Karthika Deepam 2 August 26th: పరువు పోగొట్టుకున్న జ్యోత్స్న.. పెళ్లిలో కార్తీక్ బాబు మాస్టర్ స్ట్రోక్
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 ఆగస్టు 25వ తేదీ 445వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న ఎలాగైనా పెళ్లిని ఆపాలని ప్లాన్ చేస్తూనే ఉంటుంది. కార్తీక్ బాబు, దీపాల పెళ్లిని ఆపాలని జ్యోత్స్న ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ సమయంలో పారుజాతం కూడా జ్యోత్స్నకు తోడుగా ఉంటుంది. పెళ్లి జరగకుండా ఉండేందుకు ఆ తాళిని ఎత్తుకొని రావాలా? అని జ్యోత్స్నను అడుగుతుంది. వద్దు అని జ్యోత్స్న బదులిస్తుంది. అలా చేయడం వల్ల పెళ్లేమీ ఆగిపోదని చెబుతుంది. లేకపోతే పాలల్లో మత్తు మందు కలిపి దీపాతో తాగించాలా? అని పారుజాతం మరో ఐడియా ఇస్తుంది. ఆ సలహాను కూడా జ్యోత్స్న తిరస్కరిస్తుంది. అలా చేసినా కూడా పెళ్లి ఆగిపోయే అవకాశం ఉండదని, మత్తుగా పడుకొని లేచి వచ్చి ముహుర్తం సమయానికి పెళ్లి చేసుకుంటుందని అంటుంది. ఇక కేవలం మన దగ్గర ఉన్న ఐడియా శౌర్య పాపను కిడ్నాప్ చేయడమే అని అంటుంది. దాంతో పారు, శ్రీధర్ కూడా జ్యోత్స్న చెప్పిన ప్లాన్ కు ఒప్పుకుంటారు. ఇక వెంటనే శౌర్య పాపను ఒక గదిలో బంధించమని శ్రీధర్ కు జ్యోత్స్న చెబుతుంది.
దాంతో శ్రీధర్ వెళ్లి ఒక పాపను గదిలో బంధిస్తాడు. ఆ చిన్నారే శౌర్య పాప అని అనుకుంటాడు. కానీ శౌర్య పాప కాకపోవడం విశేషం. ఇక పెళ్లి పందిరి దగ్గర శౌర్య పాప కనిపించకపోవడంతో కాంచన కంగారు పడుతుంది. అసలు పెళ్లిలో శౌర్య పాపను తన తల్లిదండ్రులకు పక్కనే ఉండమని అనసూయ చెబుతుంది. ఇక అనసూయ వెళ్లి శౌర్య పాపను వెతుకుతుంది. కానీ ఎక్కడా కనిపించదు. దీంతో శౌర్య పాప కనిపించడం లేదని చెబుతుంది. దాంతో కార్తీక్ బాబు, దీపా కూడా కంగారు పడుతారు. ఇక పెళ్లి ఆగిపోయిన పర్వాలేదు శౌర్యను వెతకాలని అనుకుంటారు. కానీ అదే సమయానికి శివ నారాయణ, శౌర్య ఇద్దరు కలిసి వస్తారు. శౌర్య నాతోనే ఉందని శివ నారాయణ చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇక తమ ప్లాన్ ఫెయిల్ అయ్యిందని జ్యోత్స్న అప్సెట్ అవుతుంది. మొత్తం చెడగొట్టావంటూ శ్రీధర్ పై మండి పడుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 26వ తేదీ 446 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కార్తీక్ బాబు, దీపాల పెళ్లికి ఓవైపు శివ నారాయణ, దశరథ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి వేడుకను జరిపిస్తారు. ఇక ఎన్నో సార్లు పెళ్లిని చెడగొట్టాలని ప్రయత్నించిన జ్యోత్స్న, పారుజాతం, శ్రీధర్ ఓడిపోతారు. శౌర్యను కిడ్నాప్ చేయాలనే తమ ప్లాన్ ఫెయిల్ అయ్యిందని, ఇక వెంటనే ఏదోకటి చేసి పెళ్లి ఆపాలని జ్యోత్స్న అనుకుంటుంది. దీంతో వెంటనే పారిజాతం, శ్రీధర్ తో మళ్లి సీక్రెట్ గా కలుస్తుంది. ఈసారి పాలల్లో మత్తు మందు ఇచ్చి దీపాకు స్పృహ లేకుండా చేయాలని అనుకుంటుంది. ఇప్పుడు మనకున్న మెరుగైన ఐడియా ఇదొక్కటే అని అంటుంది. ఇక ఇదే సమయంలో పని మనిషి వచ్చి పారిజాతాన్ని శివ నారాయాణ పిలుస్తున్నాడని చెబుతుంది. దీంతో వెంటనే పారుజాతం అక్కడి నుంచి వెళ్తుంది. ఇక జ్యోత్స్న పాలల్లో మత్తు మందు కలిపి స్వయంగా తానే దీపా చేతులకు ఇస్తానని అంటుంది. ఈసారి నువ్వు సైలెంట్ గా ఉండు మామయ్య అని శ్రీధర్ కు చెబుతుంది. ఇక శ్రీధర్ సైలెంట్ గా ఉండిపోతాడు. అనుకున్నట్టుగానే జ్యోత్స్న పాలల్లో మత్తు మందు కలుపుతుంది. ఆ పాలను దీపాకు ఇద్దామని వెళ్తున్న సమయంలో మళ్లీ పని మనిషి వచ్చి జ్యోత్స్న అమ్మగారిని నాన్న దశరథ పిలుస్తున్నారని చెబుతుంది.
దాంతో జ్యోత్స్న వెంటనే వెళ్లాలని అనుకుంటుంది. లేదంటే దశరథకు తనపై అనుమానం వస్తుందని భయపడుతుంది. ఇక తన చేతిలోని పాలను వెంటనే ఆ పని మనిషికి ఇచ్చి దీపాకు వెంటనే ఇవ్వమని అంటుంది. ఆ పని మనిషి పాలను తీసుకొని దీపకు ఇవ్వడానికి వెళ్తుంది. ఇదే సమయంలో పారిజాతం ఎదురవుతుంది. ఈ పాలు ఎవ్వరికీ అని అడుగుతుంది. దాంతో ఆ పని మనిషి దీపా కోసం అని చెబుతుంది. ఈ ఇంటికి యజమానిని నేను పాలు నాకు ఇవ్వాలి గానీ దీపాకు ఇవ్వడం ఏంటే అని ప్రశ్నిస్తుంది. ఈ పాలు మొత్తం నేను తాగుతానని తీసుకుంటుంది. ఆ విషయాన్ని శ్రీధర్ చూస్తాడు. వెంటనే వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికే పారిజాతం పాలన్నీ తాగేస్తుంది. అసలు ఈ పాలు నువ్వు ఎందుకు తాగావని శ్రీధర్ అడుగుతాడు. ఏమైందిప్పుడు అని పారిజాతం అంటుంది. వెంటనే జ్యోత్స్న వాళ్లిద్దరి దగ్గరకు వస్తుంది. ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది. అసలు ఆ పాలు నీకోసం కాదని, దీపా కోసం పంపించామని జ్యోత్స్న చెబుతుంది. అందులో మత్తు మందు కలిపామని జ్యోత్స్న చెబుతుంది. మొదటి ప్లాన్ ను శ్రీధర్ మామ చెడగొడితే, రెండో ప్లాన్ ను నువ్వు చెడగొట్టావని జ్యోత్స్న మండి పడుతుంది.
ఇక తర్వాత దశరథ జ్యోత్స్నను పిలుస్తాడు. కాస్తా పని ఉంది నాతో రా అమ్మ అని జ్యోత్స్నను వెంట తీసుకెళ్తాడు. ఇక పెళ్లి కార్యక్రమం దగ్గరే దీపాను ఉంచుతాడు. ఏమైంది డాడీ అని జ్యోత్స్న అడగటంతో ఈ పెళ్లి పూర్తి అయ్యే వరకు నువ్వు నాతోనే ఉండు అమ్మ అని చెబుతాడు. దీంతో జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. నేను ఎక్కడా ఈ పెళ్లిని అడ్డుకుంటానోనని నువ్వు సందేహిస్తున్నావు కదా నాన్న అని అంటుంది. ఇక దశరథ కూడా నువ్వు ఎప్పుడు ఏం చేస్తావోననే భయంతోనే నా పక్కనే ఉండమంటున్నాను అని మనస్సులో అనుకుంటాడు. ఇక మరోవైపు కార్తీక్ బాబు, దీపాల పెళ్లి మాంగళ్య ధారణ వరకు వస్తుంది. కార్తీక్ బాబు కాళ్లను దశరథ, సుమిత్రలతో పురోహితుడు కడిగిస్తాడు. ఆ తర్వాత మంగళసూత్రాన్ని జ్యోత్స్నకు ఇచ్చి అందరి ఆశీర్వాదం తీసుకొని రమ్మని చెబుతాడు. ఇక దీపా అందరికీ మంగళసూత్రాన్ని చూపించే సమయంలో తాళిబొట్టును మాయం చేస్తుంది. దీంతో అందరూ కంగారు పడుతారు. దీంతో జ్యోత్స్నపై అనుమానం వ్యక్తం చేస్తుంది. జ్యోత్స్న మన కళ్ల ముందే ఉంది కదా ఎలా తీస్తుందని దశరథ ప్రశ్నిస్తాడు. ఇక ఆ తర్వాత శివ నారాయణ తన మొదటి భార్య మంగళసూత్రాన్ని ఇచ్చి ముహుర్తం సమయానికి పెళ్లి జరిపిస్తాడు. దీంతో జ్యోత్స్నకు దిమ్మతిరిగి పోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











