Karthika Deepam 2 November 6th: చక్రం తిప్పిన పారిజాతం... జ్యోత్స్నకి ఊహించని షాకిచ్చిన సుమిత్ర

Photo Courtesy: JioHotstar

కిచెన్‌లో వంట చేస్తోన్న దీప దగ్గరికి సుమిత్ర వచ్చి మా కోసం నువ్వు ఇంత కష్టం ఎందుకు పడ్డావు? నీకు మాకు ఏ రక్త సంబంధం లేదు కదా? పైగా నేను మీ అమ్మని అని ఎందుకు అన్నావు? అని ప్రశ్నిస్తుంది. ఇంతలో కార్తీక్ వచ్చి మీ ఇద్దరిదీ రుణానుబంధమని చెబుతాడు. దీప విషయంలో ఉన్న ఒక్క మచ్చను నేను చెరిపేస్తానని అంటాడు కార్తీక్. ఆ రోజు దీప చేతిలో ఉన్న గన్ నుంచి బుల్లెట్ రాలేదని నేను నిరూపిస్తానని చెబుతాడు కార్తీక్.

అమ్మానాన్నల్ని కలుపుదామనుకుంటే బావ ఆ క్రెడిట్ కొట్టేశాడు.. ఇంట్లో నాకు రెస్పెక్ట్ లేకుండా పోయిందని పారిజాతంతో చెబుతుంది జ్యోత్స్న. పాత పారిజాతం మళ్లీ బయటికి రావాలని ఏదో ఒక మాయ చేసి నన్ను తాత సీఈవోగా తీయకుండా చూడమని అడుగుతుంది జ్యోత్స్న. దానికి పారిజాతం సరేనని అంటుంది. అందరూ కలిసిపోయారు కానీ నువ్వు, నేను మాత్రం కలవలేదని కాంచనతో చెప్పుకుని బాధపడతాడు శ్రీధర్. ఒకరికి ఇచ్చేసింది మళ్లీ నేను ఆశపడనని తేల్చిచెబుతుంది కాంచన. తల్లి నిర్ణయంతో కార్తీక్ బాధపడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 6వ తేదీ 508వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 508 November 6th 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న చెప్పినట్లుగానే శివన్నారాయణను బుట్టలో వేసుకునేందుకు పారిజాతం రకరకాల ప్లాన్లు వేస్తుంది. దీనిలో భాగంగా పెద్దాయనకు పాలు తీసుకొచ్చి ఇస్తుంది. ఎప్పుడూ లేనిది నేను అడగకుండానే పాలు ఎందుకు తీసుకొచ్చావని పారుని అడగుతాడు శివన్నారాయణ. ఫ్లాష్ బ్యాక్‌లో ఆ వర్షం కురిసిన దరిద్రపు రాత్రికి వెళ్లాల్సి వస్తుందని సెటైర్లు వేస్తాడు. మీరు పడుకుంటే కాళ్లు నొక్కుతానని చెబుతుంది పారిజాతం. నా కాళ్లు నొక్కుతానని అంటున్నావంటే అడిగే విషయం చాలా పెద్దదని అంటాడు శివన్నారాయణ. సుమిత్ర - దశరథ కలిసిపోయి అందరూ సంతోషంతో ఉన్నారు కానీ ఒక్కరు మాత్రమే సంతోషంగా లేరని చెబుతుంది.

ఇకపై మన కంపెనీ సీఈవోగా జ్యోత్స్నే కొనసాగుతుందని రాబోయే బోర్డ్ మీటింగ్‌లో చెప్పాలని అంటుంది పారిజాతం. ఈ విషయం అదే నాకు చెప్పొచ్చు కదా అని శివన్నారాయణ అనగా.. పాపం అది గదిలో పడి ఏడుస్తోందని చెబుతుంది పారిజాతం. నేను దానిని ఓదార్చి మీతో మాట్లాడతానని చెప్పానని అంటుంది. వీరిద్దరి మాటలను వింటున్న జ్యోత్స్నను శివన్నారాయణ పిలుస్తాడు. దాంతో పారిజాతం షాక్ అవుతుంది. నువ్వు ఎవరితో అడిగించినా? ఏం చేసినా సరే ముందు సీఈవో పోస్ట్‌కి రాజీనామా చేసి పెళ్లి చేసుకోమని చెబుతాడు శివన్నారాయణ. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పెళ్లి చేసుకుంటుంది, కానీ దానికి సీఈవో పోస్ట్‌కి సంబంధం లేదు కదా అని అంటుంది పారిజాతం. మీ అమ్మానాన్నలకు దూరంగా ఉండమని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ.

సీఈవో పోస్ట్ గురించి తాతయ్య గారు ఏం నిర్ణయం తీసుకుంటారో ఏంటో? కుటుంబంలో ఏం గొడవలు వస్తాయోనని భయంగా ఉందని కార్తీక్‌తో అంటుంది దీప. అలా కాకూడదని దేవుడికి మోకాళ్లపై దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టానని, కానీ అది కుళ్లిపోయిందని బాధపడుతుంది. జ్యోత్స్న విషయంలో తాత ఏం నిర్ణయం తీసుకుంటాడో మనకు పూర్తిగా తెలియదు కదా అని అంటాడు కార్తీక్. జ్యోత్స్న కానుక సీఈవోగా ఉండకపోతే గొడవలు మొదలవుతాయని దీప చెప్పగా.. అది మనకు పూర్తిగా సంబంధం లేదని విషయమని చెబుతాడు కార్తీక్. అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోతే వెతికింది మనమే, అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి ఆ మనిషి కారణమైంది... తిరిగి రావడానికి మనం కారణమయ్యాం. ఇది కూడా జ్యోత్స్న తట్టుకోలేదని అంటుంది దీప.

మనల్ని బాధపెట్టిన వాళ్లని కూడా మార్చి ఆ ఇంటిని ఒక బృందావనంలా మార్చాలని మనం అనుకుంటున్నామని చెబుతాడు కార్తీక్. నువ్వే ఆ ఇంటికి అసలైన వారసురాలివని చెప్పడాని కంటే ముందు ఆ ఇంటిలో ఒక్క సమస్య కూడా ఉండకూడదని అంటాడు. కానీ ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, తాత తీసుకునే నిర్ణయం వల్ల కొన్నింటికి పరిష్కారాలు దొరుకుతాయని నా నమ్మకమని చెబుతాడు కార్తీక్. నిజం తెలిసేంత వరకు జ్యోత్స్న కూడా తాతకు మనవరాలే. ఒక మంచి జరగబోతోంది అంటే తీసుకోబోయే నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండాల్సిందేనని చెబుతాడు. మావయ్యకి బుల్లెట్ ఎలా తగిలిందో నిరూపించమని అత్త చెప్పింది, దానికంటే ముందు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అంటాడు కార్తీక్.

దశరథ ఒంటరిగా ఉండటంతో వెళ్లి మీ నాన్న కాళ్ల మీద పడిపోమ్మని జ్యోత్స్నకి చెబుతుంది పారిజాతం. దానికి జ్యోత్స్స ససేమిరా అంటుంది. నువ్వు సీఈవో పోస్ట్‌లో ఉండాలంటే ఈ ఇంట్లో వాళ్ల సపోర్ట్ ఉండాలని అంటుంద పారు. నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ పరిస్ధితులు నా కంట్రోల్‌లో లేకపోతే నువ్వు ఎంట్రీ ఇవ్వమని చెబుతుంది జ్యోత్స్న. నేను కాకుండా నీకు వేరే పిల్లలున్నారా? అని దశరథను అడుగుతుంది జ్యోత్స్న. నాకు ఒక్కరే భార్య, ఒక్కరే కూతురని అంటాడు దశరథ. మీ తర్వాత మీ వారసత్వాన్ని కొనసాగించాల్సింది మీ కూతురే కదా? మరి మీ కూతురు మీ కంపెనీలో సీఈవోగా ఉండాలా? లేదా? అని నిలదీస్తుంది జ్యోత్స్న.

నీ తెలివితేటలు సూపర్.. నా ఆస్తి మొత్తం నీదేనని అంటాడు శివన్నారాయణ. నాకు ఆస్తితో పాటు పదవి కూడా కావాలని అంటుంది జ్యోత్స్న. ఆస్తి పోతే నేను మాత్రమే రోడ్డునపడతానని, అదే కంపెనీ నష్టపోతే ఎంతమంది రోడ్డునపడతారో ఆలోచించమని అంటాడు దశరథ. కార్తీక్‌ను సీఈవో పదవి నుంచి తీసేసి నిన్ను సీఈవోని చేస్తే సైలెంట్‌గా ఉన్నానని, చాలా నష్టపోయాం, అయినా సరే నీకు 30 రోజులు సమయం ఇచ్చామని, నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావని మండిపడతాడు దశరథ. ఇప్పుడు కంపెనీయే వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయేలా ఉందని, ఇలాంటి పరిస్ధితుల్లో నేను నీకు సపోర్ట్ చేయలేనని అంటాడు దశరథ. నాన్న ఏం నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అని తేల్చేస్తాడు.

నన్ను సీఈవోగా తీసేస్తే నా పరువు పోతుందని, ఉద్యోగుల ముందు తలెత్తుకోలేనని జ్యోత్స్న బాధపడుతుంది. ఇంతలో శివన్నారాయణ వచ్చి .. ఏం జరుగుతుందని అడుగుతాడు. తనను సీఈవోగా ఉంచమని జ్యోత్స్న బ్రతిమలాడుతోందని దశరథ చెబుతాడు. ఈ నిర్ణయం తీసుకోవాల్సింది నేనో, మీ నాన్నో కాదని.. బోర్డ్ మెంబర్స్ అని అంతా కలిసి ఆమోదిస్తేనే అది నిర్ణయం అవుతుందని అంటాడు శివన్నారాయణ. నేను ప్రపోజల్ పెట్టినప్పుడు ఎవ్వరూ రిజెక్ట్ చేయలేదని అందుకే సీఈవో పోస్ట్‌లో నువ్వు ఇన్ని రోజులు కూర్చోగలిగావని చెబుతాడు. దానిని నువ్వు నిలబెట్టుకోలేకపోయావని, ఇప్పుడు ఆ కుర్చీ సమర్ధవంతమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తోందని చెబుతాడు శివన్నారాయణ. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు.

జ్యోత్స్న మీ మనవరాలని, అంతకుమించిన అర్హత ఏం కావాలని పారు అడుగుతుంది. నీ మనవరాలిని ఓ 50 లక్షల రూపాయల కారు అడిగితే కొనిస్తా.. కంపెనీ సభ్యుల నిర్ణయాలు వేరని అంటాడు శివన్నారాయణ. బలమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సామర్ధ్యం, తెలివితేటలు కావాలని ఆ రెండూ నీ దగ్గర లేవని నువ్వు నిరూపించుకున్నావ్.. నిన్ను చూసి బోర్డు మెంబర్లు షేర్స్ అమ్మి పారిపోయే పరిస్ధితి వచ్చిందని అంటాడు దశరథ. ఇప్పుడు కంపెనీకి కావాల్సింది నడిపించేవాడు కాదు.. నమ్మకం కలిగించేవాడని చెబుతాడు. దాంతో కార్తీక్ వైపు జ్యోత్స్న కోపంగా చూస్తుంది. ఈ ఇంట్లో ఎప్పుడూ మగవాళ్లే నిర్ణయం తీసుకుంటారా? ఆడవాళ్లకి అధికారం లేదా? అని పారు అడగ్గా శివన్నారాయణ సీరియస్ అవుతాడు.

నేను మాట్లాడేది సుమిత్ర గురించి అంటుంది పారిజాతం. దశరథ సాధించిన విజయాల్లో నీకు కూడా భాగం ఉంటుందని చెబుతుంది. కన్నతల్లిగా సుమిత్రకు కూడా ఓ నిర్ణయం ఉంటుంది కదా? అని పారిజాతం అంటుంది. పారు అడిగిన దాంట్లో న్యాయం ఉంది.. సుమిత్ర ఈ ఇంటి మహాలక్ష్మీ తను కన్నీరు పెట్టే ఏ పని చేయడం మంచిది కాదు, మన నిర్ణయాల్లో సుమిత్రకు కూడా భాగం ఉందని అంటాడు శివన్నారాయణ. నా కొడుకు, బోర్డ్ మెంబర్స్ నా మాట కాదనరని.. కాదన్నా వాళ్లతో ఔనని ఒప్పించడానికి నా పక్కన ఒకడున్నాడని నీ నిర్ణయం చెప్పమని సుమిత్రను అడుగుతాడు శివన్నారాయణ. ఈ ఇంటి వారసురాలే సీఈవో పోస్ట్‌లో ఉండాలని చెప్పు అని సుమిత్రపై పారు, జ్యోత్స్నలు ఒత్తిడి తెస్తారు. నీ కూతురి గురించి నువ్వేం అనుకుంటున్నావో చెప్పమని అడుగుతాడు దశరథ. నా కూతురిని పెళ్లికూతురిగా చూడాలని అనుకుంటున్నానని సుమిత్ర చెప్పడంతో జ్యోత్స, పారిజాతంలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X