Karthika Deepam 2 September 16th: కార్తీక్ బాబుకు శివ నారాయణ వార్నింగ్.. దీపాపై జ్యోత్స్న కడుపుమంట
Karthika Deepam 2 Serial Latest Episode : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 15వ తేదీ 463వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శౌర్య పాప ఒంటరిగా ఇంట్లోనే ఆడుకుంటుంది కదా అని శివ నారాయణ డ్రాయింగ్ బుక్ కొని ఇస్తాడు. దాంతో శౌర్యపాప పుట్టిన రోజు సెలబ్రేషన్ కు సంబంధించిన డ్రాయింగ్ ను వేస్తుంది. అది చూసిన శివ నారాయణ ఇవ్వాళ శౌర్య పాప పుట్టిన రోజు అయ్యి ఉంటుందని గ్రహిస్తాడు. ఇక స్పష్టం చేసుకునేందుకు వెంటనే పారిజాతాన్ని పిలిచి కాంచనకు ఫోన్ చేయిస్తాడు. శౌర్య పాప ఇవ్వాళ స్కూల్ కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తుంది పారు. డబ్బులు లేక పంపించలేదా? అని కాస్తా ఎటకారంగా మాట్లాడుతుంది. కోపంలో కాంచన ఈరోజు శౌర్య పాప పుట్టిన రోజు మీరు దానికి ఇంతలా ఆలోచించాల్సిన పనిలేదు. అవమానించాల్సిన పని ఏమాత్రం లేదని ఫైర్ అవుతుంది. ఇక అసలు విషయం తెలిసిన శివ నారాయణ, మరీ కార్తీక్ బాబు, దీపాలు ఎందుకు నా దగ్గర అసలు విషయం దాచారని మండి పడుతాడు. ఇక శౌర్యను ఇంటికి తీసుకు వెళ్లాలని ప్రయత్నించిన కార్తీక్, దీపాను శివ నారాయణ అడ్డుకుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 16వ తేదీ 464 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?
కార్తీక్ బాబు, దీపాలు శివ నారాయణ ఇంట్లో ఏ విషయాన్ని అయితే దాచాలని ప్రయత్నించారో ఆ విషయమే బయట పడింది. శౌర్య పాప్ బర్త్ డే అన్న సంగతిని కార్తీక్ బాబు, దీపాలు ఎవ్వరికీ తెల్వనివ్వకుండా జాగ్రత్త పడుతారు. చివరికి శౌర్య పాపను కూడా చెప్పకూడదని కండీషన్ పెడుతారు. దాంతో శౌర్య పాప కూడా ఎవ్వరికీ చెప్పదు. కానీ శివ నారాయణ మాత్రం శౌర్య పాప గీసిన డ్రాయింగ్ బొమ్మల ద్వారా ఈరోజు శౌర్యపాప పుట్టిన రోజు అని అర్థం చేసుకుంటాడు. ఇక మరోవైపు ఇంట్లో ఎవ్వరికీ తెలియక ముందే కార్తీక్ బాబు, దీపాలు శౌర్య పాపను తీసుకుని తమ ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటారు. ఇక పనులన్నీ ముగించుకొని శివ నారాయణకు మేం ఇంటికి వెళ్తున్నామని, కాస్తా ముందుగా వెళ్తున్నందుకు మీ పర్మిషన్ కావాలని కార్తీక్ బాబు శివ నారాయణను అడుగుతాడు. ఇక శివ నారాయణ ఇంత మధ్యాహ్నమే వెళ్లాల్సిన పని ఏముందో కాస్తా చెప్పి వెళ్తారా? అని కార్తీక్ బాబును ప్రశ్నిస్తాడు శివ నారాయణ. అందుకు కార్తీక్ బాబు నేను, నా భార్య దీపా, కూతురు శౌర్యను తీసుకొని బయటికి వెళ్లాల్సి ఉందని బదులిస్తాడు. ఆ విషయం దీపా ఆల్రెడీ చెప్పింది. ఇక నీకు ఏదో ప్రైవేట్ వర్క్ ఉందని చెప్పావంట. అదేంటో కాస్తా వివరిస్తావా? అని శివ నారాయణ ప్రశ్నిస్తాడు.

ఇక నార్మల్ గా బయటికి వెళ్లే పని ఉంది పెద్ద సార్ అని కార్తీక్ బాబు బదులిస్తాడు. దాంతో శివ నారాయణకు ఇంకా మండి పోతుంది. దీంతో శివ నారాయణ దీపా వేసిన డ్రాయింగ్ పేపర్ ను బయటికి తీస్తాడు. ఇక శౌర్య పాపను ఈ డ్రాయింగ్ వేసింది ఎవరు అని ఇంట్లో వాళ్ల అందరి ముందు ప్రశ్నిస్తాడు. శౌర్య పాప్ నేనే వేశాను తాత అని చెబుతుంది. ఈ డ్రాయింగ్ లో ఏముందని అడుగుతాడు. దాంతో ఒక పాప, వాళ్ల ఫ్యామిలీ, బంధువులు ఉన్నారని చెబుతుంది. ఇక పాప ముందు ఏముందని అడగ్గా బర్త్ డే కేక్ తాతయ్య అని చెబుతుంది. మరీ ఆ పాప ఎవరన్నట్టుగా అని అడగ్గానే అది నేనే అని శౌర్య పాప చెప్పబోతుంటుంది. దాంతో కార్తీక్ బాబు శౌర్యను చెప్పకుండా అడ్డుకుంటాడు. ఇక శివ నారాయణకు ఇంకా కోపం వస్తుంది. ఆ వెంటనే శౌర్య పాపతో మాట్లాడుతూ ఆ పాప ఎవరో చెబితే బోలెడన్నీ చాక్లెట్స్, బిస్కెట్స్, బట్టలు, ఆటవస్తువులు కొనిద్దామని అనుకున్నాను అని అంటాడు. ఇక ఆనందం ఆపుకోలేక శౌర్య పాప అంటే నాకే కొనిస్తారా? తాత అని అడుగుతుంది. అంటే ఈ ఇవ్వాళ నీ పుట్టిన రోజు అన్న మాట అని శివ నారాయణ అందరి ముందే బయట పెడుతాడు.
శౌర్య పాప బర్త్ డే అని తెలిసిన వెంటనే దశరథ కూడా కార్తీక్ బాబుపైన ఫైర్ అవుతాడు. చంటి దాని పుట్టిన రోజు అనే సంగతి మాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదురా అని అడుగుతాడు. మన ఇంట్లోనే అందరి మధ్యన సెలబ్రేషన్స్ జరిపే వాళ్లం కదారా అని అడుగుతాడు. మనకు ఎందుకు చెబుతాడు. మనుషులను మనుషులకు దూరం చేయడం వాళ్లకు చాలా తేలికైనా పని కదా అని శివ నారాయణ, సుమిత్ర అంటారు. ఇక శివ నారాయణ మండిపడుతూ ఉండగానే మరోవైపు సుమిత్ర దీపాపై ఫైర్ అవుతుంది. అసలు నీ వల్లనే కుటుంబంలో ఒకరికి ఒకరు దూరం అవుతున్నారు. మేం ఏ రోజు కూడా శౌర్య పాపను వేరుగా చూసింది లేదు. నాకు నీ మీద కోపం ఉండవచ్చు కానీ ఆ కోపాన్ని నీ కూతురు మీద ఎప్పుడూ నేను చూపించలేదని అంటుంది. ఇప్పటికే నీ వల్ల నాకు చాలా మంది దూరమై పోయారు. ఇక ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్లను కూడా దూరం చేసేయ్ అని ఫైర్ అవుతుంది. నాకు అలాంటి ఉద్దేశమేమీ లేదు అమ్మగారు. చెబితే ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారోనని మేమే చెప్పలేదు అని బదులిస్తుంది.
ఎవరు ఏమనుకుంటారు. ఇప్పుడు ఎవరు దూరం పెట్టి మాట్లాడుతున్నారో, ఎవరి మనస్సులో విషయం ఉందో స్పష్టంగా అర్థం అవుతూందని శివ నారాయణ అంటారు. ఇక దీపా పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఇప్పటికే శౌర్య పాపను ఇంటికి తీసుకొచ్చిన ప్రతి సారి కొందరు పాప సాకుతో మీకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నామని, సింపథి ట్రిక్స్ ప్రదర్శిస్తున్నామంటూ అవమానిస్తున్నారు. ఇక ఇప్పుడు బర్త్ డే సెలబ్రేషన్స్ అని చెబితే మళ్లీ ఏమనుకుంటారోనని అస్సలు చెప్పలేదు అని వివరిస్తుంది. మంచి ఇలా అన్ని విషయాలను దాచేసి దూరమైపోదామని శివ నారాయణ ఫైర్ అవుతాడు. ఇక కార్తీక్ బాబు స్పందిస్తూ మేం వెళ్లాల్సి ఉందని అంటాడు. ఇక నా కంటికి కనిపించకుండా వెళ్లిపో, మీలోనే కాదు పిల్లల్లోనూ విషాన్ని నూరి పోయండి అంటూ శివ నారాయణ మండి పడుతాడు. ఆ తర్వాత కార్తీక్ బాబు, దీపాలు శౌర్యను తీసుకొని ఇంటికి వెళ్లిపోతారు. మరోవైపు శ్రీధర్ కార్తీక్ బాబు ఇంటికి వస్తాడు. ఇక కార్తీక్ తండ్రి శ్రీధర్ తో ప్రేమగా మాట్లాడుతాడు. కాశీని విడిపించారని తెలిసిందని అంటాడు. నేను మారిపోయానురా కార్తీక్, నీ మాటల వల్లే, నీకోసం, కాంచన కోసం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు భర్తగా, తండ్రిగా ఫెయిల్ అయ్యాను. ఇక ఇప్పుడు పూర్తిగా మారిపోయానని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











