Karthika Deepam 2 August 20th: పారుకు చుక్కలు చూపించిన కార్తీక్ బాబు.. జ్యోత్స్న మైండ్ బ్లాక్

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 19వ తేదీ 440వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీపాల పెళ్లికి శివ నారాయణ ఒప్పుకొని ఏర్పాట్లు చేస్తుంటారు. ఇదే సమయంలో పారుజాతం, జ్యోత్స్న వాళ్ల పెళ్లిని అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తారు. ఇప్పటికే పారుజాతం శ్రీధర్ కు ఫోన్ చేసి నువ్వు పెళ్లి రావొద్దు అల్లుడు అని చెబుతుంది. అటు శ్రీధర్ బాబు కూడా అస్సలు రానని చెబుతాడు. ఒకసారి కార్తీక్ బాబు, కాంచన ఇంటికి వెళ్లి అడిగితే కూడా అస్సలు రానంటే రానని చెబుతాడు శ్రీధర్. దీంతో వాళ్లు చేసేదేమీ లేక వెనుదిరుగుతారు. ఇక దీపాను, కార్తీక్ బాబును ఓవైపు పారు జాతం హేళన చేస్తూ ఉంటుంది. మీ పెళ్లి జరుగుతుందో లేదోనని పారుజాతం, అస్సలు జరగనివ్వనని జ్యోత్స్న సవాల్ చేస్తూ ఉంటారు. దీంతో అటు దీపా, ఇటు కాంచన, శౌర్య పాప బాధపడుతూ ఉంటారు. తమ పెళ్లి జరగాలని కోరుకుంటున్నట్టు చెబుతారు. దీంతో కార్తీక్ బాబు ఎలాగైనా దీపాతో తన పెళ్లి శివ నారాయణ ఇంట్లోనే జరగాలని నిర్ణయించుకుంటాడు.

Karthika deepam 2 Serial Today s Episode 441 August 20th 2025

దీంతో ఎలాగైనా తన తండ్రి శ్రీధర్ ను అడిగి పెళ్లికి రప్పించాలని అనుకుంటాడు. దీంతో కార్తీక్ బాబు మరోసారి శ్రీధర్ ఇంటికి వెళ్తాడు. తనతో సంబంధం లేదన్నట్టుగా ఉన్న శ్రీధర్ తో పరిచయం లేని వ్యక్తిగానే మాట్లాడుతాడు. ఇక తన కథ మొత్తం చెబుతాడు. లండన్ నుంచి తను తిరిగి వచ్చిన సయంలో తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉండిందని, కానీ ఆ తర్వాత మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడంతో సొంత వాళ్ల దగ్గరే మాట పడాల్సి వచ్చిందని శ్రీధర్ కు గుర్తు చేస్తాడు. ఇక తను, తల్లి, భార్యతో నడిరోడ్డు మీదకు వచ్చినట్టు చెపుతాడు. దాంతో శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. కార్తీక్ బాబు చెబుతూ తన తండ్రి అంటే తనకు చాలా ఇష్టమని, తన తండ్రికి కూడా తనంటే ప్రాణమని చెబుతాడు. ప్రస్తుతం తన కుటుంబం మొత్తం కలిసి అవకాశం వచ్చిందని, తన పెళ్లితో అన్ని దూరాలు చెరిగిపోతాయని చెబుతాడు. కానీ ఆ పెళ్లి మా నాన్న రావాలని అంటాడు. ఇక శ్రీధర్ వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటాడు. తప్పకుండా మీ నాన్న పెళ్లికి వస్తాడని అంటాడు. అందుకు కార్తీక్ బాబు సంతోషిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 20వ తేదీ 441 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

మొత్తానికి శ్రీధర్ మనస్సు కరిగించాడు కార్తీక్ బాబు. దీపాతో తన పెళ్లికి అస్సలు ఒప్పుకోనని అనుకున్న తండ్రి శ్రీధర్ ను కార్తీక్ బాబు ఒప్పిస్తాడు. ఇక ఇదే విషయాన్ని దీపాకు కూడా చెబుతాడు. అయితే జ్యోత్స్న, పారుజాతం కార్తీక్ బాబు, దీపాల పెళ్లిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే సమయంలో బాలు కోపంలో పారుతో నిన్ను ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లగొడుతానని సవాల్ చేస్తాడు. ఇక పారు ఉదయం కార్తీక్ బాబు రాగానే ఇవ్వాళ నువ్వో నేనో తెలిసిపోవాల్సిందే అని అంటుంది. నాతోనే పందెం కాసావు కాదా? నువ్వు చెప్పినట్టుగా శివ నారాయణతో నన్ను 9 గంటల వరకు ఆ గుండంలో ఉంచుతానని సవాల్ చేశావ్. కానీ అది అయ్యే పనికాదు. అసలు నువ్వు నన్ను ఏం చేయలేవు. అసలు మీ పెళ్లికి శ్రీధర్ ను రావొద్దని చెప్పిందే నేను, దీపా మెడలోని తాళిని తెంచమని చెప్పిందే నేను, నీకు కోపం వచ్చేలా చేసిందే నేను అని ఆవేశంలో అన్ని మాటలు జారుతూ ఉంటుంది. ఇక నువ్వు నాతో సవాల్ చేసి నెగ్గే అవకాశమే లేదని అంటుంది. చివరి వరకు ఏం జరుగుతుందో తెలియదు పారుజాతంగారు అని దీపా అంటుంది. ఇంకా ఏం జరుగుతుందే అని పారు ధీమా వ్యక్తం చేస్తుంది.

ఇదే సమయంలో వెనకాల నుంచి శివ నారాయణ పారుజాతాన్ని ఆ గుండంలోకి నెడుతాడు. దాంతో పారు గుండంలో పడిపోతుంది. అసలు శివ నారాయణకు ఇక్కడి విషయం అంతా ఎలా తెలిసిందని షాక్ అవుతుంది. మీకు ఎలా తెలిసిందండి అని ప్రశ్నిస్తుంది. ఇక కార్తీక్ బాబు అందుకు స్పందిస్తాడు. నువ్వు మాట్లాడటం ప్రారంభించినప్పుడే పెద్దసారుకు ఫోన్ చేశాను పారు అని కార్తీక్ బాబు అంటాడు. అప్పటి నుంచే పెద్ద సారు నీ మాటలన్నీ వింటున్నారని చెబుతాడు. దాంతో పారుజాతం వణికిపోతుంది. ఇక శివ నారాయణ పారుపై ఉగ్రరూపం దాల్చుతాడు. అసలు నీకు ఇలాంటి నీచపు బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందని మండి పడుతాడు. నీ అవతారం చూస్తే చిన్నప్పుడు మా స్నేహితులు చెప్పిన దెయ్యం నువ్వేనేమో అని అనిపిస్తుంది. నువ్వు అచ్చం దెయ్యంలాగానే ఉన్నావంటూ చురకలు పెడుతాడు. దాంతో పారు ఏదో సరదాకి ఇలా చేశానండి అని బదులిచ్చే ప్రయత్నం చేస్తుంది. అందుకు శివ నారాయణ మరింతగా ఫైర్ అవుతాడు. నోటికి వచ్చిన మాటలన్నీ తిడుతూ ఉంటాడు. అసలు నువ్వు దీపా, కార్తీక్ బాబుల పెళ్లిని ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తూ ఉన్నావని ప్రశ్నిస్తాడు.

పైగా నువ్వే శ్రీధర్ కు ఫోన్ చేసి ఎందుకు పెళ్లికి రావొద్దని చెప్పావంటూ ప్రశ్నిస్తాడు. అదే సమయంలో సుమిత్ర, దశరథ, జ్యోత్స్న బయటికి వస్తారు. పారును తాత శివ నారాయణ నిలదీయడంతో షాక్ అవుతారు. అసలు ఏం జరిగిందని అసలు విషయం తెలుసుకుంటారు. పారు రానురాను మరింత దిగజారిపోతోందని మండిపడుతాడు. అసలు నువ్వు శ్రీధర్ కు ఫోన్ చేసి ఎందుకు పెళ్లికి రాకూడదని చెప్పావో చెప్పమని శివ నారాయణ ప్రశ్నిస్తాడు. లేదు నేను చెప్పలేదు. అసలు శ్రీధర్ తో మాట్లాడి చాలా కాలం అయ్యిందని బదులిస్తుంది. దాంతో దశరథ పెళ్లికి శ్రీధర్ రావడం లేదా అని ప్రశ్నిస్తాడు. ఇక కార్తీక్ బాబు స్పందిస్తూ కొడుకు పెళ్లికి తండ్రి రాకుండా ఉంటాడా? అని బదులిస్తాడు. కార్తీక్ బాబు, దీపాల పెళ్లి నిర్ణయించింది శివ నారాయణ, అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని పారుకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X