Karthika Deepam 2 August 23rd: దీపాతో జ్యోత్స్న గొడవ.. పెళ్లిని ఆపే ప్రయత్నంలో చివరి ప్లాన్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 22వ తేదీ 443వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు దీపాల పెళ్లికి శివ నారాయణ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఇక ఇదే సమయంలో జోష్ణ ఎప్పటికప్పుడు పెళ్లిని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. జోష్ణకు తోడుగా పారిజాతం కూడా కార్తీక్ బాబు దీపాల పెళ్లిని ఎలాగైనా ఆపాలని వ్యూహాలు రచిస్తారు. కానీ ఓవైపు శివ నారాయణ దశరథ పెళ్లి ఏర్పాట్లు వేగం చేస్తారు. దీంతో జోష్ణకు కంగారు పెరుగుతుంది. శివ నారాయణ ఇంటికి కుటుంబ సమేతంగా శ్రీధర్, కాంచన, కార్తీక్ బాబు, దీప, అనసూయ, శౌర్య పాప అందరూ ఒక రోజు ముందుగానే వస్తారు. దాంతో శివ నారాయణ వారికి సకల మర్యాదలు చేయాలని చెబుతారు. అయితే తన కూతురు కాంచన కోసం ప్రత్యేకంగా ఒక చీరను తెప్పిస్తారు. ఇక తన భార్య గుర్తుగా ఆ చీరను ఆడబిడ్డకు పెడుతున్నానని చెబుతాడు.ఆడబిడ్డకు పెట్టడం ఏంటీ నాన్న, నీ కూతురుగా నన్ను చూడటం లేదా? అని ప్రశ్నిస్తుంది.

నేను నీకు ఏమీ కానా? అనికన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో శివ నారాయణ కూడా ఎమోషనల్ అవుతారు. నా కూతురిగానే చూస్తున్నానని చెప్పడంతో కాంచన చీరను తీసుకుంటుంది. ఇక కన్న కూతురు కాంచన కు తన చేతులతో పట్టు చీరను పెడతాడు. దాంతో కాంచన ఎంతో సంతోషిస్తుంది. అందరు సంతోషంగా ఉంటున్న సమయంలో పారిజాతం జోష్ణల కడుపు మండిపోతుంది. ఎట్టి పరిస్థితిలోనూ కార్తీక్ బాబు దీపాల పెళ్లిని ఆపాలని పారిజాతం జోష్ణ శ్రీధర్ కలిసికట్టుగా ప్లాన్ చేస్తారు. ఇక మరోవైపు దీపాను, కార్తీక్ బాబును పెళ్లికి రెడీ చేయిస్తారు. పట్టు వస్త్రాల్లో ఇద్దరు ముద్దుగా రెడీ అవుతారు. కార్తీక్ బాబును కాంచన, అనసూయ రెడీ చేస్తారు. ఇక దీవాను సుమిత్ర, జోష్ణ, పారిజాతం ముగ్గురు కలిసి తయారుచేస్తారు. ఇదే సమయంలో జోష్ణ దీపాపై సుమిత్ర మండిపడేలా చేస్తుంది. దీపపై సుమిత్రకు కోపం వచ్చేలా గతాన్ని గుర్తుచేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 22వ తేదీ 444 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?
దీపపై సుమిత్రకు పట్టలేని కోపం వచ్చేలా జోష్ణ గతంలో జరిగిన విషయాలన్నిటిని సుమిత్రకు గుర్తుచేస్తుంది. దీపా వలనే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లాలని, దీపా వల్లనే కార్తీక్ బావ తన పెళ్లి ఆగిపోయిందని, దీపా వల్లనే నాన్న గుండెలో బుల్లెట్ దిగిందని గుర్తు చేస్తుంది. అయినా ఇవన్నీటిని పట్టించుకోని దీప పోయిన కోపం తెచ్చుకోవద్దు అమ్మ అంటూ కపట ప్రేమను ప్రదర్శిస్తుంది. ఇక చెప్పాల్సినవని చెప్పి సుమిత్ర దీపపై రగిలిపోతున్న సమయంలో మల్లెపూలు ఇచ్చి దీప తలలో అలంకరించమని అంటుంది. ఇక ఆ పూలను సుమిత్ర తీసుకొని నేలకు విసిరి కొడుతుంది. అది చూసిన దీప తట్టుకోలేక పోతుంది. కన్న తల్లితోనే అసహ్యించుకునేలా చేసుకుంటున్నానని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇక సుమిత్ర మాట్లాడుతూ ఈ దీపా వలన నాకు మనశ్శాంతి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎవరి చావు వారు చూసుకోలేరు. కాని దీప వల్ల నా చావును నేను చూసుకుంటున్నాను. వాళ్ళ అమ్మ దీపాను నా చావు కోసమే కనింది. నాకు మనశ్శాంతి లేకుండా చేయడం కోసమే దీపాను కనింది అని మండిపడుతుంది. ఆ మాటలు విన్న దీప నా కన్నతల్లి నువ్వే అమ్మ అని మనసులో అనుకుంటుంది. ఇక బయటికి నా తల్లి గురించి అలా మాట్లాడ కండి అమ్మ అని చెబుతుంది. నా తల్లి ఎలాంటి తప్పు చేసి ఉండదని అంటుంది. ఏ తల్లి కూడా తన బిడ్డను ఇతరులను నాశనం కోసం అసలు కని ఉండదని చెబుతుంది. ఇక ఇదే సమయంలో దశరథ దీపను చూసేందుకు ఆ గదిలోకి వస్తాడు. వస్తూ వస్తూనే మన కూతురిని పెళ్లికి రెడీ చేసావా సుమిత్ర అని అడుగుతాడు.
ఇక దశరథ రాగానే దీపాన్ని మంచిగా రెడీ చేస్తున్నట్టుగా అందరూ నటిస్తారు. ఆ రెడీ అవుతుందని దశరథ తో సుమిత్ర చెబుతుంది. కానీ దశరథ దీప మొహం చూడగా కన్నీటితో నిండిపోతుంది. దీంతో ఏం జరిగిందని దీపాను అడుగుతాడు. దీప ఏం చెప్పకుండా నాన్న అంటూ దశరథను పట్టుకొని ఏడుస్తుంది. మీ నాన్న గుర్తుకు వచ్చాడా దీప అంటూ దశరథ ఓదార్చుతాడు. నిన్ను కన్న తండ్రి పెంచిన తండ్రి మన చుట్టూనే ఉంటారని, వారి ఆశీర్వాదం నీతోనే ఉంటుందని చెబుతాడు. ఈరోజు నువ్వు సంతోషంగా ఉండాలని చెప్పి కన్నీళ్లు తుడుస్తాడు. ఇక ముహూర్త సమయానికి దీపాన్ని తీసుకొని రమ్మని సుమిత్రకి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు కార్తీక్ బాబు కూడా రెడీ అవుతాడు. పెళ్లిలో ఎలాంటి గొడవ రాకుండా జాగ్రత్తగా ఉండాలని కార్తీక్ బాబు కాంచన అనుకుంటూ ఉంటారు.
పెళ్లిలో మనతో ఎలాంటి గొడవ వచ్చే సమస్య లేదని కార్తీక్ బాబు అంటాడు. వస్తే మాత్రం మాస్టర్ తోనే రావాలని సందేహం వ్యక్తం చేస్తాడు. ఇక మాస్టారు నేను ఇక్కడే ఉన్నానని బదులిస్తాడు. పెళ్లిలో ప్రతి ఒక్కరిని మర్యాదగా పలకరించే మాట్లాడుతున్నానని చెబుతాడు. కానీ శౌర్య పాప మాత్రం శ్రీధర్ తాత అందరితో ఇలా మాట్లాడుతున్నారని, తనకు మర్యాదలు చేయాలని, తనకు కోపం వస్తే పెళ్లి ఆగిపోతుందని అంటున్నాడని చెబుతుంది. దాంతో శ్రీధర్ ను ఇలాంటివన్నీ మానుకోండి అని కాంచన చెబుతుంది. ఇంకా మరోవైపు పెళ్లి ఎలా చెడగొట్టాలని జోష్ణ పారిజాతం ఆలోచిస్తున్నారు. వారి దగ్గరికి శ్రీధర్ వెళ్లి ఆపడానికి ఒకే ఒక ఉపాయం ఉందని, తాళిబొట్టును కనిపించకుండా చేయాలని అంటాడు. అది వర్కౌట్ కాదని, శౌర్య పాపను కిడ్నాప్ చేస్తే పెళ్లి ఆగిపోతుందని జోష్ణ ప్లాన్ చేస్తుంది. ఇక ఇదే ప్లాన్ ఫాలో అవుదామని అందరూ అనుకుంటారు. ఇక శౌర్య పాపను కిడ్నాప్ చేశారా? లేదా? ఇంతకీ పెళ్లి జరిగిందా లేదా? అనేది తర్వాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











