Karthika Deepam 2 August 22nd: దీపా కార్తీక్ ల పెళ్లి ఏర్పాట్లు.. చెడగొట్టేందుకు జ్యోత్స్న అలాంటి ప్లాన్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 21వ తేదీ 442వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తెల్లవారితే పెళ్లి ఉండటంతో కార్తీక్ బాబు, దీపాలతో కాంచన, అనసూయ, శౌర్య పాప, శ్రీధర్ కుటుంబ సమేతంగా ఒక రోజు ముందుగానే శివ నారాయణ ఇంటికి వస్తారు. ఇలా అందరూ రావడంతో పారుజాతం షాక్ అవుతుంది. అసలు విమ్మల్ని ఎవరు రమ్మన్నారని అడుగుతుంది. ఇదే సమయంలో శివ నారాయణ వచ్చి నేనే రమ్మన్నానని చెబుతాడు. రేపే పెళ్లి ఉండటంతో మగ పెళ్లి వారిని సంప్రదాయం ప్రకారం ఒక రోజు ముందుగానే రమ్మంటాం కదా అని దశరథ వివరిస్తాడు. అందుకే వాళ్లను ఉండటానికి రమ్మన్నామని చెబుతారు. వారికి విడిది ఇంటిని ఇచ్చి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోమని శివ నారాయణ చెబుతాడు. అలాగే ఇప్పుడు కార్తీక్ బాబు, దీపాలు మనకు పని మనుషులు కాదని చెబుతాడు. ఎలాంటి లోటు రాకుండా చూసుకోండి అని చెబుతాడు.
ఇక విడిది ఇంట్లో అందరూ ఒకే చోట కూర్చొని ఉంటారు. కాంచన, దశరథ, సుమిత్ర, జ్యోత్స్న, పారుజాతం, కార్తీక్ బాబు హాలులో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కాంచన తన అన్నయ్య దశరథతో సంతోషంగా ఉండటం చూసి పారుజాతం తట్టుకోలేకపోతుంది. దీంతో వెంటనే దశరథను పిలిచి ఇది నిజం పెళ్లిలానే ఉందని అంటుంది. నిజం పెళ్లి ఏంటి పిన్ని నిజంగా మన ఇంట్లో జరుగుతున్న పెళ్లే కదా ఇది అని ప్రశ్నిస్తాడు. ఇంకా నయం కార్తీక్ బాబును జ్యోత్స్న మెడలో తాళి కట్టమని అనలేదు అని అంటుంది. దీంతో దశరథ, కాంచన పారుపై ఫైర్ అవుతారు. నీకు ఎలాంటి సమయంలో ఎలా మాట్లాడాలో అసలు తెలియడం లేదా అని ప్రశ్నిస్తారు. దీంతో సుమిత్ర, పారు, జ్యోత్స్న ఒకసైడ్ కాంచన, కార్తీక్ బాబు, దశరథ, అనసూయ ఒకవైపుగా గర్షణ పడుతూ ఉంటారు. అదే సమయంలో శివ నారాయణ రావడంతో అందరూ సైలెంట్ అవుతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 22వ తేదీ 443 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

శివ నారాయణ రావడంతో అందరూ గొడవ పడటం ఆపుతారు. ఏమైంది ఎందుకు ఇందాక అందరూ గట్టిగా మాట్లాడుతూ ఉన్నారని అడుగుతాడు. ఏమీ లేదు నాన్న రేపటి పెళ్లికి ఏర్పాట్లు ఎలా చేయాలా? అని మాట్లాడుకుంటున్నామని దశరథ బదులిస్తాడు. దాంతో శివ నారాయణ అంతకంటే ముందు మనం చేయాల్సిన ముఖ్యమైన పని మరొకటి ఉందని చెబుతుంది. ఇక పారుజాతాన్ని పిలిచి వెంటనే వెళ్లి తన బెడ్ రూమ్ లో ఒక కవర్ ఉంటుంది తీసుకురమ్మని అంటాడు. వెళ్లి తీసుకొని వస్తుంది. ఆ వెంటనే కుంకుమ తీసుకొని రమ్మని చెబుతాడు. అన్ని ఒకేసారి చెప్పొచ్చు కదా అని పారుజాతం మండిపడుతుంది. వెళ్లి కుంకుమ తీసుకొని వస్తుంది. ఇక ఆ తర్వాత శివ నారాయణ ఆడపడుచు కాంచనకు తానే స్వయంగా బట్టలు పెడుతానని అంటాడు. మీరెవ్వరు ఎలా బట్టలు పెట్టినా ఆడపడుచుకు పట్టుచీర పెడుతున్నానని అంటాడు. తన భార్య గుర్తుగా ఈ చీర పెడుతున్నానని చెప్పడంతో కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎవరో పరాయి వాళ్లకు బట్టలు పెట్టినట్టుగా ఇలా నాకు మీరు బట్టలు పెట్టడం ఏంటీ నాన్న అని ఏడుస్తూనే అడుగుతుంది.
నేను పరాయి దాన్ని అయ్యానా? నా కన్న తండ్రి చేతుల మీదుగానే దానం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదని అంటుంది. నేను ఈ ఇంటి బిడ్డనే కదా, మరి మీరు నన్ను కూతురులా చూడనప్పుడు ఈ వస్త్రాలు నాకెందుకు అని అంటుంది. నాకు అస్సలు ఈ బట్టలు వద్దని అంటుంది. దాంతో శివ నారాయణ కూడా భావోద్వేగం అవుతాడు. తన కన్న కూతురు కంట్లో కన్నీళ్లు చూసి, నా కూతురుగానే చూస్తున్నానని చెబుతాడు. దాంతో కాంచన కన్నీళ్లు పెట్టుకోవడం ఆపుతుంది. అప్పుడు తండ్రి పెట్టిన చీరను తీసుకుంటుంది. నీ తండ్రి నిన్ను ఆయన కన్న కూతురుగా చూస్తున్నప్పుడు మిగితా వాళ్లు ఏమనుకుంటే ఏంటని అనసూయ కాంచనతో అంటుంది. ఇక ఇప్పుడు అసలైన పెళ్లి వాతావరణం వచ్చిందని చెబుతుంది. మరోవైపు ఈ పెళ్లిని ఎలా చెడగొట్టాలని పారు, జ్యోత్స్న ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయని, ఇక పెళ్లిని ఆపలేమని పారుజాతం అంటుంది. ఇదే సమయంలో శ్రీధర్ వచ్చి మనం అనుకుంటే ఆపొచ్చని అంటాడు. అసలు నువ్వు పెళ్లికి రాకుండా ఉంటే పెళ్లి అదే ఆగిపోయేదని పారు, జ్యోత్స్న అంటారు. కొన్ని ఎమోషనల్ సిచ్యూయేషన్ లో ఒప్పుకోవాల్సి వచ్చిందని చెబుతాడు.
ఇక ఇప్పుడు మనం ముగ్గురుం ఒక్కటైతే పెళ్లిని ఆపగలమని అంటాడు. నాకొడుకు కార్తీక్ బాబు దీపా వల్లనే కష్టాలు అనుభవిస్తున్నాడని, వాడికి తెలియకుండానే ఈ పెళ్లిని ఆపి వాడి జీవితాన్ని బాగుచేయాలని శ్రీధర్ మనస్సులో అనుకుంటాడు. అందుకే పారు, జ్యోత్స్నలతో చేయి కలుపుతున్నానని అనుకుంటాడు. పలు రకాల ప్లాన్స్ అనుకుంటారు. కానీ పెళ్లి చెడగొట్టాలంటే ఇంకా పెద్ద ప్లాన్ కావాలని ఆలోచిస్తూ ఉంటారు. సమయం చూసి కొడుదామని అనుకుంటారు. మరోవైపు దీపాను పెళ్లి కూతురిగా ముస్తాబు చేస్తారు. ఈ సమయంలో సుమిత్ర దీపాకు బుగ్గ చుక్కపెడుతుంది. దీపాపై తన కోపాన్ని మొత్తం మొహంపైనే చూపిస్తుంది. ఇక పారు దీపాను నిన్ను కని పడేసిన కన్నతల్లి కూడా నీకు ఇలా పెళ్లి అవుతుందని ఊహించి ఉండదు అని అంటుంది. దాతో దీపా నా కన్న తల్లి సుమిత్రనే.
నువ్వే నన్ను విడదీశావని పారు గురించి మనస్సులో అనుకుంటుంది. ఇక దీపాపై సుమిత్రకు మరింత కోపం వచ్చేలా జ్యోత్స్న గతాన్ని గుర్తు చేస్తుంది. దీపా తనను కొట్టింది, కార్తీక్ బాబుతో పెళ్లిని చెడగొట్టింది, పోలీసులకు అప్పగించింది, బుల్లెట్ పేల్చిన ప్రతి విషయాన్ని గుర్తు చేస్తుంది. దీపాపై సుమిత్ర రగిలిపోతున్న సమయంలో పూలు ఇచ్చి దీపాకు అలంకరించమని అంటుంది జ్యోత్స్న. ఇక కోపంలో సుమిత్ర నేలపై విసిరేస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











