Karthika Deepam 2 August 21st: కార్తీక్ బాబు, దీపాల పెళ్లి.. చిచ్చు పెట్టిన పారుజాతం

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 20వ తేదీ 441వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు ఇచ్చిన షాక్ కి పారిజాతం దిమ్మతిరిగిపోతుంది. చెప్పిన సమయానికి 9 గంటలకే పారిజాతాన్ని శివ నారాయణ మెడపట్టి గెంటేలా చేస్తాడు. ఆ తర్వాత పారిజాతం చేసిన తప్పులు అన్నిటినీ ఒప్పుకుంటుంది. తానే కార్తీక్ బాబు దీపాల పెళ్లికి శ్రీధర్ ను రావద్దని చెప్పినట్టుగా ఒప్పుకుంటుంది. దాంతో శివ నారాయణ మండిపోతాడు. కార్తీక్ బాబు దీపాల పెళ్లి శివ నారాయణ నిర్ణయం అని చెబుతాడు. ఈ పెళ్లిని ఆపాలని ఎవరు ప్రయత్నించినా ఏం మాత్రం సహించేది లేదని హెచ్చరిస్తాడు. ఇంతకీ పెళ్లికి మీ అమ్మానాన్న, ముఖ్యంగా నాన్న శ్రీధర్ వస్తున్నాడా, లేడా అని దశరథ ప్రశ్నిస్తాడు. దాంతో కార్తీక్ బాబు కొడుకు పెళ్లికి తండ్రి రాకుండా ఉంటాడా అని సమాధానం ఇస్తాడు. మా నాన్న తప్పకుండా నా పెళ్ళికి వస్తున్నారని చెబుతాడు. కార్తీక్ బాబు మాటలు వినగానే జోష్ణ ఉలిక్కిపడుతుంది. వీరికి అసలు నిజం తెలిసిపోయినట్టు ఉందని సందేహిస్తుంది. కార్తీక్ బాబు దీపాల పెళ్లికి శ్రీధర్ మామ వస్తానని చెప్పడం ఏంటని టెన్షన్ పడుతుంది.

అసలు దీప అంటే ఏమాత్రం సహించని శ్రీధర్ మామ ఇప్పుడు పెళ్లికి ఇలా వస్తున్నాడని సందేహంలో పడుతుంది. కచ్చితంగా దీపానే మీ ఇంటి వారసురాలనే సంగతి కార్తీక్ బాబుకు తెలిసి ఉంటుందని జోష్ణ స్పష్టం చేసుకుంటుంది. ఇక వెంటనే పారిజాతం కొడుకు, తన అసలు తండ్రి దాసును కలవాలని ప్రయత్నిస్తుంది. దాసును కలిశాక, అసలు నువ్వు దీపకు నిజం చెప్పావని ప్రశ్నిస్తుంది. దాంతో దాసు మొదట చెప్పానని చెబుతాడు. ఇక వెంటనే జోష్ణ నా జీవితం ఏమైనా పర్లేదని దీపకు నిజం చెప్పావా అని ప్రశ్నిస్తుంది. ఇక దీప బతికుండడమో నేను బతికుండడమో ఏదో ఒకటే జరుగుతుందని తిరిగి వెళుతూ ఉంటుంది. ఇదే సమయంలో లేదు నేను ఎవరికి నిజం చెప్పలేదని చెబుతాడు. మరి కార్తీక్ బాబుకు చెప్పావా అని అడుగుతుంది. కార్తీక్ బాబుకు నిజం తెలిస్తే ఊరుకుంటాడా అని దాసు చెబుతాడు. మరి శ్రీధర్ దగ్గర కార్తీక్ బాబు ఎందుకు తగ్గాల్సి వచ్చిందని అడుగుతుంది. అది విధి అని సమాధానం ఇస్తాడు. ఇక తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఆగస్టు 21వ తేదీ 442 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 442 August 21st 2025

ఇక పారిజాతం కార్తీక్ బాబు దీపాల పెళ్లిని ఓర్చుకోలేక పోతుంది. కానీ ఇదే సమయంలో శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. శ్రీధర్ ను చూసిన పారిజాతం షాక్ అవుతుంది. అసలేంటి అల్లుడు నువ్వు మొత్తం మాట మార్చేసావని మండిపడుతుంది. కార్తీక్ బాబు దీపాల పెళ్లికి రానని చెప్పి ఎలా వస్తానని మళ్లీ మాట మార్చేశావని ప్రశ్నిస్తోంది. దాంతో శ్రీధర్ మాట్లాడుతూ నా కొడుకు పెళ్లికి నేను రాకుంటే ఎలా ఉంటుందని సమాధానం ఇస్తాడు. నేనొక్కడినే కాదు ఫ్యామిలీ మొత్తం దిగేసిందని అంటాడు. ఇన్నోవాలో దిగుతున్నారని సామాన్లు తీసుకొస్తున్నారని చెబుతాడు. శ్రీధర్ వెనకాల కాంచన, అనసూయ, కార్తీక్ బాబు, శౌర్య పాప అందరూ లోపలికి వస్తారు. అది సరే ఇప్పుడు ఈ అందరు ఎందుకు వస్తున్నారు అని పారిజాతం శ్రీధర్ ను ప్రశ్నిస్తుంది. అదేంటి పెళ్లి ఉంది కదా అందుకే వస్తున్నామని శ్రీధర్ బదిలిస్తాడు. అయినా పెళ్లి రేపు కదా ఈరోజు మిమ్మల్ని ఎవరూ రమ్మన్నారని పారిజాతం తిరిగి మళ్లీ ప్రశ్నిస్తుంది. పారిజాతం మాటలకు కార్తీక్ బాబు సమాధానం ఇస్తాడు.

ఎవరో రమ్మన్నారని చెప్పడం దేనికి పారు నువ్వే పిలిచావని చెబుతాంలే అని అంటాడు. నా పేరు మాత్రం చెప్పకురా నాయనా అని పారిజాతం రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు నా పేరు చెప్పావంటే శివ నారాయణ నాపై శివ తాండవం ఆడుతాడని అంటుంది. అదేం కాదులే పారు అందరం నీ పేరే చెబుతామని, దీపా కూడా నువ్వు పిలిచావనే చెబుతుందిలే అని పారును ఆట పట్టిస్తాడు. ఇదే సమయంలో శివ నారాయణ వస్తాడు. అందరినీ చూసి నవ్వుతాడు. ఇక వీరందరినీ అని పారుజాతం ఏదో మాట్లాడబోతోంది. అదే సమయంలో వీరందరినీ నేనే పిలిచానని శివ నారాయణ చెబుతాడు. దాంతో పారుజాతం షాక్ అవుతుంది. కార్తీక్ గాడు నాతో ఆట ఆడుకుంటున్నాడని మండి పడుతుంది. శివ నారాయణ పిలిచాడని చెబితే సరిపోయేది కదా అని అనుకుంటుంది. ఇక రేపే పెళ్లి కాబట్టి సంప్రదాయంగా మగ పెళ్లి వారిని ఒక రోజు ముందుగానే పలిచామని అంటుంది. ఎందుకు అని పారుజాతం ప్రశ్నిస్తుంది. ఎందుకు ఏమిటీ విడిది ఇచ్చి వియ్యంకుల వారికి మర్యాద చేయడానికి అని శివ నారాయణ చెబుతాడు. శివ నారాయణ అందరినీ పలకరిస్తాడు కానీ శ్రీధర్ ను మాత్రం పలకరించడు. దాంతో శ్రీధర్ ఈ పెళ్లి అయ్యేలోపు మీ సంగతి చెబుతానని అంటాడు.

ఇక మరోవైపు కాంచన, దశరథ, సుమిత్ర, పారు, జ్యోత్స్న, అనసూయ అందరూ విడిది ఇంట్లో కూర్చొంటాడు. ఇక రేపే కార్తీక్ బాబు దీపాల పెళ్లి అని ధశరథ మాట్లాడుకుంటూ ఉంటారు. కాంచన మొహంలో చిరునవ్వు వెలిగిపోతుంది. అందరూ అంత సంతోషంగా ఉండటం చూసి పారుజాతం కడుపు మండి పోతుంది. వెంటనే దశరథ ఇలా అందరినీ చూస్తుంటే నిజం పెళ్లిలానే ఉందని అంటుంది. అందుకు దశరథ నిజం పెళ్లి ఏంటీ పిన్ని నిజంగా జరిపిస్తున్న పెళ్లే కదా, కార్తీక్ బాబు నాకు అల్లుడు కాబోతున్నాడు అని అంటాడు. ఇంకా నయ్యం జ్యోత్స్న మెడలో తాళి కట్టమనలేదు అని పారు మాట జారుతుంది. దాంతో కాంచన, అనసూయ మండిపోతారు. ఇక సూటి పోటీ మాటలు మాట్లాడే బదులు సైలెంగా ఊరుకోవడం మేలని, సుమిత్ర వదిన మనస్సులోనూ బేధం ఉన్నదని తెలిస్తే మేం ఇక్కడికి వచ్చే వారిమే కాదని కాంచన అంటుంది. ఇలా మాట మాట పెరుగుతుంది. ఇక దశరథ కలుగ జేసుకొని అసలు పారుజాతం పిన్ని వల్లే ఈ గొడవ జరిగిందని అంటాడు. అందరూ సంతోషంగా ఉంటే నువ్వు ఓర్చుకోలేవా? అని ప్రశ్నిస్తాడు. అదే సమయంలో శివ నారాయణ వచ్చి ఏం జరిగిందని ప్రశ్నిస్తాడు. ఏం లేదు నాన్న పెళ్లి ఏర్పాట్ల గురించే అని చెబుతాడు. దాంతో శివ నారాయణ పారును తన బెడ్ రూమ్ లోకి వెళ్లి ఒక కవర్ ఉంటుంది వెళ్లి తీసుకొని రమ్మని చెబుతాడు. ఇక తన కూతురికి తన చేతుల మీదుగా బట్టలు పెడుతానని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X