Karthika Deepam 2 November 10th: జ్యోత్స్నకి సుమిత్ర వెన్నుపోటు.. దీప హత్యకు పారిజాతం కుట్ర
Photo Courtesy: JioHotstar
కార్తీక్‌ను బోర్డ్ మీటింగ్‌లోకి పిలిపిస్తాడు శివన్నారాయణ. నువ్వు బావని సీఈవోగా చేయాలని అనుకుంటున్నావా? అని నిలదీస్తుంది జ్యోత్స్న. బోర్డ్ మెంబర్స్ కూడా కార్తీక్ గారే సీఈవోగా ఉండాలని చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. నేను సీఈవోగా కార్తీక్ చేయాలని అనుకున్నానని.. కానీ ప్రపోజల్ పెట్టలేదని, నువ్వే బయటపడ్డావని అంటాడు శివన్నారాయణ. బావ సీఈవోగా ఉండటానికి అర్హత లేదని ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఓ అగ్రిమెంట్ జరిగిందని.. దీని ప్రకారం నా పర్మిషన్ లేకుండా బావ సీఈవో కాలేడని అంటుంది. వ్యక్తిగత ఒప్పందాలు బోర్డు మీటింగ్‌లో చెల్లవని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్నకి ఇచ్చిన మాటకి, అగ్రిమెంట్‌కి కట్టుబడి ఉంటానని కార్తీక్ తేల్చి చెబుతాడు.
నువ్వు ఇలాంటిదేదో చేస్తావని మేం ముందే అనుకున్నామని.. అందుకే కొత్త సీఈవోగా మేమంతా కలిసి ఒకరిని అనుకున్నామని చెబుతాడు శివన్నారాయణ. అది ఎవరో నేను తెలుసుకోవచ్చా అని జ్యోత్స్న అడగ్గా... ఇంతలో దీప ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే జ్యోత్స్న , దశరథలు షాక్ అవుతారు. భోజనం తిన్నాక బోర్డ్ మీటింగ్‌లో ఫైనల్ డెసిషన్ చెబుతామని అంటాడు పెద్దాయన. వెంటనే పారిజాతానికి ఫోన్ చేసి దీపను సీఈవోగా కాకుండా ఆపమని చెబుతుంది జ్యోత్స్న. దాంతో సుమిత్రను రెచ్చగొట్టిన పారిజాతం... తాడోపేడో తేల్చుకోవాలని ఆఫీస్‌కు బయల్దేరతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 10వ తేదీ 511వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కార్తీక్, దీపలు ఆఫీస్‌లో అందరికీ భోజనం రెడీ చేస్తుండగా సుమిత్రను తీసుకుని పారిజాతం వస్తుంది. వారిని చూడగానే అందరూ షాక్ అవుతారు. నువ్వు ఆఫీసుకు వచ్చావా అంటూ సుమిత్రను అడుగుతుంది జ్యోత్స్న. దీప వచ్చినప్పుడు మేం వస్తే తప్పేంటీ అని ఆన్సర్ ఇస్తుంది పారిజాతం. నేను మీతో విడిగా మాట్లాడాలని శివన్నారాయణని తీసుకుని వెళ్తుంది పారు. ఆ వెనుక కార్తీక్ కూడా వెళ్తాడు. కొత్త సీఈవో ఎవరు? ఆ దీపేనా? అని అడగటంతో శివన్నారాయణ, కార్తీక్‌లు షాక్ అవుతారు. దీపను సీఈవోగా చేస్తామని నీకెవరు చెప్పారు? అని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. నీకు జ్యోత్స్న చెప్పిందా? అని కార్తీక్ అడుగుతాడు. ఆ వెంటనే జ్యోత్స్న వచ్చి నేనే చెప్పడం నువ్వు చూశావా? అని మండిపడుతుంది.
మీ పెద్దరికానికి గౌరవం ఇచ్చి సుమిత్ర ఏం అడగకుండా ఆగుతోందని, అందుకని నేను అడుగుతున్నానని అంటుంది పారు. సొంత మనవరాలిని కాదని, ఒక పనిమనిషికి పట్టం కట్టే మీ పెద్దరికాన్ని నేను ప్రశ్నించడానికి వచ్చానని చెబుతుంది. దీపను సీఈవోని చేస్తానని నువ్వు ఏమైనా చెప్పావా తాత అని అడుగుతాడు కార్తీక్. నువ్వు మీ తాత చేయించాల్సిన పని అదేనని అంటుంది పారిజాతం. తాత సీఈవోని చేయాలనుకున్నది దీపను కాదని కార్తీక్ చెప్పబోతుండగా శివన్నారాయణ ఆపుతాడు. ఇప్పటి వరకు నేను అనుకున్న మనిషి వేరు.. కానీ నువ్వు ఈ లోపు ఇచ్చిన సలహా నాకు బాగా నచ్చిందని థ్యాంక్స్ చెబుతాడు శివన్నారాయణ. నేనేం సలహా ఇచ్చానని అంటుంది పారిజాతం. నీ వల్లే దీపను సీఈవోని చేయాలన్న ఆలోచన వచ్చిందని అంటాడు శివన్నారాయణ.
మనింటి పనిమనిషిని సీఈవోని చేస్తారా? అని పారు ఫైర్ అవుతుంది. ఇప్పటి వరకు వంట గదిని నడిపింది.. ఇకపై రెస్టారెంట్‌ని నడుపుతుందని అంటాడు శివన్నారాయణ. పారిజాతాన్ని ఆఫీసుకు పిలిపించి మంచి పని చేశావు.. నా మనసులో లేని కొత్త ఆలోచనను తీసుకొచ్చిందని అంటాడు. నువ్వే దీపను సీఈవోగా ఒప్పించాలని కార్తీక్‌తో చెబుతాడు శివన్నారాయణ. దాంతో పారుపై జ్యోత్స్న ఫైర్ అవుతుంది. తాత మనవళ్లు మనతో ఆడుకుంటున్నారని... నేను అడగకపోయినా దీపనే సీఈవోగా అనౌన్స్ చేసేవాళ్లని అంటుంది పారిజాతం. దీపను సీఈవో కాకుండా ఎలా ఆపుతావని జ్యోత్స్న అడగ్గా.. ఆపడాలు లేవు, పైకి పంపడాలేనని కత్తి చూపిస్తుంది. దీప సీఈవో అయితే నీ భవిష్యత్ ఏంటో నాకు తెలుసు, నా మనవరాలిని కాదని పనిమనిషిని చేస్తే నేను ఊరుకుంటానా? ఒక్కటే పోటు దెబ్బకు చచ్చి ఊరుకుంటుంది అంటుంది పారు. నేను ఏమైనా పర్లేదు.. కానీ నా మనవరాలు ఓ పనిమనిషి ముందు ఓడిపోవడం నాకిష్టం లేదని చెబుతుంది.
కాంచన భోజనం చేస్తుండగా శ్రీధర్ వచ్చి బాగా ఆకలిగా ఉందా? నీతో కలిసి భోజనం చేయనా అని అడుగుతాడు. ప్లేట్ తెచ్చుకుని తనే అన్నం వడ్డించుకుని తింటాడు. నీకు పాత జ్ఞాపకాలు ఏవీ గుర్తు రావడం లేదా అని శ్రీధర్ ప్రశ్నించగా.. మీరు జ్ఞాపకాలు వెతుక్కుంటూ ఓ రెండేళ్లు వెనక్కి వెళ్లారు, నేనింకా మొదటి సంవత్సరం దగ్గరే ఆగిపోయానని అంటుంది కాంచన. ఉన్నది ఒక్కటే జీవితమని శ్రీధర్ అనగా.. అలా అనుకునే గతాన్ని మరిచిపోయి బతుకుతున్నానని చెబుతుంది కాంచన. గతమంటే ఏవో కొన్ని జ్ఞాపకాలు కాదు.. అవి నువ్వు నేను కలిసి బతికిన రోజులని అంటాడు శ్రీధర్. అవన్నీ ఒక అబద్ధాన్ని నిజం అనుకుని నేను మోసపోయిన రోజులని అంటుంది కాంచన. నేను కార్తీక్ కోసం రాలేదు.. నీ కోసమే వచ్చానని, కనీసం భోజనానికైనా పిలుస్తావని నిలబడ్డానని చెబుతాడు. నేనేమీ ఒంటరిగా లేను, ఏకాంతంలో ఉన్నానని చెబుతుంది కాంచన. నా కోసం వచ్చే మనుషుల కోసం ఎదురుచూస్తున్నానని అంటుంది.
నువ్వు స్నానం చేసేటప్పుడు కానీ, నిద్రపోయేటప్పుడు కానీ మెడలో మంగళసూత్రం ఉంచుతావా? తీసేస్తావా? అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. దానిని సరిచేయడానికి చేత్తో పట్టుకున్నప్పుడైనా కట్టినవాడు నీకు గుర్తురాడా? అని ప్రశ్నిస్తాడు. దీనిని కట్టినవాడి చేయి మూడు ముళ్లు కాదు, ఆరు ముడులు వేసిందని అంటుంది కాంచన. కొత్త సీఈవోగా ఎవరిని తీసుకుంటారని కాంచనను అడుగుతాడు శ్రీధర్. అది మా నాన్న నిర్ణయమని, అది ఎవరన్నది సాయంత్రం తెలుస్తుందని అంటుంది కాంచన.
కార్తీక్, దీపలను కూడా భోజనానికి కూర్చోమని చెబుతాడు శివన్నారాయణ. దీప వంటకాలను దశరథ మెచ్చుకోవడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. అది గమనించిన సుమిత్ర.. ఇక్కడ ఒకరి కోసం ఆలోచించడానికి మరొకరు ఉన్నారు? మరి నీ గురించి ఆలోచించడానికి ఎవరున్నారు అని అడుగుతుంది. నిన్ను నేను జంటగా చూడాలని అనుకుంటున్నానని చెబుతుంది సుమిత్ర. గ్రానీ దీపను చంపేస్తే ఆ ప్లేస్ నాదేనని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. అదృష్టం అంటే దీపదేనని, నిలబడి వడ్డించే స్థాయి నుంచి అందిరితో కూర్చొని భోజనం చేసే స్థాయికి చేరుకుందని అంటుంది పారిజాతం. దీప మనతో కలిసి చాలాసార్లు భోజనం చేసిందని దశరథ అనగా.. ఆఫీసులో ఇదే మొదటిసారి కదా అని చెబుతుంది పారు. ఇకపై రోజూ ఇలాగే తింటుందని కార్తీక్ అనడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు.
భోజనాలు ముగిసిన తర్వాత అందరూ బోర్డ్ మీటింగ్‌లో కూర్చొంటారు. మేమంతా మీ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నామని బోర్డ్ మెంబర్స్ చెబుతారు. కార్తీక్ గారు సీఈవోగా ఉంటారని ఆశపడ్డాం.. ఆ అవకాశం లేదని ఆయనే చెప్పారని, మరి నెక్ట్స్ సీఈవో ఎవరని అడుగుతారు. ఆయన రక్తానికి వారసులు ఎవరో వాళ్లే ఉంటారని అంటుంది పారిజాతం. సుమిత్ర ఏం మాట్లాడకపోవడంతో నా కోడలికి ఏం చేయాలో తెలుసని అంటాడు శివన్నారాయణ. సీఈవో పదవిని అందుకోవడానికి రక్తంలో వారసత్వం ఉండటం కాదు.. సమర్థత కావాలని చెబుతాడు. నువ్వు నాతో ఏదైనా చెప్పాలా? అని సుమిత్రను అడగ్గా... అలాంటిదేం లేదని, ఈ రెస్టారెంట్ నీడలో ఎంతో మంది బతుకుతున్నారు. వాళ్లని నడిపించే సమర్ధత ఎవరికుందో వాళ్లని సీఈవోని చేయమని అంటుంది సుమిత్ర. దాంతో కోడలిని మెచ్చుకుంటాడు శివన్నారాయణ. ఆ మాటలతో పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. నేను సంస్థలో లేకపోయినా నా సేవలు, సలహాలు సంస్థకి ఎప్పుడూ ఉంటాయని కానీ నేను సీఈవోగా ఉండే అవకాశం లేదని.. అందుకే ఈ సంస్థ కొత్త సీఈవోగా నా భార్య దీపను ప్రపోజ్ చేస్తున్నానని అంటాడు కార్తీక్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










