శ్రీధర్ దగ్గరకు వెళ్లి దీపాతో కార్తీక్ బాబు పెళ్లికి రావాలని పిలుస్తారు. కానీ ఆయన అస్సలు రానని చెబుతాడు. దీంతో తిరిగి వెళ్లిపోతారు. ఆ తర్వాత పారు, జ్యోత్స్నలు ఈ పెళ్లి జరగదని, శ్రీధర్ రాడని చెప్పి హేళన చేస్తాడు. దాంతో కార్తీక్ బాబు తన తండ్రి శ్రీధర్ దగ్గరకు వెళ్తాడు. ఇక శ్రీధర్ కార్తీక్ బాబును అర్ధరాత్రి చూసి షాక్ అవుతాడు. నువ్వు ఏం చెప్పినా వింటాను కానీ, పెళ్లి రమ్మని మాత్రం అడగకు అని అంటాడు శ్రీధర్. సరే అని ఇంట్లోకి వెళ్లి కూర్చొంటాడు. ఇక మనకు పరిచయం లేనట్టుగా మాట్లాడుకుందామని, తన కథ చెబుతానని శ్రీధర్ కు చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 19వ తేదీ 440 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?
ఇది నా కథ. నాకు తల్లి, తండ్రి అందమైన కుటుంబం ఉంది. అందరికీ ఆశలు ఉంటాయి. అలాగే నాకు కూడా బోలెడన్నీ ఆశలు ఉన్నాయి. ఆ ఆశలతోనే లండన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చానని చెబుతాడు కార్తీక్ బాబు. లండన్ నుంచి తిరిగి వచ్చిన సమయంలో నా కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉందని శ్రీధర్ తో చెబుతూ ఉంటాడు. కానీ ఒకరోజు, ఒక పరిస్థితి వల్ల మాట వచ్చిందని, అయిన వాళ్లే ఇంట్లో నుంచి గెంటేశారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. దాంతో ఒక్కసారిగా నా తల్లి, భార్య, కూతురుతో రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. అందుకు కారణం నా తండ్రి మరో పెళ్లి చేసుకోవడం. అయినా నేను ఏమీ అనుకోలేదు. జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. పడ్డచోటునే లేచి నిల్చోవాలని అనుకున్నాను. కష్టపడటం ప్రారంభించాను. కష్టపడుతూనే ఉన్నాను. ఒక రోజు అసలు నా ఆశయం ఏంటీ? నా కళ ఏంటని ఆలోచించాను. అప్పుడు నాకు అనిపించింది ఒక్కటే, నా మనస్సు చెప్పింది ఒక్కటే, కుటుంబం మొత్తంతో కలిసి నవ్వుతూ, వరసలు కలుపుకొని పలకరిస్తూ సంతోషంగా ఉండాలని మాత్రమే. ఇక ఆ రోజు సిద్ధించే సమయం వచ్చింది. నా పెళ్లితోనే ఇప్పుడున్న సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందని అనుకున్నాను. అందుకే నా పెళ్లి ఘనంగా జరగాలని నిర్ణయించుకున్నాను.

కానీ, నా పెళ్లిలో తండ్రి ఉండాలి కదా, అసలు కన్న తండ్రి లేకుండా పెళ్లి చేసుకోవడం ఎలా సాధ్యం అవుతుంది. నాన్న అంటే ఏ కొడుకుకైనా ధైర్యం, నాన్న అంటే నమ్మకం. అలాంటి నాన్న లేకుండానే నేను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నాను. నా తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడని నా తల్లి ఎంతో కుమిలి కుమిలి ఏడ్చింది. అందుకు నేను చాలా బాధపడ్డాను. ఇప్పటికీ తన గుండెల్లో ఆ బాధ అలానే ఉంది. తనే నా సర్వస్వం అని బతుకుతున్న నా తల్లిని కాదని నా తండ్రి వెళ్లిపోవడం, ఆమె అవిటిదానిలా ఇంట్లోనే పడి ఉండటం కూడా చూడని ఆయనపై ఎవ్వరికైనా కోపం రాకుండా ఉంటుందా? అని కార్తీక్ బాబు తన కథను తన తండ్రికే చెబుతూ ఉంటాడు. మా నాన్న అంటే కూడా నాకు ఎంతో ఇష్టమని, ఆయన కోసం ఎన్నో కలలు కన్నానని చెబుతాడు. మా నాన్న ఇంట్లోనే మందు కొట్టి సిగరేట్ తాగుతాడని నా ఒక్కరికి మాత్రమే తెలుసు. అందుకే లండన్ నుంచి వచ్చేప్పుుడు ఒక లైటర్ కూడా తీసుకొని వచ్చాను. దాన్ని మా నా గుర్తుగా ఇంకా మా నాన్న దగ్గరనే పెట్టుకున్నాడని చెబుతాడు. ఇక ఇప్పుడు ఆయన మాకు దూరంగా ఉన్నారని, త్వరలోనే కుటుంబం మొత్తం నా పెళ్లితోనే ఒక్కటయ్యే సమయం వచ్చిందని అంటాడు కార్తీక్ బాబు. నా తండ్రి పేరు కూడా శ్రీధరే అని చెబుతాడు. దాంతో శ్రీధర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు.
ఇక కార్తీక్ బాబు చివరిగా కుటుంబం మొత్తం తన పెళ్లితోనే కలిసే సమయం వచ్చినప్పుడు మీరే నా స్థానంలో ఉంటే మీ తండ్రిని రమ్మంటారా? అనారా? అని ప్రశ్నిస్తాడు. అందుకు శ్రీధర్ స్పందిస్తూ కచ్చితంగా రమ్మంటానని చెబుతాడు. ఇక మీరే తండ్రి స్థానంలో ఉంటే వెళ్తారా? వెళ్లారా? అని అడుగుతాడు. ఇక శ్రీధర్ వెళ్తానని చెబుతాడు. అందుకు కార్తీక్ బాబు సంతోషిస్తాడు. వెంటనే చేతులెత్తి నమస్కరిస్తాడు. శ్రీధర్ మరోసారి కార్తీక్ బాబు పెళ్లికి వస్తానని చెబుతాడు. ఇక కార్తీక్ బాబు సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. అయితే పక్కనే ఉన్న కావేరి మాత్రం శ్రీధర్ ను ఇలా ప్రశ్నిస్తుంది. అసలు మీరు నిజంగానే పెళ్లికి వెళ్తారా? లేక కార్తీక్ బాబును ఇప్పటి వరకు నమ్మించడానికి ఇలా అబద్ధం చెప్పారా అని అడుగుతుంది. అందుకు శ్రీధర్ ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. మరోవైపు పారుజాతం కార్తీక్ బాబుపై పంతం నెగ్గాలని చూస్తుంది.
రాత్రంతా నిద్రపోకుండా ఇంట్లోనే మేల్కోని ఉంటుంది. కార్తీక్ బాబు తనను ఎలా ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఎవ్వరు ఫోన్ చేసినా తన గదిలో నుంచి బయటికి అస్సలు రానని చెబుతుంది. చివరిగా జ్యోత్స్న ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పినా అస్సలు రానంటుంది. తనను ఉదయం 9 గంటలకు శివ నారాయణతో బయటికి గెంటేయిస్తానని కార్తీక్ తనతో ఛాలెంజ్ చేశాడని, ఆ పందెంలో గెలిచాకే బయటికి వస్తానని అంటుంది. ఇక జ్యోత్స్న పారుపై మండి పడుతుంది. రెచ్చిపోయి పందెంలు కాస్తుంది. ఒడిపోయి అవమాన పడుతుందని అనుకుంటుంది. ఇక కార్తీక్ బాబు దీపాలు ఇంటికి తిరిగి వస్తారు. అదే సమయంలో పారు గుమ్మం దగ్గరనే నిల్చుని ఉంటుంది. 9 కావడానికి ఇంకా 10 నిమిషాల సమయం ఉంది. నువ్వు నన్ను ఆ గుండంలో నిల్చోబెడుతానని అన్నావ్ కదా చేయరా అని అంటుంది. అదేదో సరదాకి అన్నాను పారు అని కార్తీక్ బాబు అంటాడు. సరదా కాదురా పందెంలో నువ్వైనా గెలవాలి, నేనైనా గెలవాలి. లేదంటే నేను అస్సలు ఊరుకోనని అంటుంది. అసలు జ్యోత్స్న చేత తాళి తెంపిచింది నేనే, శ్రీధర్ ను పెళ్లికి రావొద్దని చెప్పింది కూడా నేనే అని, అయినా నువ్వేం చేయలేవని అంటుంది. నీ వల్లే ఇంకా 5 నిమిషాల్లో 9 గంటల కొట్టేలోపు నన్ను ఇంట్లో నుంచి గెంటేయించమని సవాల్ విసురుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











