Karthika Deepam 2 November 8th: కొత్త సీఈవోగా దీప.. జ్యోత్స్నకి షాకిచ్చిన శివన్నారాయణ, కత్తితో ఆఫీస్‌కి పారు
Photo Courtesy: JioHotstar
నా కూతురిని పెళ్లి కూతురిగా చూడాలని అనుకుంటున్నానని సుమిత్ర చెప్పడంతో పారిజాతం, జ్యోత్స్నలు షాక్ అవుతారు. బావే కాబోయే సీఈవో అని దీనిని ఎలాగైనా ఆపాలని పారుతో చెబుతుంది జ్యోత్స్న. ఈ విషయంలో సాయం చేయమని దీపని అడగమని చెబుతుంది పారు. దాంతో కిచెన్‌లోకి వెళ్లి నేను సీఈవో కావడానికి నువ్వు హెల్ప్ చేస్తే బావతో నా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని మీరంతా హ్యాపీగా ఉండొచ్చని ఆఫర్ ఇస్తుంది జ్యోత్స్న. నేను ఏం చేసినా మా బావ నాట వినడని తేల్చేస్తుంది దీప.
కంపెనీ ఆఫీస్ బయట కార్తీక్‌తో ఏకాంతంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. నీకు నేను హెల్ప్ చేయాలని మా ఆవిడతో మాట్లాడటం చూశానని, దీనినే దిగజారిపోవడం అంటారని కార్తీక్ మండిపడతాడు. నువ్వు నా సీఈవో పోస్ట్‌కి అడ్డు రావొద్దని అడుగుతుంది జ్యోత్స్న. నాకు ఆ పదవిపై ఎలాంటి ఆశలేదని.. కానీ తాతయ్య పిలిస్తే మాత్రం కాదనలేనని చెబుతాడు. బోర్డ్ మీటింగ్‌లో జ్యోత్స్న గారు సీఈవోగా ఉంటే మేం ఈ కంపెనీలో ఉండలేమని తేల్చిచెబుతారు. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ వెంటనే కార్తీక్‌ను లోపలికి పిలవమని అంటాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 8వ తేదీ 510వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కిచెన్‌లో దీపని దొంగచూపులు చూస్తుంటుంది పారిజాతం. ఆమెను గమనించిన దీప ఎదురుగా వెళ్లి నిలబడుతుంది. కాబోయే సీఈవో మీ ఆయనేనని బయట టాక్ అని అంటుంది పారు. మీ ఆయన సీఈవో అవుతాడని అనిపిస్తుందా? మా జ్యోత్స్న నీతో ఏదో చెప్పినట్లుంది? అని అడుగుతుంది పారు. ట్రైనింగ్ ఇచ్చి పంపించింది మీరే కదా అని దీప అనడంతో పారు షాక్ అవుతుంది. మరి కార్తీక్ గాడికి ఏమైనా చెప్పావా? అది నీ దగ్గరికి వచ్చి బతిమలాడుకుంది కదా అంటుంది పారు. అధికారం అడిగితే ఇచ్చేది కాదని చెబుతుంది దీప. నా మనవరాలు నిన్ను హెల్ప్ అడిగిందని నీకు లోకువ అయిపోయానా అని పారిజాతం మండిపడుతుంది. ఈ ఇంట్లో నువ్వు, ఆఫీసులో వాడు చక్రం తిప్పాలని తెగ ఊబలాటపడిపోతున్నారని ఫైర్ అవుతుంది పారిజాతం. నేనుండగా నా మనవరాలికి అన్యాయం జరగనివ్వనని.. నీ మొగుడు సీఈవో ఎలా అవుతాడో నేను చూస్తానని అంటుంది పారిజాతం.
కార్తీక్‌ను బోర్డ్ మీటింగ్‌కి పిలిచిన శివన్నారాయణ.. మనం కొత్త సీఈవోని నియమించుకోవాల్సిన సమయం వచ్చిందని బోర్డు మెంబర్స్‌కి చెబుతాడు. మీ నిర్ణయం మాకు అర్ధమైందని, మేమంతా ఏదైతే కోరుకుంటున్నామో మీరు కూడా అదే చేయాలని అనుకుంటున్నారని అంటారు బోర్డ్ మెంబర్స్. మీరు లేట్ చేయకుండా కార్తీక్ గారిని కొత్త సీఈవోగా అనౌన్స్ చేసేయండి అని చెబుతాడు. దాంతో మండిపడిన జ్యోత్స్న.. త్వరగా ఇంటికొస్తానని ఆంటీకి మాట ఇచ్చారా? ఏంటీ అని సెటైర్లు వేస్తుంది. ఆ మాటలకు శివన్నారాయణ సీరియస్ అయి.. నువ్వు ఎక్కడ ఉన్నావో చూసుకుని మాట్లాడమని అంటాడు. భరణి అన్న మాటే నా మనసులోని మాటైతే అని శివన్నారాయణ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.
అప్పుడు అర్హత గురించి ఆలోచించాలని జ్యోత్స్న అనడంతో మీరు కార్తీక్ సార్ అర్హత గురించి మాట్లాడుతున్నారా? అని భరణి నవ్వుతాడు. అర్హత అంటే చదువు, మార్కులు కాదని ఇంకా చాలా ఉంటాయని అంటుంది. గతంలో ఇదే కంపెనీని సమర్ధవంతంగా నడిపిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నావని నీకు అర్ధమవుతుందా? బోర్డ్ మెంబర్సే కాదు, ఉద్యోగులు కూడా మనం తీసుకోబోయే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెబుతాడు దశరథ. మన నిర్ణయాలు భవిష్యత్‌లో సాధించబోయే విజయాలని డిసైడ్ చేస్తాయని అంటాడు. నేను చెప్పేది విన్న తర్వాత కొత్త సీఈవో ఎవరన్నది అనౌన్స్ చేయమని అంటుంది జ్యోత్స్న.
కార్తీక్ గారికి సీఈవో అయ్యే అర్హత లేదని చెబుతుంది జ్యోత్స్న. దానికి కారణం మా ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ అని అంటుంది. దాని ప్రకారం నా నిర్ణయానికి వ్యతిరేకంగా ఏం చేయడానికి అయినా తనకి రైట్ లేదని తేల్చేస్తుంది. నీ వ్యక్తిగతమైన అగ్రిమెంట్లు ఇక్కడ పనిచేయవని శివన్నారాయణ అనగా.. అదే మాట అగ్రిమెంట్ మీద సంతకం చేసిన ఈ మనిషితో చెప్పమని అంటుంది జ్యోత్స్న. కార్తీక్ సారే సీఈవో కావాలని బోర్డ్ మెంబర్స్ అంతా పట్టుబడతారు. నువ్వు ఇచ్చిన మాటకి, పెట్టిన సంతకానికి కట్టుబడే మనిషివని నాకు తెలుసని .. నీ నిర్ణయం కోసం బోర్డ్ అంతా ఎదురుచూస్తోందని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాను దానికే కట్టుబడి ఉంటానని తేల్చి చెబుతాడు కార్తీక్. జ్యోత్స్నకి రాసిచ్చిన నిబంధనకు నేను కట్టుబడి ఉంటానని అంటాడు. నేను ఈ రెస్టారెంట్‌కి సీఈవోగా ఉండాలని అనుకోవడం లేదని చెబుతాడు.
నీ వ్యక్తిగత కారణాలతో కంపెనీని నాశనం చేయొద్దని, నువ్వు చెబితే కార్తీక్ సీఈవోగా ఉంటాడని దశరథ అనగా.. ఆ మాట నేను చెప్పనని తేల్చేస్తుంది జ్యోత్స్న. మీరు సీఈవోగా ఉండకపోతే ఈ సంస్థ భవిష్యత్ ఏంటి? అని బోర్డ్ మెంబర్స్ ప్రశ్నిస్తారు. జ్యోత్స్న గారి మీదకు మాకు ఎలాంటి హోప్స్ లేవని అంటారు. ఇలాంటి ఒక సమస్య వస్తుందని నాకు ముందే తెలుసని చెబుతాడు శివన్నారాయణ. కార్తీక్ సీఈవో అని ముందుగా ఎవరు అన్నారు? అని ప్రశ్నిస్తాడు. ఈ కంపెనీకి సీఈవోగా మేం వేరొకరని అనుకున్నామని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ సంస్థకు కాబోయే కొత్త సీఈవో ఎంట్రీ ఇచ్చే ఉంటారని కార్తీక్ చెప్పగా.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అని అంతా ఎదురుచూస్తుంటారు. ఇంతలో దీప అక్కడికి రావడంతో అందరూ షాక్ అవుతారు. భోజనం పూర్తి చేసిన తర్వాత మాట్లాడుకుందామని అంటాడు శివన్నారాయణ.
నీ ప్లాన్ ఏంటో నాకు అర్ధమైంది బావ? దీనిని ఎలా ఆపాలో నాకు తెలుసు కదా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. వెంటనే పారిజాతానికి ఫోన్ చేస్తుంది. కార్తీక్ గాడిని సీఈవోని చేస్తారని మనం ముందే ఊహించాం కదా అదే జరిగిందా అని అడుగుతుంది పారు. జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి కాబోయే సీఈవో బావ కాదు.. దీప అని జ్యోత్స్న చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. దీనిని ఎలా ఆపాలో అర్ధం కావడం లేదని అంటుంది. అయితే దానికి ఒక పవర్‌ఫుల్ అస్త్రం ఉందని చెబుతుంది.. మీ అమ్మని అస్త్రంగా వాడతానని చెబుతుంది పారిజాతం. సుమిత్రను పిలిచి పనిమనుషులకు ఉన్న విలువ.. వారసురాలికి లేదని మండిపడుతుంది. కంపెనీకి కాబోయే కొత్త సీఈవో దీప అని చెప్పడంతో సుమిత్ర షాక్ అవుతుంది. దీపని ఆ కార్తీక్ గాడు ఆఫీస్‌కి పిలిపించింది అందుకేనని చెబుతుంది పారిజాతం.
ఏం జరిగినా మావయ్య గారి నిర్ణయానికి నేను, నా భర్త కట్టుబడి ఉంటామని సుమిత్ర తేల్చేస్తుంది. నువ్వు అసలు తల్లివేనా? నీ కూతురికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? బోడీ సీఈవో పోస్ట్ జ్యోత్స్నకి ఇస్తే ఏమవుతుంది? అంటూ నానామాటలు అంటుంది పారు. ఇంటికొచ్చాక అడుగుతానని సుమిత్ర చెబుతుంది. పారిజాతం బలవంతం చేయడంతో ఆఫీసుకి రావటానికి ఒప్పుకుంటుంది. ఆ వెంటనే శివన్నారాయణపై రగిలిపోతుంది పారు. నువ్వే కనుక నా మనవరాలిని కాకుండా ఆ దీపని సీఈవోగా చేశావంటే దీపను బతకనివ్వనని పారిజాతం కత్తి తీసుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











