Karthika Deepam 2 August 25th: అన్నంత పని చేసిన జ్యోత్స్న.. కార్తీక్ బాబు, దీపాల పెళ్లికి ఆటంకం

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 23వ తేదీ 444వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీపాల పెళ్లికి అన్ని ఏర్పాట్లను చేస్తారు. ఇక వారిద్దరిని పెళ్లి కొడుకుగా, పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో దీపాను ముద్దుగా రెడీ చేస్తారు. ఇక మీనా సంతోషంగా కనిపించడంతో జ్యోత్స్న ఓర్వలేక పోతుంది. ఇక ఎక్కడ సుమిత్రకు దగ్గర అవుతుందోనని సుమిత్రను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. గతంలో జరిగిన విషయాలన్నింటినీ గుర్తుకు చేస్తుంది. దాంతో సుమిత్రకు దీపాపై ఒళ్లు మండుతుంది. దీపా జడలో మల్లెలు పెట్టమని ఇస్తే వాటిని నేలకు విసిరి వేస్తుంది. వెంటనే దీపాపై అనరాని మాటలను అంటూ ఉంటుంది. దాంతో దీపా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అస్సలు నా కన్నతల్లితోనే మాటలు పడాల్సి వస్తోందని బాధపడుతుంది. ఇదే సమయంలో దశరథ వస్తాడు. ఆయన్ని చూసిన వెంటనే సుమిత్ర, జ్యోత్స్నలు దీపాపై కపట ప్రేమను చూపిస్తారు. మనస్ఫూర్తిగా దీపాను పెళ్లి కూతురుగా రెడీ చేస్తున్నట్టు నటిస్తారు.

ఇక దశరథ వచ్చి మన కూతురు దీపాను రెడీ చేస్తున్నావా సుమిత్ర అనగానే, హా రెడీ చేస్తున్నామని సమాధానం ఇస్తుంది. ఆ వెంటనే దీపా దశరథను నాన్న అని పట్టుకొని ఏడుస్తుంది. ఇక దశరథ దీపాను ఓదార్చుతాడు. మీ నాన్న గుర్తుకొచ్చాడా? దీపా అని అంటాడు. వాళ్లు ఎప్పుడూ నీ చుట్టు పక్కలే ఉంటారని చెబుతాడు. నువ్వు ఏమాత్రం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన సమయం ఇది కాదని చెబుతారు. ఇక రెడీ అవ్వగానే త్వరగా కిందికి తీసుకొని రండి అని, ముహుర్తానికి సమయం దగ్గర పడుతోందని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత దీపాతో సుమిత్ర మాట్లాడుతుంది. ఆయన వరసలు పెట్టి పిలిచారు కదా అని నువ్వు కూడా నన్ను నిజంగానే అమ్మా అని పిలవొద్దని అంటుంది. దీంతో దీపా కన్నీళ్లు పెట్టుకుంది. ఆ వెంటనే అమ్మాయిని కిందికి తీసుకు రండి అని పురోహితుడు చెప్పడంతో వెంటనే తీసుకొని వస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 25వ తేదీ 445 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 445 August 25th 2025

పెళ్లి కూతురిగా ముస్తాబైన దీపా అందంతో వెలిగి పోతుంది. దీపాను అలా నిండుగా సంప్రదాయ దుస్తుల్లో చూసిన కార్తీక్ బాబు ఫిదా అవుతాడు. మరోవైపు తన కొడుకు పెళ్లి ఘనంగా జరుగుతున్నందుకు కాంచన పట్టలేని ఆనందంలో ఉంటుంది. దశరథ, కాంచన, బంధుమిత్రులందరూ కార్తీక్ బాబు, దీపాల పెళ్లిలో సంతోషంగా ఉంటారు. కానీ జ్యోత్స్న, పారిజాతం మాత్రం కుళ్లుకుంటారు. ఎన్ని ప్రయత్రాలు చేసినా చివరిగా పెళ్లి జరుగుతూనే ఉందని జ్యోత్స్న అంటుంది. ఎలాగైనా ఇప్పుడే ఈ పెళ్లిని ఆపాలని అనుకుంటుంది. మనం ఏదో చేయాలని ఆలోచించి చివరికి ఏం చేయకుండా ఉండిపోతున్నామని అంటుంది. ఇక మరోవైపు దీపాను తీసుకొని వచ్చి పెళ్లి పందిరిలో కార్తీక్ బాబు పక్కన కూర్చొబెడుతారు. పూజారి మంత్రోచ్ఛారణలు చదువుతూనే ఉంటారు. అందరి మొహంలో సంతోషం వెలిగి పోతుంది. సుమిత్ర మాత్రం మనస్సులో అయిష్టాన్ని నింపుకొని ప్రయత్నపూర్వకంగా నవ్వుతూ నటిస్తుంది. ఇక దీపా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన కార్తీక్ బాబు ఎవరో ఏదో అని ఉంటారులే అని అర్థం చేసుకుంటాడు.

ఇక మరోవైపు జ్యోత్స్న ఎలాగైనా పెళ్లిని ఆపాలని ప్లాన్ చేస్తూనే ఉంటుంది. ఇక పారుజాతం ఆ తాళిని ఎత్తుకొని రావాలా? అని అంటుంది. అలాగైతే పెళ్లేమీ ఆగిపోదు. ఏదో ప్రయత్నం చేసి 10 నిమిషాల్లో మళ్లీ పెళ్లి జరిపిస్తారు అని జ్యోత్స్న బదులిస్తుంది. ఇక పారిజాతం మరో ఐడియా ఇస్తుంది. లేదంటే పాలల్లో మత్తు మందు కలిపి ఇవ్వాలా? అని అంటుంది. అలాగైనా పెళ్లి ఆగిపోయే పరిస్థితి రాదని జ్యోత్స్న అభిప్రాయపడుతుంది. ఇదే సమయంలో శ్రీధర్ కూడా వస్తాడు. పలు ప్లాన్స్ చెబుతాడు. కానీ జ్యోత్స్న వద్దని అంటుంది. దాంతో మరీ ఏం చేద్దామని పారిజాతం, శ్రీధర్ లు జ్యోత్స్నను అడుగుతారు. పెళ్లి ఆగాలంటే పెద్ద ఆపద, ఆటంకం రావాలని అంటుంది. ఇప్పటికిప్పుడు అందరి దృష్టిని మళ్లించాలంటే కేవలం శౌర్యను కిడ్నాప్ చేయడం తప్ప మరే దారి లేదని అంటుంది. దీంతో శౌర్యను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఇక పిల్లంతా ఎక్కడ ఆడుకుంటున్నారో చూస్తారు. ఒక గదిలో ఆడుకుంటుండటం చూసి శ్రీధర్ వెళ్లి తాళం వేసి వస్తాడు. కానీ శ్రీధర్ కళ్లజోడు పెట్టుకోవడంతో శౌర్య పాప అనుకొని వేరే చిన్నారిని ఆ గదిలో బంధిస్తాడు.

ఇక తిరిగి వచ్చి శౌర్యను కిడ్నాప్ చేశానని జ్యోత్స్న, పారుజాతంతో చెబుతాడు. ఇక ఇదే సమయంలో కాంచన పెళ్లి జరుగుతున్న సమయంలో శౌర్య పాప ఎక్కడ ఉందని అడుగుతుంది. తన తల్లిదండ్రుల పక్కనే శౌర్య ఉండాలని అంటుంది. ముందుగా కాంచన అనసూయకు చెప్పి శౌర్య ను తీసుకు రమ్మని అంటుంది. ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుందని నేను తీసుకొని వస్తానని వెళ్తుంది. కానీ తిరిగి వచ్చి శౌర్య పాప కనిపించడం లేదని అంటుంది. దీంతో కార్తీక్ బాబు, దీపా, కాంచన కంగారు పడుతారు. పెళ్లి ఆగిపోయినా పర్లేదు కానీ శౌర్య పాపను వెతకాలని కాంచన అంటుంది. ఆ మాటలు విని జ్యోత్స్న, కాంచన సంబర పడుతారు. వీళ్లంతా కంగారు పడుతున్న సమయంలో శౌర్యను తీసుకొని శివ నారాయణ వస్తాడు. ఈ ట్విస్ట్ కు జ్యోత్స్న దిమ్మతిరిగి పోతుంది. శౌర్య నీ దగ్గరే ఉందా అని అడుగుతారు. దీంతో అవును నా దగ్గరే ఉంది. బయటికి వెళ్తుంటే నాతో పాటు తీసుకొని వెళ్లాను అని చెబుతాడు. దీంతో జ్యోత్స్న శ్రీధర్ పై మండి పడుతుంది. ఒక్క పని సరిగా చేయలేవు అని తిడుతుంది. ఇక పెళ్లి ఆపాలంటే కేవలం పాలల్లో మత్తు మందు కలిపి ఇవ్వడమే అని జ్యోత్స్న అంటుంది. చివరిగా ఇలా పెళ్లికి ఆటంకం కలిగించాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X