Karthika Deepam 2 November 7th: సీఈవో పోస్ట్ కోసం దీపకి జ్యోత్స్న బంపరాఫర్... నలిగిపోతోన్న కార్తీక్
Photo Courtesy: JioHotstar
సీఈవో పదవి నుంచి నన్ను తీయకుండా చేయమని జ్యోత్స్న చెప్పడంతో శివన్నారాయణని బుట్టలో వేసుకునేందుకు పారిజాతం పాల గ్లాసుతో వస్తుంది. అది చూసిన పెద్దాయన నీకేం కావాలో అడగమని చెబుతాడు. జ్యోత్స్నను సీఈవో పోస్ట్ నుంచి తీయొద్దని అంటుంది పారిజాతం. వీరి మాటలను దొంగచాటుగా వింటున్న జ్యోత్స్నపై శివన్నారాయణ సీరియస్ అవుతాడు. ఉదయాన్నే దశరథ దగ్గరికి వెళ్లిన జ్యోత్స్న.. మీ వారసురాలు ఎవరు అని అడుగుతుంది. నా తర్వాత ఈ ఆస్తి మొత్తం నీదే.. ఆస్తి పోతే నేను ఒక్కడినే రోడ్డునపడతారు, అదే కంపెనీ లేకపోతే కొన్ని వందల మంది రోడ్డున పడతారని అంటాడు.
ఇంతలో శివన్నారాయణ వచ్చి నిన్ను సీఈవోగా ఉంచాలా? వద్దా? అనేది బోర్డ్ నిర్ణయమని చెబుతాడు. అయినా అక్కడ నా మాట కాదని ఏం జరగదని అంటుండగా కార్తీక్, దీపలు వస్తారు. పారిజాతం వారి మధ్యలోకి దూరి ఈ ఇంట్లో మగాళ్ల పెత్తనమేనా? ఆడవాళ్లకి ఏం లేదా? సుమిత్ర నిర్ణయంతో పనిలేదా? అని అడుగుతుంది. దాంతో జ్యోత్స్న సీఈవో పదవి గురించి సుమిత్ర ఏం నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదని శివన్నారాయణ, దశరథలు చెబుతారు. తనకు జ్యోత్స్నని పెళ్లికూతురిలా చూడాలని ఉందని సుమిత్ర చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 7వ తేదీ 509వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నా కూతురిని పెళ్లి కూతురిగా చూడాలనుకుంటున్నానని, అదే నా కల అని సుమిత్ర చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నా కూతురికి పెళ్లి చేసి అందమైన జీవితాన్ని దానికి కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నానని చెబుతుంది సుమిత్ర. ఇంతకుమించి నేనేం కోరుకోవడం లేదని తేల్చేస్తుంది. అత్త ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదని దీపతో అంటాడు కార్తీక్. జ్యోత్స్న విషయం గురించి మరోసారి ఆలోచించమని అంటుంది పారిజాతం. తప్పకుండా ఆలోచిస్తా.. కానీ ఇంట్లో కాదు, బోర్డ్ మీటింగ్‌లో అని చెప్పడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. అధికారం అనేది రికమెండేషన్‌తో కాదని టాలెంట్‌తో తెచ్చుకోవాలని జ్యోత్స్నకి చెబుతాడు దశరథ. కార్తీక్‌ను పక్కకి పిలిచి మాట్లాడటానికి రమ్మంటాడు.
బావే సీఈవో అని నాకు అర్ధమైపోయిందని, దీనిని ఆపాలని పారిజాతంతో చెబుతుంది జ్యోత్స్న. నీకు మీ అమ్మ సపోర్ట్ కూడా లేదు.. అలాంటప్పుడు ఎలా ఆపుతావని ప్రశ్నిస్తుంది పారిజాతం. కానీ మనకు టైం లేదు.. బావ సీఈవో అయితే, దీప ముందు నేను ఓడిపోయినట్లేనని అంటుంది జ్యోత్స్న. అయితే దీపని పట్టుకోమని చెబుతుంది పారు. మనకి సపోర్ట్ చేయరని తెలిసిన మనిషినే సాయం అడగాలి.. అప్పుడు శత్రువు మనల్ని ఎలా ఓడించాలని కాకుండా ఎలా తప్పించుకోవాలా? అని ఆలోచిస్తాడని అంటుంది పారు. కార్తీక్ గాడు నీకు సపోర్ట్ చేసేలా దీప చేస్తుంది.. కార్తీక్ సపోర్ట్ చేస్తే మీ తాత కూడా నీకే ఓటు వేస్తాడని చెబుతుంది పారు.
ఐడియా బాగుందని కిచెన్‌లోకి వెళ్తుంది జ్యోత్స్న. నువ్వు నాకో సాయం చేస్తావని మాట ఇవ్వమని దీపని అడుగుతుంది. మీరు అడగకూడనివి అడుగుతారు.. అది తెలియకుండా మాటిస్తే గోతిలో పడినట్లేనని దీప అంటుంది. నేను అడగబోయేది మన బావ గురించే.. నాకు వరుసకు బావ, నీకు పిలుపుకు బావ అని జ్యోత్స్న అంటుంది. నాకు కూడా వరుసకు బావేనని దీప అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ మాటకొస్తే నాకు మాత్రమే బావ.. మీకైతే బావ అని పిలిచే అధికారం కూడా లేదని అంటుంది. సుమిత్ర కూతురిని అని దీపకు తెలిసిపోయిందా అని జ్యోత్స్నకు ముచ్చెమటలు పడతాయి. నేను మేనమామ కూతురిని నాకు అన్ని అలా పిలిచే అధికారం ఉందని అంటుంది జ్యోత్స్న.
నేను చెప్పినట్లు చేస్తే బావ ఓనర్ అవుతాడని ఆఫర్ ఇస్తుంది జ్యోత్స్న.. ఈరోజు బోర్డ్ మీటింగ్‌లో నన్ను సీఈవోగా సపోర్ట్ చేస్తానని బావకి చెబితే చాలని అంటుంది జ్యోత్స్న. నాకు బావ సపోర్ట్ చేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని చెబుతుంది. దాంతో దీప షాక్ అవుతుంది. మీరేం చేసినా బావ వినడని తేల్చిచెబుతుంది దీప. నేను ఈ ఇంటికి తీసుకువచ్చి బావ నీకు దక్కేలా చేసింది నేనే అని అంటుంది జ్యోత్స్న. నాకు సపోర్ట్ చేసి రుణం తీర్చుకోమని చెబుతుంది. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ఏం చేయాలో నాకు తెలుసని అనుకుంటుంది దీప. సీఈవోగా బావ నాకు సపోర్ట్ చేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని ఆఫర్ ఇచ్చానని పారుకి చెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో పారు షాక్ అవుతుంది.
ఓవర్ డ్రామాలో దీప పెద్ద తోపు నువ్వు దాని ముందు ఎంత అంటుంది. నా మాట విని పెళ్లి చేసుకోమని చెబుతుంది పారిజాతం. పెళ్లికి నేను ప్రిపేర్‌గా లేనని.. నేను మళ్లీ సీఈవో పోస్ట్‌లో కూర్చొన్నానంటే బావే నా భర్త అంటుంది. ఆ మాటలతో పారు షాక్ అవుతుంది. ఆఫీస్ దగ్గర నీతో పర్సనల్‌గా మాట్లాడాలని కార్తీక్‌తో చెబుతుంది. శివన్నారాయణ గారి ఆస్తికి వారసురాలినే అయినా సీఈవో పదవి లేకుండా చేశావని మండిపడుతుంది. నువ్వు ఇదంతా దీప కోసమే చేస్తున్నావని నాకు తెలుసని కార్తీక్‌తో చెబుతుంది జ్యోత్స్న. దీపను ఇంట్లోకి పిలిచినప్పటి నుంచి నా పతనం మొదలైందని అంటుంది.
నీ చేతగానితనాన్ని ఎవరి మీదో చూపించొద్దని మండిపడతాడు కార్తీక్.. చేసే పని మీద శ్రద్ధ పెడితే విజయం అదే వెతుక్కుంటూ వస్తుందని అంటాడు. బోర్డ్ మెంబర్స్ నిన్ను సీఈవోగా వద్దన్నారు.. నీకు సిగ్గుంటే ఆ రోజే రిజైన్ చేసేదానివి, కానీ నువ్వు నాతో బేరాలు ఆడావని చెబుతాడు. దిగజారిపోయింది నువ్వు.. నా భార్యతో వంటగదిలో బేరాలు ఆడటం నేను చూశానని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నిన్ను సీఈవోగా సపోర్ట్ చేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని అంటావా దీనిని దిగజారిపోవడం అంటారు అంటాడు కార్తీక్. ఈరోజు బోర్డ్ మీటింగ్‌లోనూ నువ్వు ఏం చేయలేవని చెబుతాడు. లోపల ఏం జరుగుతుందో? ఏం నిర్ణయం తీసుకుంటారోనని భయపడి చస్తున్నావని అంటాడు కార్తీక్. లోపలి నుంచి నీకు పిలుపు రానివ్వనని ఛాలెంజ్ చేస్తుంది జ్యోత్స్న.
బోర్డ్ మీటింగ్‌లో అందరూ పాల్గొనగా జ్యోత్స్న ఆలస్యంగా వస్తుంది. సంస్థ అభివృద్ధి మనందరీ బాధ్యత.. మన ఛైర్మన్ శివన్నారాయణ గారి పరువుకి, ఆత్మగౌరవానికి ప్రతీక ఈ సంస్థ అని అంటుంది. ఒక్కోసారి మనం తీసుకునే చిన్న నిర్ణయం మన జీవితాల్ని మలుపు తిప్పుతుందని చెబుతుంది. ఈరోజు ఇక్కడ తీసుకునే నిర్ణయం ఈ కంపెనీ గతిని మార్చబోతుందని చెబుతాడు దశరథ. బాధ్యత లేని మనిషికి అధికారం కరెక్ట్ కాదని అంటుంది. ఇక మీదట కూడా మీరే సీఈవోగా ఉంటానంటే మేం ఈ సంస్థలో ఉండలేమని బోర్డ్ మెంబర్స్ తేల్చిచెబుతారు. నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వమని జ్యోత్స్న అడగ్గా.. అందరూ వద్దంటారు. బోర్డ్ నిర్ణయాన్ని నేను గౌరవిస్తానని, మరి కొత్త సీఈవో ఎవరు అని జ్యోత్స్న అడగ్గా.. వెళ్లి కార్తీక్‌ని పిలుచుకురమ్మని చెబుతాడు శివన్నారాయణ. ఏదో ఒకటి చేసి బావని సీఈవో కాకుండా ఆపాలని జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











