Karthika Deepam 2 September 5th: జ్యోత్స్నపై రెచ్చిపోయిన కార్తీక్ బాబు.. పుట్టెడు శోఖంలో దీపా

Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 4వ తేదీ 454వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు, దీపాల పెళ్లిలో తాళి బొట్టు తీసినందుకు పెద్ద గొడవ జరుగుతుంది. పారుజాతం చేసిన రచ్చతో సుమిత్రనే తాళి బొట్టు తీసిందనే విషయం బయట పడుతుంది. పారుజాతం అందరి ముందు సుమిత్ర గుట్టును రట్టు చేయడంతో షాక్ అవుతుంది. ఇక ఎవరు ఏం చేస్తారో చూస్తానంటూ నేనే తాళిబొట్టు తీశానని అందరి ముందు ఒప్పుకుంటుంది. సుమిత్ర మాట్లాడిన మాటలకు కాంచన, దీపా, కార్తీక్ బాబు, దశరథ, శివ నారాయణ షాక్ అవుతారు. సుమిత్రను నిలదీస్తారు. అసలు ఇలా ఎందుకు చేశావు నీకు పెళ్లి ఇష్టం ఉందా? లేదా? అని ముందే అందరి అభిప్రాయం తీసుకుని చేశాం. కదా అని అంటాడు. దాంతో సుమిత్ర నా శత్రువైనా దీపాకు తల్లిగా నేను ఉండలేనని చెబుతుంది. ఇక దశరథ మాత్రం సుమిత్ర మాటల తీరుకు మండి పడుతాడు. శివ నారాయణ కూడా సుమిత్రపై కోపంగా ఉంటాడు. తన ఇన్నాళ్ల జీవితంలో ఇప్పుడు తల దించుకునే పరిస్థితి వచ్చిందని అంటాడు.

ఇక సుమిత్ర చేసిన పనికి తన చెల్లి కాంచన ఎంతో బాధ పడుతుందని దశరథ అనుకుంటాడు. సుమిత్ర చేసిన పనికి కనీసం కాంచన ముందు తల ఎత్తుకునే పరిస్థితి కూడా లేదని, క్షమాపణ కూడా చెప్పే అవకాశం కూడా లేకుండా పోయిందని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత సుమిత్రను ఎలాగైనా తన చెల్లి కాంచన కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తాడు. నువ్వు చేసింది ముమ్మాటికీ తప్పే అని దశరథ సుమిత్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇక జ్యోత్స్న స్పందిస్తూ అమ్మ ఎందుకు క్షమాపణలు చెబుతుంది నాన్నా. అస్సలు చెప్పదు. ఎవరో అనాథ మనం కుటుంబంలో సమస్యగా మారినప్పుడు, తనను ప్రశ్నించడం మానేసి అమ్మను క్షమించమని అనడం దేనికి అంటూ ప్రశ్నిస్తుంది. అమ్మ అస్సలు క్షమాపణలు చెప్పే అవకాశమే లేదని అంటుంది. అలాగైతే నేను సుమిత్రతో మాట్లాడబోను. అంతే కాదు, జీవితాంతం క్షమాపణలు కూడా చెప్పనని అంటాడు. దాంతో సుమిత్ర షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక సెప్టెంబర్ 5వ తేదీ 455 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 455 September 5th 2025

దశరథ, సుమిత్రల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. దీపాపై సుమిత్ర పీకల్లోతు కోపంలో ఉంది. ఇదే అవకాశంగా జ్యోత్స్న దశరథ, సుమిత్రలను విడగొట్టి, దీపాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా సుమిత్రను క్షమాపణలు చెప్పాలని దశరథ డిమాండ్ చేస్తున్న సమయంలోనే దీపా వస్తుంది. ఇక దీపాను చూసిన వెంటనే జ్యోత్స్న భగభగ మండిపోతుంది. నీ వల్లనే మా ఇంట్లో ఇన్ని గొడవలు అవుతున్నాయి. ఈ రోజు ఏదోకటి తేలిపోవాల్సిందే. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించాల్సిందే అంటూ దీపాను చేయి పట్టుకొని ఇంటి గుమ్మం వరకు తీసుకెళ్తుంది. అసలు నీ వల్లే మా ఇంటికి దరిద్రం చుట్టుకుంది, ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదని మెడపట్టి బయటికి గెంటేస్తుంది. దీపా నెల మీద పడి పోతుంది. ఏడుస్తూ పైకి లేచిన దీపాను జ్యోత్స్న మరోసారి కోపంతో తోసేసింది. పడబోతున్న దీపాను కార్తీక్ బాబు పట్టుకుంటాడు. అదే సమయానికి కార్తీక్ బాబు, శివ నారాయణ బయటకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తారు. ఇక దీపాపై జ్యోత్స్న రెచ్చిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతారు. సుమిత్ర, పారుజాతం, జ్యోత్స్నలు కలిసి దీపాను ఇంట్లో నుంచి వెళ్లగొడుతుండటం చూసి శివ నారాయణ కూడా షాక్ అవుతాడు.

అందరిపై మండి పడుతాడు. తన ఇంట్లో అసలేం జరుగుతుందని అంటాడు. మీరు మరీ ఇంత దిగజారిపోతారని నేను అనుకోవడం లేదు అని మండి పడుతాడు. ఇక కార్తీక్ బాబు కూడా దీపాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలంటే మీరు నాకు పెట్టిన అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేయాలని అంటాడు. ఇక శివ నారాయణ మీరు చేసిన పాపం మీకే చుట్టుకుంటుందని, దీపా ఇంట్లోనే ఉంటుందని జ్యోత్స్న, పారులతో అంటాడు. ఆ తర్వాత దీపా, కార్తీక్ బాబులను ఇంట్లోకి వెళ్లండి అని చెబుతాడు శివ నారాయణ. మరోసారి ఇలాంటి తప్పలు జరిగితే సహించబోనని జ్యోత్స్న, సుమిత్ర, పారులను హెచ్చరిస్తాడు. ఈసారి మీరు ఇంట్లో నుంచి గెంటేయడం కాదు, నేనే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంాడు. దీంతో దశరథ కూడా చాలా అప్సెట్ అవుతాడు. సుమిత్ర, జ్యోత్స్నలపై ఇంకా కోపం పెరుగుతుంది. మీవాళ్ల మా నాన్నకు ఇాలాంటి పరిస్థితి వచ్చిందని రగిలిపోతాడు. ఇక జ్యోత్స్న తన ఎత్తులేవీ సాగడం లేదని షాక్ అవుతుంది. ఇదే అదునుగా ఇంట్లో ఇంకా పెద్ద గొడవ చేయాలని చూస్తుంది.

అయితే, సుమిత్ర క్షమాపణ చెప్పననడంతో ఇక దశరథనే కార్తీక్ బాబు, దీపాలను క్షమించమని అడుగుతాడు. ఎవరో చేసిన తప్పులకు మీరు క్షమాపణలు చెప్పడం ఎందుకు మామయ్య అని కార్తీక్ బాబు అంటాడు. ఇక దశరథ క్షమించమని కార్తీక్ బాబును అడగటం జ్యోత్స్న, సుమిత్రలు చూస్తారు. దీంతో సుమిత్ర మనస్సులో దశరథపై ద్వేషం పెంచేలా జ్యోత్స్న మాట్లాడుతుంది. అసలు నాన్న ఎందుకు క్షమాపణలు చెప్పాడని, అలాగైతే నువ్వు తప్పు చేశావని నాన్న దీపా ముందు ఒప్పుకుంటున్నాడు కదా అమ్మ అని సుమిత్రతో అంటుంది. అసలు నువ్వు తాళిబొట్టు ఎందుకు తీశావు. నీ కూతురు జీవితం కోసమే కదా. అంటే నాన్నకు కూతురు మీద ప్రేమ లేదా? కేవలం నీ ఒక్కదానికే అవసరమా? అని అంటుంది. దాంతో సుమిత్రకు దశరథ తీరుపై ఇంకా కోపం వస్తుంది. దాంతో జ్యోత్స్న దశరథ, సుమిత్రలను విడదీయడానికి ఇదే మంచి సమయం అని భావిస్తుంది. ఈ గొడవను మరింత పెద్దగా చేయాలని, నాన్న దశరథతో సుమిత్రమ్మ అస్సలు మాట్లాడకుండా చూడాలని అనుకుంటుంది. అమ్మ నావైపు ఉంటే ఇంట్లో ఒక్కొక్కరిని ఎలాపడితే అలా ఆడుకుంటానని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X